మహిళ సజీవదహనం కేసులో నిందితుడి అరెస్ట్ | accused shiva arrest in women burnt alive case | Sakshi

మహిళ సజీవదహనం కేసులో నిందితుడి అరెస్ట్

Published Fri, Mar 27 2015 8:46 AM | Last Updated on Thu, Oct 4 2018 8:38 PM

accused shiva arrest in women burnt alive case

హైదరాబాద్ : ఈ నెల 23న నగరంలో కలకలం రేపిన మహిళ సజీవదహనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... మృతురాలు శ్రీదేవి, నిందితుడు శివ బోడుప్పల్ లోని ఒక ప్రైవేటు స్కూల్లో భాగస్వాములుగా ఉన్నారు. అయితే పాఠశాల నిర్వహణలో తలెత్తిన విభేదాల కారణంగా శివ ఈ నెల 23న శ్రీదేవిని సజీవదహనం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ దర్యాప్తులో శివను నిందితుడిగా తేల్చారు. శుక్రవారం ఉదయం నిందితుడు శివను  పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement