అది తెలిసి షాకయ్యాను: మాధురీ దీక్షిత్‌ | Madhuri Dixit Reveals Ek Do Teen Song Funny Moment During Shooting | Sakshi
Sakshi News home page

‘1000 మంది ప్రేక్షకుల మధ్య ఆ పాటను చిత్రీకరించాం’

Published Sat, Apr 11 2020 12:46 PM | Last Updated on Sat, Apr 11 2020 2:21 PM

Madhuri Dixit Reveals Ek Do Teen Song Funny Moment During Shooting - Sakshi

బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ తన హిట్‌ సాంగ్‌ ‘ఏక్‌ ధో తీన్‌’ గురించిన సరదా విషయాలను, జ్ఞాపకాలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అంతేగాక ఈ పాటకు సంబంధించిన సందేహాలను, జ్ఞాపలకాలను తనతో పంచుకోవాలని అభిమానులను కోరారు. అయితే ఈ పాటను దాదాపు 1000 అర్టిస్టులతో కాకుండా నిజమైన ప్రేక్షకులతో చిత్రీకరించినట్లు ఆమె ట్విటర్‌లో తెలిపారు. ఈ పాటను షూట్‌ చేయడానికి 10, 15 రోజుల ముందు నుంచే ప్రేక్షకుల మధ్య రిహార్సల్స్‌ చేశామని వెల్లడించారు. (కరోనాతో హాలీవుడ్‌ నటి మృతి)

‘ఈ పాటలోని హుక్‌ స్టేప్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఇక సినిమా విడుదలయ్యాక ధియోటర్లలో సినిమా కొనసాగుతున్నంతసేపు మళ్లీ మళ్లీ ఈ పాటను రీప్లే చేయాలని అభిమానులు డిమాండ్‌ చేసిన విషయం తెలిసి షాకయ్యాను. ఇక ఆ సమయంలో అందరూ నన్ను మోహినీ అని పిలవడం ప్రారంభించారు. వావ్‌.. ఈ సందర్భంగా అప్పటీ ఎన్నో జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చేల చేసింది’ అంటూ ట్విట్‌ చేశారు. ఇక ఈ పాట అంతగా ఫేమస్‌ అవుతుందని మీరు ఊహించారా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘ఈ పాట అంతగా ప్రజాదరణ పొందుతుందని నేను ఊహించలేదు. కానీ కచ్చితంగా మంచి పేరు మాత్రం సంపాదింస్తుందని నమ్మాను’ అని మాధురీ సమాధానం ఇచ్చారు. ఇ​క మాధురీ ‘ఏక్‌ ధో తీన్‌’ పాట ఇప్పటికీ ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిన విషయమే. కాగా 1988లో విడుదలైన ‘తేజాబ్‌’ సినిమాలో హీరోగా అనిల్‌ కపూర్‌ నటించగా... దర్శకుడు ఎన్‌ చంద్ర తెరకెక్కించారు. (అదే ఏకైక డిమాండ్ కావాలి - చిదంబరం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement