కొత్తవారితో పోటీ అవసరంలేదు: మాధురీ | I am not here to compete with newcomers: Madhuri Dixit | Sakshi
Sakshi News home page

కొత్తవారితో పోటీ అవసరంలేదు: మాధురీ

Published Tue, Jun 3 2014 6:03 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

కొత్తవారితో పోటీ అవసరంలేదు: మాధురీ - Sakshi

కొత్తవారితో పోటీ అవసరంలేదు: మాధురీ

 ముంబై: బాలీవుడ్ అందాల భామ మాధురీ దీక్షిత్ ఇటీవల నటించిన 'దేద్ ఇష్కియా', 'గులాబ్ గ్యాంగ్' చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఈ సినిమాలో తాను అత్యుత్తమంగా నటించానని మాధురీ చెబుతున్నారు. కొత్త వాళ్లతో పోటీ పడటానికి ఇండస్ట్రీకి రాలేదని చెప్పారు.

1990ల్లో బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన మాధురీ పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరమయ్యారు. కాగా మాధురీ 47 ఏళ్ల వయసులో 'దేద్ ఇష్కియా' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. గులాబ్ గ్యాంగ్ లో సమకాలీన నటి జూహీచావ్లాతో కలసి నటించారు. అయితే ఈ రెండు చిత్రాలు పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయాయి. కాగా ప్రస్తుతం తాను నటిగా నిరూపించుకోవాల్సిందేమీ లేదని, మంచి పాత్రలు చేయాలని మాత్రం కోరుకుంటున్నానని మాధురీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement