మాధురి దీక్షిత్‌కు నచ్చలేదా? | Is Madhuri Dixit Unhappy With Ek Do Teen Remake | Sakshi
Sakshi News home page

మాధురి దీక్షిత్‌కు నచ్చలేదా?

Published Fri, Mar 23 2018 11:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Madhuri Dixit - Sakshi

మాధురి దీక్షిత్‌ (ఫైల్‌)

ముంబై: సినీ లోకంలో ఏక్‌ దో తీన్‌... పాట తెలియని ప్రేక్షకులు ఉండరు. ఈ పాటకు మాధురి దీక్షిత్‌ డ్యాన్స్‌, గ్రేస్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలీవుడ్‌లో ఓ పది ఆణిముత్యాల్లాంటి పాటలను తీస్తే... అందులో ఈ సాంగ్‌ ఉంటుంది. తేజాబ్‌ (1988) సినిమాలోని ఈ పాట అప్పట్లో ట్రెండ్‌సెట్టర్‌.  భాగీ2 సినిమా కోసం రీమీక్స్‌ చేసిన ఈ పాటలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నర్తించింది. 

మాధురి దీక్షిత్‌ను ఎవ్వరూ రీప్లేస్‌ చేయలేరని, తనలా గ్రేస్‌తో డ్యాన్స్‌ చేయడం ఎవరికీ కుదరదనీ.. ఈ పాటను ఆమెకే అంకితమిస్తున్నాని జాక్వెలిన్‌ పేర్కొన్నారు. అయితే దీనిపై మాధురి ఏమాత్రం స్పందించలేదు. గతంలో బద్రినాథ్‌ కీ దుల్హానియా సినిమాలో మాధురీ సాంగ్‌ను రీమేక్‌ చేయగా, వారిని అభినందించి కొన్నిసూచనలు కూడా చేసింది. కానీ, ప్రస్తుతం ఏక్‌ దో తీన్‌ సాంగ్‌పై మాధురి స్పందించ లేదు. ఆమెకు ఈ పాటను రీమీక్స్‌ చేయడం నచ్చలేదేమోన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. సినిమా విడుదలైన తర్వాతైనా మాధురి మాట్లాడుతుందో, లేదో చూడాలి.

ఇప్పటికే విడుదలైన ప్రోమో వీడియో సాంగ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తేజాబ్‌ సినిమా డైరెక్టర్‌ ఎన్‌. చంద్ర మాట్లాడుతూ... ‘మాధురి ఒక అమాయకత్వంతో కూడిన హావభావాలతో ఎంతో చక్కగా చేస్తే.. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా చేశార’ని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement