మామయ్య కోసం మెసేజ్‌.. రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టిన ఐశ్వర్య | Aishwarya Rai Birthday Wishes To Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

మామయ్య కోసం మెసేజ్‌.. రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టిన ఐశ్వర్య

Oct 12 2024 8:45 AM | Updated on Oct 12 2024 9:56 AM

 Aishwarya Rai Birthday Wishes To Amitabh Bachchan

లెజండరీ యాక్టర్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ అక్టోబర్‌ 11న 82వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎందరో ప్రముఖులు ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తూ యంగ్‌ హీరోలతో పోటీ పడుతున్నారు. అందుకే చాలామంది నటీనటులకు బచ్చన్‌ ఆదర్శం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అయితే, అమితాబ్‌ ఫ్యాన్స్‌ అందరూ ఐశ్వర్య రాయ్‌ చెప్పే విషెష్‌ కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె నుంచి అమితాబ్‌కు మెసేజ్‌ వెళ్లింది. దీంతో వారి అభిమానులు సంతోషిస్తున్నారు.

అమితాబ్‌ బచ్చన్‌ కుటుంబంలో పలు విభేదాలు ఉన్నాయని చాలా రూమర్స్‌ వచ్చాయి.  అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఐశ్వర్య, ఆరాధ్య విడివిడిగా రావడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో బచ్చన్‌ కుటుంబంతో ఆమెకు మాటలు లేవని అందరూ ఫిక్స్‌ అయ్యారు. అయితే, తన మామయ్య అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు  చెప్పి అలాంటి పుకార్లకు ఐశ్వర్య ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఆరాధ్యతో అమితాబ్ దిగిన పాత ఫొటోను నిన్న రాత్రి 11:30 గంటలకు ఆమె పోస్ట్‌  చేశారు. 

పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాజీ అంటూ.. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పంచుకుంది. దీంతో అభిమానులు చాలా సంతోషించారు. ఒక్క మెసేజ్‌తో రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టిందంటూ ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఐశ్వర్య చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement