మాధురి దీక్షిత్
మన కోరికలు మనమే తీర్చుకోవడంలో థ్రిల్లేముంది? ఎదుటి వారి కోరికలు తీర్చడంలో ఉన్న తృప్తిని ఎప్పుడైనా అనుభవించామా? ‘బకెట్ లిస్ట్’ అనేది పాశ్చాత్య సమాజం నుంచి మనకు వచ్చిన ఒక భావన. ‘జీవితంలో మనం నెరవేర్చుకోవాలనుకునే కోరికల పట్టిక’ను బకెట్ లిస్ట్ అంటారు. ఇప్పుడు ఆ పేరుతో ఒక మరాఠి సినిమా వస్తోంది. మాధురి దీక్షిత్ మొదటిసారి మరాఠిలో నటించింది. మే 25న విడుదల.
ఏమిటి దాని విశేషం?ఇందులో మాధురి దీక్షిత్‌కు గుండెజబ్బు. ఎవరో ఒక దాత గుండెను దానం చేస్తే తప్ప బతకదు. చివరకు దాత దొరుకుతుంది. మాధురి కొత్త గుండెతో కొత్త ఊపిరి పొందుతుంది. ‘అవయవ దానం’ ద్వారా ఒక అమ్మాయి తన శరీరంలోని ముఖ్య అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి కొత్త జీవితం ఇచ్చి మరణించిందని మాధురి తెలుసుకుంటుంది. అంతమందిని బతికించిన ఆ అమ్మాయి ఆశలూ ఆశయాలూ తీరాయా? ఆమె కోసం ఏం చేయగలం అని మాధురి అనుకుంటుంది. ఆ అమ్మాయికి ఒక ‘బకెట్ లిస్ట్’ ఉందని తెలుసుకుంటుంది. – బైక్ మీద ఒంటిరిగా దేశం తిరగాలి. – పబ్‌కు వెళ్లాలి– ఎవరిదైనా పెళ్లిలో బాగా అల్లరి చేయాలి– రణధీర్ కపూర్‌తో సెల్ఫీ దిగాలి
ఇలాంటి కోరికలు ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి ఆ అమ్మాయి. ఈ చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా తనలాంటి వారిని బతికించి మరణించిందా అని దుఃఖపడుతుంది మాధురి దీక్షిత్. మరి దానికి కాంపెన్సేషన్? వాటిని తాను తీర్చడానికి అంటే ఆ అమ్మాయిలా కొన్నాళ్లు జీవించడానికి బయలుదేరడమే. కాని ఆ ప్రయత్నంలో మాధురి ఏం తెలుసుకుంటుంది? తన జీవితాన్ని తాను తెలుసుకుంటుంది, తన కోరికలు తెలుసుకుంటుంది. ట్రైలర్‌లో మాధురి ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్‌లో పాల్గొంటోంది. ఈ అందమైన కథను కరణ్ జొహర్ నిర్మాతగా మార్చి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఈ కథ అన్ని భాషల్లోకి రీమేక్ అవ్వొచ్చని మనకు అనిపించడం లేదూ?
Comments
Please login to add a commentAdd a comment