
మాధురై కాదు.. ప్రాసలో ఉంది కాబట్టి అలా రాశాం. మాధురీ దీక్షితే. ఆమె బైకెక్కింది. ఎక్కితే బైక్ దానికై అదే నడుస్తుందా? అదే పరిగెత్తుతుందా? పడేస్తుంది. అందుకే గుర్రాన్ని మచ్చిక చేసుకున్నట్టు మాధురీ బైక్ రైడింగ్ నేర్చుకుంటోంది. మనకు తెలిసిన చిరునవ్వుల పూలగుచ్ఛం ఈమే కదా. షి ఈజ్ కమింగ్ బ్యాక్. తీ పరత్ ఏత్ ఆహే. ఏంటీ భాష అని బుర్ర గోక్కోకండి. మాధురీ మళ్లీ వస్తోందని మరాఠీలో కూడా చెప్పాం. మాధురీ వస్తున్నది మరాఠీ సినిమాతో కాబట్టి.
తెలుగు ప్రొడ్యూసర్‌లు ఎవరైనా కరుణించి, ఆ సినిమా డబ్బింగ్ రైట్లు తీసుకుని, ఆ పూలగుచ్ఛాన్ని మన తెరపైన కూడా విసిరేస్తే మనమూ చూసి తరిద్దాం. ‘హమ్ ఆప్‌కే హౌ కౌన్’ సినిమా చూశారా? అందులో రేణుకా సహానీ గుర్తుందా? అదేనండి సురభి అమ్మాయి. ఆమె స్మైలు కూడా బాగా సమ్మోహనంగా ఉంటుంది. ఇప్పుడు మన స్మైల్ గుచ్ఛం, సమ్మోహన గుచ్ఛం.. ఇద్దరూ ఒకేసారి స్క్రీన్ మీద కనబడతారట. 23 ఏళ్ల తర్వాత వీళ్లు మళ్లీ కలిసి నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment