
మాధురీ దీక్షిత్
బాలీవుడ్ వెండితెరపై బయోపిక్ ఫార్ములా నడుస్తోంది. ఆల్రెడీ కొన్ని బయోపిక్స్ వెండితెరపైకి వచ్చాయి. మరికొన్ని సెట్స్‌లో ఉన్నాయి. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ చర్చించుకునే బయోపిక్ జాబితాలో అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ కూడా ఉంది. ఆదివారం శ్రీదేవి వర్థంతి సందర్భంగా ఆమె బయోపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీదేవి బయోపిక్‌ను నిర్మించేందుకు ఆయన భర్త బోనీ కపూర్ కూడా సుముఖంగానే ఉన్నారట. కానీ శ్రీదేవిలా నటించగల నటి ఎవరు? అన్నదే పెద్ద ప్రశ్న. అయితే శ్రీదేవిపాత్రలో మాధురీ దీక్షిత్ అయితే సరిపోతారని బోనీ భావిస్తున్నారని బాలీవుడ్ తాజా ఖబర్.
Comments
Please login to add a commentAdd a comment