Madhuri Dixit Talks About Her Marriage with Shriram Nene - Sakshi
Sakshi News home page

Madhuri Dixit: ఇతడిని పెళ్లాడితే కష్టమే అనుకున్నా.. కొన్ని ఆలోచిస్తేనే అమ్మో అనిపిస్తుంది!

Published Sat, Feb 25 2023 8:31 PM | Last Updated on Sat, Feb 25 2023 8:57 PM

Madhuri Dixit Talks About Her Marriage with Shriram Nene - Sakshi

బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా ఓ వైద్యుడిని పెళ్లాడింది. శ్రీరామ్‌ నేనే అనే డాక్టర్‌ను 1999లో పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిలైపోయింది. తాజాగా శ్రీరామ్‌ నేనే యూట్యూబ్‌ ఛానల్‌లో వీరి కష్టసుఖాల గురించి మాట్లాడారు. ముందుగా నటి మాట్లాడుతూ.. 'ఇతడిని పెళ్లాడితే కష్టాలు ఖాయమనుకున్నా. ఎందుకంటే తనకు పగలూరాత్రి తేడా లేకుండా షెడ్యూల్స్‌ ఉంటాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు పిల్లల్ని చూసుకోవడం కష్టంగా ఉంటుంది. వారిని స్కూల్‌కు తీసుకెళ్లడం, మళ్లీ ఇంటికి తీసుకురావడం వంటి చాలా పనులు ఉంటాయి.

మరికొన్నిసార్లు ఏవైనా ముఖ్యమైన పనులు కూడా పడుతుంటాయి. కానీ తను అందుబాటులో ఉండడు. హాస్పిటల్‌లో పేషెంట్స్‌ను చూసుకుంటూ ఉంటాడు. కానీ నేను అనారోగ్యానికి గురైనప్పుడు ఆ పనులు ఇంకెవరు చూసుకుంటారు? ఇలా కొన్ని విషయాలు ఆలోచిస్తే ఎంతో కష్టంగా అనిపిస్తుంది. అదే సమయంలో తనను చూస్తుంటే గర్వంగానూ అనిపిస్తుంది. ఎందుకంటే పేషెంట్స్‌ కోసం ఎంతగానో తపిస్తాడు, వారి వైపు నిలబడతాడు. తను చాలా మంచివాడు. ఏదేమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మన పార్ట్‌నర్‌ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం' అని చెప్పుకొచ్చింది. మాధురి గురించి శ్రీరామ్‌ మాట్లాడుతూ.. 'ఇలా అర్థం చేసుకునే భార్య దొరకడం చాలా కష్టం. తను నాపై ఎంతో ప్రేమ చూపిస్తుంది' అని తెలిపాడు.

చదవండి: ఫస్ట్‌ డే కలెక్షన్‌ రూ.10 లక్షలు.. నాపై విరుచుకుపడ్డవారు ఇప్పుడు మాట్లాడరే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement