Amitabh Bachchan
-
రూ.120 కోట్లతో అమితాబ్ టాప్!
మన దేశంలో పలువురు సెలబ్రిటీలు సినిమాలు, యాడ్స్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తారు. అదే టైంలో ప్రభుత్వానికి ట్యాక్స్ (పన్ను) కూడా కడుతుంటారు. అదీ కోట్లలోనే ఉంటుంది. తాజాగా ఈ లిస్టులో అగ్రస్థానానికి బిగ్ బీ అమితాబ్ (Amitabh Bachchan) వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ గత ఏడాది కాలంలో ఎంత సంపాదించారంటే?(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)82 ఏళ్ల వయసులోనే ఫుల్ ఎనర్జీతో పనిచేస్తున్న అమితాబ్ బచ్చన్.. గతేడాది 'కల్కి'లో (Kalki 2898AD) ప్రభాస్ కి ధీటుగా నటించి ఆకట్టుకున్నారు. మరోవైపు 'కౌన్ బనేగా కరోడ్ పతి' షోతోనూ అలరిస్తున్నారు. కొన్ని యాడ్స్ కూడా చేస్తున్నారు. అలా 2024-25 సంవత్సరానికి గానూ దాదాపు రూ.350 కోట్ల వరకు సంపాదించారట. ఇందులోనూ రూ.120 కోట్ల ట్యాక్స్ ఈ మధ్యే కట్టారట.మన దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టే సెలబ్రిటీల్లో గతేడాది షారుక్ ఖాన్ (రూ.92 కోట్లు) అగ్రస్థానంలో నిలిచినట్లు వార్తలొచ్చాయి. ఇతడి తర్వాత తమిళ హీరో దళపతి విజయ్ (రూ.80 కోట్లు), సల్మాన్ ఖాన్ (రూ.75 కోట్లు) ఉండగా.. నాలుగో స్థానంలో అమితాబ్ ఉన్నాడు. ఈసారికి వచ్చేసరికి ఎక్కువ పన్ను కట్టి టాప్ లోకి వచ్చేశాడని సమాచారం.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?) -
కల్కి 2పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన అమితాబ్
-
అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్‌బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..!
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అయోధ్యలో మరోసారి భూమి కొన్నారు. అయితే ఈసారి తను నిర్వహిస్తున్న హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్ కోసం ఈ భూమి కొనుగోలు చేసినట్లు సమాచారం. 54,454 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ల్యాండ్‌ను ఎంపిక చేసుకున్నారట. రామమందిరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూమి ఉంది. దీనికోసం ఆయన రూ.86 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తండ్రి హరివంశ్ రాయ్ గౌరవార్థం అక్కడ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.గతంలో కొన్న ప్లాట్ విలువ ఎంతంటే?అమితాబ్ గతేడాది జనవరిలో అయోధ్యలోని హవేలి అవధ్‌లో ప్లాట్ కొన్నారు. ఇందుకోసం దాదాపు రూ.4.54 కోట్లు వెచ్చించారు. ఈ ప్లాట్ కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల ప్రయాణ దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది రిలీజైన కల్కి 2898 ఏడీ, వేట్టైయాన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. నెక్స్ట్ 'కౌన్ బనేగా కరోడ్ పతి 17'వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యహరించేందుకు రెడీ అవుతున్నారు.చదవండి: వద్దంటున్నా క్రికెటర్ చాహల్‌తో లింక్.. అసలెవరీ ఆర్జే మహ్వశ్? -
నాన్నను కదా ఆ మాట చెప్పలేకపోతున్నా: అమితాబ్
స్టార్ హీరోహీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. బ్యాగ్రౌండ్ సపోర్ట్‌తో సినిమా చాన్స్‌లు ఈజీగానే వస్తాయి. కానీ టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. రికమెండేషన్‌తో ఒకటిరెండు సినిమా చాన్స్‌లు వచ్చినా.. నటనతో ఆకట్టుకోలేకపోతే ఎంతపెద్ద స్టార్ కిడ్ అయినా దుకాణం సర్దుకోవాల్సిందే. అయితే కొంతమందికి నెపోటిజం అనేది వరంగా మారితే..మరికొంతమందికి మాత్రం అదే శాపంగా మారుతుంది. ఎంత టాలెంట్ ఉన్నా.. అద్భుతంగా నటించినా..నెపోటిజం(బంధుప్రీతి) వల్లే చాన్స్‌లు వస్తున్నాయని విమర్శలు చేసే వాళ్లు ఉంటారు. అలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నవారిలో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan ) ఒకరు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) వారసుడిగా ఇండస్ట్రీలోకి పెట్టిన అభిషేక్.. యువ, ధూమ్, గురు, ఢిల్లీ 6 లాంటి విభిన్నమైన చిత్రాల్లో నటించినా.. ఇప్పటికీ ఆయన పలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. నెపోటిజం(Nepotism) వల్లే ఆయన పరిశ్రమలో కొనసాగుతున్నారని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై అమితాబ్ బచ్చన్ స్పందిస్తూ తన కొడుకుకు మద్దతుగా నిలిచాడు. ‘ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినప్పటికీ.. అభిషేక్ అనవసరంగా నెపో కిడ్ అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కదా?’ అని ఓ నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ..‘నిజం చెప్పాలంటే నాక్కుడా అదే ఫీలింగ్. కానీ నాన్నని కదా ఈ మాట చెప్పలేకపోతున్నాను’ అని రిప్లై ఇచ్చాడు. కాగా, గతంలో అభిషేక్ నెపోటిజం విమర్శలపై స్పందిస్తూ..‘నా కెరీర్ విషయంలో నాన్న ఎప్పుడు సాయం చేయలేదు. నాతో సినిమాలను చేయమని ఎవరిని అడగలేదు. అందరి నటులలాగే నేను అవకాశాల కోసం తిరిగాను. నా టాలెంట్‌ని గుర్తించి దర్శకనిర్మాతలు చాన్స్‌లు ఇచ్చారు. అంతేకానీ నాన్న ఎప్పుడూ నాకు రికమెండేషన్ చేయలేదు. నా సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించలేదు. నేనే ఆయన నటించిన ‘పా’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాను’ అని చెప్పారు. -
ఓటీటీ సినిమా.. కూతురి కల కోసం తండ్రి చేసిన పోరాటమే 'బి హ్యాపీ'
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ నటించిన 'బి హ్యాపీ' డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రం చాలామంది హృదయాన్ని కదిలించేలా ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. రెమో డిసౌజా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై లిజెల్ రెమో డిసౌజా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఆయనే దర్శకత్వం వహించారు. ఇందులో అభిషేక్ బచ్చన్‌తో పాటు అమితాబ్ బచ్చన్, నోరా ఫతేహి, ఇనాయత్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. నాసర్, జానీ లివర్ మరియు హర్లీన్ సేథి సహాయక పాత్రల్లో నటించారు.'బి హ్యాపీ' చిత్రాన్ని మార్చి 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని అభిషేక్ బచ్చన్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ తండ్రి, కూతురు మధ్య ఉన్న అమితమైన ప్రేమను చూపుతుంది. ఒంటరి గా ఉన్న తండ్రి శివ్ ( అభిషేక్ బచ్చన్ ) అతని చురుకైన కుమార్తె ధారా (ఇనాయత్ వర్మ) మధ్య విడదీయరాని బంధానికి ప్రేక్షకులు ఫిదా అవుతారని చిత్ర యూనిట్ పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో వేదికపై డ్యాన్స్ చేయాలనే ఆశతో ఉన్న కూతురి కలను ఒక తండ్రి ఎలా నెరవేర్చాలనుకుంటాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. కానీ, ఊహించని సంక్షోభం వల్ల వారిద్దరికి ఎదురయ్యే కష్టాలు ఏంటి..? తన కూతురి ఆశయాన్ని నిజం చేసేందుకు ఆ తండ్రి ఏం చేశాడు..? విధిని కూడా సవాల్ చేసిన ఒక తండ్రి కథే 'బి హ్యాపీ' చిత్రం. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మార్చి 14న విడుదల కానుంది. -
అమితాబ్ అల్లుడు.. వేలకోట్ల కంపెనీకి రారాజు: ఎవరీ నందా?
నిఖిల్ నందా (Nikhil Nanda).. ఈ పేరు బహుశా ఎవరికీ తెలుసుండకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు 'అమితాబ్ బచ్చన్' అల్లుడు అంటే కొంతమందికి, ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ చైర్మన్ అంటే మరికొందరికీ తెలిసే ఉంటుంది. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన నందా గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..1974 మార్చి 18న జన్మించిన నిఖిల్ నందా.. డెహ్రాడూన్‌లోని ప్రతిష్టాత్మక డూన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని.. వార్టన్ స్కూల్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివారు. ఆ తరువాత ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో ఉన్న నైపుణ్యంతో.. ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్‌లో పగ్గాలు చేపట్టాడు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో.. నందా నాయకత్వంలో కంపెనీ ఉన్నత శిఖరాలను చేరింది.నిఖిల్ నందా.. దిగ్గజ నటుడు & చిత్రనిర్మాత రాజ్ కపూర్ కుమార్తె అయిన రీతు నందా కుమారుడు. దీంతో అతను రిషి కపూర్, రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్ వంటి ప్రముఖులకు మేనల్లుడు అయ్యాడు. కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్, రణబీర్ కపూర్ కూడా ఇతనికి బంధువులే. నటులకు దగ్గర బంధువు కావడం చేత నందాకు చలనచిత్ర పరిశ్రమలో కూడా సంబంధాలు ఉన్నాయి.అమితాబ్ బచ్చన్ & జయా బచ్చన్ కుమార్తె 'శ్వేతా బచ్చన్'ను నిఖిల్ నందా పెళ్లి చేసుకున్నాడు. వీరికి నవ్య నవేలి నందా, అగస్త్య నందా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవ్య తన పాడ్‌కాస్టింగ్ వెంచర్లతో తనదైన ముద్ర వేసినప్పటికీ, అగస్త్య ఇటీవల జోయా అక్తర్ నెట్‌ఫ్లిక్స్ చిత్రం "ది ఆర్చీస్"తో వినోద ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.ఇదీ చదవండి: ఆన్లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళనిఖిల్ నందా.. ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈ కంపెనీ రూ. 42,141 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో దూసుకెళ్తోంది. ఈ సంస్థ వ్యవసాయ యంత్రాలు, నిర్మాణ యంత్రాలు, మెటీరియల్ హ్యాండ్లింగ్, రైల్వే పరికరాలను తయారు చేస్తూ.. ఈ విభాగంలోని అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా ఉంది. -
వీడియోలు తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రయించిన ఆరాధ్య
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) మరోసారి ఢిల్లీ హైకోర్టుని(Delhi High Court) ఆశ్రయించింది. గతేడాదిలో తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కథనాలను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆరాధ్య పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఆ వీడియోలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా, కొన్ని వెబ్సైట్లతో పాటు పలు సోషల్‌మీడియా ఖాతాలు వాటిని పాటించలేదు. దీంతో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించింది. (ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)గతేడాదిలో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుదోవ పట్టించే వార్తలను యూట్యూబ్ వేదికగా ప్రసారం చేశారు. ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆరాధ్య ఇక లేరంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయి. దీంతో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వ్యాజ్యం వేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్లల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తప్పు అని, ఇలాంటి చర్యలు సమాజంలో అనారోగ్యకరమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని కోర్టు తెలిపింది. సమాజంలోని ప్రతి చిన్నారిని గౌరవంగా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం ఎట్టిపరిస్థితిల్లోనూ సహించదని కోర్టు పేర్కొంది. ఇలాంటి వీడియోలు గూగుల్ దృష్టికి వచ్చినప్పుడు వాటిని తక్షణమే తొలగించాలని న్యాయస్థానం తెలిపింది. అయితే, కొన్ని ఇంకా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తన తండ్రితో పాటు ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించడంతో గూగుల్‌కు మరోసారి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పిటిషన్‌పై విచారణ మార్చి 17న జరగనుందని తెలిపింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది. -
ఖరీదైన ఫ్లాట్‌ను అమ్మేసిన అమితాబ్ బచ్చన్.. ఎన్ని కోట్లు లాభమంటే?
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ విలాసవంతమైన ఫ్లాట్‌ను అమ్మేశారు. ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో ఖరీదైన డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను విక్రయించారు. దాని విలువ దాదాపు రూ.83 కోట్లు ఉంటుందని ప్రముఖ రియాల్టీ సంస్థ స్క్వేర్యార్డ్స్ వెల్లడించింది. ఆ ఫ్టాట్ దాదారు 5 వేలకు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తెలిపింది.అమితాబ్ బచ్చన్ ఈ ఫ్లాట్‌ను ఏప్రిల్ 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేశారు. అంధేరీ ప్రాంతంలోని తన డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను ఈనెల 17న వ తేదీన విక్రయించారు. ఈ అపార్ట్మెంట్లో దాదాపు ఆరు కార్లు పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ లగ్జరీ ఫ్లాట్‌ను విజయ్ సింగ్ ఠాకూర్, కమల్ విజయ్ ఠాకూర్ కొనుగోలు చేశారు.కాగా.. అమితాబ్ బచ్చన్ కుటుంబం గత నాలుగేళ్లలో రియల్ ఎస్టేట్‌లో దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టారు. గతంలో అభిషేక్ బచ్చన్ ముంబయిలో ఒకే అంతస్తులో నాలుగు పెద్ద ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ముఖ్యంగా గతేడాదిలోనే రూ. రియల్ ఎస్టేట్‌లో 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. వాటిలో ప్రధానందగా నివాస సముదాయాలతో పాటు వాణిజ్య స్థలాలు ఓషివారా, మగాథనే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో ఉన్నాయి.ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్ బచ్చన్ గతేడాది ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించారు. ఈ మూవీలో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అంతేకాకుండా కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. -
ఆ హీరోయిన్ ఆస్తులు 4600 కోట్లు.. అమితాబ్ కంటే ఎక్కువే!
హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువ. కొంతమంది హీరోలకు ఒక్క సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ హీరోయిన్లకు పది సినిమాలు చేసిన రాదు. అలాగే వాళ్ల సినీ కెరీర్ కూడా తక్కువ కాలమే ఉంటుంది. వయసు 40 ఏళ్లు దాటితే సినిమా చాన్స్‌లు కూడా రావు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా అవకాశం ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తుంటారు. అయితే ఎంత సంపాదించిన హీరోలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ఓ హీరోయిన్ ఆస్తులు మాత్రం స్టార్ హీరోల కంటే ఎక్కువగా ఉన్నాయి. అమితాబ్, హృతిక్ రోషన్ లాంటి బడా హీరోలు కూడా ఆస్తుల విషయం ఈ హీరోయిన్ వెనుకే ఉన్నారు. ఆమే జూహి చావ్లా. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్స్ ను వెనక్కి నెట్టి.. భారతదేశంలో అత్యంత సంపన్నురాలైన సినీనటిగా జూహీ చావ్లా రికార్డు కెక్కింది.అమితాబ్‌కు కంటే ఎక్కువమన దేశంలో ప్రతి ఏడాది సంపన్నుల జాబితాను వెల్లడించే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో సినిమా హీరోయిన్లలో జూహి చావ్లా మొదటి స్థానంలో ఉంది. ఆమె ఆస్తుల మొత్తం విలువ 4600 కోట్లు. సినిమా రంగంలో షారుఖ్ ఖాన్ 7300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో జుహి చావ్లానే ఉంది. మూడో స్థానంలో హృతిక్ రోషన్(2000 కోట్లు), నాలుగో స్థానంలో అమితాబ్ బచ్చన్(1200 కోట్లు) ఉన్నారు.పలు వ్యాపారాల్లో పెట్టుబడులుజూహి చావ్లా చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు చాలా మందే ఉన్నా.. ఆస్తుల విషయంలో మాత్రం జుహినే మొదటి స్థానంలో ఉన్నారు. నటనకు దూరంగా ఉన్నా.. నిర్మాతగా కొనసాగుతున్నారు. తన జూహీ ప్రొడక్షన్స్ లో షారుఖ్ పార్టనర్. డ్రీమ్స్ అన్లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్తో జూహీ చావ్లా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు. షారుఖ్ కొనుగోలు చేసిన ఐపీఎల్ టీమ్ కోల్కటా నైట్‌రైడర్స్‌లో ఆమె కూడా పార్ట్నర్గా ఉంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే ఇలా పలు వ్యాపారాలు చేయడంతో జూహి చావ్లా ఆస్తులు విపరీతంగా పెరిగాయి. -
అల్లు అర్జున్ పై అమితాబ్ ఆసక్తికర కామెంట్స్..
-
అల్లు అర్జున్‌తో నన్ను పోల్చకండి.. అభిమానితో అమితాబ్ బచ్చన్
అల్లు అర్జున్.. పుష్ప2 విడుదలైన సమయం నుంచి ఈ పేరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతూనే ఉంది. పుష్ప రాజ్‌గా తను నటించిన తీరుపై చాలామంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. కొద్దిరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ బన్నీపై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ ప్రతిభ, పనితీరుకు తాను పెద్ద అభిమానిని అంటూ బిగ్ బీ పేర్కొన్నారు. అయితే, తాజాగా మరోసారి తాను హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఓ కంటెస్టెంట్‌తో చర్చిస్తున్న క్రమంలో అల్లు అర్జున్ గురించి బిగ్ బీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో కోల్‌కతాకు చెందిన రజనీ బార్నివాల్ అనే గృహణి కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ.. తనకు అల్లు అర్జున్, అమితాబ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. దీనికి అమితాబ్ నవ్వుతూ ఇలా స్పందించారు. 'అల్లు అర్జున్‌కు ఇప్పుడు చాలామంది అభిమానులు ఉన్నారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడు. అతనికి వచ్చిన గుర్తింపునకు పూర్తి అర్హుడు. నేను కూడా అతడికి వీరాభిమానిని. ఇటీవల ఆయన నటించిన 'పుష్ప2' విడుదలైంది. మీరు ఇంకా ఆ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. అతనిలో చాలా ప్రతిభ దాగుంది. అతనితో నన్ను పోల్చొద్దు' అంటూ నవ్వుతూ చెప్పారు.అయినప్పటికీ ఆ మహిళ మాత్రం బన్నీ టాపిక్ వదల్లేదు.. కొన్ని సన్నివేశాల్లో మీ ఇద్దరి మేనరిజం ఒకేలా ఉంటుందని ఆమె పేర్కొంది. కామెడీ సీన్లలోనూ మీ ఇద్దరూ కాలర్‌ను కొరుకుతూ, కళ్లు కొడతారని ఆమె చెప్పింది. తాను ఎప్పుడలా చేశానని బిగ్ బీ అడగడంతో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో చేశారని ఆమె గుర్తు చేసింది. 'ఇక ఇద్దరి వాయిస్‌లోనూ ఓ రిచ్‌నెస్ ఉంటుంది. ఈ షో వల్ల మిమ్మల్ని కలిశాను. ఏదో ఒకరోజు అల్లు అర్జున్ను చూస్తే నా కల నెరవేరుతుంది' అని ఆమె చెప్పారు. -
రూ.1 కోటి ప్రశ్నకు కరెక్ట్ గెస్.. కానీ రూ.50 లక్షలే గెలిచింది!
Kaun Banega Crorepati (KBC): కౌన్ బనేగా కరోడ్‌పతి (మీలో ఎవరు కోటీశ్వరుడు).. అతి సామాన్యులను కూడా కోటీశ్వరులను చేసే షో! అందుకే దీనికి విశేషమైన అభిమానులున్నారు. హిందీలో పదిహేను సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం పదహారో సీజన్ నడుస్తోంది. తాజా ఎపిసోడ్లో పంకజిని దశ్ అనే మహిళ పాల్గొంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ పోయింది.రూ.1 కోటి విలువైన ప్రశ్నరూ.50 లక్షల విలువైన ప్రశ్నకు కూడా ఎటువంటి లైఫ్‌లైన్స్ వాడకుండా కరెక్ట్ సమాధానం చెప్పింది. చివరగా రూ.1 కోటి విలువైన ప్రశ్న అడిగాడు బిగ్‌బీ. 1997లో క్వీన్ ఎలిజబెత్ 2 భారత్‌కు వచ్చినప్పుడు కిందివాటిలో కమల్ హాసన్ నటించిన ఏ సినిమా సెట్‌ను సందర్శించింది? అని క్వశ్చన్ వేశాడు. అయితే ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిందన్నాడు. దీనికి ఎ. చమయం, బి. మరుదనయగం, సి. మార్కండేయన్, డి.మర్మయోగి అన్న ఆప్షన్లు ఇచ్చాడు.ఆట ఆపేశాక కరెక్ట్ గెస్!ఈ ప్రశ్నతో ఆలోచనలో పడిపోయింది పంకజిని. తప్పు సమాధానం చెప్తే ఇప్పటిదాకా గెలుచుకుంది కూడా పోతుందనే ఉద్దేశంతో ఆటను అక్కడితో ఆపేసింది. అయితే ఆమెకున్న లైఫ్లైన్లతో ఏవైనా రెండు ఆప్షన్లను ఎంచుకోమన్నాడు బిగ్‌బీ. అందుకామె బి,సి అన్న ఆప్షన్లు సెలక్ట్ చేసుకుంది. బి. మరుదనయగం కరెక్ట్ ఆన్సర్ అని బిగ్‌బీ తెలిపాడు. అయితే ఈ ప్రశ్నకుముందు ఆమె గేమ్ ఆపేస్తున్నట్లు చెప్పడంతో రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుని వెళ్లిపోయింది. -
2024 జనవరి నుంచి జూన్ వరకు టాప్ 10 బ్రాండ్ ప్రమోటర్లు (ఫోటోలు)
-
'పుష్ప 2': బన్నీకి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చిన అమితాబ్
'పుష్ప 2'కి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల గ్రాస్ దాటేసింది. దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్లే హిందీలోనూ రూ.200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. తెలుగు హీరోల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ బిగ్ బీ అమితాబ్.. బన్నీకి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' ప్రమోషన్ కోసం ముంబై వెళ్లిన అల్లు అర్జున్.. అమితాబ్ గురించి ప్రస్తావించాడు. ఆయన ఓ లెజెండ్ అని, ఈ వయసులోనూ అద్భుతంగా పనిచేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారని అన్నాడు. ఇవి ఇప్పుడు అమితాబ్ కంటపడ్డాయి. దీంతో అల్లు అర్జున్‌ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.'అల్లు అర్జున్ గారు.. మీ మాటలు నా మనసుని తాకాయి. నా అర్హత, స్థాయిని మించి మీరు పొగిడేస్తున్నారేమో అనిపించింది. మీ పనితనం, మీ ప్రతిభకు మేమంతా అభిమానులం. మీరు మా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి. ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని అమితాబ్.. బన్నీ గురించి రాసుకొచ్చారు. మరి దీనికి అల్లు అర్జున్ ఏమని రిప్లై ఇస్తాడో చూడాలి? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి -16 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్లో భాగమయ్యారు.ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని.. అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా? నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు. -
థియేటర్లలో ఫ్లాప్.. కానీ 25 కోట్ల టికెట్స్ సేల్.. ఆ సినిమా ఏదంటే? (ఫొటోలు)
-
అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!
బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మన్నలను అందుకున్న గొప్ప నటుడు. ఇప్పటికీ పలు టీవి షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. ఆయన్ను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసిన టీవీ షో "కౌన్ బనేగా కరోడ్‌పతి"గా చెప్పొచ్చు. ఆ కార్యక్రమం ఆయనకు ఎంతో పేరునే గాక లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16లో, క్రికెటర్ వరుణ్ ధావన్‌తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారిద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కార్యక్రమంలో అమితాబ్ కాబోయే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలను గురించి కూడా చెప్పారు. ఈ గోల్డెన్ రూల్స్‌ని పాటిస్తే మంచి తల్లిదండ్రులుగా పిల్లల మనుసును గెలుచుకోగలరని అన్నారు. ఇంతకీ అవేంటి?. 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్' అంటే..ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16లో అమితాబ్ క్రికెటర్ వరణ్ ధావన్ తండ్రిగా నీ కొత్త జర్నీ ఎలా ఉందని ప్రశ్నించారు. ఇటీవలే వరుణ ధావన్ నటాషా దంపతులకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ధావన్ తన కుమార్తెతో కనెక్ట్ అవుతున్నానని, ఆమె వచ్చాక తన జీవితం మొత్తం మారిపోయిందని నవ్వుతూ బదులిచ్చాడు. అప్పుడు అమితాబ్ ఈ దీపావళి నీకెంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ పండుగకి నీ ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చేసిందని అన్నారు. దానికి ప్రతిస్పందనగా ధావన్ "ఆమె రాకతో ప్రతిదీ మారిపోవడం మొదలైంది. ఇప్పటికీ తనకు ఎలా దగ్గర అవ్వాలా అనే విషయం గురించి నేర్చకుంటూనే ఉంటున్నా అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు." ధావన్. ఆ తర్వాత అమితాబ్‌తో నాన్న విధులు గురించి మాట్లాడుతూ..ఆ రోజుల్లో రాత్రిపూట మీ నిద్రకు ఇబ్బంది ఏర్పడేదా అని ధావన్ ప్రశ్నించగా..అందుకు అమితాబ్ బదులిస్తూ.. "తాను రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాడినని, కాకపోతే కాస్త ఆందోళనగా ఉండేదని అన్నారు. అంతేగాదు అప్పటికి ఒక కొత్త గాడ్జెట్ వచ్చిందని దాన్ని శిశువు బెడ్ పక్కన పెడితే వారి చిన్న శబ్దం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుందంటూ.. నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు." అమితాబ్. ఇక వరుణ్ తన పాప పడుకునే సమయం గురించి మాట్లాడుతూ..తన కూతురు కోసం లాలి పాట కూడా పాడుతున్నట్లు తెలిపారు. అంతేగాదు ఆ పాటను కూడా ఆ షోలో పాడి వినిపించారు ధావన్. ఆ కార్యక్రమంలో చివరగా ధావన్ అమితాబ్‌ని నటుడిగా కుటుంబ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అని అడిగారు. అందుకు ఆయన ఒక సలహ సూచించారు. అది అత్యంత అమూల్యమైన రూల్ అని కూడా చెప్పారు. "ఎప్పుడూ మీ భార్యను సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఆమె సంతృప్తిగా ఉంటే అన్ని బాధ్యతలు సునాయాసంగా నెరవేరిపోతాయి. ఆమె సంతోషంగా ఉంటే కుమార్తె కూడా హ్యాపీగా ఉంటుంది. దీన్ని సదా గుర్తించుకోండి. కుటుంబానికి మూల స్థంభం భార్యే. ఆమె సంతోషంగా ఉంటే అన్ని పనులు వాటంతట అవే సులభంగా అయిపోతాయి. దీన్ని పాటిస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే గాక పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండగలుగుతారని అన్నారు." అమితాబ్.(చదవండి: విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!) -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న.. 6.4 లక్షలకు..!
బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ప్రముఖ టెలివిజన్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. దాదాపు ప్రతి ఎపిసోడ్లో ప్రతి కంటెస్టెంట్‌కు ఇలాంటి ఓ ప్రశ్న ఎదురవుతుంది. తాజాగా జరిగిన కేబీసీ 16వ సీజన్ 57వ ఎపిసోడ్లో (అక్టోబర్ 29న టెలికాస్ట్ అయ్యింది) మరోసారి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది.Today's Question in KBC for 6,40,000 😮 pic.twitter.com/QBopW2AoWQ— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 29, 2024రూ. 6. 4 లక్షలు విలువ చేసే ఈ ప్రశ్న టెస్ట్ క్రికెట్‌కు సంబంధించింది. 2022లో టెస్ట్ మ్యాచ్ తొలి రోజే 500కు పైగా పరుగులు స్కోర్ చేసిన తొలి జట్టు ఏది..? ఈ ప్రశ్నకు ఆప్షన్స్‌గా ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ అని ఇచ్చారు. ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం ఇంగ్లండ్. 2022 డిసెంబర్ 1న పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి రోజే 506 పరుగులు (4 వికెట్ల నష్టానికి) చేసింది. టెస్ట్ మ్యాచ్ తొలి రోజే 500కు పైగా పరుగులు చేసిన తొలి జట్టు ఇంగ్లండే.ఈ ప్రశ్నను ఎదుర్కొన్న కంటెస్టెంట్‌కు క్రికెట్ పరిజ్ఞానం బాగా ఉన్నట్లుంది. అందుకే అతను పూర్తి వివరాలతో సహా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్ 500కు పైగా స్కోర్ చేసిన మ్యాచ్‌లో తొలి రోజే నలుగురు బ్యాటర్లు (జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్) సెంచరీలు చేశారని వివరణ ఇచ్చాడు. -
లండన్‌లో రతన్‌టాటాతో బిగ్‌బీకి ఎదురైన అనూహ్య అనుభవం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కేవలం వ్యాపార దిగ్గజంగానే కాదు ప్రముఖ దాతగా, అతి సాధారణ జీవితం గడిపే వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితం. 86 సంవత్సరాల వయస్సులో, రతన్ టాటా ఇటీవల (అక్టోబర్ 9, 2024) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఒక శకం ముగిసిందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన మృతిపై సంతాపం వ్యక్తమైంది. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన హోస్ట్ చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షోలో రతన్ టాటాతో తనకున్న ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.కౌన్ బనేగా కరోడ్‌పతి లేటెస్ట్ ఎపిసోడ్లో ఫరా ఖాన్, బోమన్ ఇరానీ హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ సమయంలో అమితాబ్ రతన్ టాటాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో తనను డబ్బులు అడిగిన వైనం గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఆయన గురించి నేనేం చెప్పగలను? సాదాసీదాగా జీవనంతో సాధారణ వ్యక్తిలా కనిపించే అసాధారణ వ్యక్తి. ఒకసారి ఇద్దరం ఒకే విమానంలో లండన్‌కు ప్రయాణిస్తూ, చివరకు హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. లండన్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను పికప్ చేసుకు నేందుకు వచ్చిన వారు కనిపించ లేదేమో బహుశా. అక్కడే ఉన్న టెలిఫోన్ బూత్ కెళ్లి, బయటకు వచ్చిన టాటా కొద్దిగా మనీ ఉంటే ఇస్తారా అని నన్ను అడిగారు. అంటే ఫోన్ చేయడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా! అని చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత అసామాన్యంగా జీవించిన వ్యక్తి అని బిగ్‌బీ పేర్కొన్నారు. అంతేకాదు మరో విషయాన్ని కూడా బిగ్‌బీ ప్రస్తావించారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) ‘‘ఒకసారి స్నేహితులతో కలిసి ఒక కార్యక్రమానికి వెళ్లాం ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత బయలు దేరుతుంటే . టాటా వచ్చి నన్ను మా ఇంటికి దగ్గర డ్రాప్ చేయగలరా? నేను మీ ఇంటి వెనుక ఉంటున్నా’’ అన్నారు. అసల రతన్ టాటా తనకంటూ ఒక కారు కూడా ఉంచుకోరు అంటే ఎవరమైనా నమ్మగలమా అంటూ వ్యాఖ్యానించిన అమితాబ్ రతన్ టాటా అంతటి గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు. రతన్జీ జీవితం ఎప్పటికీ గర్వకారణమని, గొప్ప సంకల్పంతో ఆయన జాతికి అందించిన సేవలు, విలువలు మరువలేని వన్నారు బిగ్‌బీ.కాగా రతన్ టాటా అస్తమించిన రోజు ఆయనకు నివాళి అర్పించిన బిగ్‌బీ, మరో విషయాన్ని కూడా పంచుకున్నారు. ఇకసారి ఇద్దరూ విమానంలో కలుసుకున్నపుడు పరస్పరం గుర్తించకపోవడం, చివరికి తాను అమితాబ్ బచ్చన్‌ను అనిచెప్పగానే, నా పేరు రతన్ టాటా అంటూ ఆయన పరిచయంచేసుకోవడం, దీంతో తాను ఆశ్చర్యపోవడం తనవంతైంది అంటూ సోషల్ మీడియాలో ఒక నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
Chiranjeevi:ఈ అవార్డు నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది
-
ANR అవార్డు అందుకున్న హీరో చిరంజీవి (ఫొటోలు)
-
నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చిన అవార్డు ఇది: చిరంజీవి
‘‘సినీ పరిశ్రమను నా ఇల్లు అనుకుంటే... ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలప్పుడు (2007) వచ్చింది. అందరూ కలిసి నాకు లెజండరీ అవార్డు ప్రదానం చేస్తుంటే హ్యాపీ ఫీలై, ఎంత ధన్యుణ్ణి అనుకున్నా. కానీ... కొన్ని ప్రతికూల పరిస్థితులు... కొంతమంది హర్షించని ఆ సమయంలో ఆ అవార్డు తీసుకోవడం సముచితంగా అనిపించలేదు. అందుకే ఈ టైమ్ క్యాప్సూ్యల్లో అవార్డు ఉంచి, నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అన్నాను.ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డు్డను పుచ్చుకున్న రోజున... అదీ అమితాబ్‌గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున... నా మిత్రుడు... నా సోదరుడు నాగ్ మనస్ఫూర్తిగా ఈ అవార్డుకు మీకు అర్హత ఉంది... తీసుకోండి అని అన్న రోజున ఇప్పుడు ఇంట గెలిచాను... రచ్చా గెలిచాను’’ అని హీరో చిరంజీవి ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. లెజండరీ నటుడు ‘ఏఎన్నార్’ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి ఈ విధంగా పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదగా ‘ఏఎన్నార్ అవార్డు’ అందుకున్నారు చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘పద్మభూషణ్‌లు, పద్మ విభూషణ్‌లు, పర్సనాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు... ఇలా ఎన్ని అవార్డులు వచ్చినా సరే... ఏఎన్ఆర్ అవార్డు నాకు ప్రత్యేకం. ఎందుకంటే నా వాళ్లు నన్ను గుర్తించి, ప్రశంసించి, ఇలాంటి అవార్డులు ఇచ్చినప్పుడు అది నిజమైన అచీవ్మెంట్ అని ఫీలయ్యాను. అందుకే నాగ్‌తో ఇది ప్రత్యేకమైన అవార్డు అని చెప్పాను. అమితాబ్‌గారి మాటలు ఎనర్జీ ఇచ్చాయినాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నన్ను సత్కరించింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి, అమితాబ్ బచ్చన్‌గారు ‘చిరంజీవి ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అన్నారు. నా హిందీ ‘ప్రతిబంథ్’ సినిమా చూసి, అమితాబ్‌గారు ‘పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. డన్ ఏ గుడ్ జాబ్. ప్రయోజనాత్మక సినిమా’ అన్నారు. ఆ మాటలు ఎనర్జీ ఇచ్చాయి.నాన్న పొగడాలనుకున్నానుమా నాన్నగారికి నటనంటే చాలా ఇష్టం. కానీ నన్ను పొగిడేవారు కాదు... ఏంటమ్మా... నాన్నగారు ఏం అనరు.. మాట్లాడరు. బయట ఎంత గెలిచినా ఇంట గెలవమంటుంటారు కదా అనేవాడిని. ‘చాలా పొగుడుతారు... కానీ తల్లిదండ్రులు పిల్లలను పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’ అని మా అమ్మ అన్నారు. ఆ రోజు అనిపించింది... నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట. అలాగే రచ్చ కూడా గెలిచాను. మా అమ్మ ఏఎన్నార్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్ ఏఎన్నార్‌గారి ఫ్యాన్స్‌లో సీనియర్ మోస్ట్ ఫ్యాన్ మా అమ్మ. ఆమె నిండు గర్భిణీతో ఉన్నప్పుడు ఏఎన్నార్‌గారి ‘రోజులు మారాయి’ సినిమా చూడాలనుకుంది. అమ్మ తన పుట్టింట్లో మొగల్తూరులో ఉండేది. నర్సాపూర్ దాటి పాలకొల్లు వెళ్లి, సినిమా చూడాలి. నాన్న జట్కా బండి ఏర్పాటు చేశారు. గతుకుల రోడ్డు. మొగల్తూరు వైపు వెళుతున్న బస్సు ఈ బండికి ఎదురుగా వచ్చింది. దానికి దారి ఇచ్చే క్రమంలో జట్కా బండి పొలాల్లో దొర్లింది. బండిలో ఉన్న అందరూ కిందపడ్డారు. నాన్న కంగారుపడి, అమ్మతో ‘పద.. ఇంటికి వెళ్లిపోదాం’ అన్నా ‘సినిమా చూడాల్సిందే’ అని పట్టుబట్టి వెళ్లింది. ఆ తర్వాత రెండు నెలలకు నన్ను బయట పడేసింది. ఏఎన్ఆర్గారి మీద నాకు ఉన్న అభిమానం అమ్మ ద్వారా... ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో. చిరంజీవికి ఎముకలు లేవన్నారు ఏఎన్‌ఆర్‌గారు నాకు నాగేశ్వరరావుగారి సినిమాల్లో డ్యాన్సులంటే ఇష్టం. ఆయన పాటలకు నాకు తెలిసిన పద్ధతిలో డ్యాన్సులు వేసుకునేవాడిని. నాకు డ్యాన్సుల్లో ఇన్స్పిరేషన్ ఎవరంటే అక్కినేనిగారు. అయితే ఆయన నా గురించి ఓ ఇంటర్వ్యూలో ‘నాకు ఎముకలు ఉన్నాయి... కానీ చిరంజీవికి లేవు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి డ్యాన్సులు పరిచయం చేసింది నేనే. కానీ ఆ డ్యాన్సులకి స్పీడు పెంచింది, గ్రేసు పెంచింది చిరంజీవి’ అన్నారు. ‘ఇది గొప్ప గొప్ప అవార్డులతో సమానం’ అనిపించింది.అలాగే ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇక్కడికి రావడానికి కృషి చేసిన మహానుభావుడు ఏఎన్‌ఆర్‌గారు. ‘కాలేజీ బుల్లోడు’ హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌కి నన్ను పిలిస్తే వెళ్లాను. అందరూ ఒకటే కేరింతలు... కేకలు. ఆయన పక్కకి తిరిగి, ‘ఎవరి కోసం అవన్నీ అనుకున్నావ్...’ అంటే ‘మీ కోసం’ అన్నాను. ‘మాది అయిపోయింది. నీ కోసమే’ అంటూ, నన్ను ఎంకరేజ్ చేశారు. అలా ప్రశంసించే గొప్ప మనసు చాలామందికి ఉండదు. ఆ తర్వాత ఆయనతో ‘మెకానిక్ అల్లుడు’ చేసే గొప్ప చాన్స్ వచ్చింది. ఆయన్ను చూస్తే నాకో ‘ఫాదర్లీ ఫీలింగ్’.నాగ్ నాకు డాక్టర్‌లాంటి వాడు ఆరోగ్య సూత్రాలు పాటించడం, ఎక్సర్సైజుల విషయంలో, యంగ్‌గా ఉండటానికి చూపించే శ్రద్ధలో నాగ్ నాకెంతో ఇన్స్పిరేషన్. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్. ఇక దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబ్, బాలచందర్‌గార్లు... ఇలా గొప్ప గొప్పవారికి ఇచ్చిన ఏఎన్నార్ అవార్డు రావడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఇచ్చిన అవార్డులా భావిస్తున్నాను’’ అన్నారు.ఏఎన్ఆర్ని ఎవరూ మ్యాచ్ చేయలేరు: అమితాబ్ బచ్చన్ ‘‘ఇండియన్ సినిమాకు ఏఎన్నార్‌గారు చేసిన కాంట్రిబ్యూషన్‌ను ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఈ సందర్భంగా నా తండ్రి రాసిన ఓ హిందీ పద్యంలోని ఓ లైన్‌ను ఇక్కడ ప్రస్తావించాలనుకున్నాను. ‘‘నా కుమారులైనంత మాత్రాన... నా కుమారులు నాకు వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో వారే కుమారులు’’ అని ఉంది. గొప్ప వ్యక్తి ఏఎన్నార్‌గారికి నిజమైన వారసులుగా, కుమారులుగా నాగార్జున ఆయన కుటుంబం నిరూపించుకుంది. నా ఫ్రెండ్ చిరంజీవికి ఈ అవార్డును అందించేందుకు నన్ను ఎంపిక చేసిన నాగ్‌కు థ్యాంక్స్.ఆ ఇద్దరూ ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా: నాగార్జున ‘‘ఏఎన్ఆర్... ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. ఏ లెజెండ్ లివ్స్ ఆన్. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే గొప్ప వ్యక్తులని గౌరవించడం ఏయన్నార్ అవార్డు ముఖ్యోద్దేశం. ఈ రోజు అలాంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు. ఇండియన్ సినిమాకు ఏబీ (అమితాబ్) సి (చిరంజీవి).. అమితాబచ్చన్‌గారు, మెగాస్టార్ చిరంజీవిగారు. చిరంజీవిగారికి అవార్డు ప్రదానం చేయడానికి అమితాబచ్చన్‌గారు రావడం ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా ఇది మాకు ఎంతో ప్రత్యేకం. అమితాబ్‌గారి సామాజిక బాధ్యతకు మేం సెల్యూట్చేస్తున్నాం. 1985లో నేను సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు.. నాన్నగారు అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవిగారి షూటింగ్ జరుగుతుంటే ఆయన డాన్స్ చూడమని చెప్పారు. ఆ డాన్స్, గ్రేస్, కరిష్మా చూసి ఆయనలా డాన్స్ చేయగలనా అనిపించింది. చేయలేం... కెరీర్లో మరో దోవ వెతుక్కుంద్దామనుకుని బయటకు వచ్చాను. మనం సొసైటీ నుంచి ఏదైనా తీసుకున్నప్పుడు మళ్లీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని నాన్నగారు అనేవారు. చిరంజీవిగారు, అమితాబచ్చన్ గారు అదే చేసి చూపించారు. ఒకటే చెప్పగలను... ఈ ఇద్దరూ ‘ఏబీసీ ఆఫ్ ఇండియన్ సినిమా’. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ «థ్యాంక్స్. ‘ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్’. ఈ వేడుకలో కీరవాణి ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ హిట్ పాటలను పలువురు గాయనీ గాయకులు ఆలపించారు. ఇక ఆస్కార్ విజేత కీరవాణిని ఈ వేదికపై నాగార్జున ప్రత్యేకంగా సన్మానించారు. -
మెగాస్టార్‌కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.. అందజేసిన అమితాబ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ అగ్రతారలు, దర్శక నిర్మాతలు, నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పాల్గొన్నారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నాని, బ్రహ్మనందంతో పాటు పలువురు సినీతారలు హాజరయ్యారు. -
ఓవైపు విడాకుల రూమర్స్.. 10 ఫ్లాట్స్ కొన్న బచ్చన్ ఫ్యామిలీ
గత కొన్నాళ్లుగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడాకుల రూమర్స్ దీనికి కారణం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడిపోనున్నారనే టాక్ బాలీవుడ్లో గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు నిమ్రత్ కౌర్ అనే నటి కారణమని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది పక్కనబెడితే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఒకేసారి 10 ఫ్లాట్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)ప్రభాస్ 'కల్కి'లో ఆశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ములంద్ ఏరియాలోని ఒబెరాయ్ రియల్టీ, ఒబెరాయ్ ఎటెర్నియాలో 10 ఫ్లాట్స్ ఒకేసారి కొనుగోలు చేశారు. వీటి ధర రూ.24.95 కోట్లు అని తెలుస్తోంది. అక్టోబర్ 9న రిజిస్టేషన్ జరిగిన ఈ కొనుగోలు కోసం కోటిన్నర వరకు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించారట.ఈ పదింటిలో ఆరు అభిషేక్ పేరు మీద రిజిస్టర్ చేయించగా.. నాలుగింటిని అమితాబ్ పేరుపై రిజిస్టర్ చేయించారు. ఇకపోతే గత 20 ఏళ్లలో బచ్చన్ ఫ్యామిలీ దాదాపు రూ.200 కోట్ల మేర రియల్ ఎస్టేట్ కోసం డబ్బు పెడుతున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు పలు సినిమాలతో తండ్రికొడుకు ఫుల్ బిజీగా ఉన్నారు. విడాకులు రూమర్స్ కావొచ్చు, ఫ్లాట్స్ కొనడం కావొచ్చు, ఏదో రకంగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ) -
చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం
ఈ నెల(అక్టోబర్ 28)న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవిని అక్కినేని నాగార్జున ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఎక్స్ వేదికగా నాగార్జున తెలియజేశారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన చిత్ర ప్రముఖులకు తన పేరుతో జాతీయ అవార్డ్ ఇచ్చి సత్కరించాలని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2006లో ఏఎన్నార్ అవార్డులను ప్రారంభించారు. మధ్యలో రెండేళ్ల గ్యాప్ ఇచ్చి.. 2014 తిరిగి అమితాబ్ బచ్చన్‌కు ఈ అవార్డు అందజేశారు. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2016లో జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరికి ఏఎన్నార్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి, శ్రీదేవి, రేఖలకు ఈ అవార్డులు అందుకున్నారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేయబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు. ఈ నెల 28న అన్నపూర్ణ స్టూడియో జరగబోతున్న ఈ వేడుకల్లో అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును అందుకోబోతున్నారు. -
జయా బచ్చన్ తల్లి ఆరోగ్యంపై రూమర్స్
సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ తల్లి ఇందిరా భాడురి(94) అనారోగ్యంతో కన్నుమూశారంటూ వార్తలు వెలువడుతున్నాయి. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె భోపాల్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం! ఈ వ్యవహారంపై బచ్చన్ ఫ్యామిలీ స్పందించాల్సి ఉందికాగా ఇందిరా భాడురి.. భోపాల్‌లోని శ్యామల హిల్స్ ఏరియా అన్సల్ అపార్ట్మెంట్లో చాలా ఏళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త, జర్నలిస్ట్ తరుణ్ భాడురి 1996లో కన్నుమూశారు. ఈ దంపతులకు జయ, రీతా, నీతా అని ముగ్గురు సంతానం.చదవండి: సంపాదన గురించి అడగదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం..: యష్ -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను
‘‘రజనీకాంత్ గారిని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారో అనే అవగాహన నాకు ఉంది. ఫ్యాన్స్‌ని అలరించే అంశాలతో పాటు ఆకట్టుకునే కంటెంట్‌తో ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాను రూపొందించడమే నా ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. రజనీకాంత్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’’ అని డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అన్నారు. రజనీకాంత్ లీడ్ రోల్లో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘వేట్టయాన్: ది హంటర్’. లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై రిలీజైంది. తమిళ్, తెలుగులో ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా టీజే జ్ఞానవేల్ పంచుకున్న విశేషాలు.→ ‘జైలర్’ సినిమా తర్వాత రజనీకాంత్‌గారి కుమార్తె సౌందర్య నాతో ‘మా నాన్నకి సరి΄ోయే కథలు ఉన్నాయా’ అని అడిగారు. రజనీకాంత్‌గారు నా శైలిని అర్థం చేసుకుని, కావాల్సినంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. నిజ జీవిత ఎన్కౌంటర్ల నుంచి స్ఫూర్తి పొంది ‘వేట్టయాన్: ది హంటర్’ కథ రాశాను. అయితే ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ రజనీకాంత్‌గారి అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టడం, ఈ కథకి ఆయన స్టైల్, మేనరిజమ్‌ను జోడించడం నాకు సవాల్‌గా అనిపించింది. → దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికే వారిని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు తప్పించుకుంటున్నారని నా పరిశోధనల్లో తెలిసింది. ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? నిజమైన దోషులనే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయాన్: ది హంటర్’లో చూపించాను. విద్యా వ్యవస్థ లోపాలను కూడా టచ్ చేశాం. → ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్గార్లను బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టలేదు. వారి పాత్రల భావజాలాన్ని బ్యాలెన్స్ చేయడంపైనే దృష్టి పెట్టాను. ΄్యాట్రిక్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ కరెక్ట్ అనిపించింది. అలాగే నటరాజ్ పాత్రని రాస్తున్నప్పుడు రానా దగ్గుబాటినే అనుకున్నాను. అనిరుథ్ రవిచందర్ అద్భుతమైన సంగీతం, నేపథ్య సంగీతం అందించాడు. ‘వేట్టయాన్: ది హంటర్’ సినిమాకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఇక నవంబరు మొదటి వారంలో నా కొత్త సినిమాల గురించి చెబుతాను. -
రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను: జ్ఞానవేల్
‘దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి అనేక వార్తలు చదివాను. వాటితో ప్రభావితుడ్ని అయ్యాను. ఈ ఎన్కౌంటర్లలో ఎంత వాస్తవం ఉంది? అసలు ఇలా చేయడం కరెక్టేనా? దోషుల్నే శిక్షిస్తున్నామా? అనే వాటిని ‘వేట్టయన్’లో చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ చెట్లు నరికేసే అమాయకుల్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. నా పరిశోధనలో పేదలు తరచూ ఇటువంటి ఎన్కౌంటర్ల బాధితులవుతున్నారని, సంపన్నులు న్యాయం నుండి తప్పించుకుంటారని తెలిసింది. విద్యా వ్యవస్థ లోపాలను కూడా ఇందులో చూపించాను. ఈ చిత్రంలో నేను లేవనెత్తిన అంశాల గురించి చర్చలు జరుగుతాయని నేను భావిస్తున్నాను’ అన్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయన్’. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు జ్ఞానవేల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ 'జై భీమ్' తర్వాత సూర్యతో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది, కానీ రజనీకాంత్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది. 'జై భీమ్' ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను మాత్రమే ప్రతిధ్వనిస్తుండగా.. రజినీకాంత్ సినిమాకు ఉండే విస్తృత అంచనాలను అందుకోవాలని ముందే ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఓ యాభై శాతం వినోదం.. యాభై శాతం సందేశం ఉండాలని ఇలా కథను రాసుకున్నాను. అయితే నేను ఏ విషయంలోనూ రాజీ పడలేను. ఈ చిత్రంలో అనేక అంశాలపై లోతుగా చర్చించినప్పటికీ.. రజనీకాంత్ అభిమానులు ఇష్టపడే ఆ ఐకానిక్ మూమెంట్స్‌ను పెట్టాను. ఈ కథకి రజినీ స్టైల్, మ్యానరిజంను జోడించడమే నాకు ఎదురైన సవాల్.→ రజనీకాంత్‌ను ఎలా చూడాలని, ఎలా చూపిస్తే అభిమానులు సంతోషిస్తారనే అవగాహన నాకు ఉంది. నేను ఆయనకు ఓ ఎలివేషన్ సీన్స్ చెబితే.. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యేవారు. అభిమానులు తన నుంచి ఏం కోరుకుంటారో ఆయనకు బాగా తెలుసు. ఆయన నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారు. నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.→ నా పరిశోధన ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పులు, మానవ హక్కుల కమిషన్‌తో చర్చలపై దృష్టి సారించడంపై జరిగింది. ఎన్కౌంటర్ల చట్టపరమైన, నైతిక అంశాలను అర్థం చేసుకోవడానికి ఇవి బలమైన పునాదిని అందించాయి.→ ఇది సీరియస్ కథ. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేయడం అతి కష్టమైన పని. వినోదాన్ని కోరుకునే రజనీ అభిమానులతో పాటు ఆలోచింపజేసే కథనాలను మెచ్చుకునే ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది.వెట్టయన్'కి ప్రీక్వెల్‌ను చేయాలని ఉంది. 'వెట్టయన్: ది హంటర్' అతియాన్ గురించి చెబుతుంది. అయితే అతియాన్ ఎలా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయ్యారనే కథను చెప్పాలని అనుకుంటున్నాను. ఫహద్ ఫాసిల్ దొంగగా, పోలీసు ఇన్ఫార్మర్గా మారడం, ఇలా ఈ కథలోని చాలా అంశాలకు బ్యాక్ స్టోరీని చెప్పాలని అనుకుంటున్నాను.→ నిజ-జీవిత ఎన్కౌంటర్ కేసుల నుండి ప్రేరణ పొందాను. అటువంటి సంఘటనల చుట్టూ ఉన్న నైతిక సంక్లిష్టతలను జోడించి కథ రాయాలని అనుకున్నాను.→ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసింది. ఆడియెన్స్ పల్స్ పట్టుకోవడంలో అతను నిష్ణాతుడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సంగీతాన్ని అందించడంలో దూసుకుపోతున్నారు. అతను సినిమా సోల్‌ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. దానికి తగ్గ సంగీతాన్ని అందిస్తారు.→ నా దగ్గర కొన్ని ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, కానీ నేను ప్రస్తుతం 'వెట్టయన్'పై దృష్టి పెడుతున్నాను. నవంబర్ మొదటి వారంలో నేను నా భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి చెబుతాను. -
ఎలక్ట్రిక్ కారు కొన్న అమితాబ్.. ఎన్ని కోట్లంటే?
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గ్యారేజీలోకి కొత్త కారు తీసుకొచ్చాడు. ఈ మధ్యే 82వ పుట్టినరోజు జరుపుకున్న ఈయన బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండెడ్ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇది ఎలక్ట్రిక్ వాహనం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ కారు ధర రూ.2.03 కోట్లు విలువ చేస్తోంది. ఇకపోతే బచ్చన్‌కు కార్ల మీద మక్కువ ఎక్కువ. ఈయన తొలిసారి కొన్న కారు ఫియాట్ 1100. కార్ల కలెక్షన్..తన తొలి సినిమా 'సాట్ హిందుస్తానీ (1969)' సక్సెస్ తర్వాత ఫియాట్ కారు కొన్నాడు.. అది కూడా సెకండ్ హ్యాండ్లో! అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ సినిమా గర్వించే స్థాయికి చేరుకున్నాడు. ఈయన గ్యారేజీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెవన్, లెక్సస్ ఎల్ఎక్స్ 570 కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా మినీ కూపర్ కూడా ఉంది.చదవండి: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏకంగా 1600 కిలోమీటర్లు! -
'వేట్టయాన్'కు ఎవరి రెమ్యునరేషన్ ఎంత..?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్’ బాక్సాఫీస్ వద్ద వీకెండ్లో మంచి కలెక్షన్లతో సత్తా చాటుతుంది. TJ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ముఖ్యంగా మూడు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు సినీ దిగ్గజాలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, కిశోర్, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయ్, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్‌గా మారింది.‘వేట్టయాన్’ సినిమాను సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 148 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ రూ. 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటే.. అమితాబ్ బచ్చన్ మాత్రం కేవలం రూ. 7 కోట్లు తీసుకున్నట్లు ఒక వార్త ట్రెండ్ అవుతుంది. బచ్చన్ కంటే తలైవా 17 రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది. ఇద్దరూ సూపర్ స్టార్స్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే, రెమ్యునరేషన్లో ఇంత వ్యత్యాసం ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.సపోర్టింగ్ కాస్ట్ రెమ్యూనరేషన్వేట్టయాన్ సినిమాలో చాలామంది స్టార్స్ సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించారు. మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రం కోసం రూ. 3కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటే.. మంజు వారియర్ ఆమె పాత్ర కోసం రూ. 2.5 కోట్లు అందుకున్నట్లు సమాచారం. అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి మాత్రం తన రోల్ కోసం రూ.5 కోట్లు ఛార్జ్ చేశారట. వేట్టయాన్‌లో తనదైన స్టైల్లో దుమ్మురేపిన రితికా సింగ్ మాత్రం కేవలం రూ. 25 నుంచి 35 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
మామయ్య కోసం మెసేజ్.. రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టిన ఐశ్వర్య
లెజండరీ యాక్టర్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 82వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎందరో ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వయసు మీద పడుతున్నా ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తూ యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. అందుకే చాలామంది నటీనటులకు బచ్చన్ ఆదర్శం. ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కూడా సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. అయితే, అమితాబ్ ఫ్యాన్స్ అందరూ ఐశ్వర్య రాయ్ చెప్పే విషెష్ కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె నుంచి అమితాబ్‌కు మెసేజ్ వెళ్లింది. దీంతో వారి అభిమానులు సంతోషిస్తున్నారు.అమితాబ్ బచ్చన్ కుటుంబంలో పలు విభేదాలు ఉన్నాయని చాలా రూమర్స్ వచ్చాయి. అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఐశ్వర్య, ఆరాధ్య విడివిడిగా రావడంతో విభేదాలు తీవ్రమయ్యాయి. దీంతో బచ్చన్ కుటుంబంతో ఆమెకు మాటలు లేవని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే, తన మామయ్య అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పి అలాంటి పుకార్లకు ఐశ్వర్య ఫుల్స్టాప్ పెట్టింది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఆరాధ్యతో అమితాబ్ దిగిన పాత ఫొటోను నిన్న రాత్రి 11:30 గంటలకు ఆమె పోస్ట్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు దాదాజీ అంటూ.. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె పంచుకుంది. దీంతో అభిమానులు చాలా సంతోషించారు. ఒక్క మెసేజ్‌తో రూమర్స్‌కు ఫుల్స్టాప్ పెట్టిందంటూ ఐశ్వర్యను ప్రశంసిస్తున్నారు. ఐశ్వర్య చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
'హ్యాపీ బర్త్ డే అశ్వత్థామ'.. కల్కి టీమ్ స్పెషల్ వీడియో!
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా విడుదలైన రజినీకాంత్ వేట్టయాన్ మూవీలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన హిందీలో మాత్రమే ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బిగ్‌బీ ఇవాళ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అమితాబ్ బర్త్ డే కావడంతో కల్కి టీమ్ స్పెషల్‌గా విషెస్ తెలిపింది. ఆయన కల్కి మూవీలోని సీన్స్‌తో వీడియోను రూపొందించింది. కల్కి షూటింగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్రలో మెప్పించారు. హ్యాపీ బర్త్‌డే అశ్వత్థామ.. త్వరలోనే సెట్స్‌లో కలుసుకుందాం అంటూ బిగ్ బీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. అమితాబ్ కల్కి-2 మూవీలోనూ నటించనున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. Team #Kalki2898AD shares a special BTS video of @SrBachchan wishing him a very happy birthday!!🔥#HBDAmitabhBachchan@ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/FEj0xS2YAD— Telugu FilmNagar (@telugufilmnagar) October 11, 2024 -
రెండు చేతులతో రాత.. రాజీవ్ గాంధీతో చదువు.. అమితాబ్ గురించి ఇవి తెలుసా? (ఫొటోలు)
-
రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. స్టార్ హీరోతో సినిమా
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ దిగ్గజం రతన్ నావల్ టాటా నింగికేగిశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. మనదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తగా పేరు గడించారు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు కూడా నివాళులర్పిస్తున్నారు.అయితే రతన్ నావల్ టాటా కేవలం వ్యాపారవేత్త అని మనందరికీ తెలుసు. కానీ ఆయన కళాపోషణ కూడా ఉందన్నది చాలామందికి తెలియదు. కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటాకు సినిమాలంటే అమితమైన ఆసక్తి. గతంలో అంటే 2004లో ఒక బాలీవుడ్ చిత్రానికి సహ నిర్మాతగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు నటించిన ఏట్బార్ అనే మూవీ నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. రతన్ టాటా ఈ చిత్రాన్ని జతిన్ కుమార్‌తో కలిసి టాటా బీఎస్ఎస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడింది. ఈ సినిమాను రూ. 9.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.7.96 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రతన్ టాటా నిర్మించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం. -
పెళ్లి గురించి అడిగిన అమితాబ్.. స్టార్ హీరో కుమారుడు ఏమన్నాడంటే?
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే కల్కి సినిమాతో సినీ ప్రియులను అలరించాడు. ఈ చిత్రం అశ్వత్థామగా అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో ప్రసారం అవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోను మరింత ఇంట్రెస్టింగ్ మార్చేందుకు అప్పుడప్పుడు మధ్యలో సెలబ్రిటీలు కూడా దర్శనమిస్తుంటారు. తాజా ఎపిసోడ్లో అమిర్ ఖాన్‌తో పాటు ఆయన తనయుడు జునైద్ ఖాన్ కూడా పాల్గొన్నాడు.ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్‌కు, తండ్రి, తనయుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మీ పెళ్లి రోజున నర్వస్‌గా ఉన్నారా?..లేదా ఉత్సాహంగా ఉన్నారా? అంటూ అమితాబ్‌ను ప్రశ్నించాడు జునైద్ ఖాన్. ఈ ప్రశ్నకు అమితాబ్ నవ్వేశాడు. దీంతో వీరి మధ్య సరదా సంభాషణ జరిగింది. అనంతరం జునైద్‌ను పెళ్లి గురించి ఆరా తీశారు అమితాబ్. మీరు లైఫ్‌లో త్వరలోనే ఎవరైనా వస్తున్నారా? అంటూ జునైద్‌ను అడిగాడు అమితాబ్. దీంతో అతను వెంటనే దీని గురించి మళ్లీ మాట్లాడతా అంటూ సమాధానమిచ్చాడు. ఈ విషయం ఏదో ఒకరోజు బయటికి వస్తుంది అన్నాడు.. అమితాబ్ నవ్వుతూ. దీంతో పక్కనే ఉన్న తండ్రి అమిర్ ఖాన్.. అతని సమాధానంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. జునైద్ ఖాన్.. అమిర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా కుమారుడు. అతని ఐరా ఖాన్ అనే సోదరి కూడా ఉంది. అమీర్ 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో అమీర్ కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఆజాద్ రావ్ ఖాన్ జన్మించారు. ఆ వీరు కూడా 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌కు సంబంధించి రూ. 6. 4 లక్షల ప్రశ్న
ప్రముఖ టీవీ గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో ఇటీవలికాలంలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తాజా ఎపిసోడ్లో ఏకంగా రూ. 6.4 లక్షల ప్రశ్న జెంటిల్మెన్ గేమ్‌కు సంబంధించింది ఎదురైంది. ఇంతకి ప్రశ్న ఏంటంటే.. 2024లో సునీల్ గవాస్కర్ తర్వాత ఓ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో 700కు పైగా పరుగులు స్కోర్ చేసింది ఎవరు..? ఈ ప్రశ్నకు నాలుగు ఆప్షన్స్‌లో మొదటిది విరాట్ కోహ్లి కాగా.. రెండోది యశస్వి జైస్వాల్, మూడోది శుభ్‌మన్ గిల్, నాలుగోది రోహిత్ శర్మ. ఈ ప్రశ్న ఎదురైనప్పుడు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ లైఫ్ లైన్‌కు వెళ్లాడు. ఆడియన్స్ పోల్‌లో మెజార్టీ శాతం 'బి' యశస్వి జైస్వాల్‌కు ఓటు వేశారు. ఈ నాలుగు ఆప్షన్స్‌లో మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.కాగా, 1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 774 పరుగులు చేశాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ సునీల్ గవాస్కరే. ఈ సిరీస్‌లో గవాస్కర్ రెండు డబుల్ సెంచరీలు, ఓ సెంచరీ చేశాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో గవాస్కర్ తర్వాత 700 పరుగుల మార్కును తాకింది యశస్వి జైస్వాల్ ఒక్కడే. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో యశస్వి 712 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది.చదవండి: IPL 2025: ‘ఆర్సీబీ రోహిత్ శర్మను కొని.. కెప్టెన్ చేయాలి’ -
వారం రోజులు అక్కర్లేదు!
‘‘ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్... ఖైదు చెయ్ ఖైదు చెయ్... నేరస్తుణ్ణి ఖైదు చెయ్’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్: ద హంటర్’ సినిమా తెలుగు ట్రైలర్. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్’. అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్’ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి’ (రావు రమేశ్), ‘అక్కర్లేదు సార్... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్ బచ్చన్), ‘నన్ను ఏ పోస్ట్‌లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్వాడినే సార్... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్)’ అన్న డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
సూపర్ స్టార్ రజనీ ‘వెట్టయన్’మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
ఐశ్వర్యను దూరం పెట్టిన బిగ్‌బీ? నటి ఏమందంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బిగ్‌బీ తనయుడు అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐష్‌కు, తన అత్త జయా బచ్చన్‌కు సఖ్యత లేదని కూడా ఓ గాసిప్!ఐశ్వర్యను పట్టించుకోని బిగ్‌బీ?ఈ విషయంలో సోషల్ మీడియా అంతా ఐష్‌కు సపోర్ట్‌గా ఉండగా బిగ్‌బీ కుటుంబాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాంకర్ సైతం అమితాబ్‌ను విమర్శించింది. ఆయన తన కూతురికి అండగా ఉంటాడు కానీ కోడలు ఐశ్వర్యను మాత్రం అస్సలు పట్టించుకోడు. కూతురు, కొడుకు ఫోటోలు షేర్ చేస్తుంటారే తప్ప ఐష్ అవార్డు పొందితే దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు అని ఆరోపించింది. ఈ వీడియో సీనియర్ నటి సిమి గరెవాల్ కంట్లో పడింది.ఇక చాలు ఆపండని నటి వార్నింగ్బచ్చన్ కుటుంబం గురించి మీకసలు ఏదీ తెలియదు.. ఇక చాలు, ఆపేయండి అని వార్నింగ్ ఇచ్చింది. కాగా సిమి గరెవాల్.. మేరా నామ్ జోకర్ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. సిద్దార్థ, కభి కభీ, కార్జ్ వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: Krystle DSouza: రెండు రోజులు బ్రేక్ లేకుండా షూటింగ్.. కింద పడిపోయినా వదల్లేదు! -
ఆ సాంగ్ షూటింగ్లో కరెంట్ షాక్ తగిలింది: అమితాబ్
కౌన్ బనేగా కరోడ్‌పతి(మీలో ఎవరు కోటీశ్వరులు) షోలో అమితాబ్ బచ్చన్ ఎప్పటికప్పుడు తన గురించి కొత్త విషయాలు చెప్తూనే ఉంటాడు. సినిమా సంగతులను కంటెస్టెంట్లతో పంచుకుంటాడు. అలా తాజా ఎపిసోడ్లో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.స్టేడియంలో షూటింగ్యారన్ సినిమాలో సారా జమానా అనే హిట్ సాంగ్ ఉంది. దాన్ని స్టేడియంలో షూట్ చేస్తే బాగుంటుందని నేనే సలహా ఇచ్చాను. సరిగ్గా అదే సమయంలో కోల్‌కతాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం కొత్తగా ఓపెన్ చేశారు. 12 వేల నుంచి 15 వేల కూర్చోగలిగే ఆ స్టేడియంలోకి ఏకంగా 50 వేల నుంచి 60 వేల మంది దాకా వచ్చారు.రాత్రిళ్లు షూట్ చేద్దామని..పరిస్థితి చేయిదాటడంతో షూటింగ్ ఆపేసి ముంబై వెళ్లిపోయాం. అయితే ఎవరికీ తెలియకుండా రాత్రిళ్లు షూట్ చేద్దామన్నాను. అలా కొద్దిరోజులకే గుట్టుచప్పుడు కాకుండా కోల్‌కతాకి వచ్చే స్టేడియంలో నైట్ షూట్ చేశాం. సీట్లు ఖాళీగా కనిపిస్తే బాగోదని డైరెక్టర్ క్యాండిల్స్ పెట్టాడు.కరెంట్ షాక్‌తో డ్యాన్స్నాకేమో ఎలక్ట్రిక్ జాకెట్ తొడిగించారు. అప్పుడు టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. నా జాకెట్‌కు లైట్స్ రావాలంటే ప్లగ్ బోర్డు దగ్గర స్విచ్ ఆన్ చేయాలి. ఆ స్విచ్ ఆన్ చేయగానే నాకు కరెంట్ షాక్ తగిలి ఆటోమేటిక్‌గా డ్యాన్స్ చేశాను అని బిగ్‌బీ నవ్వుతూ చెప్పాడు.చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో భూకంపం.. ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు! -
రజనీకాంత్ ను వేధిస్తున్న ఆ టెన్షన్..
-
అమితాబ్ బచ్చన్ పరిస్థితి చూసి వాళ్లందరూ నవ్వుకున్నారు: రజనీకాంత్
రజనీకాంత్ , అమితాబ్ బచ్చన్ ఇద్దరూ మంచి స్నేహితులేనని అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో 'హమ్, అందాకా నూన్, గిరాఫ్తార్' వంటి సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే, 32 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ కలిసి నటించిన సినిమా 'వెట్టైయాన్'. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ వేదికపై తన మిత్రుడు అమితాబ్ బచ్చన్ గురించి రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.రజనీకాంత్ మాట్లాడుతూ.. 'అమితాబ్ బచ్చన్ సినీ నిర్మాతగా భారీ అర్ధిక నష్టాలను చవిచూశారు. ఒకానొక సమయంలో తన వాచ్‌మెన్‌కు కూడా జీతం ఇవ్వలేని స్థితికి చేరిపోయారు. దీంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన జూహూ ఇంటిని వేలానికి పెట్టారు. అప్పడు బాలీవుడ్ మొత్తం ఆయన్ను చూసి నవ్వింది. పతనమైనప్పటికీ సరిగ్గా మూడేళ్లలో తిరిగి మళ్లీ నిలబడ్డారు. కౌన్ బనేగా కరోడ్‌పతి నుంచి చేతికి వచ్చిన ప్రతి యాడ్ చేస్తూ కష్టపడ్డారు. అందుకోసం ఆయన చాలా శ్రమించారు. 82 ఏళ్ల వయసులో కూడా రోజుకు 10 గంటలకు పైగానే కష్టపడ్డారు. తను ఎక్కడైతే కిందపడ్డారో మళ్లీ అక్కడే తనేంటో చూపించారు. జూహూలోని తన ఇంటితో పాటు మరో మూడు ఇళ్లను తిరిగి కొనుగోలు చేశారు.' అని రజనీ చెప్పారు.గాంధీ కుటుంబంతో అమితాబ్ బంధం: రజనీకాంత్అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుతూ ఒక అరుదైన విషయాన్ని రజనీకాంత్ ఇలా పంచుకున్నారు. ఒకసారి అమితాబ్‌కు ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ విదేశాల్లో ఓ సదస్సుకు వెళ్లారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆమె వెంటనే ఇండియాకు వచ్చారు. రాజీవ్ గాంధీ, అమితాబ్ జీ కలిసి చదువుకున్నారని అప్పుడే అందరికీ తెలిసింది. అలా గాంధీ కుటుంబంతో ఆయనకు దగ్గరి పరిచయాలు ఉన్నాయని అప్పుడే తెలిసింది. అమితాబ్ జీ తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గొప్ప రచయిత. తనకు కష్టం వచ్చినప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఎవరినైనా సాయం అడగొచ్చు. కానీ, ఆయన అలాంటి పనిచేయలేదు. కష్టాల్లో కూడా తనంతట తానే తిరిగి మళ్లీ నిలబడ్డారు. అమితాబ్ ఎందరికో ఆదర్శం.దసరా సందర్భంగా అక్టోబర్ 10న థియేటర్స్‌లోకి ‘వేట్టైయాన్’ రానున్నాడు. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకాప్రోడక్షన్స్‌పై ఈ మూవీని సుభాస్కరన్ నిర్మించారు. వేట్టయాన్‌లో సత్యదేవ్ పాత్రలో అమితాబ్ నటించారు. రితికా సింగ్, దుషార విజయన్, మంజు వారియర్ , రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ నటించారు. -
జనరల్ నాలెడ్జ్‌కు కేరాఫ్ అడ్రస్
ఫ్రెండ్స్, ఈరోజు మనం మయాంక్ గురించి తెలుసుకుందాం. పన్నెండేళ్ల వయసులో పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అమితాబ్ బచ్చన్ నుంచి బహుమతిని అందుకున్నాడు. ప్రైజ్ మనీతో పాటు ఒక కారును కూడా తీసుకున్నాడు. ‘కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పినందుకు సంతోషంగా ఉంది. కేబీసిలో ΄ాల్గొనే అవకాశం రావడం, అమితాబ్ సర్‌తో షోలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ బహుమతి గెలుచుకున్న రోజు తన సంతోషాన్ని ప్రకటించాడు మయాంక్.మయాంక్‌ను మెచ్చుకోవడమే కాదు అతడి తండ్రిని....‘ఈ అబ్బాయి ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎలా సంపాదించాడు?’ అని అడిగాడు అమితాబ్. హరియాణాలోని మహేంద్రగఢ్‌కు చెందిన మయాంక్‌కు పాఠ్య విషయాలే కాదు ప్రపంచంలో జరిగే పరిణామాలు, చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం. వాటి గురించి టీచర్లను అడుగుతుంటాడు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలను చదువుతుంటాడు.అలా చదివిన జ్ఞానం వృథా పోలేదు.దేశవ్యాప్తంగా ఎంతోమంది దృష్టిలో పడేలా చేసింది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మయాంక్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. క్విజ్ పోటీలు ఉన్నప్పుడే జనరల్ నాలెడ్జ్‌పై దృష్టి పెట్టడం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాంతోబాటు చరిత్రలో ఏం జరిగిందో కూడా పుస్తకాలు చదువుతూ తెలుసుకోవాలి.న్యూస్‌పేపర్ రోజూ చదవడం మరచిపోవద్దు.‘జననరల్ నాలెడ్జ్‌కు ఆకాశమే హద్దు’ అంటున్నాడు మయాంక్. నిజమే కదా!మనం ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మరి ఈరోజు నుంచే మీ ప్రయత్నం మొదలు పెట్టండి. ‘జనరల్ నాలెడ్జ్‌లో దిట్ట’ అనిపించుకోండి. -
క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ క్షమాపణ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. కొన్ని దశాబ్దాల నుంచి హీరోగా హిందీలో సినిమాలు చేసిన ఈయన.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ హిందీ, తెలుగులో మూవీస్ చేస్తున్నారు. అలాంటిది ఈయన ఇప్పుడెందుకు సారీ చెప్పారు. అసలు ఏం జరిగింది?(ఇదీ చదవండి: Bigg Boss 8: కొట్టుకు చస్తుంటే సినిమా చూస్తాడేంట్రా బాబూ.. చీఫ్‌గా అట్టర్ ఫ్లాప్!)తప్పుగా పలకడంతోనటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తారు. అలా కొన్నిరోజుల క్రితం ప్రజలకు సందేశమిచ్చే ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 'హలో నేను అమితాబ్ బచ్చన్, నేను చెత్త వేయను. ధన్యవాదాలు' అని అందులో చెప్పుకొచ్చారు. అయితే ఇదే వీడియోని మరాఠీలోనూ మాట్లాడి పోస్ట్ చేశారు. ఇందులో కచ్రా (చెత్త) అనే పదాన్ని తప్పుగా పలికానని, దాని గురించి తన స్నేహితుడు సుదేశ్ భోసలే చెప్పాడని, అందుకే ఈసారి సరైన ఉచ్ఛారణతో చెప్పినట్లు పేర్కొన్నారు.సారీ చెప్పారుఈ క్రమంలోనే తన తప్పుని మన్నించాలని మరాఠీ వాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు చెప్పారు. దీంతో నెటిజన్లు అమితాబ్ మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు. రీసెంట్‌గానే ప్రభాస్ 'కల్కి'లో అశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ 'వేట్టాయాన్' మూవీలో కీలక పాత్ర పోషించారు. అక్టోబరు 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య చౌకబారు వ్యాఖ్యలు) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) -
కల్కి సినిమా అర్థం కాలేదన్నారు: అమితాబ్ బచ్చన్
కొందరు హాలీవుడ్ సినిమాలను ఆహా.. ఓహో.. అని పొగుడుతుంటారు. మరికొందరికేమో ఆ చిత్రాలేవీ బుర్రకెక్కవు. తనది రెండో కేటగిరీ అంటున్నాడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కౌన్ బనేగా కరోడ్‌పతి షోలోని తాజా ఎపిసోడ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ త్రిషూల్ చౌదరి కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అతడు టెన్షన్ పడటం చూసిన బిగ్‌బీ.. ఆ కంగారును పోగొట్టేందుకు త్రిషూల్ను హత్తుకుని తనతో మాట కలిపాడు.అమితాబ్‌కు కౌంటర్‌నా మనవళ్లు, మనవరాళ్ల కోసం వారితో కలిసి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు వెళ్తుంటాను. కానీ ఆ సినిమాలు నాకసలు అర్థమే కావని చెప్తే వాళ్లేమన్నారో తెలుసా? అవునా, మాకు కూడా కల్కి 2898 ఏడీ మూవీ అస్సలు అర్థం కాలేదని రివర్స్ పంచ్ ఇచ్చారు అని తెలిపాడు. ఈ మాటలు విని నవ్వేసిన త్రిషూల్.. కల్కిలో అశ్వత్థామగా పాత్ర, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉన్నాయని బిగ్‌బీపై ప్రశంసలు కురిపించాడు.సినిమా సంగతులు..ఇకపోతే ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నాగ్ అశ్విన దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రానుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ మూవీతో పాటు ద ఇంటర్న్ సినిమా రీమేక్‌లోనూ బిగ్‌బీ నటించనున్నాడు.చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు -
కౌన్ బనేగా కరోడ్‌పతిలో టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించిన ప్రశ్న
ఇటీవలికాలంలో కౌన్ బనేగా కరోడ్‌పతి టీవీ షోలో క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువయ్యాయి. తొలి ఐదారు ప్రశ్నల్లో ఏదో ఒకటి క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్నే ఉంటుంది. తాజాగా జరిగిన ఓ ఎడిసోడ్లోనూ క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. 40000 రూపాయల కోసం ఎదురైన ఆ ప్రశ్న ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించింది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. కింది నాలుగు ఆప్షన్స్‌లో ఎవరూ టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ జట్టు సభ్యులు కాదు..? ఈ ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ ఇలా ఉన్నాయి. ఏ-కుల్దీప్ యాదవ్, బి-రవీంద్ర జడేజా, సి-రవిచంద్రన్ అశ్విన్, డి-సూర్యకుమార్ యాదవ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. A cricket related question in KBC for 40,000 INR. pic.twitter.com/GF3Lc3Kal6— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2024కాగా, కౌన్ బనేగా కరోడ్‌పతి అనేది దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ షో. ఇందులో కంటెస్టెంట్స్ కంప్యూటర్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందుకు వారి నిర్దిష్ట పారితోషికం లభిస్తుంది.వరల్డ్ ఛాంపియన్‌గా భారత్ఇదిలా ఉంటే, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై జయకేతనం ఎగురవేసి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. త్వరలో బంగ్లాదేశ్ సిరీస్ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో భారత ఆటగాళ్లు ఖాళీగా ఉన్నారు. ఈ నెల 19 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. తొలి టెస్ట్ చెన్నై వేదికగా సెప్టెంబర్ 19 నుంచి.. రెండో టెస్ట్ కాన్పూర్ వేదికగా సెప్డెంబర్ 27 నుంచి మొదలుకానుంది. అనంతరం అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదరాబాద్ వేదికలుగా మూడు టీ20లు జరుగనున్నాయి.చదవండి: తలో స్థానం మెరుగుపర్చుకున్న రోహిత్, జైస్వాల్, విరాట్ -
క్యాన్సర్‌తో పోరాటం.. రూ.25 లక్షలు మిస్ చేసుకున్నాడు!
ఇటీవల కల్కి మూవీతో ప్రేక్షకులను అలరించిన బిగ్‌బీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ -16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అక్షయ్ నారంగ్ అనే యువకుడికి రూ.25 లక్షల ప్రశ్న ఎదురైంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పటికీ ఊహించని విధంగా షో నుంచి తప్పుకున్నాడు. దీంతో కేవలం రూ.12.5 లక్షలు మాత్రమే సొంతం చేసుకున్నాడు. అతను అనుకున్న ఆన్సర్పై కాన్ఫిడెన్స్ లేకపోవడంతో షో నుంచి నిష్క్రమించాడు. అయితే ఢిల్లీకి చెందిన యువకుడు తన నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.(ఇది చదవండి: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య)అయితే అక్షయ్ నారంగ్ గతంలో క్యాన్సర్‌తో పోరాడినట్లు ఈ షోలో పంచుకున్నారు. 2018లో తనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించాడు. ఆ తర్వాత ఓ కణితిని వైద్యులు తొలగించారని తెలిపాడు. దాదాపు రెండేళ్లపాటు క్యాన్సర్‌తో పోరాటం చేసినట్లు చెప్పుకొచ్చాడు. కాలేజీలో తన స్నేహితులు సరదాగా గడుపుతున్న సమయంలో తాను ఆసుపత్రిలో ఉన్నానని అక్షయ్ తన బాధను అమితాబ్‌తో పంచుకున్నారు. నేను ఆరోగ్యంగా బయటకు వచ్చి కౌన్ బనేగా కరోడ్‌పతి షో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని అమితాబ్‌తో అన్నారు. దీంతో అమితాబ్ అతనికి ధైర్యం చెప్పారు. -
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు.. 10 క్లాసిక్ సినిమాలు రీ-రిలీజ్
ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకటించింది.1941లో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నాగేశ్వరరావు.. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో 71 సంవత్సరాల పాటు కొనసాగారు. తన కెరీర్లో 250 చిత్రాలకు పైగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలో భారతదేశపు అత్యున్నతమైన పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. 1924 సెప్టెంబరు 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న మరణించారు. 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు కొనసాగుతుంది. దేశంలో 25 ప్రధాన నగరాల్లో నాగేశ్వరరావు నటించిన 10 సూపర్ హిట్ క్లాసిక్ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రోలతో పాటు వడోదర, జలంధర్, తుమకూరు వంటి చిన్న నగరాల్లో కూడా ఈ సనిమాలు రిలీజ్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ప్రధాన సిటీలలో విడుదల అవుతాయి.సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలుదేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)నిధులుఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, NFDC - నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా , మల్టీప్లెక్స్ చైన్ PVR-Inox సంయుక్తంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాయి. నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నిధులు సమకూరుతాయి.తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది: నాగార్జున 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ గురించి నాగార్జున ఇలా రియాక్ట్ అయ్యారు. 'కొన్ని దశాబ్దాలుగా ప్రజల హృదయాలలో నిలిచిపోయే పాత్రలలో నాగేశ్వరరావు గారు నటించారు. ఆయన సాధువుగా కనిపించినా, మద్యపానానికి బానిసగా ఆపై రొమాంటిక్ హీరోగా అనేక రకాల పాత్రలను పోషించడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు. అందుకే ఆయన్ను 'నటసామ్రాట్' అని పిలుస్తారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించిన మార్గదర్శకుడు. అతని వారసత్వం గురించి మేము చాలా గర్విస్తున్నాము. ఈ పండుగ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్‌ను గుర్తుంచుకుంటారు.' అని నాగ్ అన్నారు.ఆ అదృష్టం నాకు కలిగింది: అమితాబ్ బచ్చన్'అక్కినేని నాగేశ్వరరావు గారిని చాలా సందర్భాల్లో కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ, వినయం ఎప్పుడూ ఆశ్చర్యాన్ని తెప్పిస్తాయి. భారతీయ సినిమా వారసత్వాన్ని తిరిగి పెద్ద తెరపైకి తీసుకురావాలనే ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఈ పండుగను జరుపుతుంది. బహుముఖ ప్రజ్ఞ, లెజెండరీ నటుడి గురించి అందరూ తెలుసుకునే అద్భుతమైన అవకాశం మనకు దక్కుతుంది.' అని అన్నారు. -
అమితాబ్ కోటి రూపాయల ప్రశ్న.. కంటెస్టెంట్ ఏం చేశాడంటే?
బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కల్కి సినిమాతో అభిమానులను మెప్పించిన ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వచ్చాడు. ఆదివాసి తెగకు చెందిన కంటెస్టెంట్ బంటి వడివా కోటీ రూపాయల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో కోటీశ్వరుడు అయ్యే ఛాన్స్‌ను కొద్దిలో మిస్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ప్రశ్నేంటో మనం ఓ లుక్కేద్దాం.తాజా ఎపిసోడ్లో మొదటి ఆదివాసీ కంటెస్టెంట్ బంటి వడివా రూ. 50 లక్షలు గెలుచుకున్నాడు. ఈ సీజన్లో మొదటి కోటీశ్వరుడు అయ్యే అవకాశాన్ని తృటిలో మిస్ చేసుకున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో రిస్క్ తీసుకోకుండా నిష్క్రమించాడు. దీంతో 50 లక్షల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమితాబ్ కూడా ప్రశంసించారు.గతంలో తాను ముంబైకి వచ్చినప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.260 మాత్రమే ఉన్నాయని బంటి వడివా తెలిపారు. ఇప్పుడు తన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలకు పైగానే ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఎపిసోడ్లో 2024 పారిస్ ఒలింపిక్ పతక విజేతలు మను భాకర్, అమన్ షెరావత్ కూడా అతిథులుగా పాల్గొన్నారు.కోటీ రూపాయల ప్రశ్న..ప్రశ్న: ది స్టాగ్ అనే ఆర్ట్ వర్క్‌కు బెంగాలీ శిల్పి చింతామోని కర్ను వరించిన పతకమేది?ఆప్షన్స్: ఎ. పైథాగరస్ బహుమతి బి. నోబెల్ బహుమతి సి. ఒలింపిక్ పతకం డి. ఆస్కార్ పతకంఅయితే 1948లో ఒలింపిక్ గేమ్స్‌లో కళల పోటీలు కూడా ఉన్నాయని అమితాబ్ వెల్లడించారు. అందువల్లే చింతామోని కర్ తన కళాకృతికి ఒలింపిక్ రజత పతకాన్ని గెలుచుకున్నాడని తెలిపారు. కాగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షో సోనీలివ్‌లో ప్రసారమవుతోంది. -
అడ్వాన్స్ ట్యాక్స్‌లో ‘కింగ్’ ఖాన్!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం అత్యధికంగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీల్లో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో నిల్చారు. ఆయన రూ. 92 కోట్లు చెల్లించారు. తమిళ నటుడు విజయ్ రూ. 80 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2023–24లో భారీ స్థాయిలో అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీలతో ఫార్చూన్ ఇండియా రూపొందించిన ’ది స్టార్ కాస్ట్’ లిస్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ (రూ. 75 కోట్లు), అమితాబ్ బచ్చన్ (రూ. 71 కోట్లు) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యధికంగా రూ. 66 కోట్లు చెల్లించగా, ఎంఎస్ ధోని రూ. 38 కోట్లు, సచిన్ టెండూల్కర్..సౌరవ్ గంగూలీ వరుసగా రూ.28 కోట్లు, రూ. 23 కోట్లు చెల్లించారు. పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన సినీ ప్రముఖుల్లో అల్లు అర్జున్, మోహన్‌లాల్ చెరో రూ. 14 కోట్లు కట్టగా ఆమిర్ ఖాన్ రూ. 10 కోట్లు చెల్లించారు. -
Dupe: ఏడడుగుల అశ్వత్థామ
ఏడడుగుల అశ్వత్థామ‘కల్కి’ సినిమాలో అశ్వత్థామ మనందరికీ నచ్చాడు కదా. అమితాబ్ బచ్చన్ ఆ పాత్రలో కనిపిస్తాడు. ద్వాపర యుగం నాటి పాత్ర కాబట్టి సినిమాలో మిగిలిన అన్ని పాత్రలు ఇప్పటి ఎత్తులో ఉన్నా అమితాబ్ 7 అడుగుల ఎత్తులో ఉంటాడు. కాని సినిమాల్లో అన్ని సన్నివేశాల్లో హీరోలు యాక్ట్ చేయరు. వాళ్లకు డూప్స్ ఉంటారు. ‘కల్కి’లో కూడా అమితాబ్‌కు డూప్ ఉన్నాడు. అతని పేరు సునీల్ కుమార్. ఇక్కడ ఫోటోల్లో ఉన్నాడే... అతనే. ఇతని ఎత్తు ఏడు అడుగుల ఏడంగుళాలు. జన్యుపరమైన ఇబ్బందుల వల్ల ఇంత ఎత్తు పెరిగాడు. జమ్ము– కశ్మీర్లో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్యనే సినిమాల కోసం ఇతణ్ణి ఉపయోగిస్తున్నారు. కల్కి సినిమా మొత్తం అమితాబ్‌కు డూప్‌గా నటించాడు. అమితాబ్ సునీల్‌ని చూసి ‘అరె... నేనే లంబు అనుకుంటే ఇతను నాకంటే లంబుగా ఉన్నాడే’ అని సరదాపడ్డాడట. సునీల్ కుమార్ ఇటీవల పెద్ద హిట్ అయిన ‘స్త్రీ2’లో కూడా ఉన్నాడు. అందులో ‘సర్కటా’ అనే దెయ్యం వేషం వేశాడు. షూటింగ్‌ల కోసం లీవ్ పెట్టి ముంబై, హైదరాబాద్ తిరగాలంటే సెలవు కొంచెం కష్టమైనా సినిమాల్లో నటించడం బాగనే ఉందని సంతోషపడుతున్నా సునీల్. -
బాలీవుడ్లో టాప్-5 కుబేరులు వీళ్లే.. అమితాబ్ ప్లేస్ ఎంతంటే?
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కల్కి మూవీతో మెప్పించిన ఆయన ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్లో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ -2024 పేరుతో విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో అమితాబ్ నాలుగో ప్లేస్‌లో నిలిచారు.ఇటీవల విడుదలైన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో అమితాబ్ బచ్చన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ.1,600 కోట్లు అని వెల్లడించింది. అతనికంటే ముందు షారుఖ్ ఖాన్ (రూ.7300 కోట్లు), జూహీ చావ్లా కుటుంబం (రూ.4600 కోట్లు), హృతిక్ రోషన్ (రూ. 2000కోట్లు) అతని ముందున్నారు.ఈ లిస్ట్‌లో కరణ్ జోహార్ రూ.1400 కోట్లతో ఐదోస్థానంలో నిలిచారు.అయితే అమితాబ్ తన చిన్న వయసులో కోల్‌కతాలో నెలకు రూ.400 ఉద్యోగంలో పని చేసినట్లు వెల్లడించారు. కాలేజీ పూర్తి చేసిన తర్వాత కోల్‌కతాలో జాబ్ చేసేందుకు వెళ్లానని తెలిపారు. ఓకే గదిలో దాదాపు 8 మందితో కలిసి ఉండేవాడినని పేర్కొన్నారు. కేవలం నేల మీద పడుకునేవాడినని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. కాగా.. ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఓ వ్యక్తి తాను పుణెలో ఓకే గదిలో ఎనిమిది మందితో కలిసి జీవిస్తున్నట్లు అమితాబ్‌తో అన్నారు. ఈ సందర్భంగా తాను కూడా ఆ స్థాయి నుంచే వచ్చినట్లు అమితాబ్ వెల్లడించారు.ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 16 షూటింగ్లో బిజీగా ఉన్న అమితాబ్ ఆ తర్వాత సెక్షన్ 84 చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రజనీకాంత్ నటిస్తోన్న వేట్టైయాన్లోనూ నటించనున్నారు. -
స్విగ్గీలో అమితాబ్ బచ్చన్ కుటుంబానికి వాటాలు
న్యూఢిల్లీ: ఐపీవోకి సన్నద్ధమవుతున్న ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం స్విగ్గీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కి చెందిన ఫ్యామిలీ ఆఫీస్ స్వల్ప వాటాలు తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ ఉద్యోగులు, ప్రారంభ దశ ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఈ లావాదేవీని నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 10,414 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు స్విగ్గీ షేర్హోల్డర్లు ఏప్రిల్‌లో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా కొత్తగా షేర్లను జారీ చేయడంతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను విక్రయించనున్నారు. -
'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో క్రికెటర్‌కు సంబంధించిన ప్రశ్న
ప్రముఖ బాలీవడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో టీమిండియా క్రికెటర్‌కు సంబంధించిన ఓ ప్రశ్న వచ్చింది. తాజాగా జరిగిన ఎడిసోడ్‌లో బెంగళూరుకు చెందిన ప్రియాంక పోర్వాల్ అనే కంటెస్టెంట్ 80,000 రూపాయలకు ఈ ప్రశ్నను ఎదుర్కొంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే.. చెన్నైలో పుట్టిన ఏ టీమిండియా క్రికెటర్ 'కుట్టి స్టోరీస్' అనే టాక్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తాడు..?A cricket question in KBC. pic.twitter.com/X7hwjhNBVC— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2024ఈ ప్రశ్నకు అమితాబ్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో మొదటిది దినేశ్ కార్తీక్ కాగా.. రెండోది రవిచంద్రన్ అశ్విన్.. మూడవది వాషింగ్టన్ సుందర్, నాలుగవది సంజూ శాంసన్. పై నాలుగింటిలో కంటెస్టెంట్ ప్రియాంక ఓ సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉండింది. అయితే సమాధానంపై సరైన అవగాహణ లేని ప్రియాంక ఆడియన్స్ పోల్‌కు వెళ్లి, ఆప్షన్-బి రవిచంద్రన్ అశ్విన్ అని చూస్ చేసుకుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ కావడంతో ఆమె తదుపరి ప్రశ్నకు అర్హత సాధించింది. అయితే 1,60,000 ప్రశ్నకు ఆమె ఆన్సర్ చెప్పలేకపోవడంతో ఆమె 80,000తోనే గేమ్‌ను వదిలేసింది.కాగా, కేబీసీలో ఇలా క్రికెట్‌కు, క్రికెటర్లకు సంబంధించిన ప్రశ్నలు రావడం ఇటీవలికాలంలో తరుచూ జరుగుతుంది. కంటెస్టెంట్లకు అన్ని అంశాల్లో అవగాహణ ఉందో లేదో తెలుసుకునేందుకు నిర్వహకులు ఇలాంటి ప్రశ్నలను సంధిస్తుంటారు.ఇదిలా ఉంటే, టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడంతో లోకల్ క్రికెట్లో పాల్గొంటున్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్ రెండు టెస్ట్‌లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో అశ్విన్ టెస్ట్‌లకు ఎంపికయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అశ్విన్ 100 టెస్ట్‌లు ఆడి 516 వికెట్లు పడగొట్టాడు. -
81 ఏళ్ల వయసులో సినిమాలు.. మీకేంటి ప్రాబ్లమ్?: బిగ్‌బీ
81 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. అభిమానులకు వినోదాన్ని పంచడమే తన ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నాడు. అయితే కొందరు మాత్రం.. ఇంకా ఈ వయసులో కూడా పని చేయడం అవసరమా? విశ్రాంతి తీసుకోవచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు. వయసుపై బడ్డప్పుడు ఖాళీగా కూర్చోకుండా ఇంకా పని చేయాల్సిన అవసరమేంటని కొందరు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.నా కారణమైతే..తాజాగా ఈ ప్రశ్నలకు బిగ్‌బీ సమాధానమిచ్చాడు. 'ఇంకా ఎందుకు పని చేస్తున్నావని ఇప్పటికీ సెట్లో ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు. దీనికి నా దగ్గర సమాధానమే లేదు. అయితే సినిమా అనేది నాకొక ఉద్యోగం వంటిది. చేసుకుంటూ పోతున్నాను. మీరేదైనా అనుకోండి. నా పని నేను చేసుకునే స్వేచ్ఛ ఉంది. నా కారణమైతే నేను చెప్పాను. దానికి మీరు ఏకీభవిస్తారో లేదో మీ ఇష్టం. నేనైతే చెప్పాను.మీకేమైనా సమస్యా?ఇసుక కోటలను నిర్మించేటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు. అవి కూలిపోయినా మళ్లీ కట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈసారి మరింత ధృడంగా ఉండాలని కష్టపడతారు. అది మీ కోసం, మీ వ్యాపార సామ్య్రాజ్యం కోసం ఇష్టంగా చేస్తారు. నేనూ అలాగే ఓ సామ్య్రాజ్యాన్ని సృష్టించాను, దాన్ని నిలబెట్టుకున్నాను. అందులో ఉన్నవారి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటాను. అందుకు మీకేమైనా సమస్యా? అని ప్రశ్నించాడు. కాగా అమితాబ్ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో కనిపించాడు. -
కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఒక్క ఎపిసోడ్‌కే రూ.5 కోట్లా?
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇటీవలే ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైంది.అయితే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ పారితోషికం గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఇందులో ఒక్కో ఎపిసోడ్‌కు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ఎంతనే దానిపై ఆడియన్స్ తెగ ఆరా తీస్తున్నారు. బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అమితాబ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్‌కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని ఓ నివేదికలో వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్ల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్.. తాజా సీజన్లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్‌కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు. -
‘జయా అమితాబ్ బచ్చన్’.. సమాజ్‌వాదీ ఎంపీ మరోసారి అభ్యంతరం
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆమెను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ పూర్తి పేరుతో సంబోధించడంపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కొత్త డ్రామా ప్రారంభించారంటూ జయా బచ్చన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమితాబ్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నా. ఆయనతో నా వివాహం, భర్తతో ఉన్న అనుబంధాన్ని చూసి గర్వపడుతున్నా.. నా భర్త పాధించిన విజయాలపై సంతోషంగా, గర్వంగానూ ఉంది. కానీ నన్ను కేవలంజయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుంది. మహిళలకు సొంత గౌరవం అంటూ లేేదా? మీరందరూ ప్రారంభించిన కొత్త డ్రామా ఇది. ఇంతకు ముందు ఇలా జరిగేది కాదు’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు.అయితే దీనిపై ఉపరాష్ట్రపతి ధన్ఖర్ స్పందిస్తూ.. ఎన్నికల సర్టిఫికెట్లో పేరు అలాగే ఉందని, కావాలంటే తన పేరును మార్చుకునే నిబంధన కూడా ఉందని తెలిపారు. ‘అమితాబ్ బచ్చన్ సాధించిన విజయాలకు దేశమంతా గర్విస్తోంది. ‘ఎన్నికల సర్టిఫికేట్లో కనిపించే పేరునే మేము ఉపయోగిస్తున్నాం. మీరు కావాలంటే పేరు మార్చుకోవచ్చు. దాని కోసం నిబంధన కూడా ఉంది’ అని పేర్కొన్నారు.కాగా జయాబచ్చన్ తన పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం ఇదేం తొలిసారి కాదు. జూలై 29న సభా కార్యక్రమాల్లో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ‘జయ అమితాబ్ బచ్చన్’ అని సంబోధించడంపై అసహనానికి లోనయ్యారు. తనను కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందన్నారు. అయితే, ఇలా తనను భర్త పేరుతో కలిపి పిలవడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన రోజుల వ్యవధిలోనే ఆమె అదే పేరుతో తనను పరిచయం చేసుకుని రాజ్యసభలో శుక్రవారం కాసేపు సరదాగా నవ్వులు పూయించారు. -
రాజ్యసభలో అమితాబ్ ప్రస్తావన.. పగలబడి నవ్విన ఛైర్మన్
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలో భాగంగా రాజ్యసభలో శుక్రవారం ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించింది. సభలో తనను తాను పరిచయం చేసుకునే క్రమంలో ఆమె తన భర్త అమితాబ్ పేరును ప్రస్తావించారు. దీంతో ఒక్కసారిగా ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. సభలో మిగిలిన ఎంపీలు నవ్వుతూ కనిపించారు. అయితే సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్.. ‘జయా అమితాబ్ బచ్చన్’ మాట్లాడాలంటూ ఆహ్వాహించాగా.. ఆమె అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. తనను ‘‘జయా బచ్చన్ అంటే సరిపోతుంది’’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’అంటూ చెప్పారు. దానికి ఆమె స్పందిస్తూ మహిళలకు సొంతంగా గుర్తింపు లేదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.Watch 🔥 🔥 🔥Vice-president Jagdeep Dhankhar Ji enjoying the meltdown with his witty relies.🤣🤣🤣🤣🤣 pic.twitter.com/N6SMykvQg0— Alok (@alokdubey1408) August 2, 2024 ఈ నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ మాట్లాడుతూ.. తనను తాను జయా అమితాబ్ బచ్చన్‌గా పేర్కొనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఆమె అబితాబ్ ప్రస్తావన తీసుకురాగనే జగదీప్ ధన్‌ఖడ్ పగలబడి నవ్వారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేదు. అందుకే కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే మీకు ఆహారం అరగదేమో’అంటూ చమత్కరించారు. దానికి ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ సైతం అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. ‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’అంటూ సమాధానం ఇవ్వడంతో సభలో నవ్వులు విరిశాయి. -
పని చేస్తూ సంపాదించే భార్య నాకొద్దు.. పెళ్లికి ముందే బిగ్‌బీ కండీషన్?
పెళ్లయ్యాక భార్య ఇంటిపట్టునే ఉండాలని, ఉద్యోగం చేయకూడదని ఆంక్షలు పెట్టేవారు చాలామంది! అందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడట! ఈ విషయాన్ని ఆయన సతీమణి, నటి జయా బచ్చన్ వెల్లడించింది. అలాగే తన పెళ్లి ముచ్చట్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మేము అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలన్నాం. అదే నెల ఎందుకు ఎంచుకున్నామంటే అప్పటికి నేను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయిపోతాయని! ప్రతిరోజూ షూటింగ్స్‌కి వద్దుఅమితాబ్ నాతో ఏమన్నాడంటే.. ఉదయం 9 నుంచి సాయంత్రి 5 గంటల వరకు పని చేసే భార్య నాకొద్దు. అలా అని నిన్ను సినిమాలు మానేయమని చెప్పడం లేదు. కానీ ప్రతిరోజు షూటింగ్స్‌కే సమయం కేటాయించొద్దని అంటున్నాను. నీకు కరెక్ట్ అనిపించిన ప్రాజెక్టులు మాత్రమే ఒప్పుకో, నచ్చినవాళ్లతోనే సినిమాలు చేయు అని సలహా ఇచ్చాడు.ఒప్పుకోలేదని జూన్‌లో పెళ్లిఅక్టోబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్న మేము జూన్‌లోనే వివాహంతో ఒక్కటయ్యాం. అందుకు ఓ కారణముంది. మేమిద్దం జంటగా నటించిన జంజీర్ సినిమా సక్సెస్‌ను ఆనందిస్తూ ఓ ట్రిప్‌కు వెళ్లాలుకున్నాం. అయితే జంటగా వెళ్లేందుకు అమితాబ్ కుటుంబం ఒప్పుకోలేదు. మనం పెళ్లి చేసుకుంటేగానీ హాలీడేకు కలిసి వెళ్లనిచ్చేలా లేరన్నాడు. అలాగైతే అక్టోబర్‌దాకా ఆగడమెందుకు? ఈ జూన్‌లోనే పెళ్లి చేసుకుందామన్నాను. దానికంటే ముందు మా పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్పాను. నాన్నకు ఇష్టం లేదుఅలా మా నాన్నను కలిసి విషయం చెప్పాడు. కానీ ఆయనకు మేము పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. తర్వాత ఎలాగోలా మా పెళ్లి జరిగిపోయింది అని జయ తెలిపింది. తన మనవరాలు నవ్య నంద నిర్వహించే 'వాట్ ద హెల్ నవ్య' అనే పాడ్‌కాస్ట్‌లో ఈ సంగతులను చెప్పుకొచ్చింది. అయితే దశాబ్దం క్రితం ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్నది జయ నిర్ణయమేనని తెలిపాడు. సినిమాకు బదులు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.గొప్ప స్టార్‌గా..కాగా పెళ్లి తర్వాత బిగ్ బీ ఎవరూ ఊహించనంత గొప్ప స్టార్ అయ్యాడు. జయ తన కుటుంబానికే సమయం కేటాయించి గృహిణిగా మిగిలిపోయింది. కుమారుడు అభిషేక్, కూతురు శ్వేతకు కావాల్సినవి సమకూరుస్తూ అమ్మ బాధ్యతను నిర్వహించింది.చదవండి: కోట్ల అప్పు వల్లే ప్రాణాలు తీసుకున్న దర్శకుడు? -
'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!
ప్రభాస్ 'కల్కి' రిలీజై దాదాపు నెలరోజులు కావొస్తుంది. అయితేనేం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం లేకపోవడంతో ఇప్పటికే విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మహాభారతం సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. వీటికోసమే జనాలు మాట్లాడుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఈ సన్నివేశాల విషయమై చిత్రబృందానికి కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి.(ఇదీ చదవండి: శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్)'కల్కి' సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపించిన ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చిత్రబృందంతో పాటు ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌కు నోటీసులు పంపారు. కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.'మన పురాణాల్లో ఉన్న వాటికి ఈ సినిమా విరుద్ధంగా ఉంది. మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. కల్కి భగవానుడి కాన్సెప్ట్నే ఈ సినిమా మార్చేసిందని, ఇలా చేయడం పురాణాలని అగౌరపరచడమే. దీని వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది' అని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తన నోటీసుల్లే పేర్కొన్నారు.(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?) -
అశ్వద్దామ అమితాబ్ నటనపై బాలీవుడ్ సైలెంట్..?
-
'రెబల్స్ ఆఫ్ కల్కి' వీడియో వైరల్
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది.'బుక్ మై షో'లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటికీ టికెట్ల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా 'రెబల్స్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో భారీ యాక్షన్ సీన్స్‌ను వారు చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి. -
ప్రభాస్‌కు అది రోటీన్.. కానీ నాకు మాత్రం.. అమితాబ్ ఆసక్తికర కామెంట్స్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత గతనెల థియేటర్లలోకి వచ్చింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.తాజాగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు. కల్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విశేష ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే వెయ్యి కోట్ల రావడమనేది ప్రభాస్ కెరీర్లో రోటీన్ విషయమేనని అన్నారు. నా విషయానికొస్తే ఇంత పెద్ద సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. కల్కి చిత్రాన్ని ఇప్పటికే నాలుగు సార్లు చూశానని.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా.. కల్కి మూవీకి పార్ట్-2 కూడా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో భైరవగా సందడి చేసిన ప్రభాస్.. సీక్వెల్లో కర్ణుడిగా కనిపించనున్నారు. దీంతో పార్ట్-2పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కాగా.. కల్కి 2898 ఏడీలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బీ కాళ్లకు నమస్కరించబోయిన రజనీకాంత్.. వీడియో వైరల్
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు హాజరైన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కొత్త జంటను మనసారా ఆశీర్వదించారు. జూలై 12న పెళ్లి జరగ్గా.. ఆ తర్వాత రోజు శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ సహా తదితరులు హాజరయ్యారు.అయితే బిగ్‌బీ, తలైవా ఒకరికొకరు ఎదురుపడగానే ఆత్మీయంగా పలకరించుకున్నారు. బిగ్‌బీ షేక్ హ్యాండ్ ఇవ్వబోతే రజనీ.. ఆయన పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అమితాబ్ వద్దని వారించి ఆయన్ను హత్తుకున్నాడు. ఇద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇది చూసిన అభిమానులు ఒకరంటే మరొకరికి ఎంత ప్రేమ, గౌరవం అని కొనియాడుతున్నారు. శనివారం జరిగిన శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో అమితాబ్ కలర్‌ఫుల్ షేర్వాణీ ధరించగా రజనీకాంత్ వైట్ డ్రెస్‌లో కనిపించాడు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) చదవండి: సినీ దర్శకుడు ఆత్మహత్య -
వాష్ రూమ్ కోసం అమితాబ్ పర్మిషన్.. అసలు విషయం ఇది
థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు అయిపోతున్నా సరే ప్రభాస్ 'కల్కి'కి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా రూ.1000 కోట్ల గ్రాస్ దాటేసినట్లు పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఇందులో అశ్వద్థామగా నటించిన అమితాబ్ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. ఇక సెట్లో ప్రభాస్ కాళ్లకు నమస్కారం చేస్తానని చెప్పడం లాంటి కామెంట్స్‌తో ఈయనపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి.షూటింగ్ జరుగుతున్న టైంలో అమితాబ్, వాష్ రూమ్‌కి వెళ్లాలన్నా సరే తన అనుమతి తీసుకునేవారని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రమోషన్స్ టైంలో చెప్పాడు. తాజాగా దీనికి అమితాబ్ వివరణ ఇచ్చారు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. సెట్లో ఉన్నంత సేపు తాను ఓ పనివాడిని అయితే.. దర్శకుడు కెప్టెన్ లాంటి వాడని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)'మంచితనంగా ఉండటానికి ఇదేం ఉదాహరణ కాదు. ఎందుకంటే ఇది చాలా సాధారణ విషయం. వాష్ రూమ్‌కి వెళ్లేందుకు నేను పర్మిషన్ అడిగారని డైరెక్టర్ చెప్పారు. అవును అది నిజమే. అది అతడి సెట్, అతడి సమయం, అక్కడ అతడే కెప్టెన్. నేను కేవలం పనోడిని మాత్రమే. ఒకవేళ నేను బయటకెళ్లాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి కదా! సెట్‌కి నన్ను పిలిచింది అతడే. అందుకే అతడి చెప్పిన విషయాల్ని తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నేను అదే చేశాను' అని అమితాబ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.'కల్కి' సినిమాలో అశ్వద్థామగా కనిపించి అమితాబ్.. 80 ఏళ్ల వయసులోనే యాక్షన్, ఎమోషనల్ సీన్లలో రఫ్ఫాడించారు. ఒకానొక సమయంలో హీరో ప్రభాస్ అయినప్పటికీ.. పార్ట్-1లో తన యాక్టింగ్‌తో అశ్వద్థామనే అసలైన హీరో అనిపించేలా యాక్టింగ్ చేశారు. ఇలా ఇంత డెడికేషన్ చూపిస్తూ డైరెక్టర్ చెప్పింది వింటున్నారు కాబట్టి ఇప్పటికీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారేమో!(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఆలస్యం.. మనసు మార్చుకున్న చరణ్?) -
రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ‘కల్కి’.. అరుదైన రికార్డు!
ఊహించిందే నిజమైంది. ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల కొల్లగొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమైయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ రోజే(జూన్ 27) హిట్‌టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పటికి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు వచ్చాయాని మేకర్స్ ప్రకటించారు. (చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్)రిలీజ్ అయి రెండు వారాలు దాటినా..ఇప్పటికీ సక్సెఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.ఏడో చిత్రంగా ‘కల్కి’ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఏడోది. అంతకు ముందు దంగల్ (2016) రూ.2024 కోట్లు, బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్ఆర్ఆర్ (2022) 1387 కోట్లు, కేజీయఫ్2 (2022) రూ.1250 కోట్లు, జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు వసూలు చేశాయి. -
నా సినిమా ఫ్లాఫ్ అయితే వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా సర్ఫీరా మూవీతో ప్రేక్షకులను పలరించాడు. ఈ చిత్రం సూర్య నటించిన సూపర్‌హిట్ మూవీ సూరారైపోట్రుకు రీమేక్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు కూడా సుధా కొంగర దర్శకత్వం వహించారు. జూలై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన సర్ఫీరా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ సందర్భంగా అక్షయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినిమాలు ఫ్లాఫ్ అయినప్పుడు ఎలా ఉండాలో అమితాబ్‌ను చూసి నేర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా.. ఏప్రిల్ 10న విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో సెలెక్టివ్‌గా పనిచేసే వ్యక్తులను నేను చూశా. వారి సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇక్కడ సినీ పరిశ్రమలో ఫ్లాప్‌లు వస్తే మనకు అవకాశాలు ఇవ్వడం మానేస్తారు. కొందరు వ్యక్తులు నా సినిమాల వైఫల్యాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలా చూడటం వాళ్లకు ఇష్టం. కానీ నేను నా శ్రమను నమ్ముకున్నా. అయితే ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలి. అయితే నేను అమితాబ్ బచ్చన్ నుంచి ఓ విషయం నేర్చుకున్నా. ఫ్లాఫ్ వచ్చినా మన పనిని మాత్రం ఆపకూడదు. మన పనితో పాటు అదృష్టాన్ని నమ్ముకోవాలని ఆయన సలహా ఇచ్చారు.' అని అన్నారు. అయితే తాను ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరి గురించి చెడుగా మాట్లాడలేదని తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అసహనం వ్యక్తం చేశారు. 'బడే మియాన్ చోటే మియాన్' షూటింగ్ కోసం 80 రోజులు కేటాయించినట్లు అక్షయ్ కుమార్ వెల్లడించాడు. కాగా.. అక్షయ్ నటించిన 'బడే మియాన్ చోటే మియాన్', 'రామ్ సేతు', 'రక్షా బంధన్', 'బచ్చన్ పాండే', 'సెల్ఫీ' బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. -
కల్కి సినిమా నుంచి అశ్వత్థామ సాంగ్.. వీడియో వైరల్
ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే మ్యూజిక్ ఆల్బమ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా కల్కి సినిమా నుంచి పాటలను విడుదలను కూడా విడుదల చశారు. 'వెయిట్ ఆఫ్ అశ్వత్థామ' పేరుతో కేశవ, మాధవ పాటను మేకర్స్ విడుదల చేశారు. జూన్ 27న విడుదలైన కల్కి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1000 వరకు కలెక్షన్స్ రాబట్టింది. సంతోష్ నారాయాణ్ పాడిన ఈ పాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. -
1000 కోట్లు ఊరికే రాలేదు..! ఇవి కదా ప్లస్ పాయింట్స్
-
కల్కి సినిమాలో ఓల్డ్ టెంపుల్.. ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా? (ఫొటోలు)
-
ఫైనల్ చూడలేదు.. తెలియకుండానే కన్నీళ్లు: బిగ్‌బీ
దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విశ్వవేదికపై భారత జెండా రెపరెపలాడింది. టీ 20 వరల్డ్‌కప్ (2024) ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ అపురూప క్షణాలను అభిమానులు, సినీ తారలు టీవీలో చూసి మురిసిపోయారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ విజయం వరించిందని తన్మయత్వానికి లోనవుతున్నారు.టీవీ చూడలేదుబాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వరల్డ్ ఛాంపియన్స్‌గా ఇండియా.. టీ 20 వరల్డ్ కప్ 2024 గెలిచాం.. ఈ ఆనందం, ఎమోషన్స్ మాటల్లో చెప్పలేం. నేను మ్యాచ్ చూస్తే ఎక్కడ ఓడిపోతామోనని టీవీ చూడలేదు. మనందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.ఎమోషనల్ ట్వీట్'తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్స్ ఇండియా.. భారత్ మాతాకీ జై.. జై హింద్! జై హింద్!!' అని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. కాగా నిన్న (జూన్ 29న) జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫినాలేలో సౌతాఫ్రికాను వెనక్కునెట్టి భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే!సినిమాల సంగతి..అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన కీలక పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న విడుదలైంది. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్లు రాబట్టింది. T 5057 - Tears flowing down .. in unison with those that TEAM INDIA sheds ..WORLD CHAMPIONS INDIA 🇮🇳भारत माता की जय 🇮🇳जय हिन्द जय हिन्द जय हिन्द 🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) June 29, 2024 చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా? -
అమితాబ్ అలా చేస్తారని ఊహించలేదు: నిర్మాత సి. అశ్వినీదత్
‘‘అమితాబ్ బచ్చన్‌గారు లెజెండ్. మేము సెట్స్‌లో కలిసినప్పుడు పరస్పరం నమస్కరించుకుంటాం. కానీ ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నా కాళ్లకి అమితాబ్‌గారు నమస్కరించడంతో నాకు తల కొట్టేసినంత పని అయింది. ఆయన అలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అన్నారు నిర్మాత సి. అశ్వినీదత్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో సి. అశ్వినీదత్ మాట్లాడుతూ– ‘‘నాగ్ అశ్విన్ ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే నమ్మకం నాకు మొదటి నుంచి ఉంది. ఈ శతాబ్దంలో ఒక మంచి దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు (నవ్వుతూ). ‘కల్కి’ విషయంలో టెన్షన్ పడలేదు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే తీశాం... అది నెరవేరింది. ప్రభాస్ సహకారం లేకపోతే అసలు ఈ సినిమా బయటికి రాదు. రాజమౌళి–ప్రభాస్‌ల ఎపిసోడ్ ఫన్నీగా పెట్టిందే. అలాగే బ్రహ్మానందం, రామ్‌గోపాల్ వర్మ పాత్రలని కూడా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ కథ అనుకున్నప్పుడే రెండో భాగం ఆలోచన వచ్చింది. కమల్‌గారు ఎంటరైన తర్వాత పార్ట్ 2 డిసైడ్ అయిపోయాం. ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 2 వచ్చే ఏడాది జూన్‌లోనే విడుదల కావొచ్చు. 50 ఏళ్ల వైజయంతీ మూవీస్ ప్రయాణం అద్భుతం. ప్రస్తుతం శ్రీకాంత్‌గారి అబ్బాయి రోషన్‌తో ఓ సినిమా, దుల్కర్ సల్మాన్‌తో ఒక చిత్రం నిర్మిస్తున్నాం’’ అన్నారు. -
కల్కి లో ప్రభాస్ ని డామినేట్ చేసిన ఆ యాక్టర్...
-
ప్రభాస్ ‘కల్కి’ మూవీ HD స్టిల్స్ (ఫొటోలు)
-
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్‌లో, న్యూయార్క్‌లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్‌కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, బెల్ట్‌లు... అన్నీ హ్యాండ్‌మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్‌లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్‌లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్‌లో ఒక ఫ్యాబ్రిక్‌కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్‌ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్‌లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్‌గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్‌ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్‌కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్‌ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్‌స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
ప్రభాస్‌ను ఇలా ఎప్పుడు చూడలేదు: కల్కిపై ఆర్జీవీ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కల్కి అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో కల్కి సందడి మొదలైంది. దీంతో ప్రభాస్ సక్సెస్‌ను థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీపై సంచలన డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్‌ను కొనియాడారు. నీ ఆశయం, ఊహలకు నా అభినందనలు. ఇందులో అమితాబ్ బచ్చన్ వందరెట్లు ఎక్కువగా కనిపించారు. ప్రభాస్‌ను ఇంతకు ముందెప్పుడు ఇలాంటి లుక్‌లో చూడలేదు. అదేవిధంగా తొలిసారి నాకు నటించేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇవాళ రిలీజైన కల్కి చిత్రంలో ఆర్జీవీ అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ స్టార్స్ సైతం ఈ సినిమాలో మెరిశారు.Hey @nagashwin7 KUDOS to ur AMBITION and IMAGINATION .. @srbachchan is a 100 times more dynamic than ever and #prabhas is in a never before seen avatar and AHEM 😌also THANKS for giving me my acting DEBUT 😌#Kalki2898— Ram Gopal Varma (@RGVzoomin) June 27, 2024 -
Kalki 2898 AD: అశ్వత్థామగా బిగ్‌బీ, అర్జునుడిగా దేవరకొండ.. ఇంకా.. (ఫోటోలు)
-
ప్రభాస్ ‘కల్కి’ మూవీ..ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ
టైటిల్: కల్కి 2898 ఏడీనటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పఠాని, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నాబెన్ తదితరులునిర్మాణ సంస్థ: వైజయంతీ మూవీస్నిర్మాత: అశ్వనీదత్దర్శకత్వం: నాగ్ అశ్విన్సంగీతం: సంతోష్ నారాయణన్సినిమాటోగ్రఫీ: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: జూన్ 27, 2024ఈ ఏడాది యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన సినిమాల్లో కల్కి ‘2898 ఏడీ’ ఒకటి. ప్రభాస్ హీరోగా నటించడం.. కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై ఎంతో హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘కల్కి 2898 ఏడీ’ కథేంటంటే..కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే కనీసం ఒక మిలియన్ యూనిట్స్(డబ్బులు) ఉండాలి. ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్ భైరవ(ప్రభాస్) కూడా ఒకడు. ఎప్పటికైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లి సుఖపడాలనేది అతడి కోరిక. యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. అతనికి బుజ్జి((ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆలోచించే మెషీన్)తోడుగా ఉంటుంది. మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ‘కల్కి 2898’తో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్, శంబాల ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అయితే కథ పరంగా చూస్తే మాత్రం ఇందులో పెద్దగా ఏమీ ఉండడు. అసలు కథంతా పార్ట్ 2లో ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు. వాస్తవానికి నాగ్ అశ్విన్ రాసుకున్న కథ చాలా పెద్దది. అనేక పాత్రలు ఉంటాయి. ఒక్క పార్ట్‌లో ఇది పూర్తి చేయడం సాధ్యం కాని పని. అది నాగికి కూడా తెలుసు. అందుకే పార్ట్ 1ని ఎక్కువగా పాత్రల పరిచయాలకే ఉపయోగించాడు. కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఆరువేల సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళ్తుంది. కాశీ, కాంప్లెక్స్, శంబాల ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీనం అవుతాడు. భారీ యాక్షన్ సీన్‌తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. బుజ్జి, భైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఇంటెర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితీయార్థంలో కథనంలో వేగం పుంజుకుంటుంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో అమితాబ్ పాత్రతో మహాభారతం కథను చెప్పించడం.. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ 2పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. దీంతో ప్రభాస్ కూడా తెరపై తక్కువ సమయమే కనిపిస్తాడు. భైరవగా ఆయన చేసే యాక్షన్, కామెడీ ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రభాస్ మరో పాత్ర కూడా పోషించాడు అదేంటనేది వెండితెరపైనే చూడాలి. ప్రభాస్ తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అమితాబ్‌ది. అశ్వత్థామ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ వయసులోనూ యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ప్రభాస్-అమితాబ్ మధ్య వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. సుప్రీం యాష్కిన్‌గా కమల్ హాసన్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. అయితే ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే. పార్ట్ 2లో ఆయన రోల్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీ సుమతిగా దీపికా పదుకొణె తనదైన నటనతో ఆకట్టుకుంది. శంబాల ప్రంచానికి చెందిన రెబల్ ఖైరాగా అన్నాబెన్, రూమిగా రాజేంద్ర ప్రసాద్, వీరణ్గా పశుపతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ చాలా బాగుంది. నాగ్ అశ్విన్ ఊహా ప్రపంచానికి టెక్నికల్ టీమ్ ప్రాణం పోసింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు అయితే తెరపై మరీ దారుణంగా అనిపించాయి. నేపథ్య సంగీతం కూడా యావరేజ్‌గానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కల్కి 2898 ఏడీ’ టాక్ ఎలా ఉందంటే..?
ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కల్కి 2898 మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి సినిమాటిక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ నటించడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, రెండు ట్రైలర్లు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల గురువారం తెల్లవారుజాము నుంచే స్పెషల్ షోలు పడిపోయాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కల్కి’ కథేంటి? నాగ్ అశ్విన్ కలల ప్రాజెక్టు ఎలా ఉంది? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.. అవేంటో చదివేయండి. అయితే ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. భైరవగా ప్రభాస్‌ను అద్భుతంగా చూపించడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడంటూ నెటిజన్లు చెబుతున్నారు. ముఖ్యంగా కల్కి కథ చెప్పిన విధానం బాగుందని తెలుపుతున్నారు. అయితే, 20 నిమిషాల తర్వాత నుంచి అసలు కథ ప్రారంభం అవుతుందని వారు చెబుతున్నారు. ఇందులో యానిమేషన్ విజువల్స్ కూడా భారీగానే మెప్పించాయి. ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చెప్పినట్లుగా బుజ్జి పాత్ర ఇందులో చాలా కీలకంగా ఉన్నట్లు వారు తెలుపుతున్నారు. Last 30mins🥵🔥 Mahabharatam🙌 #KALKI #Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan #kalki2898ad #BlockBusterKALKI pic.twitter.com/blithytX2g— Crick...Shyam!! (@ShyamCrick) June 27, 2024 అమితాబ్ బచ్చన్ యాక్షన్ సీన్స్ సినిమాకు ప్రధాన హైలెట్‌గా నిలుస్తాయంటున్నారు. కమల్ హాసన్ గెటప్ మాత్రం పీక్స్‌లో ఉంటుందని ఆయన పాత్రకు మంచి మార్కులే పడుతాయని అంటున్నారను. ఫైనల్‌గా కల్కితో ప్రభాస్ హాలీవుడ్లో కూడా తన మార్క్ చూపించబోతున్నట్లు ప్రేక్షకులు చెబుతున్నారు.మరికొందరు మాత్రం కల్కి 2898 ఏడీ సినిమా యావరేజ్‌గా ఉందంటూ తెలుపుతున్నారు. కథ చెప్పడంలో కాస్త నెమ్మది ఉందని తెలుపుతున్నారు. కానీ, ఎక్కువ ప్రాంతాల్లో సినిమాకు అదిరిపోయే టాక్ వస్తోంది. అక్కడక్కడా కాస్త బోరింగ్ ఫీల్ అవుతారని అంటున్నారు. సినిమా యావరేజ్ అని కూడా కొందరు నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్నీ ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని కూడా వారు చెబుతున్నారు. ఇందులో ఊహించని కెమియో రోల్స్ ఉన్నాయని అంటున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఇండియన్ సినిమా ఉందంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.It's Time For #Kalki2898AD, claimed to be Biggest Indian Film, with 600+ Cr Budget and PAN India Mass Appeal 💡All said an done, I wanted to see what #NagAshwin invisioned & created.I belive, this could be the game changer and taking that feeling in to the theater.Without… pic.twitter.com/a8KvWrJQXU— Ashwani kumar (@BorntobeAshwani) June 27, 2024 #KALKI2898AD gets unanimous positive talk in tamil#Prabhas #Kalki2898AD #NagAshwin #AmitabhBachchan #DeepikaPadukone #KamalHaasan pic.twitter.com/3U4un4OPrF— Tolly hub (@tolly_hub) June 27, 2024#Kalki2898AD - 3.75 ⭐ /5 ⭐ • #Prabhas 's Performance & Comedy Timings 🔥• Storyline & #NagAshwin 's Direction 🏆• SANA 's Background Scores 💣💥 Literally ge is The Second Hero.• Pre - Interval 🧨• VFX Standard & Visuals .. Literally a Never Seen Stuffs - in… pic.twitter.com/ghh0WFA8Ph— Let's X OTT GLOBAL (@LetsXOtt) June 26, 2024Epude #Kalki movie premier chusa... Just Superb.... anthe Never before visuals...Prabhas, Amitabh and Kamal Haasan rocked the show.Nag ashwin Rating: 4.5/5 #Kalki28989AD#kalki #Kalki2898ADonJune27 #kalki2898 #Prabhas #DeepikaPadukone #Amitabh #KalkiUK pic.twitter.com/ZI8LgSbrBS— OTTRelease (@ott_release) June 27, 2024 #Kalki2898AD 2nd Half Arachakam 🔥🌋Block Buster Bomma 🔥🔥🤩@nagashwin7 - The Pride Of Indian Cinema #Prabhas Fans Collars Yegareyochu 🤘Waiting For Kalki Cinematic Universe pic.twitter.com/yAyou7Jl2K— 𝘿𝙖𝙧𝙡𝙞𝙣𝙜𝙨...🖤 (@ajayrock1211) June 26, 2024#KALKI2898AD #kalki2898ADreviewGood: Grand scale, good story, Ashwathama, Climax.Bad: BGM, loose screenplay, many unwanted scenes, Prabhas characterization in first half was silly, wasted opportunities to connect emotionally. Overall ok ok.— goutham (@Goutham_se) June 26, 2024Finished watching #Kalki2898AD Kalki Cinematic Universe 🔥🔥🔥Review :- No words 🤐, Especially Last 30mins🔥🔥🔥, Goosebumps guarantee, KCPD Worth Watching. Nagi Mawa - unexpected from you.Prabhas character - Surya puthraa *****#Kalki2898AD #PRABHAS @VyjayanthiFilms pic.twitter.com/i2NoumQPxP— Jagadish (@kvj2208) June 26, 2024Deepika Padukone as Danerys Targeryan for Interval, is the best non heroic goosebumps moment for me@Music_Santhosh BGM is fucking lit 🔥🔥#kalki2898ad #Prabhas pic.twitter.com/yTPffkrLO6— sampathkumar (@Imsampathkumar) June 26, 2024Indian film directors need super mega stars like #prabhas to pull off visual grandeurs like #kalki2898ad Film may have few flaws but what @nagashwin7 envisioned is second to none and is filled with huge brilliance.DO NOT MISS this movie! Visual extravaganza!@HailPrabhas007— Nikhil (Srikrishna) Challa (@Srikrishna6488) June 26, 2024Finished watching #kalki2898ad @nagashwin7 took his time and research to get this epic on screen Visuals are Out the world ,Screen play was on point ,Comedy personally did not work for me at some point Mahabharatham shots are crisp 🤌🏻Last 20 mins 🔥🔥🔥🔥 Casting is 👍 pic.twitter.com/h7QnfR7cYJ— TIG🐯R (@GopiSai251) June 26, 2024#Kalki2898AD A breath of fresh air to Indian cinema. Theme : Dystopian future entangled in mythology. Rating : ⭐️⭐️⭐️Long read🧵— 🪬Absurdism 🪢 (@absurdtips) June 26, 2024World’s first premier show completed in Finland @PrabhasRaju Mind blowing visualsVery good first half 👌👌Awestruck second half 🔥🔥🔥 Fight between @SrBachchan and @PrabhasRaju is next level. Repeat watches for sure Thanks @nagashwin7 #Kalki2898AD #kalki2898 #Prabhas pic.twitter.com/VrL9PNqb49— Jyothi Swaroop (@subbuswaroop) June 26, 2024Em Tesav Bhayya Next Part Kosam Em Hype Ekkinchinav Pakka Indian Star Wars Type Film This Is Repeating Like Baahubali 1 and The Next One Will Be Like Baahubali 2 Kalki Cinematic Universe #kalki2898 #Kalki2898AD #KALKI2898ADBookings #ProjectK#Prabhas#RebelStarOochaKotha— RTC X ROADS DEVARA 🌊⚓ (@MGRajKumar9999) June 26, 2024#Kalki2898ADFirst 30 Min#Kalki Review #KALKI2898ADO >>> #Salaar 💥🔥Nagashwin 💥Super hero entry #Prabhas performance 💥💥💥 comedy timing 🔥Songs 👍💥Bgm 🔥🔥🥁overall ga movie lover ki biggest festival 🤙My rating : 4.5 / 5 #Kalki#KALKI2898ADO #Kalki28989AD pic.twitter.com/lXu69nullD— Daemon (@sammyTFI) June 27, 2024 -
మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్‌గా రూ.4 కోట్లు!
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఇటీవలే కొత్త ఫ్లాట్లు కొన్నాడు. ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో ఆరు ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు. వీటి కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. తాజాగా ఈయన తండ్రి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఆఫీసు పెట్టుకునేందుకు పనికివచ్చే మూడు కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ముంబైలోని వీరసావర్కర్ సిగ్నేచర్ భవంతిలోనే ఈ ఆఫీస్ స్పేస్ ఉందట! దీని మొత్తం విలువ రూ.60 కోట్లు కాగా.. వీటికోసం బిగ్ బీ ఇప్పటికే సుమారు రూ.4 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా కమర్షియల్ ప్రాపర్టీ కొనడం అమితాబ్‌కు కొత్తేం కాదు. గతంలోనూ ఇదే సిగ్నేచర్ బిల్డింగ్‌లో నాలుగు ఆఫీస్ స్పేస్‌లను కొని గతేడాది అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దె ద్వారానే ఏడాదికి రూ.2.07 కోట్లు సంపాదిస్తున్నాడు.సినిమాల విషయానికి వస్తే.. బిగ్‌బీ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ రేపు (జూన్ 26న) విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా? -
'కల్కి' ముందు పెద్ద సవాలు.. నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో?
ప్రభాస్ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే కోట్లాది టికెట్స్ అమ్ముడుపోయాయి. మరిన్ని చోట్ల బుకింగ్స్ ఇంకా నడుస్తున్నాయి. మొన్నటివరకు సరిగా ప్రమోషన్ జరగలేదని బాధపడిన ఫ్యాన్స్.. ఇప్పుడొస్తున్న బజ్ చూసి తెగ సంతోషపడిపోతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ 'కల్కి' ఓ పెద్ద సవాలు ఉంది. దీన్ని దాడటం పెద్ద కష్టమేమి కాదు గానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చేస్తాడోనని అందరూ వెయిటింగ్.(ఇదీ చదవండి: 'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్‌ఫుల్!)ఇలా థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే అర్థమైపోవడానికి, ఎంజాయ్ చేయడానికి 'కల్కి'.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో లేదంటే లవ్ స్టోరీనో కాదు. సైన్స్ ఫిక్షన్ ప్లస్ మైథాలజీ కాంబోలో తీసిన క్రేజీ సినిమా. భూత, భవిష్యత్, వర్తమాన అంశాల్ని స్టోరీలో మిలితం చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వర్తమాన, భవిష్యత్ ఉండే సీన్లనీ అర్థం చేసుకోవడం ఎవరికీ పెద్దం కష్టమేం కాకపోవచ్చు.'కల్కి'లో మహాభారతం ఆధారంగా తీసిన సీన్లు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అలా కల్కి, కలి, అశ్వథ్ధామ పాత్రల రిఫరెన్సులు కూడా ఉన్నాయి. ఒకప్పటి జనరేషన్‌కి పర్వాలేదు గానీ ప్రస్తుత టీనేజీలో ఉన్న యూత్ వీటన్నింటిని అర్థం చేసుకోవాలంటే పూర్తిగా కాకపోయినా కాస్తయిన అవగాహన ఉండాలి. ఎందుకంటే సినిమాలో ఇన్ డీటైల్డ్‌గా అయితే చెప్పలేరు కదా! మరి ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం చేశాడనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.(ఇదీ చదవండి: Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?) -
Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడీంచి సరికొత్తగా తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా, అమితాబ్,కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రలు పోషించడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచడంతో పాటు నాగ్ అశ్విన్ ఏం చెప్పబోతున్నాడనేదానిపై కాస్త క్లారిటీ వచ్చింది. కథ మొత్తం ‘కల్కి’ పాత్ర చుట్టే తిరుగుతుంది.మన పురణాల ప్రకారం మహావిష్ణువు పదో అవతారమే ‘కల్కి’. కలియుగం చివరి పాదంలో భగవంతుడు ‘కల్కి’రూపంలో వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి అవతారం చాలిస్తాడని పురణాలు చెబుతున్నాయి. ఈ పాయింట్‌నే నాగ్ అశ్విన్ తీసుకొని దానికి సాంకేతిక జోడించి, సినిమాటిక్‌గా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో కాశీ, కాంప్లెక్స్, శంబలా అనే మూడు ప్రపంచాలు ఉంటాయి. ఈ మూడు ప్రపంచాల మధ్య జరిగే కథే ఈ సినిమా.కల్కి అవతరించడానికి ముందు అంటే 2898 ఏడీలో అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్ర కథాంశం. అయితే ఇందులో ‘కల్కి’ ఎవరు? ‘కలి’ ఎవరనేది ఇప్పటివరకు చెప్పలేదు. హీరో ప్రభాస్ పోషించిన పాత్ర పేరు ‘భైరవ’. అశ్శత్థామగా అమితాబ్ నటించాడు. కమల్ పోషించిన పాత్ర పేరు ‘సుప్రీం యాస్కిన్’ అని వెల్లడించారు. ఇక గర్భిణీ ‘సమ్-80’ గా దీపికా పదుకొణె నటించింది. కల్కి పుట్టబోయేది ఆమె కడుపునే అన్నది ప్రచార చిత్రాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అమెను కాపాడడం కోసం అశ్వత్థామ పొరాటం చేస్తున్నాడు. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర అశ్వత్థామ. కృష్ణుడి శాపంతో శారీరక రోగాలతో బాధపడుతున్న ఆయన.. ‘కల్కి’ అవతార ఆవిర్భావానికి ఎందుకు సాయం చేస్తున్నాడని మరో ఆసక్తికరమైన పాయింట్. సుప్రీం యాస్కిన్ పాత్రే కలిగా మారుతుందా? అంటే ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అవుననే అంటారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో కమల్ పోషించిన సుప్రీం యాస్కిన్ పాత్ర ‘ఎన్ని యుగాలైనా మనిషి మారడు.. మారలేడు’ అనే డైలాగ్ చెబుతాడు. పురాణాల ప్రకారం కలి అనేవాడు మానవుడిలో ఉన్న అరిషడ్వర్గాలను ఆసరగా చేసుకొని ఆడుకుంటాడు. కమల్ చెప్పిన డైలాగ్‌ను బట్టి చేస్తే ఆయనే కలి అని అర్థమవుతుంది. భైరవగా నటించిన ప్రభాస్‌నే కల్కిగా చూపించబోతున్నారా? లేదా పుట్టబోయే ‘కల్కి’ని రక్షించే వ్యక్తిగా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రచార చిత్రాల్లో అశ్వత్థామ చేతిలో ఉన్న కర్రను ప్రభాస్ పాత్ర చేతిలోనూ చూపించారు. అంటే ‘కల్కి’ని రక్షించే బాధ్యత భైవర తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదంతా మన ఊహ మాత్రమే. డైరెక్టర్ నాగి అల్లుకున్న కథలో కలి ఎవరు? కల్కి ఎవరు అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు(జూన్ 27 రిలీజ్)ఆగాల్సిందే.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?
ప్రభాస్ 'కల్కి' మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్ అంచనాల్ని భారీగా పెంచేశాయి. తాజాగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటమే దీనికి నిదర్శనం. మరోవైపు రిలీజ్ దగ్గర పడే కొద్ది మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెడుతోంది. తాజాగా టీమ్ అంతా కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ అమితాబ్ మాత్రం ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది.'కల్కి'లో భైరవగా ప్రభాస్, అశ్వద్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఈ విషయం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ సీన్స్ గురించే అమితాబ్ మాట్లాడుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)'నాగి.. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది, ప్రభాస్ పాత్ర ఏంటనేది చూపించేందుకు కొన్ని ఫొటోలు చూపించాడు. 'కల్కి'లో నాది ప్రభాస్‌ని కొట్ట క్యారెక్టర్ అని చెప్పాడు. ముందే చెబుతున్నా ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి. సినిమాలో నేను చేసే పనులు చూసిన తర్వాత నన్ను తిట్టుకోకండి, ట్రోల్ చేయకండి' అని అమితాబ్ అన్నాడు. దీనికి ప్రభాస్ నవ్వుతూ.. 'అయ్యో సర్, వాళ్లంతా మీ ఫ్యాన్స్ కూడా!' అని చెప్పాడు.ఇకపోతే తెలంగాణలో బుకింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి. 8 రోజుల పాటు ఐదు షోలకు అనుమతిచ్చారు. అలానే సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 వరకు ధర పెంచుకునేందుకు అనుమతిచ్చారు. ఉదయం 5 గంటలకే బెన్ఫిట్ షోలు వేసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా టికెట్ ధరల గురించి తేలాల్సి ఉంది. నేడో రేపో టికెట్ ధరల పెంపుపై జీవో వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?) -
ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?
'కల్కి' రిలీజ్‌కి మరో ఐదు రోజులు మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఓ రేంజ్లో కాకపోయిన ఓ మాదిరి హైప్ ఉంది. ఇప్పటికే రిలీజైన రెండు ట్రైలర్స్ సూపర్‌గా ఉన్నాయి. కానీ మూవీ టీమ్ ప్రమోషన్స్ మాత్రం కాస్త తక్కువగానే చేస్తోందనేది నెటిజన్ల నుంచి వినిపిస్తున్న మాట. ఎవరెమనుకున్నా సరే ఒక్కసారి సినిమా క్లిక్ అయితే జనాలు ఇవేవి పట్టించుకోరు. సరే ఇదంతా వదిలేస్తే ఇప్పుడు 'కల్కి' రెమ్యునరేషన్స్ ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి.'బాహుబలి' తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అలా 'కల్కి'ని ఏకంగా రూ.700 కోట్ల బడ్జెట్‌తో తీశారనే టాక్ నడుస్తోంది. ట్రైలర్లో విజువల్స్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు?)అయితే మొత్తం బడ్జెట్ అంతా సినిమా కోసమే ఖర్చు చేయరు కదా! ఇందులో రెమ్యునరేషన్స్ కూడా ఉంటాయి. అలా హీరోగా చేసిన ప్రభాస్‌కి రూ.150 కోట్ల వరకు ఇచ్చారట. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన అమితాబ్, కమల్‌కి తలో రూ.20 కోట్లు ఇచ్చారని సమాచారం. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ కలిసి మరో రూ.60 కోట్ల వరకు ఖర్చయిందట.దీనిబట్టి చూస్తే మొత్తం బడ్జెట్లో రూ.250 కోట్ల వరకు పారితోషికాలకే అయిపోయినట్లు అనిపిస్తుంది. అంటే మిగిలిన రూ.450 కోట్ల బడ్జెట్‌తో మూవీ తీశారనమాట. ఏదేమైనా సంక్రాంతి తర్వాత భాక్సాఫీస్ డల్లుగా ఉంది. 'కల్కి' గనక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్స్ మోత మోగిపోవడం గ్యారంటీ. మరి మీలో ఎంతమంది 'కల్కి' కోసం వెయిట్ చేస్తున్నారు?(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!) -
ప్రభాస్ 'కల్కి' మూవీ స్టిల్స్
-
ప్రభాస్ 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Amitabh Bachchan: కల్కిలాంటి సినిమా నేనిప్పటివరకూ చేయలేదు
‘‘కల్కి 2898 ఏడీ’ సెట్స్‌లో తొలిసారి అమితాబ్ బచ్చన్గారిని కలిసినప్పుడు ఆయన కాళ్లను తాకాలనుకున్నాను. అమితాబ్‌గారు వద్దన్నారు. నువ్వు చేస్తే నేనూ చేయాల్సి ఉంటుందన్నారు. సార్... ప్లీజ్ అన్నాను. అప్పట్లో ఎవరైనా టాల్‌గా ఉంటే అమితాబ్ అనేవారు. అమితాబ్ బచ్చన్‌గారి హెయిర్ స్టయిల్ బాగా ఫేమస్. ఇక ‘సాగర సంగమం’ చూసి ఆ సినిమాలో కమల్గారిలా డ్రెస్ కావాలని మా అమ్మతో అన్నాను. ‘ఇంద్రుడు చంద్రుడు’లో ఆయన నటన చూసి ఎగ్జైట్ అయ్యాను. ఈ స్టార్స్, దీపికా పదుకోన్‌తో కలిసి యాక్ట్ చేయడం నాకో మంచి ఎక్స్పీరియన్స్’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రీ రిలీజ్ వేడుకకు హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్‌ను అమితాబ్ బచ్చన్‌కు అశ్వినీదత్ అందించగా, ఆయన నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్‌ను ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు? అని అమితాబ్‌ను రానా అడగ్గా, మై బద్రర్ కమల్‌హాసన్‌కి అని చె΄్పారు. ఆ తర్వాత ఈ టికెట్‌ను అమితాబ్ నుంచి కమల్ అందుకుని, ‘షోలే’ సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇంకా ఈ వేడుకలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నేనిప్పటివరకూ ఇలాంటి సినిమా చేయలేదు. నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు అతను ఏం తాగితే ఇలాంటి ఐడియా వచ్చిందా అనిపించింది. తన విజన్ అద్భుతం. అశ్వినీదత్‌గారు సింపుల్‌గా ఉంటారు. సెట్స్‌లో నాకు కోపరేటివ్‌గా ఉన్నారు’’ అన్నారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’ సినిమా స్టార్ట్ చేసేప్పుడు ఆసక్తిగా అనిపించింది. సెట్స్‌లో పాల్గొన్న తర్వాత సర్ప్రైజింగ్గా అనిపించింది. ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తోంది. సాధారణంగా కనిపించేవారు అసాధారణ పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ విషయంలో నాకు అదే అనిపించింది. బ్యాట్మేన్లాంటి కథలు చేయాలని నాకు ఉండేది. ఈ సినిమాలో చేశాను. ఈ సినిమాలో నేనొక పాత్ర చేయాలనుకున్నా.. ఈ పాత్రను అమిత్జీ చేస్తున్నారన్నారు. మరో పాత్ర ఎంచుకున్నా.. అది ప్రభాస్ చేస్తున్నారన్నారు. ఫైనల్‌గా సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘కరోనా టైమ్‌లో జూమ్‌లో నాగ్ అశ్విన్ కథ చె΄్పారు. తన విజన్ క్లియర్‌గా ఉంటుంది. ఇందులో తల్లి పాత్ర చేశాను. ఈ సినిమా సెట్స్‌లో ప్రభాస్ ఈ రోజు ఎవరికి ఏం ఫుడ్ పెట్టారు అన్నదే హైలైట్ డిస్కషన్‌గా ఉండేది (సరదాగా)’’ అన్నారు దీపికా పదుకోన్. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ వేడుకకు హాజరు కాలేదు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడిన వీడియో బైట్‌ను ప్లే చేశారు. కాశీ, కాంప్లెక్స్, షంబాల అనే మూడు ప్రపంచాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చెప్పి, ఈ ప్రపంచాల నేపథ్యాలను వివరించారు నాగ్ అశ్విన్. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్వ΄్నాదత్, ప్రియాంకా దత్, అనిల్ తడానీ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రెగ్నెంట్‌గా ఉన్న దీపికా పదుకోన్ స్టేజ్ నుంచి దిగేటప్పుడు ప్రభాస్, స్టేజ్ ఎక్కేటప్పుడు అమితాబ్ హెల్ప్ చేయడం ఈవెంట్లో హైలైట్‌గా నిలిచింది. -
లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం అన్నింటి కంటే గొప్పది: ప్రభాస్
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, భైరవ ఆంథమ్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబయిలో గ్రాండ్ నిర్వహించారు. ఈ వేడుకలో అమితాబ్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, దీపికా, ప్రభాస్, రానా సైతం పాల్గొన్నారు. ఈవెంట్లో రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కల్కి మూవీకి సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. 'గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో వర్క్ చేసే అవకాశం రావడం ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగా. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ' అని అన్నారు.కల్కి 2898 ఏడీ చిత్రంలో భాగం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అమితాబ్ అన్నారు. నాగ్ అశ్విన్ తన విజన్‌తో మహా అద్భుతంగా తీశారని కొనియాడారు. కల్కి ఎక్స్ పీరియన్స్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని.. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయానని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నాగ్ అశ్విన్ మా గురువు బాలచందర్‌లా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు ఉంది. ఇందులో బ్యాడ్ మ్యాన్‌గా నటించా. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు' అని అన్నారు. The biggest stars have come together. ✨#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/nK6hN7nmdU— Kalki 2898 AD (@Kalki2898AD) June 19, 2024 -
అక్కడ ఒకరోజు ముందుగానే 'కల్కి' రిలీజ్
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'కల్కి: 2898 ఏడీ'. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా వస్తున్న ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంచనాలకు మించి ట్రైలర్ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.కల్కి సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లో ఉన్న బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (బీఎఫ్ఐ) ఐమ్యాక్స్‌లో ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రీమియర్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం27న విడుదల కానుంది. అయితే, ఇక్కడ మాత్రం ఒక రోజు ముందుగానే జూన్ 26నే మొదటి ఆట పడనుంది. రాత్రి 8.30 గంటలకు మొదటి ప్రీమియర్ స్టార్ట్ కానుంది. అక్కడ ఒక సినిమా ప్రీమియర్ షో పడటం చాలా అరుదు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీని కూడా ఇక్కడ ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కల్కి చిత్రం కూడా ఈ ఘనతను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
సీక్వెల్ సెట్లో...
గుజరాతీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్. 2022లో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటించిన ‘ఫక్త్ మహిళా మాటే’ చిత్రానికి సీక్వెల్ ఇది. యశ్ సోనీ, దీక్షా జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫక్త్ మహిళా మాటే’కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. జై బోదాస్ దర్శకత్వంలో ఆనంద్ పండిట్, వైశాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఫక్త్ పురుషో మాటే’ అనే సినిమాను ఆరంభించారు. అమితాబ్, యశ్ సోనీ, మిత్ర గాధ్వీ, ఇషా కన్సారా, దర్శన్ జరీవాలా సీక్వెల్లో ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌ని పార్థ్ త్రివేదీతో కలిసి జై బోదాస్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.ప్రస్తుతం అమితాబ్‌తో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘అమితాబ్ బచ్చన్‌గారితో ఓసారి పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ వర్క్ చేయాలనుకుంటారు. అమితాబ్‌గారి ఎనర్జీ, అంకితభావం సెట్స్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ఆనంద్ పండిట్. ఈ సంగతి ఇలా ఉంచితే... మహిళల మనసుల్లో ఏముందో తెలుసుకోగల శక్తులు ఓ కుర్రాడికి వస్తాయి. వాటితో ఆ యువకుడు ఏం చేశాడు? విడిపోతున్న ప్రేమికులను ఎలా కలిపాడు? అనే అంశాలతో ‘ఫక్త్ మహిళా మాటే’ చిత్రం సాగుతుంది. ఇక సీక్వెల్ మగవారి కోణంలో ఉంటుందని టైటిల్ స్పష్టం చేస్తోంది. -
కజ్రారే సాంగ్.. లైవ్‌లో డ్యాన్స్ మర్చిపోలేనన్న అమితాబ్..
కొన్ని పాటలు ఎవర్గ్రీన్.. ఎప్పుడు విన్నా ఎక్కడలేని ఉత్తేజం వస్తుంది. అలాంటి పాటే కజ్రారే.. కజ్రారే..! 2005లో వచ్చిన బంటీ ఔర్ బబ్లీ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ ఇది. అప్పట్లో ఈ సాంగ్ ఓ రేంజ్లో మార్మోగిపోయింది. అందులో అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ నటించారు. అయితే ఈ పాట రిలీజయ్యే సమయానికి వారికింకా పెళ్లి కాలేదు.. అది వేరే విషయం!ఎంతో పాపులర్..బంటీ ఔర్ బబ్లీ సినిమా రిలీజై 19 ఏళ్లు అయిన సందర్భంగా బిగ్‌బీ ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. ఓ అభిమాని కజ్రారే సాంగ్ ఫోటోను షేర్ చేయగా దానిపై అమితాబ్ స్పందిస్తూ.. ఆ పాట ఎంత పాపులర్ అయిందో! ఇప్పటికీ ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూనే ఉంది. మర్చిపోలేని విషయం ఏంటంటే.. భయ్యూ(అభిషేక్)తో కలిసి స్టేజీపై ఈ పాటకు లైవ్‌లో డ్యాన్స్ చేశాను అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశాడు. ఐశ్వర్య పేరు ప్రస్తావించాల్సింది!కాగా 2006 జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో అమితాబ్, అభిషేక్‌తో పాటు ఐశ్వర్య రాయ్.. స్టేజీపై కజ్రారే పాటకు డ్యాన్స్ చేశారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్న బిగ్‌బీ.. ఐశ్వర్య పేరు కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు మీరు, మీ కుమారుడు ఈ పాటకు అవసరం కూడా లేదు. ఐశ్వర్య లేకపోతే ఎవరూ చూసేవారు కూడా కాదు, అలాంటిది తననే మర్చిపోయారా? అని విమర్శిస్తున్నారు. సీక్వెల్..బంటీ ఔర్ బబ్లీ విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో అభిషేక్ హీరోగా రాణి ముఖర్జీ హీరోయిన్గా నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి 2022లో సీక్వెల్ కూడా వచ్చింది. ఇందులో అభిషేక్‌కు బదులుగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అలాగే రాణీ ముఖర్జీ, సిద్దాంత్ చతుర్వేది, శర్వారి వాఘ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. the song became so popular that it still regenerates attention and love .. and the best moments with the song, Bhaiyu, were when we performed this live on stage .. 🙏🤣🤣 https://t.co/vKuMM7ipIN— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2024 చదవండి: ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్ -
ప్రభాస్ కల్కి ఖాతాలో కోట్లు జోష్ మాములుగా లేదుగా
-
ఏడ్చేసిన కావ్య.. ఆమెను అలా చూస్తే బాధేసింది: బిగ్ బీ
ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? ఇదీ అంతే.. ఈసారి కాకపోతే మరోసారికి చూసుకుందాం.. అని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎవరికి వారే ధైర్యం చెప్పుకుంటున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ చివరి మ్యాచులో ఎస్ఆర్హెచ్పై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. గెలుపును మాత్రమే ఊహించిన సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు ఇది పెద్ద భంగపాటు అనే చెప్పాలి. కన్నీళ్లు దిగమింగుతూ..కళ్ల ముందే జట్టు కుప్పకూలిపోవడం చూసి కావ్య తట్టుకోలేకపోయింది. కన్నీళ్లను దిగమింగుకునే ప్రయత్నం చేసింది. తన వల్ల కాకపోవడంతో వెనక్కు తిరిగి కంటతడి పెట్టుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్పందించాడు. 'ఐపీఎల్ ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ అద్భుతంగా ఆడి గెలిచింది. ఎస్ఆర్హెచ్ పేలవంగా ఆడింది. నిజానికి సన్‌రైజర్స్ మంచి టీమ్.. ఇదివరకు ఆడిన మ్యాచ్‌లలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. కానీ ఫైనల్లోనే నిరాశపరిచింది.ఆమెను చూస్తే బాధేసిందిమరింత బాధ కలిగించిన విషయం ఏంటంటే.. సన్ రైజర్స్ యజమానురాలు కావ్య స్టేడియంలోనే ఏడ్చేసింది. కెమెరాల కంట పడకూడదని వెనక్కి తిరిగి తన బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేసింది. ఆమెను అలా చూస్తే బాధేసింది. ఇదే ముగింపు కాదు మై డియర్.. రేపు అనేది ఒకటుంది' అని తన బ్లాగ్‌లో కావ్యను ఓదార్చాడు. ఇకపోతే ప్రస్తుతం అమితాబ్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదల కానుంది. Kavya Maran was hiding her tears. 💔- She still appreciated KKR. pic.twitter.com/KJ88qHmIg6— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ విన్నర్ -
Kalki 2898 AD Bujji Event Photos: అట్టహాసంగా ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్ (ఫొటోలు)
-
నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు!
‘‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉంది బుజ్జి, భైరవ గ్లింప్స్. ఎంజాయ్ చేశారా? ‘కల్కి..’లో అమితాబ్ సార్, కమల్ సార్‌తో పని చేసే అవకాశం ఇచ్చిన అశ్వినీదత్‌గారికి, నాగీ (నాగ్ అశ్విన్)కి థ్యాంక్స్. హోల్ ఇండియా ఇన్స్పైర్ అయ్యే అమితాబ్, కమల్‌గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. కాగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కల్కి స్పెషల్ క్రియేటివ్ ఈవెంట్’లో సినిమాలోని బుజ్జి (కారు) పాత్రను పరిచయం చేశారు. ఈవెంట్లో ఈ వాహనాన్ని ప్రభాస్ నడిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి వెళ్లి΄ోదాం అనుకుంటే ఈ కార్లు.. ఫీట్లు ఏంటి సార్ (నవ్వుతూ). బుజ్జి సూపర్ ఎగ్జయిటింగ్. నేను కూడా ‘కల్కి’ టీజర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కమల్ సార్ ‘సాగర సంగమం’ సినిమా చూసి నాకలాంటి బట్టలు కావాలని మా అమ్మను అడిగాను.. అలాంటివి కుట్టించుకుని వేసుకున్నాను. ఇక ఈ వయసులో కూడా అశ్వినీదత్‌గారి ΄్యాషన్ చూసి ఆయన వద్ద ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు తెలిసి 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనొక్కరే. ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలకు కూడా ఆయనలా ΄్యాషన్, ధైర్యం ఉంది. వాళ్లు పని చేసే విధానానికి మేమంతా స్ఫూర్తి ΄÷ందుతాం అని మా సిస్టర్స్‌కి చెబుతుంటాను’’ అన్నారు. ‘‘బుజ్జి కారుని ఎంతో కష్టపడి తయారు చేయించాం. ఇందుకోసం మహీంద్ర ఆటోమొబైల్ ఇంజినీర్స్ ఎంతో శ్రమించారు’’ అన్నారు నాగ్ అశ్విన్. నిర్మాతలు అశ్వినీ దత్, స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, కృష్ణంరాజు సతీమణి శ్యామల పాల్గొన్నారు. -
అమితాబ్ గురించి ఏదో అనుకున్నా.. ఆరోజు సీన్ షూట్ చేసేటప్పుడు..
తెలుగు బ్యూటీ అదితి రావు హైదరి నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ "హీరామండి: ద డైమండ్ బజార్". దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో తన నటనకు, డ్యాన్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. తన పర్ఫామెన్స్‌కు పాజిటివ్ రియాక్షన్ వస్తుండటంతో ఆనందంలో తేలియాడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.బిగ్‌బీతో నటించే ఛాన్స్అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన వాజీర్ సినిమాలో ఛాన్స్ వచ్చిందనగానే ఎగిరి గంతేశాను. ఆయనతో కలిసి పని చేసే అదృష్టం వస్తుందని ఊహించలేదు. బిగ్‌బీతో కలిసి పని చేసిన రోజుల్ని ఎన్నటికీ మర్చిపోలేను. ఆ సంతోషం, ఎగ్జయిట్మెంట్ మాటల్లో వర్ణించలేను. ఆ మూవీ అంతా తను వీల్‌చైర్‌లోనే కనిపిస్తారు. చిన్నపిల్లాడిలా..సెట్లో కూడా అదే చైర్లో కూర్చుని అంతా తిరుగుతూ ఉండేవారు. ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం చూస్తుంటే భలే ముచ్చటేసేది. వానిటీ వ్యాన్‌ను వదిలేసి సెట్లోనే ఉండేవారు. వాజీర్లో అమితాబ్ నాతో మాట్లాడే ఓ సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం చిత్రీకరణ జరిపేటప్పుడు ఆయన నా ఎదురుగా వచ్చి పెద్ద డైలాగ్ చెప్తున్నాడు. ఆయన్ని చూస్తూ ఏడ్చేశాను. గొప్ప నటుడుతనొక పెద్ద స్టార్ కాబట్టి మనలాగా ఉండరేమో, డాబు ప్రదర్శిస్తారేమోనని ఏవేవో పిచ్చిగా ఊహించుకున్నాను. కానీ అక్కడలాంటిదేమీ లేదు. ఆయన నిజమైన యాక్టర్. నా కోసం ఆ సన్నివేశాన్ని మళ్లీ అంతే ఎమోషన్‌తో పూర్తి చేశారు.. నేను మళ్లీ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను అని అదితిరావు హైదరి చెప్పుకొచ్చింది.చదవండి: 'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే? -
'కౌన్ బనేగా కరోడ్‌పతి'లో పాల్గొనాలని ఉందా..?
హిందీలో విజయవంతంగా కొనసాగుతున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఇప్పటి వరకు 15 సీజన్లు పూర్తి అయ్యాయి. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం నుంచి ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ వచ్చింది. కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చేసింది.కౌన్ బనేగా కరోడ్‌పతి భారతీయ టెలివిజన్‌లో ప్రముఖ క్విజ్ రియాలిటీ షో. అమితాబ్ బచ్చన్ హౌస్ట్‌గా గత 17 ఏళ్లుగా ఈ షో రన్ అవుతుంది. ఇందులో ఎక్కువగా సాధరణ ప్రేక్షకులే పాల్గొంటారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడే ఈ రియాల్టీ షోలో మీరు కూడా పాల్గొనవచ్చు. ఈ క్విజ్ షోలో పాల్గొనాలనుకునే వారి కోసం అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియాలో అప్డేట్ ఇచ్చారు. ఈ సీజన్లో పాల్గొనేందుకు ఆయన రెండు ప్రశ్నలు అడిగారు. వాటికి సరైన సమాధానం చెప్పినవారిని ఎంపిక చేస్తారు.మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలనే ఆసక్తి ఉంటే.. మీరు SonyLIV యాప్‌ని డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా 5667711కు SMS ద్వారా మీ సమాధానాన్ని నేటి (ఏప్రిల్ 29) రాత్రి 9గంటల లోపు పంపి నమోదు చేసుకోవచ్చు. 1: 2024లో మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన శ్రీ కర్పూరి ఠాకూర్, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి?A- ఉత్తర ప్రదేశ్, B- రాజస్థాన్, C- పంజాబ్, D- బీహార్2: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, ఆగ్రా నగరాలు రెండింటిలో వీటిలో ఏస్తువుకు GI ట్యాగ్లు ఉన్నాయి?A - పాన్ B- చెక్క బొమ్మలు, C- బియ్యం, D- డ్యూరీ (ఫ్లాట్ కార్పెట్) View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
లాయర్‌గా...
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘పింక్’లో అమితాబ్ బచ్చన్ లాయర్‌గా తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. మరోసారి కోర్టులో అమితాబ్ బచ్చన్ మాట్లాడే పవర్ఫుల్ డైలాగ్స్ వినే అవకాశం ఉందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘వేట్టయాన్’ చిత్రంలో లాయర్ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారట. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అది లాయర్ పాత్ర అనే ప్రచారం జరుగుతోంది. రజనీ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపిస్తారని, అమితాబ్ లాయర్‌గా కనిపిస్తారనీ భోగట్టా. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చెన్నైలోని ఓ స్టూడియోలో జరుగుతోందట. రజనీ ఇంట్రో సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. -
బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్.. ఆ సినిమాను టచ్ కూడా చేయలేకపోయాయి!
ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతోంది. కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్కు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి. కానీ.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, జవాన్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ రికార్డ్‌ను అధిగమించలేకపోయాయి. నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డ్‌ను ఇప్పటివరకు ఏ చిత్రం దాటలేకపోయింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం. అప్పట్లోనే అంటే.. నాలుగు దశాబ్దాల క్రితం సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆ మూవీనే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడైన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. అదే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని నటించిన షోలే మూవీ. రమేశ్ సిప్పీ డైరెక్షన్లో 1975లో వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్స్ విక్రయించిన సినిమాగా రికార్డులకెక్కింది. అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఇండియన్ సినిమా షోలే చిత్రాన్ని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లలో వీక్షించారు. బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం 1975-80 మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో 18 కోట్ల టిక్కెట్లను విక్రయించారు. అంతే కాకుండా ఈ సినిమా 60 థియేటర్లలో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. బొంబాయి మినర్వా థియేటర్లో ఏకంగా ఐదేళ్లపాటు ప్రదర్శించారు. ఈ మూవీ ఓవర్సీస్లో దాదాపు 2 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అప్పటోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా..4.8 కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు. ఇండియాతో పాటు ఓవర్సీస్ కలిపితే మొత్తం ఈ చిత్రం 25 కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి. షోలే ఫ్లాప్ టాక్.. అయితే థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల వసూళ్లు సాధించింది. మొఘల్-ఎ-ఆజామ్, మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది. మొదట ఈ చిత్రానికి హిట్ టాక్ రాలేదు. మొదటి రెండు వారాల్లో ఫ్లాప్ మూవీగా ముద్ర వేశారు. కానీ చివరికీ అన్నింటిని అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. బాహుబలి, దంగల్, ఆర్ఆర్ఆర్లు, కేజీఎఫ్ సినిమాలు సైతం షోలేను దాటలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి. బాహుబలి -2 ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల ప్రేక్షకులు వీక్షించగా.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ -2 చిత్రాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం దంగల్ కూడా 10 కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించారు. గతేడాది రిలీజైన షారూక్ ఖాన్ జవాన్ కేవలం రూ.4 కోట్ల మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టిక్కెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి. -
అమితాబ్.. రెహమాన్‌లకు లతా మంగేష్కర్ అవార్డు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ 2022న ఫిబ్రవరి 6న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్‌కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు. అలాగే సామాజిక సేవా రంగంలో ‘దీప్‌స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్‌కు కూడా ఈ అవార్డును ఇవ్వనున్నారు. ఈ నెల 24న లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి. అదే రోజు ఈ పురస్కారాల పంపిణీ ఉంటుంది. -
శ్రీరాముని సేవలో సెలబ్రిటీలు, శుభాకాంక్షలు (ఫోటోలు)
-
బిగ్ బీకి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రకటన!
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ బచ్చన్‌ను లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించనున్నట్లు మంగేష్కర్ కుటుంబం మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 6, 2022న మరణించిన లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈ అవార్డును అందజేస్తున్నారు. లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న ఈ పురస్కారంతో అమితాబ్‌ను సత్కరించనున్నారు. కాగా.. 2023లో ఈ అవార్డ్‌ను మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లేకు బహుకరించారు. అంతేకాకుండా భారతీయ సంగీతానికి చేసిన కృషికి గానూ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కూడా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోనున్నట్లు వారి కుటుంబం వెల్లడించింది. సామాజిక సేవా రంగంలో సేవలకు గాను లాభాపేక్షలేని సంస్థ దీప్‌స్తంభ్ ఫౌండేషన్ మనోబల్‌కు కూడా ఈ అవార్డును అందజేయనున్నారు. వీరితో పాటు మరికొంత మంది ప్రముఖులు సైతం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమానికి హృదయనాథ్ మంగేష్కర్ అధ్యక్షత వహిస్తారని.. ఆశా భోంస్లే చేతుల మీదుగా అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. -
‘ఓటు వేయాలంటూ.. సెలబ్రిటీల ప్రచారం’
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 04న విడుదలవుతాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లులో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ, క్రీడా సెలబ్రిటీలతో ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో..‘తప్పకుండా ఓటు వేయండి.. ఓటు వేయటం మీ కర్తవ్యం’అని సెలబ్రిటీలంతా కోరుతారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించటం గమనార్హం. క్రీడా రంగం నుంచి సచిన్ టెండుల్కర్, సినిమా రంగం నుంచి పలువురు బాలీవుడ్, కోలివుడ్ ప్రముఖలు ఉన్నారు. వారివారి శైలీలో ఓటు వేయాలని కోరారు. ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోపై ఓ లుక్కేయండి.. -
ప్రభాస్, రామ్ చరణ్ తాతయ్యలుగా అమితాబ్, సంజయ్ దత్!
అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్.. ఇద్దరు ఒకప్పుడు స్టార్ హీరోలే. వారిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇద్దరికి కోట్లమంది అభిమానులు ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు వైవిధ్యమైన సినిమాలతో వారిని అలరించారు. ఇప్పడు వయసు పైబడిన తర్వాత తమలోని మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. విలన్‌గా, తండ్రిగా, సోదరుడిగా, గురువుగా పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు తాతయ్యలుగానూ అలరించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌కు తాతగా అమితాబ్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. ఇది బుచ్చిబాబుకు రెండో సినిమా. ఉప్పెన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రామ్‌చరణ్ మూవీ (RC16) ప్రకటించాడు. రామ్‌చరణ్ బర్త్‌డే రోజు షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ మూవీ కోసం బుచ్చిబాబు సెట్ చేస్తున్న కాంబినేషన్ మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడని ప్రకటించి అందరికి షాకిచ్చాడు. అంతేకాదు శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, విజయ్ సేతుపతి ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లోకి అమితాబ్ కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం అమితాబ్‌ని ఒప్పించే పనిలో పడ్డాడట బుచ్చిబాబు. అది రామ్ చరణ్ తాత పాత్ర అట. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకం అని.. అమితాబ్ అయితేనే సెట్ అవుతుందని బుచ్చిబాబు భావించారట. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఫ్రీడం ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే భారీ క్యాస్టింగ్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆత్మగా సంజయ్ దత్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామమాలవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా సంజయ్ పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో సంజయ్.. ప్రభాస్‌కు తాతగా నటించబోతున్నాడట. అకాల మరణం చెందిన సంజయ్..దెయ్యంగా తిరిగి వస్తాడట. ఆత్మగా మారిన తాత.. ప్రభాస్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాడనే నేపథ్యంలో కథ సాగనుందట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. -
తాతా... మనవడు?
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ తాజాగా మరో తెలుగు మూవీలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. అది కూడా హీరో రామ్‌చరణ్‌కి తాతయ్య పాత్ర అని భోగట్టా. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. తాత–మనవడు కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తాత పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ని సంప్రదించారట మేకర్స్. ‘ఆర్సీ 16’ కథ, తన పాత్ర నచ్చడంతో ఈ క్యారెక్టర్ చేసేందుకు అమితాబ్ అంగీకరించారని తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం సరిగా లేదని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మార్చి 15న రోజంతా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అమితాబ్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్లను కోరుతూ వారందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కామెంట్లు చేశారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడటం వల్ల ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారని అక్కడ ఆంజియోప్లాస్టీ చికిత్స చేశారని వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందారు. బిగ్ బి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆయన బహిరంగ ప్రదేశంలో కనిపించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యారు. థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో మాఝీ ముంబయి, టైగర్స్ ఆఫ్ కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌కు కుమారుడితో అమితాబ్ హాజరయ్యారు. మ్యాచ్ చూసేందుకు వెళ్లిన ఆయన్ను ఆరోగ్యం గురించి మీడియా వారు ప్రశ్నించగా... అందులో నిజం లేదని, ఆ వార్తలు ఫేక్ అని తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అంతే కాకుండా ఆయన చికిత్స పొందారు అని ప్రచారంలో ఉన్న కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి కూడా అమితాబ్ గురించి ఎలాంటి ధృవీకరణ లేదు. దీంతో ఇవన్నీ ఫేక్ అని తెలుస్తోంది. (ISPL) ఫైనల్ మ్యాచ్‌లో భారత మాజీ క్రికెటర్ సచిన్‌తో అమితాబ్ కనిపించారు. వారిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసిని అభిమానులు సంబరపడ్డారు. అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 ADలో కనిపించబోతున్నారు, ఇది 2024లో మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ ఉన్నారు. కోలీవుడ్‌లో రజనీకాంత్ వెట్టయన్ చిత్రంలో కూడా అమితాజ్ నటించనున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ నటీనటుల తెరపై మళ్లీ కలయిక కోసం ఉత్సాహంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఎప్పటికీ కృతజ్ఞతగా...
అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరారనే వార్త గుప్పుమనడంతో అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే ఆ తర్వాత కంగారు పడాల్సిందేమీ లేదనే వార్త కూడా రావడంతో కూల్ అయ్యారు. ఇంతకీ విషయం ఏంటంటే... శుక్రవారం తెల్లవారుజాము అమితాబ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారట. అమితాబ్‌కి యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారని సమాచారం. కాలికి ఒకచోట రక్తం గడ్డ కట్టడంతో యాంజియోప్లాస్టీ చేశారట. ఇక శుక్రవారం మధ్యాహ్నమే అమితాబ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాతే ‘ఇన్ గ్రాటిట్యూడ్ ఎవర్’ (ఎప్పటికీ కృతజ్ఞతగా..) అని ఎక్స్‌లో పోస్ట్ చేసినట్లున్నారు అమితాబ్. అంటే... ఆరోగ్యంగా బయటపడినందుకు ఆయన ఇలా పోస్ట్ చేసి ఉంటారని ఊహించవచ్చు. ఇక ఇటీవల ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, రజనీకాంత్ ‘వేట్టయాన్’ చిత్రాల షూటింగ్స్‌లో అమితాబ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. -
ఫ్యాన్స్‌కు ఊరట.. బిగ్ బీ లేటేస్ట్ హెల్త్ అప్డేట్ ఇదే!
బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరిన ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఇవాళ ఉదయం ఆస్పత్రికి తరలించారు. ఆయనకు యాంజియోప్లాస్టీ చేసిన అనంతరం సాయంత్రమే ఇంటికి పంపించారు. కాగా.. అమితాబ్‌ను గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నాడు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో ఓ సర్జరీ చేశారు. 2020లో కోవిడ్‌తో పోరాడాడు. దాన్నుంచి కోలుకున్నాడని సంతోషించేలోపు 2022లో మరోసారి కరోనాతో పోరాడి విజయం సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన చేతి మణికట్టుకు సర్జరీ జరిగింది. అమితాబ్ ఇటీవల టైగర్ ష్రాఫ్, కృతి సనన్ నటించిన గణపత్‌లో కనిపించారు. అంతే కాకుండా ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రంలో కీలక పాత్రలో నటించారు. -
ఆస్పత్రిపాలైన బిగ్‌బీ.. ఈ ఏడాది రెండోసారి!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు లోనయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు శుక్రవారం (మార్చి 15) నాడు ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి ఆంజియోప్లాస్టీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్‌బీ ఎక్స్ (ట్విటర్)లో ఎప్పటికీ కృతజ్ఙతగా ఉంటాను అంటూ ఓ ట్వీట్ చేశాడు. దీనికి అభిమానులు స్పందిస్తూ మీరు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు కాగా అమితాబ్‌ను గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నాడు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో ఓ సర్జరీ చేశారు. 2020లో కోవిడ్‌తో పోరాడాడు. దాన్నుంచి కోలుకున్నాడని సంతోషించేలోపు 2022లో మరోసారి కరోనాతో పోరాడి విజయం సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన చేతి మణికట్టుకు సర్జరీ జరిగింది. ఆ సినిమాతో కెరీర్ మొదలు కాగా అమితాబ్ ప్రస్తుత వయసు 81. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 55 ఏళ్లు పూర్తయింది. 1969లో అమితాబ్ ‘సాత్ హిందూస్థానీ’ చిత్రంతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టాడు. తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్నాడు. వందలాది చిత్రాలతో భారతీయులను అలరించిన అతడు ప్రస్తుతం వేట్టయాన్, కల్కి 2898 ఏడీ అనే సినిమాలు చేస్తున్నాడు. T 4950 - in gratitude ever .. — Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024 చదవండి: మళ్లీ వచ్చేసిన మగజాతి ఆణిముత్యాలు.. సిరీస్ ఎలా ఉందంటే? -
ఆసుపత్రిలో బిగ్ బీ : ఆంజియోప్లాస్టీ అంటే ఏమిటి?
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అక్కడ బిగ్‌బీకి వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఈ ప్రక్రియ జరిగిందని ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీనికి సంబంధి ఒక కృతజ్ఞతా సందేశాన్ని కూడా బిగ్‌బీ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు క్రికెటర్ గురించి కూడా ఒక ట్వీట్ చేయడం విశేషం. కాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్, దిశా పటానీ, దీపికా పదుకొణె నటిస్తున్న కల్కి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది మే 9న థియేటర్లలోకి రానుంది. ఆంజియో ప్లాస్టీ అంటే ఏమిటి? ఎపుడు చేస్తారు? గుండెలోని క్లాట్స్‌ను తొలగించేందుకు వినియోగించే ఆధునిక టెక్నాలజీ ఆంజియోప్లాస్టీ. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను బెలూన్ డైలేషన్ ద్వారా తొలగించి, అవసరమనుకుంటే తొలగించిన అడ్డంకి స్థానంలో స్టెంట్‌ను అమర్చడాన్ని ఆంజియోప్లాస్టీ అంటారు. తద్వారా భవిష్యత్తులో తిరిగి రక్తనాళాలలో కొవ్వుపేరుకొని అడ్డంకులు ఏర్పడకుండా నివారించవచ్చు. రక్తనాళాల్లో బ్లాకేజీ 70 శాతం కంటే ఎక్కువగా ఉండే వారికి ఇది చేస్తారు. T 4950 - in gratitude ever .. — Amitabh Bachchan (@SrBachchan) March 15, 2024 ఛాతిలో నొప్పి, వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం రావడం, అలసిపోయినట్టు అనిపించడం బరువైన పనులు చేస్తున్న సమయంలో ఆయాసంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపించినపుడు, హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి ఆంజియోగ్రామ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. తరువాత హానికరమైన క్లాట్స్‌ను గురించినట్టయితే ఆంజియో ప్లాస్టీ ద్వారా చికిత్స అందించి భవిష్యత్తులో సమస్యలు రాకుండా నివారించడంతోపాటు, ప్రాణాపాయం నుంచి కాపాడతారు. -
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ నేటి నుంచి ప్రారంభం
ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ టీ10 లీగ్ (ఐఎస్పీఎల్) తొలి ఎడిషన్ నేటి నుంచి (మార్చి 6) ప్రారంభంకానుంది. ఈ కొత్త క్రికెట్ లీగ్ భారత దేశపు నలుమూలల్లో దాగివున్న యంగ్ టాలెంట్‌ను వెలికితీయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ లీగ్ ద్వారా పరిచమయ్యే ఆటగాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి, తగు ప్రోత్సాహకాలతో పోటీ ప్రపంచంలో నిలబెట్టాలన్నది నిర్వహకుల ఆలోచన. జట్లను కొనుగోలు చేసిన ప్రముఖ సినీ తారలు.. ఐఎస్పీఎల్లో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ జట్లను టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ తారలు కొనుగోలు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. చీఫ్ మెంటార్‌గా రవిశాస్త్రి.. ఈ లీగ్‌కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చీఫ్ మెంటార్‌గా వ్యవహరించనుండగా.. భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, జతిన్ పరంజపే సెలెక్షన్ కమిటీ హెడ్లుగా పని చేయనున్నారు. అమితాబ్ వర్సెస్ అక్షయ్.. ఈ లీగ్‌లోని తొలి మ్యాచ్‌లో అమితాబ్ మఝీ ముంబై.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో జరుగనుంది. ఈ లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఇదే వేదికగా జరుగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్ 2 టీవీ ఛానెల్లో చూడవచ్చు. అలాగే సోనీ లివ్ యాప్‌లోనూ వీక్షించవచ్చు. సచిన్ జట్టుతో తలపడనున్న అక్షయ్ టీమ్.. ఇవాళ జరుగబోయే ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ఓ ప్రత్యేక క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవెన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. -
RGV Den: హైదరాబాద్‌కు అమితాబ్ బచ్చన్.. ఆర్జీవీ డెన్‌లో సందడి (ఫొటోలు)
-
ఆర్జీవీ డెన్‌లో అమితాబ్ సందడి.. ‘వ్యూహం’ కోసమేనా?
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మంచి స్నేహితులన్న విషయం అందరికి తెలిసిందే. ఆర్జీవీతో సినిమా అంటే కథ వినకుండా ఓకే చెప్పే నటుల్లో అమితాబ్ ఒక్కరు. ఆర్జీవీ ముంబైకి వెళ్లిన ప్రతిసారి అమితాబ్‌ను కలుస్తుంటారు. అపాయింట్మెంట్ లేకుండానే అమితాబ్‌ని ఇంటికి వెళ్లి కలిసే అతి కొద్దిమందిలో వర్మ ఒక్కరు. సర్కారు సినిమా ద్వారానే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. (చదవండి: మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్) అమితాబ్ కెరీర్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సర్కార్(2005) సినిమా తెరకెక్కించి బిగ్ హిట్ ఇచ్చాడు వర్మ. ఆ తర్వాత 2008లో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సర్కార్ రాజ్’ అనే సినిమా చేశారు. అదీ సూపర్ హిట్ అయింది. 2017లో సర్కార్ 3 తీసుకొచ్చారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగింది. ఫ్రీ టైమ్ దొరినప్పుడల్లా వీరిద్దరు కలుస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన అమితాబ్.. ఆర్జీవీ డెన్‌లో సందడి చేశారు. డెన్ మొత్తం కలియతిరిగి.. ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. SARKAR @SrBachchan in MY SEAT at RGV DEN pic.twitter.com/WxUoMIqJuc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 తన కార్యాలయానికి వచ్చిన సర్కార్(అమితాబ్‌ని ఆర్జీవీ ముద్దుగా సర్కార్ అని పిలుస్తుంటాడు)కి ఆర్జీవీ సాదరంగా ఆహ్వానం పలికారు. దగ్గరుండి డెన్ మొత్తం చూపించాడు. అలాగే ఆఫీస్‌లోని తన సీట్లో కూర్చొబెట్టి.. సర్కార్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. సర్కార్ నా సీటులో కూర్చున్నాడు అని క్యాప్షన్ ఇచ్చాడు. Me and Dasari Kiran Kumar VYOOHAM ing with SARKAR Amitabh Bachchan at RGV DEN 💐💐💐 pic.twitter.com/jnboZKlhHc — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 అలాగే వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ సైతం ఆర్జీవీ డెన్‌లో ఆమితాబ్ని కలిశాడు. దానికి సంబంధించిన ఫోటోని ఎక్స్‌లో షేర్ చేస్తూ..‘నేను, దాసరి కిరణ్ కలిసి అమితాబ్‌తో ‘వ్యూహం’ రచించాము అని సరదాగా రాసుకొచ్చాడు. ఈ రెండు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసి వ్యూహం ప్రమోషన్ కోసమే అమితాబ్ హైదరాబాద్ వచ్చారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం కల్కీ 2898 సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది. విరామ సమయంలో ఆర్జీవీని కలిశాడు.ఆర్జీవీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వ్యూహం’ మార్చి 2న విడుదల కాబోతుంది. SHIVA ing with @SrBachchan at RGV DEN 🔥🔥🔥 pic.twitter.com/RIKwFeh7fK — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
అమితాబ్ మనవడికి ఎగ్జిమా! ఇది ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తూ ప్రేకక్షుల ప్రశంసలందుకుంటున్నారు అమితాబ్. ప్రముఖ టెలివిజన్ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్పతికి అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన మనవడు అగస్త్య నంద 'ది ఆర్చీస్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్యూలో తాను ఎగ్జిమా అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏంటా ఎగ్జిమా? ఎందువల్ల వస్తుంది. అగస్త్య సోదరి నవ్య నేవలి నంద హోస్ట్ చేసిన 'వాట్ ది హెల్ నవ్య పాడ్‌క్యాస్ట్' ప్రోగ్రాంలో తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అగస్త్య తన తల్లి శ్వేతా బచ్చన్, అమ్మమ్మ జయబచ్చన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ ముగింపులో చర్మ సంరక్షణ విషయంలో ఎవరిని సంప్రదిస్తారని ప్రశ్నించగా అగస్త్య తాను తల్లినే ఆశ్రయిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ఎగ్జిమా(తామర)తో బాధపడుతున్నట్లు అగస్త్య తెలిపారు. ఇది తనను బాగా వేధించే సమస్య అని అన్నారు. తన సహ నటులతో కలిసి నటించే సమయంలో ఈ సమస్య కారణంగానే చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. తాను ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్, ఫేస్‌క్రీమ్, షేస్ వాష్ వంటి వాటిని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటానని అన్నారు. అయితే తామరకు ఇంతవరకు బెస్ట్ అయింట్మెంట్ అంటూ ఏదీ లేకపోవడం బాధకరం అని చెప్పారు. దయచేసి దానికి సరైన మందు కనుక్కొండని వేడుకున్నాడు అగస్త్య. ఇంతకీ ఏంటీ ఎగ్జామా అంటే.. ఎగ్జిమా అంటే.. తామర అనేది పిల్లలను పెద్దలను ప్రభావితం చేసే ఒక సాధారణ చర్మ పరిస్థితి. దీనిని అటోపిక్ ఎగ్జిమా లేదా తామర అని కూడా అంటారు. దీని వల్ల చర్మంలో అస్సలు తేమగా ఉండదు. అస్తమాను పొడిగా ఉండి చికాకు తెప్పిస్తుంది. ఫలితంగా చర్మం నుంచి కొన్ని రకాల రసాయనాలు విడుదలయ్యి ఒక విధమైన గీతలు, చారలు రావడం జరుగుతుంది. అది కాస్త దురదగా, ఇరిటేట్‌గా ఉంటుంది. పోని గోకితే వెంటనే మరింత దురదగా ఉండి ఎర్రగా బొబ్బల్లా రావడం జరగుతుంది. లక్షణాలు.. చర్మం పొడిగా ఉండి, ఎరుపుగా ఉంటుంది. ఎక్కువుగా మోచేతుల మడతలు, మోకాళ్ల వెనుక, మణికట్టు, చీలమండలలో వస్తుంది. ఎక్కువుగా పెద్దలు, పిల్లలను ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఎక్కువుగా మెడ, ముఖంపై వస్తుంది. ఓ నాణెం సైజులో చేతులు, కాళ్లు, లేదా వీపుపై ఎర్రగా వస్తుంటాయి. అయితే ఎందువల్ల ఇలా వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కుటుంబపరంగా వచ్చే వ్యాధే ఇది కూడా. అయితే వ్యక్తుల పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఈ తామర వస్తుందని వైద్యలు చెబుతున్నారు. తామర రావడానికి గల కారణాలు.. వ్యాధి నిరోధక శక్తి.. కొందరిలో వ్యాధి నిరోధక శక్తి వాతావరణంలో ఉండే బ్యాక్లీరియా లేదా వైరస్‌లకు అతిగా ప్రతిస్పందించడంతో అలెర్జీలకు దారితీయడం వల్ల ఈ సమస్య తలెత్తుంది. అందువల్ల ముందుగా మన వ్యాధినిరోధక శక్తిని మంచిగా పెంపొందించుకునేలా ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. జీన్స్.. వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి ఇది. కుటుంబంలో ఎవ్వరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే వారి తర్వాత తరాలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణ కారకాలు.. కొందరూ పొడి వాతావరణంలో జీవిచడం వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. వాతావరణంలో తేమ తక్కువుగా ఉండే ప్రాంతాల్లో నివశించే వాళ్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒత్తిడికి గురైనా.. మానసిక ఆరోగ్యం బాగోలేకపోయినా, ఎక్కువగా ఒత్తిడి, యాంగ్జిటీ, డిప్రెషన్ వంటి వాటికి గురైనా ఇలాంటి చర్మ సంబంధిత రుగ్మతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానసికంగా సరిగా లేకపోయినా శరీరంపై ప్రభావం ఏర్పడుతుందని చెబుతున్నారు. వైద్యులు వద్దకు సకాలంలో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటే సమస్యను ఆదిలోనే నియంత్రించొచ్చని అంటున్నారు నిపుణులు. అలాగే పరిస్థితి మరింత జటిలం కాకమునుపే ఈ ఎగ్జిమాకు చికిత్స తీసుకోవడమే అని విధాల మంచిదని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: 'శబ్దమే శాపం ఆమెకు' అత్యంత అరుదైన వ్యాధి..ఆఖరికి పిల్లల నవ్వులు కూడా..) -
అప్పుడు అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు మహేశ్ బాబు
పబ్లిక్ ఫిగర్స్ (ప్రముఖులు) వేలకోట్ల వ్యాపార రంగాన్ని కనుసైగతో శాసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్గిపుల్ల నుంచి సబ్బు బిళ్ల వరకు ఆయా ప్రొడక్ట్ ల అమ్మకాలు జరిగేలా బ్రాండ్ అంబాసీడర్లుగా రాణిస్తున్నారు. ఆయా ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా ప్రచారం చేస్తున్నారు. స్పోర్ట్స్ పర్సన్, సినిమా స్టార్లయినా బ్రాండ్ అంబాసీడర్‌గా వాళ్లు చేయాల్సిందల్లా మూమెంట్లు,డబ్బింగ్ చెబితే సరిపోతుంది. ఒక్కసారి సదరు బ్రాండ్ అంబాసీడర్ యాడ్ మార్కెట్ లోకి విడుదలైందా అంతే సంగతులు. ఊహించని లాభాల్ని చూడొచ్చు. అందుకే చిన్న చిన్న కంపెనీల నుంచి బడబడా కంపెనీల వరకు ఆయా రంగాల్లో రాణిస్తున్న వారిని తమ కంపెనీ ప్రొడక్ట్ ల అమ్మకాల కోసం బ్రాండ్ అంబాసీడర్ లు గా నియమించుకుంటాయి. వారికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించుకుంటాయి. తాజాగా, డిజిటల్ లావాదేవీల్లో దూసుకుపోతున్న ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ఫోన్ పే యూజర్లను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. గత ఏడాది తన స్మార్ట్ స్పీకర్లకు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌ను అందించిన 'ఫోన్ పే'.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్‌ను జోడించింది. ఇకపై చెల్లింపులు చేసినప్పుడు మనీ రిసీవ్డ్ అనే కంప్యూటర్ జనరేటెడ్ వాయిస్ కి బదులు 'మహేశ్ బాబు' గొంతు వినిపిస్తుంది. ఇందుకోసం ఫోన్ పే ప్రతినిధులు మహేష్ వాయిస్ తీసుకుని కృత్రిమ మేధస్సు ద్వారా వాయిస్‌ను జనరేట్ చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూజర్ చెల్లించిన మొత్తాన్ని ప్రకటించిన తర్వాత ధన్యవాదాలు బాస్ అనే వాయిస్ వినిపిస్తుంది. Babu voice vasthundhi phone pay lo ma shop lo 💥💥😅🔥@urstrulyMahesh #GunturKaaram #SSMB29 pic.twitter.com/1lib8hIjl7 — babu fan ra abbayilu 💥💥🔥🤙 (@Vamsi67732559) February 20, 2024 బిగ్ బికి ఎంత రెమ్యునరేషన్ అంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ సుమారు 30కి పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా పనిచేస్తున్నారు. కుర్ర హీరోలతో పోటీ పడి మరి బ్రాండ్ అంబాసీడర్ గా పని చేస్తూ తన ప్రచారంతో ఆయా కంపెనీలకు కనకవర్షం కురిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన ఒక్కో సంస్థ నుంచి రూ.5కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. -
సెల్ఫ్ మేడ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అమితాబ్ బచ్చన్ ఆసక్తి కనబరుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బాలీవుడ్ బిగ్ బి నటుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 55 ఏళ్లయింది. ఈ నేపథ్యంలో ఏఐతో చేసిన తన ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేశారు అమితాబ్ బచ్చన్. ‘‘సినిమా అనే అద్భుత ప్రపంచంలో 55 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. ‘సెల్ఫ్ మేడ్’’ అంటూ అమితాబ్ బచ్చన్ ఈ ఫొటోలను ఉద్దేశించి పేర్కొన్నారు. నిజంగానే అమితాబ్ ‘సెల్ఫ్ మేడ్’. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎన్నో కష్టాలు పడి అమితాబ్ బచ్చన్ స్టార్ యాక్టర్‌గా ఎదిగారు. కెరీర్ తొలి నాళ్లలో ఆయన అవమానాలు ఎదుర్కొన్నారు కూడా. తిరస్కరణలకు గురయ్యారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్నాళ్లు ముంబై మెరీనా బీచ్‌లో గడిపారు. ఎన్నో సవాళ్లను దాటుకుని 1969లో అమితాబ్ ‘సాత్ హిందూస్థానీ’ చిత్రంతో యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాకే న్యూ కమర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు అమితాబ్. అదే ఏడాది ఉత్పల్ దత్ హీరోగా చేసిన ‘భువన్ షోమ్’ సినిమాకు నరేటర్‌గా చేశారు అమితాబ్. ఆ తర్వాతే మధు, ఉత్పల్లతో కలిసి అదే ఏడాది ‘సాత్ హిందూస్థానీ’ సినిమాతో అమితాబ్ ఎంట్రీ జరిగింది. అలా ముందు తన గొంతు వినిపించి, ఆ తర్వాత నటుడిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ‘భువన్ షోమ్’ చిత్రం మేలో విడుదల కాగా, ‘సాత్ హిందూస్థానీ’ చిత్రం నవంబరులో విడుదలైంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’, రజనీకాంత్ ‘వేట్టయాన్’తో పాటు హిందీలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు అమితాబ్ బచ్చన్. -
ఆస్తుల వివరాలు వెల్లడించిన జయా బచ్చన్
అమితాబ్ బచ్చన్- జయా బచ్చన్.. బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ అండ్ సీనియర్ జంట. ఇద్దరిదీ సినిమా బ్యాక్‌గ్రౌండే.. కాకపోతే బిగ్‌బీ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్‌గా కొనసాగుతుండగా జయా బచ్చన్ మాత్రం పాలిటిక్స్‌లో రాణిస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత ఈమె ఈ మధ్యే రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీలో ఓ ముఖ్య పాత్రలో మెరిశారు. ఇకపోతే జయా బచ్చన్ వరుసగా ఐదోసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సమాజ్ వాదీ పార్టీ తరపున ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 2022 - 2023వ సంవత్సరానికి గానూ జయ వ్యక్తిగత నికర విలువ రూ.1.63 కోట్లు కాగా, ఆమె భర్త అమితాబ్ నికర విలువ రూ.273.74 కోట్లుగా ఉంది. తన బ్యాంకులో రూ.10 కోట్లు ఉన్నాయన్న ఆమె అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.120 కోట్లుగా పేర్కొన్నారు. ఉమ్మడి చరాస్తుల విలువ రూ.849 కోట్లు కాగా స్థిరాస్తి విలువ రూ.729 కోట్లుగా ఉంది. ఆమె దగ్గర రూ.40.97 కోట్ల విలువైన నగలతో పాటు రూ.9.82 లక్షల విలువ చేసే కారు ఉంది. అమితాబ్ దగ్గర రూ.54.77 కోట్ల ఆభరణాలతో పాటు రూ.17.66 కోట్లు విలువ చేసే 16 వాహనాలున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మొత్తంగా బిగ్‌బీతో కలిసి రూ.1578 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జయా బచ్చన్ ప్రకటించారు. చదవండి: Valentine's Day 2024: ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి! -
చివరి ఘట్టానికి చేరుకున్న ప్రభాస్ 'కల్కి'
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్ ఫ్యూచరిస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోలు నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్ షెడ్యూల్ ఈ నెల రెండో వారంలో చిత్రీకరించేలా ప్లాన్ చేశారట నాగ్ అశ్విన్. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె.. ఇలా ఈ సినిమా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది. -
బాలీవుడ్ కంటే సౌత్ సినిమాలే గొప్ప.. బిగ్‌బీ గుస్సా!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ మీద విపరీతమైన నెగెటివిటీ వచ్చేసింది. స్టార్ కిడ్స్‌కు అందలమిస్తారని, వేరేవాళ్లను తొక్కేస్తారని ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో హిందీ సినిమాలను ఎవరూ చూడొద్దు, బ్యాన్ చేసేద్దామని నెటిజన్లు సంకల్పించుకున్నారు. ఆ తర్వాత రిలీజైన సినిమాల్లో చాలామటుకు ఫ్లాప్స్‌గా నిలిచిపోయాయి. అదే సమయంలో సౌత్ సినిమాలు అందరినీ ఆకర్షించాయి. పాన్ ఇండియాగా రిలీజైన చిత్రాలు జనాలను మెప్పించాయి. దీంతో బాలీవుడ్ పనైపోయింది. సౌత్ ఇండస్ట్రీదే హవా.. అన్న టాక్ మొదలైంది. ఇప్పటికీ చాలాచోట్ల దక్షిణాది చిత్రాలను పొగుడుతూ హిందీ సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. ఇది బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు బాధ కలిగిస్తోందట! సినిమాలను ఎందుకు తప్పుపడతారు? సౌత్ వర్సెస్ బాలీవుడ్ అన్న అంశంపై అమితాబ్ తీవ్రంగా స్పందించాడు. అలాగే సినిమాల మీద వ్యతిరేకత గురించి కూడా సంభాషించాడు. ఆయన మాట్లాడుతూ.. 'జనాల్లో వచ్చే మార్పులకు, సమాజంలో సంఘటనలకు సినిమాలే కారణమంటూ అనేకసార్లు మూవీ ఇండస్ట్రీనే తప్పుపడుతూ ఉంటారు. ఈ ప్రకృతిలో, ప్రపంచంలో, దైనందిన జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు, అనుభవాల నుంచే కథలు, సినిమాలు పుడతాయి. ఆ యదార్థ సంఘటనలే సినిమాగా తెరకెక్కుతాయి. ఈ మధ్య ప్రాంతీయ సినిమాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అందుకే అద్భుతంగా కనిపిస్తున్నాయి ఆ సినిమాల్లో వేషధారణ మార్చడంతో అవి అద్భుతంగా కనిపిస్తున్నాయి. మీ సినిమా బాగుంది అని వాళ్లను ప్రశంసించినప్పుడు ఏమని చెప్తున్నారో తెలుసా? హిందీలో ఎలాంటి సినిమాలైతే తీశారో అలాంటి వాటినే అక్కడ తెరకెక్కిస్తున్నామన్నారు. దీవార్, శక్తి, షోలే సినిమాలను రీమేక్ చేస్తున్నామని, వాటి సారాన్ని వాడుకుంటున్నామన్నారు. కాకపోతే మలయాళం సినిమా అలాగే కొంతవరకు తమిళ సినిమాలు మాత్రం వాటికవే ప్రత్యేకంగా ఉంటాయి. అలా అని మా ఇండస్ట్రీ కంటే అదే గొప్ప అని చెప్పడం సరి కాదు' అన్నాడు బిగ్‌బీ. చదవండి: సాయిపల్లవి సోదరి వీడియో.. అక్కనే మించిపోయిందిగా! పెళ్లైన రెండేళ్లకే గొడవలు.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌పై భార్య ఫిర్యాదు! -
ముఖేష్ అంబానీ మరియు అమితాబ్ బచ్చన్ విజువల్స్
-
అయోధ్య రామాలయానికి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్
-
అయోధ్య శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ.. హాజరైన అగ్ర సినీ తారలు వీళ్లే!
ప్రతి ఒక్క భారతీయుని కల నెరవేరుతున్న రోజు ఇది. 500 ఏళ్ల కల సాకారమవుతున్న తరుణమిది. ప్రతి భారతీయుడు ఎన్నో దశాబ్దాలుగా వేచి చూసిన క్షణమిది. అయోధ్యలో శ్రీరామమందర నిర్మాణం 500 ఏళ్లనాటి కల నేడు నెరవేరబోతోంది. ఇంతటి అద్భుతమైన ఈ మహాఘట్టాన్ని వీక్షించేందుకు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి కళ్లు అయోధ్య వైపే. ఆ క్షణాలను భక్తితో ఆస్తాదించేందుకు ఇప్పటికే అయోధ్యాపురికి చేరుకున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రముఖ అగ్ర సినీ తారలంతా శ్రీరామనామం జపిస్తూ అయోధ్యలో అడుగుపెట్టారు. ఈ అద్భుతమైన మహాత్తర వేడుకను వీక్షించేందుకు వెళ్లిన సినీతారలపై ఓ లుక్కేద్దాం. అయోధ్యకు మెగాస్టార్ దంపతులు.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో బయలుదేరిన చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్‌కు అయోధ్యలో ఘనస్వాగతం లభించింది. వీరితో పాటు పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. టాలీవుడ్ హీరో సుమన్ ఇప్పటికే అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. అయోధ్యలో బాలీవుడ్ తారల సందడి శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వీక్షించేందుకు బాలీవుడ్ అగ్రతారలంతా హాజరవుతున్నారు. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మాధురీ దీక్షిత్ నానే, జాకీ ష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్, అలియా భట్ నిర్మాతలు రాజ్‌కుమార్ హిరానీ, మహావీర్ జైన్, రోహిత్ శెట్టి రామ మందిరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి వెళ్లారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్, సినీ నిర్మాత మధుర్ భండార్కర్, వివేక్ ఒబెరాయ్, సింగర్ సోనూ నిగమ్, మనోజ్ జోషి ఇప్పటికే అయోధ్యలో అడుగుపెట్టారు. అయోధ్యలో తలైవా సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ సైతం ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠను తిలకించేందుకు నటుడు ధనుశ్ కూడా బయలుదేరి వెళ్లారు. #WATCH | Ayodhya, Uttar Pradesh | Actor Suman says, "Congratulations and best wishes to PM Modi and CM Yogi Adityanath. These two are like Ram and Lakshman and had this temple come up here, I think has been God's doing. He created them to build this temple...This will be the… pic.twitter.com/bvi94YgnfN — ANI (@ANI) January 22, 2024 VIDEO | Actors @SrBachchan, @juniorbachchan, BJP leader @rsprasad, industrialist Anil Ambani reach Ayodhya Ram Mandir to attend the Pran Pratishtha ceremony.#RamMandirPranPratishtha #AyodhyaRamMandir pic.twitter.com/yibxh5Xbuf — Press Trust of India (@PTI_News) January 22, 2024 #WATCH | Telegu superstars Chiranjeevi and Ram Charan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony #RamMandirPranPrathistha pic.twitter.com/1vhq7yhX1Z — ANI (@ANI) January 22, 2024 MegaStars ✨ #RamCharan and #Chiranjeevi garu are being Welcomed in Ayodhya 🚩#RamMandirPranPrathistha 🕉️🙏pic.twitter.com/WbUcOsvtaQ — Ujjwal Reddy (@HumanTsunaME) January 22, 2024 Yehi janmbhoomi hai param pujya Shri Ram ki, ek naye yug ka aarambh 🚩 pic.twitter.com/TBFAtWAYu3 — Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024 Actors Madhuri Dixit Nane, Vicky Kaushal, Katrina Kaif, Ayushmann Khurrana, Ranbir Kapoor, Alia Bhatt and filmmakers Rajkumar Hirani, Mahaveer Jain and Rohit Shetty left for Ayodhya to attend the Pran Pratishtha ceremony at the Ram Temple. pic.twitter.com/WDpI9cWCPT — ANI (@ANI) January 22, 2024 -
బాలీవుడ్ స్టార్స్ ఇలాంటివి నమ్ముతారా.. ద్యావుడా!
సినిమా రంగంలో సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఎక్కువ. ప్రతిభ కంటే అదృష్టానికే విలువెక్కువ. గుడ్డి నమ్మకాలకు గౌరవిస్తూ పేర్లను కూడా మార్చుకుంటారు. ఈ సెంటిమెంట్ స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల దాకా అందరి మీదా ఉంటుంది. దానికి తగ్గట్టే ప్రవర్తిస్తుంటారు వాళ్లంతా. అలాంటి వింత అలవాట్లు, సెంటిమెంట్లను ఫాలో అవుతున్న కొంతమంది బాలీవుడ్ స్టార్స్ గురించి.. పేరుతో సక్సెస్ రాదు.. చేసే పనితో వస్తుంది అకుంటాం. కానీ బాలీవుడ్లో దీనికి రివర్స్! పేరులో అక్షరాలు కరెక్ట్‌గా ఉంటేనే సక్సెస్ అని నమ్ముతారు బాలీవుడ్ సెలబ్రిటీస్‌లో చాలా మంది. సీనియర్ మోస్ట్ యాక్టర్ సంజయ్ దత్ ఇలాంటి నమ్మకాల్లోనూ సీనియరే. చిన్నప్పుడు స్కూల్లో అతని పేరు ‘Sunjay dutt’గా నమోదయింట. కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సక్సెస్ అంతత్వరగా దరి చేరకపోయేసరికి ‘Sajay’లోని‘U’అక్షరాన్ని తీసేసి ఆ స్థానంలో ‘A’ని చేర్చి ‘Sanjay’గా మార్చుకున్నాడట. అప్పటి నుంచి సక్సెస్ ఆ పేరుకు సఫిక్స్ అయిందని అతని స్ట్రాంగ్ బిలీఫ్! బాలీవుడ్ నటుడు గోవిందా ఏదైనా షూటింగ్లో ఉన్నప్పుడు అతన్ని కలవడానికి విజిటర్ ఎవరైనా రెడ్ కలర్ డ్రెస్‌లో వస్తే ఆ విజిటర్ని కొట్టేసేంత ఆవేశాన్ని, కోపాన్నీ కంట్రోల్ చేసుకుంటాడట. కారణం షూటింగ్స్‌లో రెడ్ అతనికి యాంటీసెంటిమెంట్ అట. అంతేకాదు ఎక్కడికి వెళ్లినా ఇంటి భోజనమే తింటాడు. ఈ సెంటిమెంట్ ఎంతదూరం వెళ్లిందంటే ఔట్‌డోర్ షూటింగ్స్‌కి తనింటి గేదేనే తీసుకెళ్లేంత. ఈ గేదె పాలతో కాచిన కాఫీ, టీలనే తీసుకుంటాడని బాలీవుడ్ వర్గాల భోగట్టా. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా సెంటీఫెలోనే.. న్యూమరాలజీ విషయంలో! ఆయనకు నంబర్ 9 పట్ల అబ్సెషన్. రెమ్యునరేషన్ కూడా టోటల్ నైన్ వచ్చేలా తీసుకుంటాడట. అంటే 5 కోట్లు, 63 కోట్లు, 72 కోట్లు.. ఇలా రెండు అంకెలను కూడితే 9(ఇండస్ట్రీలో తనకున్న డిమాండ్, తన సినిమాలకు ఉన్న మార్కెట్‌ను బట్టి) వచ్చేలా చూసుకుంటాడట. ఇంకో సెంటిమెంట్ కూడా ఉంది. తెల్ల కాగితం మీద ‘ఓం’అని రాసి.. దానికి దండం పెట్టుకోందే ఏ కొత్త పనీ మొదలుపెట్టడట. బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరు రాజ్‌కుమార్ రావ్ అని అందరికీ తెలిసిందే! అయితే రావు అనేది అతని పెట్టుడు పేరు అని తెలిసింది మాత్రం కొందరికే! ఆ నటుడి అసలు పేరు రాజ్‌కుమార్ యాదవ్. ఈ పేరుతో కొనసాగినన్నాళ్లూ సినిమాల్లో అతనికి సహాయక పాత్రలే దొరికాయి. అవి ‘మంచి నటుడు’అని పేరు తెచ్చినా.. ముఖ్య పాత్రలను మాత్రం రప్పించలేకపోయాయి. సెంటిమెంట్ల ఊట అయిన సినిమా ఫీల్డ్‌లో ఎవరు సలహా ఇచ్చారో మరి.. తన పేరును మార్చుకున్నాడు. Rajkummar Rao అని! అంతే హీరో అయిపోయాడు. సింపుల్‌గా పేరు ఇంగ్లీష్ స్పెల్లింగ్‌లో ఎక్స్ట్రాగా ఒక ‘M’ చేర్చి, యాదవ్‌ని డిలీట్ చేసి రావ్ని యాడ్ చేశాడు అంతే! చమత్కార్ హోగయా! అమితాబ్ బచ్చన్‌కి ఉన్న మూఢనమ్మకాన్ని వింటే నిజంగానే విస్తుపోతారు. అమితాబ క్రికెట్‌కి వీరాభిమాని. అంత అభిమానం ఉన్నవాళ్లెవరైనా స్టేడియంలో కూర్చొని ఆటను చూసే అవకాశాన్ని అస్సలు వదులుకోరు కదా! కానీ అమితాబ్ అలాంటి ప్యాన్ కదాఉ. లైవ్ మ్యాచెస్కి వెళ్లడు. టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తాడు. ఎందుకంటే తను స్టేడియంలో కూర్చొని ఆటను తిలకిస్తే.. తన ఫేవరేట్ టీమ్ ఓడిపోతుందని భయమట. ఒకటి రెండు సార్లు అలా జరిగిందట. అందుకే అప్పటి నుంచి ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఆటను టీవీలోనే చూస్తాడట. జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్లినా వెంట మెరుపు మెరుపుల గులాబీ రంగు వాటర్ బాటిల్‌ని క్యారీ చేస్తుందట. అంతేకాదు దానికి ‘చుస్కీ(సిప్)’అని పేరు కూడా పెట్టుకుందట. ఆ బాటిల్, ఆ పేరు ఎంతగా ఫేమస్ అయిందంటే.. జాన్వీ కపూర్ ఫ్యాన్ ఒకరు చుస్కీ పేరుతో ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను క్రియేట్ చేసేంతగా! సల్మాన్ ఖాన్‌కి వేడి వేడి భోజనమే ఇష్టం. అయితే చద్దాన్నాన్ని డస్ట్‌బిన్‌లో పారేస్తాడా? అయ్యే లేఉద.. అన్నం పరబ్రహ్మా స్వరూపం అని గట్టిగా నమ్ముతాడు. మరైతే వేడి చేసుకుని తర్వాత పూటకు తినేస్తాడా? నో. ఒక్కసారి వండినవాటిని మళ్లీ వేడిచేయడం అనారోగ్యమనే ఆరోగ్య సూత్రాన్ని అస్సలు విస్మరించడు. మరేం చేస్తాడు? చద్దన్నానికి బటర్, పచ్చడి కలుపుకొని లాగిస్తాడట. సోనమ్ కపూర్ అహుజా సెంటిమెంట్ వింటే విస్తుపోతారు. తను నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్‌లో గనుక తను పొరపాటున కిందపడితే ఆ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆమె నమ్మకం. అందుకే షూటింగ్ ముహూర్తం రోజు నుంచి షూటింగ్ ఆఖరి రోజు వరకు తను కిందపడిపోయే చాన్స్ కోసం ఎదురు చూస్తుంటుందట. ఫిట్నెస్ క్వీన్ బిపాశా బసుకు దిష్టి మీద నమ్మకం ఎక్కువ. అందుకే ప్రతి శనివారం నిమ్మకాయలు, పచ్చి మిరపకాయలు కొని వాటిని ఒక ఇనుప తీగకు గుచ్చి కారు విండ్ షీల్డ్కున్న రియల్ వ్యూ మిర్రర్‌కి వేలాడదీస్తుందట. ఈ ప్రాక్టీస్‌ని వాళ్లమ్మ నుంచి నేర్చుకుందట బిపాశా. డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి గుర్తున్నాడు కదా! అతనికున్న నమ్మకం గురించి కూడా చదివేయండి. తను నటించే సినిమా షూటింగ్ ముహుర్తాలు ఎగ్గోడ్తాడట. తను షూటింగ్ ముహూర్తానికి హాజరయిన సినిమాలన్నీ ఘోరంగా ఫ్లాప్ అవడంతో తను ముహుర్తానికి అటెండ్ అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే నమ్మకం ఏర్పడిపోయిందట అతనికి. ఇక అప్పటి నుంచి తన సినిమా ముహుర్తాలకు ఆబ్సెంట్ వేయించుకోవడం మొదలుపెట్టాడట. నవరసనటసార్వభౌమురాలు విద్యాబాలన్ కళ్లకు కాటుక పెట్టందే గడప దాటదు. అది సాదా సీదా కాటుక కాదు.. పాకీస్తానీ పాపులర్ బ్రాండ్ ‘హష్మీ’కాజల్. తన మీద అదృష్టం దృష్టిపడ్డానికి.. సక్సెస్ తన కెరీర్ అడ్రస్‌గా మారడానికి ఆ కాజలే కారణం అని విద్యాబాలన్ బలంగా నమ్ముతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా! -
అయోధ్యలో భూములు కొన్న అమితాబ్.. రేట్లు ఎలా ఉన్నాయి?
ఈనెల 22న అయోధ్యలో నూతన రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. అదేరోజున రామాలయంలోని గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య.. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఆవిర్భవించనుంది. రామాలయం ప్రారంభోత్సవం నేపధ్యంలో ఈ ప్రాంతంలో భారీగా ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇక్కడి భూముల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్.. అయోధ్యలో భూములను కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ కంపెనీ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ ద్వారా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్లాట్ సెవెన్ స్టార్ మల్టీ పర్పస్ ఎన్క్లేవ్ ‘ది సరయూ’లో ఉంది. అమితాబ్ కొనుగోలు చేసిన ప్లాట్ సైజు 10 వేల చదరపు అడుగులు. ఇందుకోసం ఆయన రూ.14.5 కోట్లు వెచ్చించారు. అయోధ్యలో ప్లాట్ కొనుగోలుకు సంబంధించి అమితాబ్ ఒక ప్రకటన కూడా చేశారు. ‘అయోధ్య నా హృదయంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన నగరం. అయోధ్యకున్న కాలాతీత ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంపద నాలో భావోద్వేగ సంబంధాన్ని సృష్టించాయి. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన అయోధ్య ఆత్మలోకి నా హృదయపూర్వక ప్రయాణానికి ఇది నాంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు ఎదురు చూస్తున్నానని’ అమితాబ్ పేర్కొన్నారు. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా షేర్ చేసిన బ్రోచర్లోని వివరాల ప్రకారం అయోధ్య నగరంలో 1,250 చదరపు అడుగుల భూమి ధర రూ. 1.80 కోట్లు, 1,500 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.35 కోట్లు. 1,750 చదరపు అడుగుల స్థలం ధర రూ. 2.50 కోట్లుగా ఉంది. అమితాబ్ బచ్చన్ ప్లాట్‌ను కొనుగోలు చేసిన ప్రదేశానికి 10 నిమిషాల దూరంలో రామాలయం, 20 నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి. సరయూ నది రెండు నిముషాల ప్రయాణ దూరంలో ఉంది. ఇది కూడా చదవండి: నేటి నుంచి ‘ప్రాణప్రతిష్ఠ’ ముందస్తు ఆచారాలు ప్రారంభం! -
లోహ్రీ రోజు దానం చేయాలి : అమితాబ్
సంక్రాంతి పండగ సంబరాలు ఆరంభమయ్యాయి. కొందరు బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ లోహ్రీ (భోగి పండగ) శుభాకాంక్షలు. లోహ్రీ అంటే నాకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. లోహ్రీ రోజు జానపద కళాకారులు ‘లోహ్రీ దా టక్కా దే, రబ్ యానూ బచ్చా దే’ అంటూ పాటలు పాడుకుంటూ ఇంటింటికీ వచ్చినప్పుడు వారికి దానం ఇవ్వడం ఆనవాయితీ. నా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా పండగ తాలూకు విషయాలు చెప్పేవారు’’ అని సోషల్ మీడియా ద్వారా అమితాబ్ బచ్చన్ షేర్ చేశారు. T 4889 - Happy Lohri .. 'लोहड़ी दा टक्का दे, रभ थानू बच्चा दे ' ... 😁 this is how the chanting went when they came to homes and families to collect donations on the occasion of Lohri .. Maa used to tell us these stories .. pic.twitter.com/t9rVu8Kb2j — Amitabh Bachchan (@SrBachchan) January 13, 2024 ‘‘లోహ్రీ తాలూకు వెచ్చదనాన్ని, పండగ సందర్భంగా మా అమ్మగారు చేసిన స్వీట్స్‌ని తలుచుకుంటున్నాను. ఇరుగు పొరుగుతో పంచుకున్న నవ్వులతో నా మనసు నిండిపోయేది. నేటి బిజీ జీవితంలో అప్పటి ఆనందకర సాధారణ రోజులను తలచుకుని, ఆనందిస్తున్నాను. అందరి జీవితాల్లో లోహ్రీ ఆనందం నింపాలని కోరుకుంటున్నా’’ అని సన్నీ డియోల్ పేర్కొన్నారు. ఇంకా అక్షయ్ కుమార్, సంజయ్ దత్, విక్కీ కౌశల్, ఇషా డియోల్, నేహా ధూపియా వంటి తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
అమితాబ్ బచ్చన్ ఆస్తులు అద్దెకు - సంవత్సరానికి అన్ని కోట్లా..
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి పుంజుకుంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొందరు ప్రముఖులు, సెలబ్రిటీలు ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా గత ఏడాది నాలుగు కమర్షియల్ యూనిట్లను కొనుగోలు చేసి, ఏడాదికి కోట్ల రూపాయలను అద్దె రూపంలో సంపాదిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డెవెలప్ అవుతున్న నగరాల్లో ఆస్తులను కొనుగోలు చేయడానికి, ఎక్కువ ధరలకు విక్రయిస్తూ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని విక్రయించడానికి కొందరు ఆసక్తి చూపుతున్నారు. మరి కొందరు మాత్రం ఉన్న ఆస్తుల ద్వారా కోట్ల కొద్దీ డబ్బును అద్దె రూపంలో సంపాదించుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ ముంబైలోని ఓషివారా ప్రాంతంలో సుమారు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు వాణిజ్య యూనిట్లను అద్దెకు ఇస్తున్నారు. ఈ స్పేస్ కోసం మూడు సంవత్సరాల లీజుకు 'వార్నర్ మ్యూజిక్ ఇండియా లిమిటెడ్' రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్లు సమాచారం. దీని ద్వారా అమితాబ్ సంవత్సరానికి రూ.2.07 కోట్లు అద్దె సంపాదిస్తున్నారు. నాలుగవ సంవత్సరం నుంచి అద్దె ఏడాదికి రూ.2.38 కోట్లకు చేరనుంది. ఇదీ చదవండి: మునుపెన్నడూ చూడని అద్భుతాలు 'ఏఐ'తో సాధ్యం - బిల్ గేట్స్ అమితాబ్ బచ్చన్ ఒషివారాలో ఉన్న నాలుగు వాణిజ్య యూనిట్లను 2023 ఆగష్టులో కొనుగోలు చేశారు. ఈ నాలుగు యూనిట్లను ఒక్కొక్కటి రూ.7.18 కోట్లకు కొనుగోలు చేశారు. బచ్చన్ మాత్రమే కాకుండా.. కార్తీక్ ఆర్యన్, మనోజ్ బాజ్‌పేయి, సారా అలీ ఖాన్ కూడా ముంబైలో ఆస్తులు కొనుగోలు చేశారు. -
KBC 15: ముగిసిన కేబీసీ 15వ సీజన్.. అమితాబ్ ఎమోషనల్
కొన్ని రియాల్టీ షోల ద్వారా హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీలకు పేరొస్తుంది. మరికొన్ని రియాల్టీ షోలకు మాత్రం హోస్టింగ్ చేసిన సెలెబ్రిటీ ద్వారానే మంచి గుర్తింపు వస్తుంది. అలాంటి రియాల్టీ షోలలో`కౌన్ బనేగా కరోడ్‌పతి` ఒకటి. ఈ షో పేరు చెప్పగానే అందిరికి గుర్తొచ్చే పేరు అమితాబ్ బచ్చన్. ఈ షో సక్సెస్‌లో అబితాబ్ కీలక పాత్ర పోషించాడు. ఇది కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందించి షో కాదు.. ఎన్నో అనుభూతులను కూడా పంచుతుంటుంది. హాట్సీట్లో కూర్చొని అబితాబ్ చెప్పే విషయాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటి వరకు 14 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 15వ సీజన్‌ని కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్ 29న చివరి ఎపిసోడ్ ప్రసారమవ్వగా.. షోకి వచ్చిన ప్రేక్షకులతో పాటు అబితాబ్ కూడా ఎమోషనల్ అయ్యారు. (చదవండి: Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ) `లేడీస్ అండ్ జెంటిల్మెన్.. మేం వీడ్కోలు పలుకుతున్నాం. ఈ వేదిక రేపట్నుంచి కనిపించదు. రేపట్నుంచి మేం ఇక్కడకు రావడం లేదు అని చెప్పాలనిపించడం లేదు. నేను, అమితాబ్ బచ్చన్, ఈ సీజన్లో చివరి సారిగా నేను చెప్పేది ఒక్కటే.. గుడ్ నైట్.. గుడ్ నైట్’ అంటూ అమితాబ్ భావోద్వేగానికి గురయ్యారు. (చదవండి: Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్) అమితాబ్‌తో పాటు షోకి వెళ్లిన ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ‘మేం దేవుడిని చూడలేదు కానీ ఆ దేవుడికి అత్యంత ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నాం’అంటూ ఓ ప్రేక్షకురాలు చెప్పడంతో వేదిక అంతా చప్పట్లతో మారుమ్రోగింది. కాగా, చివరి ఎపిసోడ్‌కి విద్యాబాలన్, షీలా దేవి, షర్మిలా ఠాగూర్, సారా అలీఖాన్ విచ్చేసి సందడి చేశారు. ఇదే చివరి ఎపిసోడ్. ఇకపై ఇక్కడకు రాలేము అనే మాటలు చెబుతున్నందుకు బాధగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని ముందే తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నాను’అని అమితాబ్ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
దుస్తులు ఫ్రీగా ఇచ్చేవారు కాదు, కొనుక్కునే స్థోమత లేక..
సంతోషమైనా, దుఃఖమైనా ఏదీ కలకాలం ఉండదు. పగలూరేయిలా ఒకదాని తర్వాత మరొకటి వస్తూ పోతూనే ఉంటాయి. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ జీవితంలోనూ ఇదే జరిగింది. స్టార్ అన్న బిరుదు సంపాదించడానికి ముందు ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. ఒకానొక సమయంలో సంపాదించినదంతా పోగొట్టుకుని ఉట్టి చేతులతో నిలబడ్డాడు. కానీ గోడకు కొట్టిన బంతిలా మెరుపు వేగంతో మళ్లీ సంపాదించి నిలదొక్కుకున్నాడు. తాజాగా ఆనాటి గడ్డు పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు బిగ్‌బీ తనయుడు, నటుడు అభిషేక్ బచ్చన్. సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్లో చాలా కష్టపడ్డాను. నటుడిని అవ్వాలన్న కోరిక నాలో బలంగా ఉండేది. కానీ రెండేళ్లపాటు చాలామంది డైరెక్టర్లు నాతో సినిమా చేయడానికి వెనుకడుగు వేశారు. అదే సమయంలో నాన్న(అమితాబ్ బచ్చన్) ఓ బిజినెస్ ప్రారంభించి ఉన్నదంతా పోగొట్టుకోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. నేను, నా స్నేహితుడు కలిసి సొంతంగా కథ రాసుకోవాలనుకున్నాం.. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీన పరిస్థితి.. ఒకరోజు నాన్న.. ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమానికి రమ్మన్నాడు. ఈవెంట్‌కు ఎలా రెడీ అయి వెళ్లాలని అందరూ కొన్ని నెలల ముందే ప్రిపేర్ అవుతుంటారు. పైగా 20 ఏళ్ల క్రితం ఎవరూ ఉచితంగా దుస్తులు ఇచ్చేవారు కాదు. కొనుక్కున్న వాటినే వేసుకుని వెళ్లాలి. సాయంత్రం షూటింగ్ లాంటివి పెట్టుకోకుండా ఇండస్ట్రీ అంతా సమయానికి అక్కడికి చేరుకుంటుంది. నేనేమో ఫంక్షన్‌కు ఏం వేసుకోవాలి? అని నాన్నను అడిగాను. ఇప్పుడిది మీకు విచిత్రంగా అనిపించవచ్చేమో కానీ ఆ సమయంలో మాత్రం పరిస్థితి అంత దారుణంగా ఉంది. నా దగ్గర సరైన బట్టలు లేవు. కొనుక్కునే స్థోమత లేదు ఆర్థిక కష్టాల వల్ల కొనుక్కునేంత స్థోమత కూడా లేకపోయింది. ఫార్మల్ డ్రెస్ లేదు, జీన్స్-టీషర్ట్ వేసుకుని వెళ్తే బాగోదు. మా సోదరి పెళ్లికి కొన్నేళ్ల క్రితం కొనుక్కున్న డ్రెస్ ఉంటే అదే వేసుకెళ్లాను' అని చెప్పుకొచ్చాడు అభిషేక్. కాగా ఈ ఫంక్షన్లో బార్డర్ సినిమాకుగానూ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న జేపీ దత్తా.. అభిషేక్‌ను చూసి తనతో సినిమా తీయాలనుకున్నాడు. రిఫ్యూజీ మూవీతో అభిషేక్‌ను వెండితెరకు హీరోగా పరిచయం చేశాడు. స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కు సైతం ఇదే తొలి సినిమా! అభిషేక్ చివరగా ఘూమర్ సినిమాలో కనిపించాడు. చదవండి: కొత్త వ్యాపారం మొదలుపెట్టిన మనోజ్- మౌనిక.. దేశం నలుమూలలా తిరిగి.. -
ఆనంద్ పండిట్ 60వ పుట్టినరోజు వేడుకలో బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
ప్రీమియర్ లీగ్‌లో అమితాబ్ బచ్చన్.. ఏకంగా ముంబై జట్టునే!
బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ క్రీడల్లోనూ అడుగుపెట్టారు. సీనియర్ నటుడు సడన్‌గా ఆటల్లోకి ఎలా వచ్చారని అనుకుంటున్నారా? అయితే అమితాబ్ ఎంట్రీ ఇచ్చింది ఆటగాడిగా కాదండి.. ఆయన కూడా ప్రముఖ క్రికెట్ లీగ్‌లో జట్టును కొనుగోలు చేశారు. టెన్నిస్ బాల్ టీ10 క్రికెట్ టోర్నీ ఇండియన్ స్ట్రీట్ ప్రిమియర్ లీగ్‌లో అమితాబ్ ముంబయి టీమ్‌ను దక్కించున్నారు. ఈ టోర్నీ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 9 వరకు ముంబయిలో తొలి సీజన్ జరగనుంది. హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ జట్లు ఈ లీగ్‌లో బరిలో ఉన్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. బాలీవుడ్ హీరోలు అక్షయ్‌కుమార్, హృతిక్ రోషన్ కూడా ఇటీవలే ఐఎస్పీఎల్ జట్లను కొనుగోలు చేశారు. శ్రీనగర్‌ను అక్షయ్.. బెంగళూరును హృతిక్ తీసుకున్నారు. -
ముచ్చటగా మూడోసారి.. మాస్ మహారాజా మూవీ టైటిల్ ఫిక్స్!
మాస్ మహారాజా రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మిరపకాయ్ వంటి మాస్ హిట్‌ను అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌తో పాటు పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని రవితేజ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. హరీశ్- రవితేజ కాంబోలో తెరకెక్కుతోన్న మూడో చిత్రమిది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపించాయి. తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ ఖరారు చేశారు. నామ్ తో సునా హోగా అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. పోస్టర్లో రవితేజ కూర్చుని స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘షాక్’, ‘మిరపకాయ్’ సినిమాల వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే నటించనున్నారు. ఈ విషయాన్ని మాస్ మహారాజాతో క్లాస్ మహారాణి అంటూ చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. #MrBachchan Naam tho suna hoga 😉 Honoured to play the character with the name of my favourite @SrBachchan saab 🤗🙏@harish2you @peoplemediafcy @TSeries pic.twitter.com/CHMOvgh3bo — Ravi Teja (@RaviTeja_offl) December 17, 2023 -
నిమిషం యాడ్ కోసం రూ. 10 కోట్లు.. రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. దీంతో అతని రెమ్యునరేషన్‌తో పాటు పలు యాడ్ రెమ్యునరేషన్ కూడా పెరిగింది. సుకుమార్ డైరెక్ట్ చేసి పుష్ప నుంచి పార్ట్ -2 త్వరలో విడుదల కానుంది. 2024 కొత్త ఏడాదిలో బన్నీ పేరు మరోసారి పాన్ ఇండియా రేంజ్లో వెలిగిపోవడం ఖాయం. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం యాడ్స్ రూపంలో ప్రమోట్ చేయాలని కోరడం సహజం. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఒక మద్యం కంపెనీకి చెందిన తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలని కోరాయాట. అందుకు సుమారు రూ. 10 కోట్లు ఆఫర్ చేశాయట. కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్‌లో కనిపిస్తే చాలని కోరాయట.. కానీ ఈ డీల్‌ను అల్లు అర్జున్ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం. మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర దుర్వ్యసనాల యాడ్స్లలో నటిస్తే సమాజంలో చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అయన చెప్పారట.. అందు కోసం ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తాను చేయనని చెప్పి పంపించేశాడట బన్నీ. ప్రజలకు హానికరం చేసే వస్తువులను ప్రమోట్ చేసి వాటి ద్వారా వచ్చే డబ్బు తనకు అవసరం లేదని ఆయన ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. సరోగేట్ యాడ్స్ నిషేధం మద్యం, సిగరెట్స్, గుట్కా తదితర హానికరమైన వాటిని సరోగేట్ యాడ్స్ అంటారు. నియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే ప్రకటనల (యాడ్స్) నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలను నిర్ణయించింది. ఈ మేరకు సరోగేట్ యాడ్స్ (ప్రచారం చేయడానికి వీల్లేని ఉత్పత్తులకు సంబంధించి వాటి పేరుతోనే అదేరీతిలో ఉండే వేరే ఉత్పత్తులను చూపించడం)ని కూడా నిషేధించింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గతంలో ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీ కి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన తెలిపిన విషయం తెలిసిందే. భారతదేశంలో ఎందుకు నేరం కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం 1995 ద్వారా పొగాకు, మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తుల ప్రకటనలపై భారత్‌లో నిషేధం ఉంది. దీంతో సెలబ్రీటిలతో ఈ సరోగేట్ ప్రకటనలు పుట్టుకొచ్చాయి. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తుల ప్రకటనలు ఉండకూడదని భారత ప్రభుత్వం నిర్ణయించింది. టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, సెక్షన్ 5 అనే చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. సిగరెట్లు, పొగాకు వంటి హానకరమైన ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించ కూడదని ఆ చట్టం చెబుతుంది. దీంతో ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడం లేదు. -
భర్త, మామతో ఈవెంట్‌కు వెళ్లిన ఐశ్వర్య రాయ్.. కాకపోతే!
బాలీవుడ్ దంపతులు ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ ఈ మధ్య ఎక్కువగా బయట కలిసి కనిపించడం లేదు. ఐశ్వర్య పుట్టినరోజున కూడా చాలా లేట్‌గా బర్త్‌డే విషెస్ తెలిపాడు అభిషేక్. అది కూడా ఏదో పైపైనే చెప్పినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు బచ్చన్ కుటుంబంలో ఏదో జరుగుతోందని అనుమానపడ్డారు. ఈ అనుమానాలు ఈమధ్య మొదలైనవి కాదు. కొన్నేళ్ల నుంచే వీళ్లు విడిపోతున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సదరు పుకార్లను కొట్టిపారేశాడు అభిషేక్. ఇటీవల పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైన సమయంలోనూ ఐశ్వర్యను చూసి గర్వపడుతున్నానని ట్వీట్ చేశాడు. ఇంటి నుంచి బయటకు? అయినప్పటికీ ఈ రూమర్స్ ఆగిపోలేదు. పైకి ఏదో కవరింగ్ చేస్తున్నారు కానీ అసలు విషయం వేరే ఉందని అనుమానిస్తున్నారు. ఇకపోతే ఈసారి ఏకంగా ఐశ్వర్య.. తన కూతురిని తీసుకుని బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అత్తగారు జయాబచ్చన్‌తో చాలాఏళ్లుగా మాటలు లేవని, భర్తతోనూ విభేదాలు రావడంతో ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నట్లు సదరు వార్తల సారాంశం. ఈ క్రమంలో అభిషేక్- ఐశ్వర్య కలిసి కనిపించారు. వీరిద్దరూ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈవెంట్‌కు చెరో కారులో.. అయితే ఐశ్వర్య, తన తల్లి బృంద్య రాయ్‌తో కలిసి ఓ కారులో రాగా.. అభిషేక్, తన తండ్రి అమితాబ్ బచ్చన్‌తో కలిసి మరో కారులో ఈవెంట్‌కు హాజరయ్యారు. కారు దిగగానే ఐశ్వర్య.. బిగ్‌బీని పలకరించింది. అటు అభిషేక్.. భార్యపై చేయి వేసి ఆమెతో సరదాగా మాట్లాడుతూ లోనికి వెళ్లిపోయాడు. ఈవెంట్లోనూ బిగ్‌బీ, అభిషేక్, ఐశ్వర్య సరదాగా స్టెప్పులు వేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత భర్తతో పాటు అదే కారులో వెళ్లింది ఐశ్వర్య. ఇది చూసిన జనాలు ఇదేం ట్విస్టు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by AISHVERSE 💌 (@theaishverse) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: అపర్ణకు కంగ్రాట్స్ చెప్పిన నయనతార.. ఎందుకో తెలుసా..? -
ఇన్స్టాగ్రామ్ పోస్టులతోనే... కోట్లు సంపాదించింది!
నటి, సింగర్, టిక్ టాక్ స్టార్, యాంకర్ అయిన 'జన్నత్ జుబేర్ రహ్మానీ' పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ పరిచయం లేకపోవచ్చు కానీ బాలీవుడ్లో మాత్రం ఈ పేరు తెలియని వారుండరు.. కేవలం ఏడేళ్ల వయసులో మొదట బుల్లితెరపై కనిపించిన జన్నత్ జుబేర్ రహ్మానీ కొద్దిరోజుల్లోనే సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2009లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ... 2011లో కలర్స్ టీవీలో 'ఫుల్వా'తో బుల్లి తెరపై మెరిసింది. అప్పటి నుంచి పలు సీరియళ్లతో పాటు లైవ్ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్, సాంగ్ ఆల్బమ్స్‌లో తనదైన మార్క్ చూపించి నెట్టింట ఒక ఊపు ఊపేసింది. 2018లో బాలీవుడ్లో అడుగుపెట్టి 'హిచ్కీ' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. రాణీ ముఖర్జీ స్టూడెంట్స్‌లో ఒకరిగా నటించి ఆపై.. నటిగా కొనసాగుతూనే సింగర్‌గా, వాయిస్ ఆర్టిస్ట్‌గా, టిక్ టాక్ స్టార్‌గా ఇలా ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయో అన్నింటిలో తన సత్తా ఎంటో చూపింది ఈ ముంబై బ్యూటీ. ఇండియాలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్‌లను కూడా తన క్రేజ్‌తో వెనక్కి నెట్టేసింది. అంతలా బాలీవుడ్లో తన ప్రభావం చూపింది. ప్రస్తుతం 22 ఏళ్ల వయసున్న ఈ బ్యూటీకి కేవలం ఇన్‌స్టాలో పోస్టులు ద్వారానే దాదాపు రూ.25 కోట్లకు పైగానే సంపాదిస్తోంది. ముంబైలో విలాసవంతమైన ఇల్లు, సుమారు రూ. 3కోట్ల లగ్జరీ కారుతో పాటు తన చుట్టూ ఎప్పుడు సేవకులు.. ఇలా బాలీవుడ్లో ఒక సెన్సేషన్‌గా మారిపోయింది. బాలీవుడ్ నుంచి పంజాబి చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అక్కడ తన గాత్రంతో విపరీతంగా ఆటకట్టుకుంది. మరో వైపు వెండితెరపై ప్రత్యేకమైన పాత్రలలో కనిపిస్తూ అక్కడా దుమ్మురేపుతుంది. ఆమె టాలెంట్ అంతే అనుకుంటే పొరపాటే.. 'తు ఆషికి, ఖత్రోన్ కే ఖిలాడీ, బిగ్ బాస్' వంటి రియాలిటీ షో నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. అలా తన అందం, అభినయంతో అభిమానులను కట్టిపడేసింది. పాన్ ఇండియా రేంజ్ హీరోలను కూడా వెనక్కినెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పాపులర్ ఫిగర్‌గా మారిపోయింది. అక్కడ ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య అక్షరాల 48 మిలియన్లు. దీంతో ఆమె చేస్తున్న పోస్ట్‌ల ద్వారా ఏడాదికి రూ. 25 కోట్లు అర్జిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్ ఖాన్ ఫాలోవర్ల సంఖ్య 42 మిలియన్లు కాగా, అమితాబ్‌కు 38 మిలియన్లు ఉన్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న 41 మిలియన్లు, అల్లు అర్జున్ 24 మిలియన్లు, జాన్వీ కపూర్ 22 మిలియన్లు మాత్రమే ఉన్నారు. దీనిని బట్టి ఈ బ్యూటీ టాలెంట్ ఏంటో ఈ పాటికే అర్థమైంది కాదా..! సోషల్ మీడియాలో ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న జన్నత్.. మీడియా,ఎంటర్టైన్మెంట్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ కేటగిరీల్లో ఫోర్బ్ 30 జాబితాలో ఆమె చోటు దక్కించుకుంది. View this post on Instagram A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) -
అభిమానికి వీడియో కాల్ చేసి సర్ప్రైజ్ చేసిన రష్మిక!
పుష్ప సినిమాతో రష్మిక మందన్నా నేషనల్ క్రష్‌గా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అందుకే రష్మికకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారిలో ప్రమోద్ భాస్కర్ కూడా ఒకరు. రష్మికకు అతను వీరాభిమాని. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతుంటాడు. అమె సినిమాలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటాడు. అంతేకాదు ఎక్స్(ట్విటర్)వేదికగా రష్మికకు ప్రపోజ్ కూడా చేశాడు. రష్మిక కూడా ప్రమోద్ ట్వీట్స్‌కి ఫన్నీ రిప్లైలు ఇచ్చింది. తాజాగా అతనితో వీడియో కాల్ మాట్లాడి సర్ప్రైజ్ చేసింది. ఇదంతా బిగ్‌బీ అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘ కౌన్ బనేగా క్రోర్‌పతి’షో వేదికగా జరిగింది. బిగ్‌బీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా క్రోర్‌పతి రియాల్టీ షోలో తాజాగా ప్రమోద్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని కోరికను అమితాబ్‌తో పంచుకున్నాడు. రష్మిక అంటే చాలా ఇష్టమని, తన సినిమాలన్నీ చూశానని.. ఆమెకు ప్రపోజ్ కూడా చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో బిగ్‌బీ రష్మికకు వీడియో కాల్ చేసి..ప్రమోద్‌తో మాట్లాడించాడు. తన ఫేవరేట్ హీరోయిన్ వీడియో కాల్ లో మాట్లాడేసరికి ప్రమోద్ సర్ ప్రైజ్ అయ్యారు. ఆమెను ఎంతగానో అభిమానిస్తున్నాని, పర్సనల్ గా కలిసి మాట్లాడాలని ఉందని ప్రమోద్ అడగగా..రష్మిక తప్పకుండా మీట్ అవుదామని చెప్పింది. తన అభిమాని కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో పాల్గొనడం పట్ల రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అమితాబ్ రష్మికపై ప్రశంసల జల్లు కురిపించాడు. రష్మిక నటించిన ప్రతి సినిమాను చూస్తున్నానని.. యానిమల్‌లో ఆమె నటన చాలా బాగుందని ప్రశంసించాడు. అబితాబ్ తన నటనను మెచ్చుకోవడం పట్ల రష్మిక ఆనందం వ్యక్తం చేసింది. I feel like am literally living my dream moments right now still not able to believe that one day I will be on TV and will get a chance to talk with My Crush since 2016 @iamRashmika Ji Mam,I wish I will meet her in person one day. 1/2#JaiHoKBC pic.twitter.com/lLoiUdYQJ8 — Pramod Bhaske 🇮🇳 (@AlwaysPramod9) December 9, 2023 -
కేబీసీలో చిచ్చరపిడుగుకు కోటి రూపాయలు
ప్రముఖ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) సీజన్ 15లో ప్రస్తుతం ‘కేబీసీ జూనియర్స్ వీక్’ జరుగుతోంది. చివరి ఎపిసోడ్లో హర్యానాలోని మహేంద్రగఢ్ నివాసి మయాంక్ హాట్‌సీట్‌పై కూర్చున్నాడు. ఈ 12 ఏళ్ల కంటెస్టెంట్‌తో హోస్ట్ బిగ్ బీ అమితాబ్ పలు విషయాలను ముచ్చటించారు. అమితాబ్ బచ్చన్ ఈ ఎపిసోడ్‌లోని మొదటి ప్రశ్నను అడిగారు. దీనికి సమాధానం చెబితే రూ. 6,40,000 గెలుచుకోవచ్చు. 2023లో వాషింగ్టన్ డీసీలో ప్రారంభించిన ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఎవరి పేరు మీద ఉంది? అని అడిగారు. దీనికి మయాంక్ సరైన సమాధానం ఇస్తూ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్పాడు. తరువాతి ప్రశ్నలకు మయాంక్ సరైన సమాధానాలు చెబుతూ వచ్చాడు. గేమ్ సమయంలో మయాంక్ తాను పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నదీ ఇంకా తనకు తెలియడం లేదని చెప్పాడు. తరువాత మాయాంక్ ‘మీరు చిన్నప్పుడు ఏం కావాలని అనుకున్నారు?’ అని అడిగాడు. అందుకు అమితాబ్ బదులిస్తూ ‘చిన్నప్పుడు ఎక్కువగా గిల్లీ దందా ఆడేవాళ్లం. అది తప్ప మరేదీ మా మనసులోకి రాలేదు’ అని చెప్పారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను కోటి రూపాయల ప్రశ్న అడిగాడు. కొత్తగా కనుగొన్న ఖండానికి ‘అమెరికా’ అని పేరు పెట్టిన ఘనత ఏ యూరోపియన్ కార్టోగ్రాఫర్‌కు దక్కుతుంది? అడి అడిగారు. దీనికి సమాధానం చెప్పేందుకు మయాంక్ ఒక ఒక నిపుణుడి సహాయం తీసుకుని ‘మార్టిన్ వాల్డ్సీముల్లర్’అని సరైన సమాధానం చెప్పాడు. సీజన్ 15లో భారీ మొత్తాన్ని గెలుచుకున్న తొలి జూనియర్ కోటీశ్వరుడు మయాంక్. ఈ విషయాన్ని అమితాబ్ షోలో ప్రకటించారు. ఆ సమయంలో మయాంక్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. తరువాత అమితాబ్.. మయాంక్‌ను రూ. 7 కోట్ల ప్రశ్న అడిగారు. దీనికి మయాంక్ సమాధానం చెప్పలేక గేమ్ ముగించి, కోటి రూపాయలు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు -
అమితాబ్ కూతురికి బహుమతిగా కోట్లు విలువ చేసే బంగ్లా!
నటనకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నాడు బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. 80 ఏళ్లు దాటినా కుర్రాళ్లకంటే హుషారుగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అంతేకాదు పాపులర్ టీవీ షో ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’కి హోస్ట్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ఇలా వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీకి మాత్రం దూరంగా ఉండలేరు బిగ్‌బీ. బాధ్యత గల తండ్రిగా ఇప్పటికీ తన పిల్లల బాగోగులను చూసుకుంటున్నారు. (చదవండి: పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు) కొడుకుతో పాటు కూతురు శ్వేతా బచ్చన్‌పై కూడా అమితాబ్‌కి ఎనలేని ప్రేమ. పెళ్లి చేసి అత్తారింటికి పంపించినా.. ఇప్పటికీ ఆమెకు ఆర్థికంగా ఆదుకుంటూనే ఉంటాడు. తాజాగా తన కూతురుకి ఖరీదైన బహుమతిని అందించి, తండ్రి ప్రేమను చాటుకున్నాడు. తనకెంతో ఇష్టమైన జుహు బంగ్లా ‘ప్రతీక్ష’ను కూతురు శ్వేతా బచ్చన్‌కు గిఫ్ట్‌గా అందించారు. దీని విలువల దాదాపు 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. (చదవండి: అన్నదమ్ముల మధ్య ఈగో, డబ్బు సమస్యలు ఉండొద్దు: మనోజ్) ముంబైలోని అంత్యంత ఖరీదైన జై జుహు ప్రాంతంలో అమితాబ్ బంగ్లా ‘ప్రతీక్ష’ ఉంది. ఈ బంగ్లా అంటే అమితాబ్‌కు చాలా ఇష్టం. తన పేరెంట్స్‌తో కలిసి అమితాబ్ ఇక్కడే ఉండేవాడు. అంతేకాదు అభిషేక్, ఐశ్వర్యల పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఇది మొత్తం 674 చదరపు మీటర్లు, 890.47 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండు ప్లాట్స్‌లో విస్తరించి ఉంది. అమితాబ్ ఫ్యామిలీ ప్రస్తుతం జుహులో ఉన్న జల్సా బంగ్లాలో నివసిస్తోంది. View this post on Instagram A post shared by S (@shwetabachchan) -
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్‌ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్‌గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్‌లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్‌లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్‌లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్‌గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్‌లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్‌లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్‌ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్‌కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు చేతిలో ఉన్న బ్యాట్‌ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్‌ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్‌ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్‌కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్‌ను అన్ని మ్యాచ్‌లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ను పాస్‌కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్‌కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్‌కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లొద్దంటూ బిగ్‌బీకి స్వీట్ వార్నింగ్
ప్రస్తుతం యావత్ భారత్ కోరుకుంటోంది ఒక్కటే.. వరల్డ్ 'కప్పు'. ఇప్పటికే ఒక్కో ఆట గెలుచుకుంటూ వచ్చి ఫైనల్లో అడుగుపెట్టింది భారత క్రికెట్ జట్టు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుతో భారత్ తలపడనుంది. కోట్లాది మంది ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్ గెలుపు కోసం శతకోటి ప్రార్థనలు చేస్తున్నారు. నేను చూడకపోతే భారత్ గెలిచింది ఈ క్రమంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మాత్రం ఈ మ్యాచ్ చూడటానికి రాకూడదంటూ కొందరు నెటిజన్లు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రెండు రోజుల క్రితం జరిగిన సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్స్తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీనిపై అమితాబ్ ఎక్స్(ట్విటర్)లో స్పందిస్తూ.. 'నేను చూడకపోతే ఇండియా మ్యాచ్ గెలిచింది' అని రాసుకొచ్చాడు. ఇంకేముంది.. అసలే సెంటిమెంట్లను విపరీతంగా ఫాలో అయ్యే జనాలు బిగ్‌బీని ఫైనల్‌కు రావొద్దని కోరుతున్నారు. ఈసారి కూడా మ్యాచ్ చూడొద్దు.. ప్లీజ్ ఆయన మ్యాచ్ చూడకపోతే భారత్ గెలుపు తథ్యమని భావిస్తున్న కొందరు.. 'ఈ ఒక్కసారి మాకోసం త్యాగం చేయండి', 'ఆదివారం జరిగే ఫైనల్స్‌కు దూరంగా ఉండండి.. లేదంటే మేము మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లి బంధించేస్తాం..' అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన బిగ్‌బీ.. 'ఇప్పుడు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా' అని మరో ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు మరింత కంగారుపడుతూ ఆ పని మాత్రం చేయొద్దు.. అంటూ ఏకంగా దండాలు పెట్టేస్తున్నారు. మరి ఫైనల్స్‌కు బిగ్‌బీ వెళ్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. T 4831 - when i don't watch we WIN ! — Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023 T 4832 - अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ ! — Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023 చదవండి: యాంకర్ సుమ ప్రశ్నలు.. కౌంటర్లిచ్చిన హీరో.. పరువు పాయే.. -
సుబ్రతా రాయ్‌కు అమితాబ్‌తో దోస్తీ ఎలా కుదిరింది?
సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతా రాయ్ మంగళవారం అర్థరాత్రి కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో మరణించారు. 75 ఏళ్ల వయసులో ఆయన ప్రపంచానికి వీడ్కోలు పలికారు. భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన సుబ్రతా రాయ్ విభిన్న వ్యాపార ప్రయోజనాలతో కూడిన సహారా ఇండియాను నెలకొల్పారు. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సుబ్రతా రాయ్‌ను ‘సహారాశ్రీ’ అని కూడా పిలుస్తుంటారు. ఆయనకు బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో విడదీయరాని స్నేహం ఉందని చెబుతారు. అమితాబ్ బచ్చన్ వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయినప్పుడు సుబ్రతా రాయ్ ‘బిగ్‌బీ’కి సహాయం అందించారు. వీరి స్నేహం ఇక్కడి నుంచే మొదలైంది. వీరిద్దరినీ సమాజ్‌వాదీ పార్టీ దివంగత నేత అమర్ సింగ్ దగ్గర చేశారని చెబుతారు. ఈ ముగ్గురూ మంచి స్నేహితులుగా మెలిగారు. దీనికి గుర్తుగా పలు ఫొటోలు ఇంటర్నెట్లో కనిపిస్తాయి. సుబ్రతా రాయ్ సహారా మేనకోడలు శివాంక వివాహం 2010లో జరిగింది. ఈ వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమయంలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ సుబ్రతా రాయ్ సహారా కలిసి కనిపించారు. ఇప్పుడు సుబ్రతా రాయ్ సహారా మన మధ్య లేరు. బుధవారం(నేడు)లక్నోలో సుబ్రతా రాయ్ సహారా అంత్యక్రియలు జరగనున్నాయి. ఇది కూడా చదవండి: సుబ్రతా రాయ్ కుటుంబం విదేశాల్లో ఎందుకు ఉంటోంది? -
అల్లు అర్జున్ డాన్స్ పై అమితాబ్ కామెంట్స్ వైరల్
-
'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్ బీ కామెంట్స్ వైరల్!
పుష్ప సినిమా పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఆ డైలాగ్ ఒక్కటే. అదే గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదేలే అని చెప్పడం. ఈ డైలాగ్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎక్కువసార్లు ప్రదర్శించి ఉంటాడు. అంతలా ఫేమస్ అయింది పుష్ప సినిమా డైలాగ్. కానీ అదే రేంజ్లో వైరలైన మరో సీన్ కూడా ఈ చిత్రంలో ఒకటి ఉంది. ఇప్పుడు దానిపైనే మన బిగ్ బీ అమితాబ్ క్రేజీ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందామా? ఈ సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు స్టెప్పులు వేయని వారు ఉండరు. అంతలా ఫేమస్ అయిన ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముగ్ధులైపోయారు. ఈ పాటలోని అల్లు అర్జున్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌లో చెప్పును వదిలేసి డ్యాన్స్ వేసే స్టెప్పును చాలామంది ట్రై చేశారు. తాజాగా ఆ సాంగ్ గురించే అమితాబ్ ప్రశ్న వేశారు. ఈ సందర్బంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్పపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్. ఈ సందర్భంగా పుష్ప చిత్రం గురించి, అందులోని శ్రీవల్లీ పాటకు బన్నీ వేసిన స్టెప్పు గురించి మాట్లాడుతూ.. 'పుష్ప మూవీ నిజంగా అద్భుతం. ఇంకా శ్రీవల్లి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. హీరో డ్యాన్స్ చేస్తూ చెప్పు వదిలేసినా సీన్ కూడా.. ఇంతలా వైరల్ కావడం నా కెరీర్లో ఇదే మొదటిసారి చూశా. ఆ స్టెప్పును చాలా మంది అనుకరించారు. ఎక్కడ పడితే అక్కడ ఆ స్టెప్ వేసి.. చెప్పులు వదిలేసి మరీ వేసుకునే వారు' అంటూ అమితాబ్ నవ్వారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలోనే పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. GOAT praises GOAT. 🧎@SrBachchan @alluarjun #Pushpa pic.twitter.com/J5yPkgDq9a — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) November 8, 2023 -
రష్మిక మందన్న ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన మొదటి హీరో
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో పెద్ద చర్చకు దారితీసింది. రష్మికదిగా చెబుతున్న ఓ అభ్యంతకరమైన వీడియో క్లిప్ ఇంటర్నెట్లో అప్లోడ్ అయిన నిమిషాల్లోనే వైరల్ అయింది. నిజానికి అందులో ఉన్నది బ్రిటీష్-ఇండియన్ సోషల్ మీడియా పర్సనాలిటీ జారా పటేల్. కానీ కొందరు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. ఇలాంటి పని చేసిన వారిని గుర్తించి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. (ఇదీ చదవండి: ఆ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తానంటే: అనన్య నాగళ్ల) కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వ్యాఖ్యానించారు. తన ఎక్స్ (ట్విటర్) ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తప్పవని తెలిపారు.కొందరు దుండగులు రష్మిక ముఖాన్ని మరో యువతి వీడియోగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై చాలా మంది మండిపడుతున్నారు. నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయని చిన్మయి శ్రీపాదతో పాటు తాజాగా టాలీవుడ్ నుంచి మొదటగా హీరో నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు. ఈ దుశ్చర్యపై చైతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. బాధితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలి. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలి' అంటూ అంతకుముందు రష్మిక చేసిన ట్వీట్‌కు ఆయన ట్యాగ్ చేశారు. తనకు మద్దతుగా నిలిచిన చైతూకి రష్మిక కృతజ్ఞతలు తెలిపింది రష్మిక. ఇలాంటి మార్ఫింగ్ వీడియోల వల్ల సమాజంలో ఎంతో మంది అమ్మాయిలు ఇబ్బందలకు గురౌతున్నారు. ఇది చాలా భయానకమైన చర్య అంటూ తెలిపిన రష్మిక.. తనకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తోంది. It’s truly disheartening to see how technology is being misused and the thought of what this can progress to in the future is even scarier. Action has to be taken and some kind of law has to be enforced to protect people who have and will be a victim to this .Strength to you. https://t.co/IKIiEJtkSx — chaitanya akkineni (@chay_akkineni) November 6, 2023 -
ఆస్తులన్నీ పోగొట్టుకుని దీనస్థితిలో అమితాబ్.. నలుగురిలో నిలబెట్టిన ధీరూభాయ్..
ధీరూబాయ్ అంబానీ సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ధీరుడు. పెట్రోల్ బంకులో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ 62వేల కోట్లను సంపాదించి కార్పొరేట్ మహా సామ్రాజ్యానికి అధిపతి. ఓ మామూలు మసాలా దీనుసులు అమ్ముకునే డీలర్‌గా పనిచేసే ధీరూభాయ్.. నిరంతర కృషితో ఎన్నో ఎదురుదెబ్బలు ఓర్చుకుంటూ తన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. బిజినెస్ టైకూన్‌గా అవతరించారు. రిలయన్స్ అనే సంస్థను ప్రారంభించారు. ఇప్పుడా సంస్థ ప్రపంచంలో అతి విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. ఆయన ఇచ్చిన స్పూర్తి నేటి తరాలే కాదు.. రేపటి తరాలకు కూడా ఆదర్శం. అలాంటి బిజినెస్ టైకూన్ ధీరూభాయ్ అంబానీ గురించి బిగ్ బి అమితాబ్ తన జీవితంలో ఎదురైన సంఘటనని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురవుతారు. ఇంతకి ఏంటా సంఘటన! వులి దెబ్బ పడనిదే శిల శిల్పం కాదు. కొలిమిలో కాలనిదే ఆ బంగారానికి కాంతి రాదు. అమితాబ్ జీవితం అంతే. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే గాని ఆయనకు బిగ్ బి బిరుదు రాలేదు. సాదాసీదా బచ్చన్.. సాహెబ్ (దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ తీసుకునే) స్థాయికి రావడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. అది చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుందేమో. అలా సూపర్ స్టార్‌గా వెలిగిపోతున్న అమితాబ్ బిజినెస్‌లోకి దిగారు. బచ్చన్‌కు వరుస సినిమాలు తీయాలని 1995లో ఏబీసీఎల్ కార్పొరేషన్ ను స్థాపించారు. ఏబీసీఎల్ అంటే అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా చేయాలని అనుకున్నారు. అలా రూ.22 కోట్లతో కెనరా బ్యాంక్ వద్ద లోన్ తీసుకుని 150 మంది ఉద్యోగులతో ఏబీసీఎల్ ను ప్రారంభించారు. ఏబీసీఎల్ ప్రొడక్షన్లో 15 సినిమాలు వచ్చాయి. ఒక్క ఏడాదిలో ఆ సినిమాలకు పెట్టిన పెట్టుబడి రూ.60 కోట్లు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో బిజినెస్‌ను విస్తరించాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం.. భారత్ లోని బెంగళూరులో తొలిసారి మిస్ వరల్డ్ ఈవెంట్ ను నిర్వహించారు. అప్పట్లో మిస్ వరల్డ్ పోటీలు మనదేశంలో జరగడం ఫస్ట్ టైం. కానీ ఇది చాలా రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే? అప్పట్లో భారత్‌లో ఆడవాళ్ల గురించి ఇలాంటి ఈవెంట్లు చేయకూడదనే ఆందోళనలు జరిగాయి. కాబట్టే ఈ ఈవెంట్ కోసం ఒక్క స్పాన్సర్ ముందుకు రాలేదు. ఈ ఈవెంట్‌కి బచ్చన్ సాబ్ పెట్టింది రూ.14 కోట్లపై మాటే. భారత్‌లోని ఆందోళనలతో మిస్ వరల్డ్ ఈవెంట్ భారత్ నుంచి సౌతాఫ్రికాలో రూ.34 కోట్లు పెట్టి మరి నిర్వహించారు. దీని వల్ల ఏబీసీఎల్ కి రూ.20 కోట్లు లాస్ వచ్చింది. అయితే, ఈ నష్టాల్ని పూడ్చాలంటే ఏబీసీఎల్లో ఏదో ఒక మంచి హిట్ సినిమాలను తెరకెక్కించారు. రెండు సినిమాల్ని తీశారు. అవి రెండు కాస్త బిలో యావరేజ్‌గా ఆడాయి. అమితాబ్‌తో మరో సినిమా తీస్తే నష్టాల నుంచి బయటపడొచ్చని మృత్యుదాత అనే సినిమానికి తెరకెక్కించారు. కానీ ఊహించని విధంగా ముందు తీసిన రెండు సినిమాల కంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరోవైపు నార్త్ అమెరికాలో కొన్ని ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు అమితాబ్ అక్కడా ఏబీసీఎల్‌ను ప్రారంభించారు. కానీ సరైన ప్లానింగ్ లేక ఏబీసీఎల్లో బుకింగ్స్ చేసే వారు కాదు. అలా ఏబీసీఎల్కి ఇటు సినిమాలు, అటు ఈవెంట్స్‌లో కలిసి రాకపోవడం వల్ల, బ్యాంక్‌కు కట్టాల్సిన బాకీలు ఇలా మొత్తం కలుపుకుని రూ.90 కోట్లతో అప్పులు పాలయ్యారు. దాంతో బచ్చన్‌కి ఏం చేయాలో అర్ధం కాలేదు. ఏబీసీఎల్కి ఫండ్స్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఉద్యోగులకు ఇచ్చే శాలరీ కూడా సరిపోయేది కాదు. చేసేది లేక చివరికి 1999లో ఏబీసీఎల్‌ను మూసేశారు. అదే సమయంలో ధీరూభాయి అంబానీ .. అమితాబ్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ను బచ్చన్ గుర్తు చేసుకున్నారు. ‘‘ జీవితంలో ఒకానొక సమయంలో నేను బ్యాంక్ రఫ్ట్ అయిపోయా దివాళ తీశాను. నేను స్థాపించిన కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది. కోటానుకోట్లు అప్పులయ్యాయి. నా బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా అయ్యింది. డబ్బు సంపాదించే మార్గాలు మూసుకుపోయాయి. ప్రభుత్వ అధికారులు సోదాలు చేశారు. ఈ విషయం ధీరూ భాయికి తెలిసింది. ఎవరినీ సంప్రదించకుండా తన చిన్న కొడుకు, నా మిత్రుడు అనిల్ అంబానీతో ఇలా అమితాబ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. కొంత డబ్బు ఇమ్మని పంపించాడు. అప్పుడు అనిల్ నా ఇంటికి డబ్బుతో వచ్చాడు. ఆ డబ్బు ఎంతంటే? దాంతో కష్టాలన్నీ, టెన్షల్లు మాయం అయ్యేవి. వారి మంచి తనానికి నేను చాలా పులకించి పోయాను. అయితే వారి సహాయం మాత్రం నేను తీసుకోలేకపోయాను. భగవంతుడి దయతో నా జీవితంలో చీకటి రోజులు పోయాయి. మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీర్చగలిగాను. అలా ఓ సారి ధీరూ భాయి ఇంట్లో విదేశీ ప్రతినిధులతో ఒక పార్టీ పెట్టారు. నన్ను కూడా పిలిచారు. ధీరూ భాయి అందరి మధ్యలో కూర్చున్నారు. ఆ సమయంలో దేశ, విదేశాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థులతో వ్యాపార విషయాలు మాట్లాడుతున్నారు. నన్ను చూసి తన పక్కన వచ్చి కూర్చోమని కోరారు. నాకు కొంత వింతగా అనిపించి క్షమించండి నేను అక్కడ నా మిత్రలతో కలిసి కూర్చంటానని అన్నాను. కానీ ఆయన నన్ను కూర్చోమని మరోసారి కోరారు. దిగ్గజాలు కూర్చున్న ఆ సమయంలో నన్ను చూపిస్తూ ఈ కుర్రాడు కిందపడ్డాడు. కానీ తన స్వశక్తితో మళ్లీ నిలబడ్డాడు. అని అందరితో చెప్పాడు. అలా అనడం ఆయన నాకు ఇచ్చిన గౌరవం అనేది నన్ను ఇబ్బందుల్లో నుంచి బయట పడేయడానికి ధీరూభాయ్ నాకు ఇవ్వాలి అనుకున్న ఆర్ధిక సహాయం కన్నా ఎక్కువ అది. ఇదీ ఆయన వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం’’ అంటూ ధీరూభాయిపై ప్రశంసల వర్షం కురిపించారు. -
బై బై ముంబై
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ ముంబై షెడ్యూల్ ముగిసిందని వెల్లడించి, ఓ వర్కింగ్ స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్. ఇలా ముంబైకి బై బై చెప్పారు రజనీకాంత్. ఇక 1991లో విడుదలైన హిందీ చిత్రం ‘హమ్’ తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి 33 ఏళ్లకు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న చిత్రం ఇది. రానా, ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఓ సామాజిక అంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది. -
ఆనందం ఉప్పొంగుతోంది
రజనీకాంత్ పట్ట లేనంత ఆనందంలో ఉన్నారు. అందుకే ‘‘నా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారాయన. ఈ ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్‌తో 33 ఏళ్ల తర్వాత రజనీ స్క్రీన్ షేర్ చేసుకోవడమే. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘అంథా కానూన్ (1983), గిరఫ్తార్ (1985), హమ్’ (1991) చిత్రాల్లో నటించారు. ఇన్నేళ్ల తర్వాత వీరి కాంబినేషన్ మళ్లీ కుదింరింది. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలోనే అమితాబ్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో తాను ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘‘లైకా ప్రొడక్షన్స్‌లో నేను చేస్తున్న నా 170వ సినిమాలో నా గురువు, గొప్ప నటుడు శ్రీ అమితాబ్ బచ్చన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నాను. నా హృదయం ఉప్పొంగుతోంది’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
ఒకే సినిమాలో ఇద్దరు లెజెండరీ హీరోలు.. మూడు దశాబ్దాల తర్వాత!
జైలర్ సినిమా హిట్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి.. వివిధ భాషల స్టార్స్ జైలర్‌లో కీలక పాత్రల్లో నటించారు. చూడటానికి రెండు కళ్లలు చాలవన్నట్లుగా అనిపించింది అభిమానులకు. అందుకే ఈ సినిమా తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లోనూ బాగా ఆడింది. జైలర్ అనే కాదు మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకే ఉంటుంది. ఇకపోతే ఇద్దరు లెజెండరీ నటుల కాంబినేషన్లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుంది. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కాంబినేషన్లో మూవీ రూపొందనుంది. తలైవా 170వ సినిమాలో బిగ్‌బీ నటించనున్నాడట. ఈ విషయాన్ని రజనీకాంత్ స్వయంగా వెల్లడించాడు. 33 ఏళ్ల తర్వాత తన గురువు బిగ్‌బీతో కలిసి నటించబోతున్నట్లు పేర్కొన్నాడు. తనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్ తదితరులు నటించనున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నాడు. ఇకపోతే బిగ్‌బీ, తలైవా చివరగా 1991లో వచ్చిన హమ్ సినిమాలో కలిసి నటించారు. After 33 years, I am working again with my mentor, the phenomenon, Shri Amitabh Bachchan in the upcoming Lyca’s "Thalaivar 170" directed by T.J Gnanavel. My heart is thumping with joy!@SrBachchan @LycaProductions @tjgnan#Thalaivar170 pic.twitter.com/RwzI7NXK4y — Rajinikanth (@rajinikanth) October 25, 2023 చదవండి: రెండో భార్యకు నటుడు విడాకులు.. తొలిసారి స్పందించిన నటి! -
ప్రభాస్ 'కల్కి'తో పోలిక.. రూ.3 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు!
దసరా సందర్భంగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటితో పాటే సందట్లో సడేమియా అన్నట్లు బాలీవుడ్ నుంచి 'గణపథ్' మూవీ కూడా రిలీజైంది. ట్రైలర్ రిలీజ్ కాగానే దీన్ని ప్రభాస్ 'కల్కి'తో దీన్ని పోల్చారు. తీరా చూస్తే డిజాస్టర్ కా బాప్ అనేలా టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ అయితే ఘోరం. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) 'గణపథ్' కథేంటి? అది 2060 సంవత్సరం. ప్రపంచం రెండుగా విడిపోయుంటుంది. సిల్వర్ సిటీలో కేవలం ధనవంతులే ఉంటారు. ఇక్కడ మనుషుల కంటే రోబోలు, డ్రోన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. గరీబొంకి బస్తీలో పేదవాళ్లు మాత్రమే ఉంటారు. తమని కాపాడేందుకు గణపథ్ వస్తాడని వేయి కళ్లతో వీళ్లు ఎదురుచూస్తుంటారు. అయితే డబ్బునోళ్ల వైపు ఉన్న గణపథ్(టైగర్ ష్రాఫ్).. పేదవాళ్లవైపు ఎలా వచ్చాడు? అనేదే స్టోరీ. ఎలా ఉంది? ఈ డైరెక్టర్ ఎవడో గానీ సినిమాతో ప్రేక్షకులకు నరకం అంటే చూపించాడు. ట్రైలర్ చూసి అందరూ 'కల్కి'తో పోలికలు ఉన్నాయన్నారు గానీ అంత సీన్ లేదు. హాలీవుడ్ హిట్ మూవీస్ అయిన మ్యాడ్ మాక్స్, డ్యూన్, ఎలిసియం లాంటి సినిమాల్ని 'గణపథ్' కోసం డిటోకి డిటో దర్శకుడు కాపీ కొట్టేశాడు. అమితాబ్ లాంటి స్టార్‌ని ఒక్క శాతం కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ఇక హీరో అయితే బాడీ ఉంది కదా అని అవసరమున్నా లేకపోయినా చూపిస్తూనే పోయాడు. అది అయితే చిరాకు తెప్పించింది. ఓవరాల్ గా థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకుడు.. చివరివరకు కూర్చుంటే గ్రేట్ అనేంత డిజాస్టర్ కా బాప్, పెద్ద కళాఖండం ఈ సినిమా. ఇకపోతే తొలిరోజు రూ 2.5 కోట్లు వచ్చాయి. టైగర్ ష్రాఫ్ కెరీర్ లో ఇది చాలా తక్కువ. అలా కూడా చెత్త రికార్డ్ సెట్ చేశాడీ హీరో. (ఇదీ చదవండి: నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!) -
బిగ్‌బీకి ఐశ్వర్య బర్త్‌డే విషెస్.. జయా బచ్చన్‌ను డిలీట్ చేసిందేంటి?
సెలబ్రిటీలు ఏం చేసినా అందులో తప్పొప్పులు వెతకడానికి జనాలు సిద్ధంగా ఉంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్ ఓ పోస్ట్ పెట్టగా చాలామంది దాన్ని తప్పుపడుతున్నారు. అక్టోబర్ 11న అమితాబ్ బచ్చన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఐశ్వర్య ఒక రోజు ఆలస్యంగా మామగారికి బర్త్‌డే విషెస్ చెప్పింది. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఉండునుగాక అంటూ తన కూతురు ఆరాధ్యతో బిగ్‌బీ దిగిన ఫోటోను షేర్ చేసింది. అంతా బాగుంది కానీ ఈ ఫోటోను జూమ్ చేసి, క్రాప్ చేసి మరీ పెట్టింది. అత్తను కూడా ఫోటోలో నుంచి డిలీట్ ఈ విషయం ఎలా తెలిసిందంటే? బిగ్‌బీకి అతడి మనవరాలు నవ్య నవేలి నందా(శ్వేతా బచ్చన్ కూతురు) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్ ఫోటో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇందులో బిగ్‌బీ, జయా బచ్చన్, నవ్య, అగస్త్య, ఆరాధ్య ఉన్నారు. ఇదే ఫోటోను తీసుకున్న ఐశ్వర్య తన అత్తతో సహా అందరినీ క్రాప్ చేసి అవతల పడేసింది. బిగ్‌బీ, ఆరాధ్య మాత్రమే ఉండేలా ఎడిట్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో వదిలింది. ఇది చూసిన జనాలు ఏదో తేడా కొడుతోందని కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్యను లైట్ తీసుకున్నారా? అయితే ఆమె అభిమానులు మాత్రం అది అంత పెద్ద విషయమే కాదని కొట్టిపారేస్తున్నారు. ప్రతి ఏడాది బిగ్‌బీ, ఆరాధ్య.. వీళ్లిద్దరు ఉన్న ఫోటో మాత్రమే పోస్ట్ చేస్తుందని, అందులో భాగంగానే ఇలా చేసిందని అంటున్నారు. కాగా ఇటీవల జయా బచ్చన్, శ్వేతా బచ్చన్ పారిస్ ఫ్యాషన్ వీక్‌కు హాజరయ్యారు. ఈ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య రాయ్‌తో పాటు, నవ్య కూడా ర్యాంప్ వాక్ చేసింది. జయ, శ్వేత.. నవ్యను ఎంకరేజ్ చేస్తూ ఆమెలో ఉత్సాహాన్ని నింపారు, కానీ ఐశ్వర్యను మాత్రం లైట్ తీసుకున్నారు. అందుకే ఈసారి ఐశ్వర్య వారి ఫోటోలను కట్ చేసి కేవలం తన కూతురు మాత్రమే కనిపించేలా ఫోటో పోస్ట్ చేసిందని ఫ్యాన్స్ గెస్ చేస్తున్నారు. ఇకపోతే ఐశ్వర్య రాయ్ చివరగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో కనిపించింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)