ముంబై : బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ చాలా కాలం తరువాత బిగ్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లు 1990లో నువ్వానేనా అన్నట్లే బాలీవుడ్‌ను ఏలారు. తరువాత కాలంలో ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకుని.. సినిమాలకు దూరమయ్యారు. అయితే శ్రీదేవి ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంతో మళ్లీ బిగ్‌స్క్రీన్ మీద కనిపించి తన అభిమానులను అలరించారు. తాజాగా ఇదే బాటలో మాధురి దీక్షిత్ పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మరాఠీ చిత్రంలో మాధురి దీక్షిత్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మాధురి సగటు మధ్యతరగతి గృహిణిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిపై మాధురి దీక్షిత్ మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఈ చిత్రంలో తన పాత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తివంతంగా ఉండడంతో పాటు, వాస్తవ జీవితానికి దగ్గర ఉంటుందని అన్నారు. ఈ మధ్యకాలంలో చాలా స్క్రిప్ట్స్ తన దగ్గరకు వచ్చాయని.. అయితే అందులో ఈ కథ బాగా నచ్చిందని ఆమె తెలిపారు.
బిగ్ స్క్రీన్‌పై మాధురీ..!
Published Tue, Oct 17 2017 6:01 PM | Last Updated on Tue, Oct 17 2017 6:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment