
ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్‌లో ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దివంగత నటి శ్రీదేవితో కలిసి ఉన్న ఆ ఫోటో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ ఫోటోలో క్యూట్‌గా నవ్వుతున్న చిన్నారిని ఎవరో మీరు గుర్తు పట్టారా? మరెవరో కాదు.. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్.
దివంగత నటి కూతురు జాన్వీ కపూర్ ఫోన్ వాల్‌పేపర్‌గా ఉన్న ఫోటోతో నెట్టింట్లో వైరలవుతోంది. జాన్వీ జిమ్ చి ఇంనుంటికి వెళ్తుండగా ఈ ఫోటో కెమెరాలకు చిక్కింది. అదే సమయంలో ఆమె ఫోన్ వాల్‌పేపర్‌గా ఉన్న త్రోబాక్ పిక్ కనిపించింది. చిన్ననాటి ఫోటోలో జాన్వీ తన తల్లి ఒడిలో చిరునవ్వుతో క్యూట్‌గా ఉంది. ఫోటో చూసిన కొంతమంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరెమో ఎమోషనల్ అవుతూ ఎమోజీలు జతచేశారు. మరికొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే స్పోర్ట్స్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆమెకు వరుణ్ ధావన్ నటించిన బవాల్ చిత్రంలోనూ కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment