మెగాస్టార్ అవుట్.. టాప్ హీరోయిన్కి చాన్స్..! | Aishwarya Rai or Madhuri Dixit to replace Amitabh Bachchan in the KBC | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ అవుట్.. టాప్ హీరోయిన్కి చాన్స్..!

Published Thu, May 18 2017 1:10 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

Aishwarya Rai or Madhuri Dixit to replace Amitabh Bachchan in the KBC

వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా తనకు తిరుగులేదని కౌన్ బనేగా కరోడ్ పతి షోతో ప్రూవ్ చేసుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. 90లలో ప్రారంభమైన ఈ టీవీ షోను 2014 వరకు నిరాటంకంగా కొనసాగించారు అమితాబ్. అంతేకాదు అమితాబ్ స్ఫూర్తితో చాలా మంది సౌత్ స్టార్స్ ప్రాంతీయ భాషల్లో ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే త్వరలో మరో కొత్త సీజన్తో కేబీసీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీజన్లో అమితాబ్ హోస్ట్గా కనిపించరని తెలుస్తోంది.

గతంలోనూ కౌన్ బనేగా కరోడ్ పతి హోస్ట్గా రణబీర్ కపూర్ను తీసుకోవాలని భావించారు. అయితే ఎందుకో నిర్మాతలు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అమితాబ్ బచ్చన్ స్థానంలో ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని భావిస్తున్నారట. మాధురీ దీక్షిత్, ఐశ్వర్యరాయ్లలో ఒకరిని కేబీసీ కొత్త సీరీస్కు వ్యాఖ్యతగా ఫైనల్ చేసే ప్లాన్లో ఉన్నారు. త్వరలోనే కొత్త సీజన్పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement