దుబాయ్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్ (ఇన్‌సెట్‌లో శ్రీదేవి)
ముంబై : లెజెండ్ శ్రీదేవి హఠాన్మరణానికి సంబంధించిన వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను ఒక్కసారిగా కలచివేసింది. మేనల్లుడి పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.. తాను బస చేసిన జుమేరియా ఎమిరేట్స్ టవర్ హోటల్లో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దగ్గర్లోని రషీద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. శ్రీదేవి మరణించిన విషయాన్ని మొదట మీడియాకు చెప్పింది ఆమె మరిది సంజయ్ కపూర్.
శ్రీదేవీ మరణించిన కొద్దిసేపటికే సంజయ్ కపూర్.. దుబాయ్‌లోని ప్రఖ్యాత ‘ఖలీజ్ టైమ్స్’తో మాట్లాడారు. శ్రీదేవి హఠాన్మరణంతో తమ కుటుంబం మొత్తం షాక్‌కు గురైందని, ఆమెకు ఎలాంటి గుండె జబ్బులూ లేవని చెప్పారు. హోటల్ గదిలో ఉన్నప్పుడే నొప్పితో ఆమె కుప్పకూలిపోయారని వివరించారు. వివాహకార్యక్రమంలో పాల్గొనేందుకు సంజయ్ శనివారం ఉదయమే దుబాయ్‌కి వెళ్లారు. శ్రీదేవి దంపతులతోపాటే వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉన్న అతను.. వదిన పార్థివదేహం తరలింపునకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. సోమవారం మధ్యాహ్నానికి శ్రీదేవి మృతదేహం ముంబై చేరుకోనుంది. అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని మెహబూబా స్టూటియోలో ఉంచుతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
భర్త బోనీ, మరుదులు సంజయ్,అనిల్ - తోటికోడళ్లతో శ్రీదేవి (పాత ఫొటో)
Comments
Please login to add a commentAdd a comment