
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బిగ్‌బీ తనయుడు అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐష్‌కు, తన అత్త జయా బచ్చన్‌కు సఖ్యత లేదని కూడా ఓ గాసిప్!
ఐశ్వర్యను పట్టించుకోని బిగ్‌బీ?
ఈ విషయంలో సోషల్ మీడియా అంతా ఐష్‌కు సపోర్ట్‌గా ఉండగా బిగ్‌బీ కుటుంబాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాంకర్ సైతం అమితాబ్‌ను విమర్శించింది. ఆయన తన కూతురికి అండగా ఉంటాడు కానీ కోడలు ఐశ్వర్యను మాత్రం అస్సలు పట్టించుకోడు. కూతురు, కొడుకు ఫోటోలు షేర్ చేస్తుంటారే తప్ప ఐష్ అవార్డు పొందితే దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు అని ఆరోపించింది. ఈ వీడియో సీనియర్ నటి సిమి గరెవాల్ కంట్లో పడింది.
ఇక చాలు ఆపండని నటి వార్నింగ్
బచ్చన్ కుటుంబం గురించి మీకసలు ఏదీ తెలియదు.. ఇక చాలు, ఆపేయండి అని వార్నింగ్ ఇచ్చింది. కాగా సిమి గరెవాల్.. మేరా నామ్ జోకర్ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. సిద్దార్థ, కభి కభీ, కార్జ్ వంటి చిత్రాల్లో నటించింది.
చదవండి: Krystle DSouza: రెండు రోజులు బ్రేక్ లేకుండా షూటింగ్.. కింద పడిపోయినా వదల్లేదు!
Comments
Please login to add a commentAdd a comment