తెలుగు నచ్చేసింది | i like telugu | Sakshi
Sakshi News home page

తెలుగు నచ్చేసింది

Published Sun, Mar 1 2015 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

తెలుగు నచ్చేసింది

తెలుగు నచ్చేసింది

 తెలుగు తెరపై మెరిసిన మరో కొత్తందం పూజా జవేరి. ఇటీవల విడుదలైన ‘భమ్ బోలేనాథ్’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ గుజరాతీ భామ తనకు తెలుగు భాష నచ్చిందంటున్నారు. అందుకే ప్రస్తుతం తన దృష్టి అంతా తెలుగు చిత్రాలపైనే అని పూజా చెబుతూ - ‘‘నేను పుట్టింది గుజరాత్‌లో. పెరిగింది ముంబయ్‌లో. గ్రాఫిక్స్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేశా. చిన్నప్పట్నుంచీ నటనంటే ఇష్టం. కథానాయికగా ట్రై చేద్దామనుకుంటున్న తరుణంలో ‘భమ్ బోలేనాథ్’ గురించి తెలిసి, నా అంతట నేనే సంప్రదించా. నా ఆరాధ్య నటి మాధురీ దీక్షిత్. ఆమె నటనను ఆదర్శంగా తీసుకుని, నాదైన శైలిలో నటించాను. కథ డిమాండ్ మేరకు గ్లామరస్, హోమ్లీ ఏ తరహా పాత్రలైనా చేస్తా. భవిష్యత్తులో దర్శకురాలిగా మారాలన్న ఆలోచన కూడా ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement