మాధురి దీక్షిత్ ... శివరాజ్ సింగ్ చౌహాన్... | Madhuri to be brand ambassador for MP's childcare campaign | Sakshi
Sakshi News home page

మాధురి దీక్షిత్.. శివరాజ్ సింగ్ చౌహాన్...

Published Thu, Jun 26 2014 5:04 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

మాధురి దీక్షిత్ ...  శివరాజ్ సింగ్ చౌహాన్... - Sakshi

మాధురి దీక్షిత్ ... శివరాజ్ సింగ్ చౌహాన్...

మహిళలకు ప్రేరణనిచ్చేందుకు, స్త్రీశిశు హత్యలను నివారించే విషయంలో అవగాహన కల్పించేందుకు మాధురీ దీక్షిత్ సేవలను ఉపయోగించుకుంటున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

ఏ ముహూర్తాన గుజరాత్ టూరిజంను ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ అమితాభ్ ను తీసుకొచ్చారో కానీ ఇప్పుడు బిజెపి ముఖ్యమంత్రులు తమ పథకాల ప్రచారం కోసం సినీ స్టార్ల వెంట పడుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా చేరారు. 
 
ఆడపిల్ల సంరక్షణ కోసం, గర్భిణీ స్త్రీల మరణాలు, భ్రూణ హత్యలను అరికట్టేందుకు ఆయన మమతా అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమాన్ని యూనిసెఫ్ సాయంతో నిర్వహిస్తున్నారు. అయితే ప్రచారం కోసం ఆయన బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ను రంగంలోకి దించారు. 
 
గురువారం ఈ పథకాన్ని భోపాల్ లో మాధురి దీక్షిత్ ప్రారంభించారు. ఆమె ఈ ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నారు. మహిళలకు ప్రేరణనిచ్చేందుకు, స్త్రీశిశు హత్యలను నివారించే విషయంలో అవగాహన కల్పించేందుకు మాధురీ దీక్షిత్ సేవలను ఉపయోగించుకుంటున్నామని ఆయన అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement