![Madhya Pradesh Cm Shivraj Singh Chouhan Resigns - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/12/Shivraj%20chouhan_0.jpg.webp?itok=F7LhDdv2)
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మేజిక్ ఫిగర్‌కు రెండు స్దానాల దూరంలో నిలిచిన కాంగ్రెస్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధమని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సీఎంగా వైదొలిగిన అనంతరం తానిప్పుడు స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
మరోవైపు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. బీఎస్పీ మద్దతుతో పాటు స్వతంత్రుల సహకారం కూడగట్టేందుకు ఆ పార్టీ నేతలు మంతనాలు ముమ్మరం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. కాగా, మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది
Comments
Please login to add a commentAdd a comment