
దిగ్గజ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు హాజరైన సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కొత్త జంటను మనసారా ఆశీర్వదించారు. జూలై 12న పెళ్లి జరగ్గా.. ఆ తర్వాత రోజు శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ సహా తదితరులు హాజరయ్యారు.
అయితే బిగ్‌బీ, తలైవా ఒకరికొకరు ఎదురుపడగానే ఆత్మీయంగా పలకరించుకున్నారు. బిగ్‌బీ షేక్ హ్యాండ్ ఇవ్వబోతే రజనీ.. ఆయన పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే అమితాబ్ వద్దని వారించి ఆయన్ను హత్తుకున్నాడు. ఇద్దరూ కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది చూసిన అభిమానులు ఒకరంటే మరొకరికి ఎంత ప్రేమ, గౌరవం అని కొనియాడుతున్నారు. శనివారం జరిగిన శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో అమితాబ్ కలర్‌ఫుల్ షేర్వాణీ ధరించగా రజనీకాంత్ వైట్ డ్రెస్‌లో కనిపించాడు.
చదవండి: సినీ దర్శకుడు ఆత్మహత్య