బాలీవుడ్ యువనటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బదాయి హో’ చిత్రం గతేడాది అక్టోబర్‌లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ దర్శకుడి తొలి సినిమా ‘తేవర్’కు బోనీకపూర్ నిర్మాత. ఇలా అమిత్‌శర్మను ఇండస్ట్రీకి పరిచయం చేసింది బోనీ కపూర్‌నే. ఇప్పుడు అమిత్ శర్మ తెరకెక్కించిన ‘బదాయి హో’ చిత్రాన్ని సౌత్‌కి చూపించాలనుకుంటున్నారు బోనీకపూర్.
ఈ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను ఆయన దక్కించుకున్నారు.‘‘బాలీవుడ్‌లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అదే ఆదరణ సౌత్‌లోనూ ఉంటుందని ఆశిస్తున్నాను. అయితే ఈ సినిమాను ముందుగా తెలుగులో నిర్మించాలా? లేక తమిళంలో సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలా? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదు’’ అని పేర్కొన్నారు బోనీ కపూర్.
సౌత్‌కి బదాయి హో
Published Wed, Mar 20 2019 12:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment