sridevi died
-
క్యూట్‌గా నవ్వుతున్న చిన్నారిని గుర్తు పట్టారా.. ఇప్పుడేలా ఉందంటే?
ఇటీవలే మిలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్లో ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన భామ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దివంగత నటి శ్రీదేవితో కలిసి ఉన్న ఆ ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ ఫోటోలో క్యూట్‌గా నవ్వుతున్న చిన్నారిని ఎవరో మీరు గుర్తు పట్టారా? మరెవరో కాదు.. శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్. దివంగత నటి కూతురు జాన్వీ కపూర్ ఫోన్ వాల్‌పేపర్‌గా ఉన్న ఫోటోతో నెట్టింట్లో వైరలవుతోంది. జాన్వీ జిమ్ చి ఇంనుంటికి వెళ్తుండగా ఈ ఫోటో కెమెరాలకు చిక్కింది. అదే సమయంలో ఆమె ఫోన్ వాల్‌పేపర్‌గా ఉన్న త్రోబాక్ పిక్ కనిపించింది. చిన్ననాటి ఫోటోలో జాన్వీ తన తల్లి ఒడిలో చిరునవ్వుతో క్యూట్‌గా ఉంది. ఫోటో చూసిన కొంతమంది అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరెమో ఎమోషనల్ అవుతూ ఎమోజీలు జతచేశారు. మరికొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే స్పోర్ట్స్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఆమెకు వరుణ్ ధావన్ నటించిన బవాల్ చిత్రంలోనూ కనిపించనుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
శ్రీదేవి అంత్యక్రియలు.. ఆలస్యానికి కారణాలివే!
దుబాయ్ : దిగ్గజ నటి శ్రీదేవి మరణించి దాదాపు 35 గంటలు గడుస్తున్నా తుది వీడ్కోలుపై ఇంకా స్పష్టత రాలేదు. ఆమె పార్థివదేహాన్ని దుబాయ్ నుంచి ముంబైకి తరలించడంలో జాప్యం నెలకొంది. శనివారం రాత్రి హోటల్ గదిలో అచేతనంగా పడిఉన్న శ్రీదేవిని స్థానిక వైద్య బృందం, పోలీసులు కలిసి రషీద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు. అక్కడి నుంచి భౌతిక కాయాన్ని భారత్‌కు తరలించడానికి సుదీర్ఘ ప్రక్రియ అవసరమవుతుంది. ఈ వ్యవహారం గురించి ‘ప్రవాసీ మిత్ర’ ఎడిటర్ భీంరెడ్డి కొంత సమాచారాన్ని అందించారు. దుబాయ్ నుంచి మృతదేహాన్ని తరలించాలంటే.. ►మృతదేహానికి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ ఫోరెన్సిక్ నివేదికను రూపొందిస్తారు. ►అనంతరం పార్థివదేహాన్ని ముహైస్నాకు తరలించి, విమానంలో రవాణా చేసేందుకు అనువుగా సుగంధపరిమాళాలు, శుభ్రమైన వస్త్రాల్లో చుడతారు. ఈ ఎంబామింగ్ ప్రక్రియకు కనీసం రెండు గంటలు పడుతుంది. ►ఈలోపే స్థానిక పోలీసులు డెత్ సర్టిఫికేట్‌ను జారీచేయాల్సిఉంటుంది. ఇందుకోసం మృతురాలు/మృతుడి కుటుంబీకుల నుంచి అఫిడవిట్ తీసుకుంటారు. ఫోరెన్సిక్ రిపోర్టు అందిన తర్వాతే పోలీసులు ముందుకు వెళతారు. ►దుబాయ్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు.. మృతురాలు/మృతుడి పాస్‌పోర్టును రద్దు చేస్తారు. ►ఆ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుమతితో మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు. ►అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు తరలిస్తారు. కస్టమ్స్ క్లియరెన్స్ అనంతరం విమానంలో భారత్‌కు తరలిస్తారు. ►శ్రీదేవి పార్థివదేహాన్ని తరలించేందుకు ఇప్పటికే ప్రత్యేక విమానాన్ని సిద్ధంగా ఉంచారు. ►భారతకాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6 గంటలకు విమానం ముంబైకి చేరుకునే అవకాశంఉంది. -
శ్రీదేవి మరణవార్తను బ్రేక్ చేసింది అతనే!
ముంబై : లెజెండ్ శ్రీదేవి హఠాన్మరణానికి సంబంధించిన వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను ఒక్కసారిగా కలచివేసింది. మేనల్లుడి పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. తాను బస చేసిన జుమేరియా ఎమిరేట్స్ టవర్ హోటల్లో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దగ్గర్లోని రషీద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. శ్రీదేవి మరణించిన విషయాన్ని మొదట మీడియాకు చెప్పింది ఆమె మరిది సంజయ్ కపూర్. శ్రీదేవీ మరణించిన కొద్దిసేపటికే సంజయ్ కపూర్.. దుబాయ్‌లోని ప్రఖ్యాత ‘ఖలీజ్ టైమ్స్’తో మాట్లాడారు. శ్రీదేవి హఠాన్మరణంతో తమ కుటుంబం మొత్తం షాక్‌కు గురైందని, ఆమెకు ఎలాంటి గుండె జబ్బులూ లేవని చెప్పారు. హోటల్ గదిలో ఉన్నప్పుడే నొప్పితో ఆమె కుప్పకూలిపోయారని వివరించారు. వివాహకార్యక్రమంలో పాల్గొనేందుకు సంజయ్ శనివారం ఉదయమే దుబాయ్‌కి వెళ్లారు. శ్రీదేవి దంపతులతోపాటే వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్న అతను.. వదిన పార్థివదేహం తరలింపునకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం మధ్యాహ్నానికి శ్రీదేవి మృతదేహం ముంబై చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని మెహబూబా స్టూటియోలో ఉంచుతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. భర్త బోనీ, మరుదులు సంజయ్,అనిల్ - తోటికోడళ్లతో శ్రీదేవి (పాత ఫొటో) -
అంబానీల విమానంలో శ్రీదేవి మృతదేహం తరలింపు
ముంబై : దివంగత సినీతార శ్రీదేవీ పార్థివదేహం మరికొద్ది సేపట్లోనే దుబాయ్ నుంచి ముంబైకి తరలించనున్నారు. భారత కుబేరులు అంబానీ కుటుంబానికి చెందిన ప్రత్యేక జెట్ విమానంలో భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్‌లో శ్రీదేవీకి పోస్ట్‌మార్టం ప్రారంభమైన సమయంలోనే ముంబై నుంచి అంబానీ విమానం బయలుదేరి వెళ్లింది. 13 సీట్లున్న ఈ ప్రత్యేక విమానం(ఎంబ్రార్-135బీజే) రిలయన్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ లిమిటెడ్‌కు చెందినది. ఈ సంస్థ ప్రస్తుతం అనిల్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తోంది. బోనికపూర్ మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం రస్ ఆల్ ఖైమాకు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. అయితే, దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది. సోమవారం మధ్యాహ్నాంలోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. శ్రీదేవి పార్థివదేహాన్ని మొదట ఆమె ఇంటికి తరలిస్తారు. అటు నుంచి మెహబూబా స్టూడియోకు తీసుకెళతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. టీనా-అనిల్ అంబానీ దంపతులతో శ్రీదేవీ-బోనీ జంట(పాత ఫొటో) -
మాజీ సీఎం సిఫారసుతో సినిమాల్లోకి
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కామరాజర్ సిఫార్సుతోనే శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ విషయం ఆమె తండ్రి అయ్యప్పన్ సన్నిహిత మిత్రులకు మాత్రమే తెలుసు. వారిలో ఒకరైన 81 ఏళ్ల బాలు నాయకర్ శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శ్రీదేవి స్వగ్రామంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, తాను సాత్తూరు కోర్టులో జూనియర్ న్యాయవాదులుగా ఉన్న సమయంలో స్నేహితులమయ్యామని చెప్పారు. అయ్యప్పన్కు చెన్నై సీఐటీ నగర్లో ఓ ఇల్లు కూడా ఉండేదని.. శ్రీదేవి నాలుగేళ్ల వయసులో ఆయన చెన్నైకు వచ్చేశారన్నారు. ఆ ఇంటికి సమీపంలోనే అప్పటి కాంగ్రెస్ నేత, దివంగత సీఎం కామరాజర్ నివాసం ఉండేదని ఆయన వివరించారు. కామరాజర్‌కు అయ్యప్పన్ సన్నిహితుడని.. ఆ పరిచయం శివకాశి నియోజకవర్గం నుంచి అయ్యప్పన్ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి దారితీసిందన్నారు. ఆ ఎన్నికల్లో అయ్యప్పన్ ఓడిపోయాడని, దాంతో చెన్నైకు పరిమితమైనట్టు ఆయన తెలిపారు. ఓ సాయంత్రం అయ్యప్పన్ శ్రీదేవిని వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో కామరాజర్ చూశారని.. అప్పట్లో చిన్నారి శ్రీదేవి అందం, చురుకుదనం చూసి అక్కడే ఉన్న రచయిత కన్నదాసన్ను పిలిచి సినిమాల్లో నటింపజేయడానికి ఏర్పాట్లుచేయాలని సూచించినట్టు నాయకర్ తెలిపారు. అనంతరం కామరాజర్ సిఫారసుతో కన్నదాసన్.. నిర్మాత సాండో చిన్నప్ప దేవర్‌కు శ్రీదేవి గురించి చెప్పినట్టు ఆయన వివరించారు. అదే సమయంలో బాలనటి కోసం ఎదురుచూస్తున్న దేవర్, తొనైవన్ సినిమాలో శ్రీదేవికి అవకాశం కల్పించారన్నారు. దానితో మొదలైన శ్రీదేవి సినీ ప్రస్థానం ముంబై వరకు సాగించిందని ఆయన వివరించారు. శ్రీదేవి శాశ్వతంగా దూరం కావడం వేదన కల్గిస్తోందని నాయకర్ చెప్పారు. ప్రస్తుతం మీనంపట్టిలోని పూర్వీకుల నివాసంలో అయ్యప్పన్ సోదరుడు రామస్వామి కుటుంబం ఉంటున్నట్టు ఆయన చెప్పారు. -
అచ్చతెలుగు ఆడపడుచు
చంద్రగిరి/రాయచోటి రూరల్: సినీ లోకాన్ని ఏలిన ఇండియన్ సూపర్‌స్టార్, అతిలోక సుందరి శ్రీదేవి తెలుగమ్మాయే. ఈమె తల్లి రాజేశ్వరి తిరుపతిలోని తీర్థకట్టవీధిలో జన్మించారు. శ్రీదేవి అమ్మమ్మ వెంకటరత్నమ్మది వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని గేరంపల్లె. విద్యాభ్యాసం పూర్తిచేసి అక్కడే నర్సుగా పనిచేస్తుండేవారు. తిరుపతికి చెందిన వెంకటస్వామిరెడ్డితో వివాహం తర్వాత తీర్థకట్టవీధి డోర్ నం.93లో నివాసముండేవారు. వారికి రాజేశ్వరి, అనసూయమ్మ, అమృతమ్మ, శాంతకుమారి, బాలసుబ్రమణ్యం, సుబ్బరామయ్య సంతానం. ఇందులో మొదటి కుమార్తె శ్రీదేవి తల్లి రాజేశ్వరి. చెన్నైలో చదువుతుండగా తోటి విద్యార్థి, సేలంకు చెందిన అయ్యప్పన్‌ను ప్రేమవివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. రెండో కుమార్తె అనసూయమ్మను తిరుపతి ఆకు తోటవీధిలో నివాసముంటున్న కాంట్రాక్టర్ నారాయణరెడ్డికి ఇచ్చిచేశారు. మూడో కుమార్తె అమృతమ్మ చెన్నైకి చెందిన ఇంజినీరును వివాహం చేసుకున్నారు. నాలుగో కుమార్తె శాంతకుమారి సేలంకు చెందిన మున్సిపాలిటీ ఉద్యోగి సెల్వంరెడ్డిని వివాహమాడి అక్కడే ఉండి పోయారు. శ్రీదేవి మేనమామ బాలసుబ్రమణ్యం చెన్నైలో సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్లో ఉద్యోగం చేస్తూ స్థానికంగా ఉంటున్న బేబిని పెళ్లి చేసుకున్నారు. సుబ్బరామయ్య చెన్నైలోని ప్రభుత్వ లెదర్ కంపెనీలో పనిచేసేవారు. చంద్రగిరి మండలం ఏ.రంగంపేటకు చెందిన వేణగోపాల్‌రెడ్డి సోదరి నిర్మలను వివాహం చేసుకున్నారు. కాగా, 1991లో శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ చెన్నైలో మరణించారు. 1997లో తల్లి రాజేశ్వరి మృతి చెందారు. ఆమెకు అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం విదేశాలకు తీసుకెళ్లగా.. అక్కడ ఆమె తలకు ఒక వైపు చేయాల్సిన ఆపరేషన్ మరోవైపు చేయడంతో మరణించారు. ఈ సంఘటన అప్పట్లో వివాదానికి దారి తీసింది. అనసూయమ్మ అంటే ఎంతో ఇష్టం శ్రీదేవి పిన్నమ్మ అనసూయమ్మ అంటే శ్రీదేవికి ఎంతో ఇష్టం. వివాహంగాక ముందు శ్రీదేవిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆమెకు నారాయణరెడ్డితో వివాహమైన తర్వాత తిరుపతికి వచ్చేశారు. తరచూ అనసూయమ్మ యోగక్షేమాల కోసం శ్రీదేవి తిరుపతికి వచ్చేవారు. పిన్నమ్మ ఆరోగ్యంతో పాటు వారి యోగక్షేమాలపై శ్రద్ధ వహించేవారు. ఎ.రంగంపేటతో విడదీయరాని అనుబంధం చంద్రగిరి మండంలోని ఎ.రంగంపేట గ్రామంతో నటి శ్రీదేవికి విడదీయరాని అనుబంధం ఉంది. మేనత్త నాగమ్మది రంగంపేట. ఆమె కుమార్తె అమరావతమ్మ వివాహమప్పుడు శ్రీదేవికి ఎనిమిదేళ్లు. ఆ సమయంలో సుమారు పది రోజుల పాటు శ్రీదేవి తన తల్లిదండ్రులతో వచ్చి ఎ.రంగంపేటలోని నాగమ్మ ఇంట్లోనే ఉన్నారు. భగవంతుడు చిన్నచూపు చూశాడు మా అన్న కుమార్తె శ్రీదేవిపై భగవంతుడు చిన్న చూపు చుశాడు. ఆమె ఎప్పుడు తిరుపతికి వచ్చినా మాతో ఎంతో ప్రేమగా మాట్లాడేది. తాను చిన్నతనంలో మా ఇంటికి వస్తే సుమారు వారం రోజులపాటు ఉండేది. నటిగా పేరుప్రఖ్యాతులు వచ్చినా ఆమె నిరాడంబరంగా అందర్నీ ఆప్యాయంగా పలకరించేది. అలాంటి మంచి మనిషి మృతి చెందడం చాలా బాధాకరం. – వేణుగోపాల్‌రెడ్డి -
దేవకన్యా.. దిగిరావా
స్వర్గలోకపు దారుల్ని వెతుక్కుంటూ.. ఆసేతు హిమాచలాన్ని శోకసంద్రంలో ముంచేస్తూ.. దివికేగిన ఓ దేవకన్యా.. అంగుళీయకము లేదని స్వర్గలోక ప్రవేశానికి ఇంద్రుడు నిరాకరిస్తే.. మళ్లీ భూలోకానికి దిగిరావా...!! సాక్షి, హైదరాబాద్/దుబాయ్/ముంబై: ఐదు దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి (54) ఇక లేరు. శనివారం రాత్రి దుబాయ్‌లో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం తెలతెలవారుతుండగా ఈ చేదువార్త విని యావత్ భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది. సినీలోకం మూగబోయింది. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలసి శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. పెద్ద కూతురు జాహ్నవి షూటింగ్ కారణంగా ముంబైలోనే ఉండిపోయారు. శనివారం రాత్రి శ్రీదేవి వేడుకల్లో హుషారుగానే పాల్గొన్నారు. కొందరు బంధువులు తిరిగి స్వదేశం చేరుకున్నా ఆమె అక్కడే ఆగిపోయారు. జుమైరా ఎమిరేట్స్ టవర్ హోటల్లోని తన స్నానాల గదిలో రాత్రి 11 గంటల సమయంలో ఆమె కుప్పకూలి కనిపించారని సమాచారం. వెంటనే రషీద్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మరణించారని డాక్టర్లు ధ్రువీకరించారు. శ్రీదేవికి భర్త బోనీకపూర్, ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషీ ఉన్నారు. శ్రీదేవి భౌతికకాయానికి దుబాయ్‌లోనే పోస్టుమార్టం పూర్తయింది. సోమవారం ఉదయం భౌతికకాయాన్ని ముంబైకి తీసుకురానున్నట్లు ఆమె కుటుంబీకులు ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్ల వయసు నుంచే.. తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి(అసలు పేరు అమ్మయంగార్ అయ్యప్పన్) నాలుగేళ్ల వయసు నుంచే వెండితెరపై వెలిగారు. 1967లో ‘కందన్ కరుణై’ చిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. ‘కొందరు సిల్వర్ స్పూన్‌తో పుడతారు.. శ్రీదేవి సిల్వర్ స్క్రీన్‌తో పుట్టింది’ అనే నానుడి స్థిరపడేలా బాలనటిగా దూసుకుపోయారు. ఎన్టీఆర్, శివాజీ గణేశన్, ఎస్వీఆర్ వంటి హేమాహేమీల నడుమ, గంభీరమైన రూపు– వాచకం ఉన్న అంత పెద్ద నటుల మధ్య ఏమాత్రం తొట్రుపడకుండా అలవో కగా శ్రీదేవి నటించారు. ‘బడిపంతులు’లో ‘బూచాడమ్మ బూచాడు’ పాటతో తెలుగు ప్రేక్షకులు ముచ్చటపడే చిన్నారిగా మారారు. 11వ ఏటనే మలయాళంలో హీరోయిన్గా నటించినా 13వ ఏట తెలుగులో ‘అనురాగాలు’ (1976), 14వ ఏట ‘మా బంగారక్క’ (1977) సినిమాలతో తెలుగు హీరోయిన్గా మారారు. ‘పదహారేళ్ల వయసు’ (1978) ఘన విజయంతో ఆమె దశ తిరిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇటు దక్షిణాదిని, అటు ఉత్తరాదిని ఏలారు. ‘ప్రేమాభిషేకం’, ‘వేటగాడు’, ‘కొండవీటి సింహం’, ‘దేవత’ వంటి సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. నాగార్జునతో ‘ఆఖరి పోరాటం’, చిరంజీవితో ‘జగదేకవీరుడు–అతిలోక సుందరి’ వంటి భారీ హిట్స్ ఇచ్చారు. హిందీలో ‘సద్మా’, ‘చాందినీ’, ‘చాల్బాజ్’, ‘ఖుదాగవా’, ‘లమ్హే’ వంటి సినిమాలు ఆమె వల్లే హిట్ అయ్యాయి. 2013లో శ్రీదేవి ‘పద్మశ్రీ’ అందుకున్నారు. సిసలైన తెలుగు నటి శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ శివకాశిలో స్థిరపడ్డ తెలుగు వ్యక్తి. ఆయన తెలుగు స్పష్టంగా మాట్లాడేవారు. తల్లి రాజేశ్వరి చిత్తూరు జిల్లా నుంచి సినీ రంగ అవకాశాలను వెతుక్కుంటూ చెన్నై వెళ్లారు. శ్రీదేవికి శ్రీలత అనే సోదరి ఉంది. నటి మహేశ్వరి కజిన్. బోనీ కపూర్‌ను వివాహమాడారు. నటుడు అనిల్ కపూర్ ఆమెకు మరిది. శ్రీదేవి చివరి సినిమా ‘మామ్’ (2017). పదిహేనేళ్లపాటు చిత్రాలకు విరామం ఇచ్చిన అనంతరం ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కుమార్తె జాహ్నవి నటిస్తున్న తొలి చిత్రం ‘ధడక్’ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. కుమార్తెను హీరోయిన్గా చూడాలని శ్రీదేవి ఎంతో పరితపించారు. ఆ సినిమా విడుదల కాకముందే ఆమె మరణించడం విషాదం. కన్నీరు పెట్టిన చిత్రపరిశ్రమ శ్రీదేవి హఠాన్మరణంతో భారత చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, సుస్మితాసేన్, సిద్ధార్థ్ మల్హోత్రా, రితీశ్ దేశ్‌ముఖ్ తదితరులు ట్వీటర్ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీదేవి మృతిపై అందరికన్నా ముందుగా స్పందించింది అమితాబే. ‘ఈ బాధను వర్ణించేందుకు మాటల్లేవు. శ్రీదేవిని అభిమానించే అందరికీ నా సానుభూతి. ఇదో చీకటి దినం’ అని ప్రియాంక చోప్రా ట్వీటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. ‘షాక్‌కు గురయ్యా. చాలా బాధగా ఉంది. శ్రీదేవి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి’ అని హాస్యనటుడు జానీ లివర్ పేర్కొన్నారు. ‘శ్రీదేవి లేరనే వార్త తెలిసినప్పటినుంచీ ఏడుపాగటం లేదు. చాలా బాధగా ఉంది’ అని సుస్మితా సేన్ తెలిపారు. ‘భారత లెజెండరీ నటి శ్రీదేవి ఇకలేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా’ అని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ కెమరాన్ బైలీ పేర్కొన్నారు. ఇంటి వద్ద భారీగా అభిమానులు.. ముంబైలోని లోఖండ్వాలాలో ఉన్న శ్రీదేవి ఇంటివద్ద విషా దఛాయలు అలుముకున్నాయి. ఆమెను కడసారి చూసేం దుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఇంట్లో శ్రీదేవి తన భర్త, ఇద్దరు కూతుళ్లతో కలసి నివ సించేవారు. ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అంటూ ఒకతరం ఆమె వెంటపడింది ‘జాబిలితో చెప్పనా’ అంటూ ఒక శకం ఆమెతో పరుగు తీసింది ‘పందొమ్మిది వందల ఎనభై వరకు’ ఇట్టాంటి అందం ఎవరూ చూడలేదని అందరూ అన్నారు దేవేంద్రునికి కూతురు ఉంటే ఇలాగే ఉంటుందని ‘అహోమహో’లు పాడారు ఈ అతిలోక సుందరి వేయి పుంజాల వెలుతురు ఇవాళ ఆమె లేరు.. వెండితెర వెలవెలబోయింది.. ఆమెకు హృద్రోగ సమస్యల్లేవు శ్రీదేవికి హృద్రోగ సమస్యలేమీ లేవని ఆమె మరిది, నటుడు సంజయ్ కపూర్ తెలిపారు. ‘శనివారం రాత్రి 11 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలో ఆమె హోటల్ గదిలో ఉన్నారు’ అని ఆయన చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ఆలస్యం శ్రీదేవి భౌతికకాయానికి దుబాయ్‌లోనే పోస్టుమార్టం పూర్తయినా ఆదివారం రాత్రి వరకు పోలీసుల విచారణ నివేదిక రాలేదు. దీంతో ఆమె భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో ముంబైకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్ చట్టాల ప్రకారం.. ఆసుపత్రిలో కాకుండా వేరేచోట మృతిచెందిన వారి పోస్టుమార్టం పూర్తయ్యేందుకు కనీసం 24 గంటలు పడుతుంది. మార్చురీలో భౌతికకాయం శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు వీలైనంత తొందరగా తరలించేందుకు దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు అక్కడి పోలీసులతో కలసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె పార్థివదేహం దుబాయ్ పోలీసు ప్రధాన కార్యాలయంలోని మార్చురీలో ఉంది. -
మహిళ సజీవదహనం కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ : ఈ నెల 23న నగరంలో కలకలం రేపిన మహిళ సజీవదహనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... మృతురాలు శ్రీదేవి, నిందితుడు శివ బోడుప్పల్ లోని ఒక ప్రైవేటు స్కూల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే పాఠశాల నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగా శివ ఈ నెల 23న శ్రీదేవిని సజీవదహనం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో శివను నిందితుడిగా తేల్చారు. శుక్రవారం ఉదయం నిందితుడు శివను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.