థియేటర్లలోకి వచ్చి రెండు వారాలు అయిపోతున్నా సరే ప్రభాస్ 'కల్కి'కి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా రూ.1000 కోట్ల గ్రాస్ దాటేసినట్లు పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఇందులో అశ్వద్థామగా నటించిన అమితాబ్ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు. ఇక సెట్‌లో ప్రభాస్ కాళ్లకు నమస్కారం చేస్తానని చెప్పడం లాంటి కామెంట్స్‌తో ఈయనపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి.
షూటింగ్ జరుగుతున్న టైంలో అమితాబ్, వాష్ రూమ్‌కి వెళ్లాలన్నా సరే తన అనుమతి తీసుకునేవారని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రమోషన్స్ టైంలో చెప్పాడు. తాజాగా దీనికి అమితాబ్ వివరణ ఇచ్చారు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. సెట్‌లో ఉన్నంత సేపు తాను ఓ పనివాడిని అయితే.. దర్శకుడు కెప్టెన్ లాంటి వాడని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: అనంత్ అంబానీ పెళ్లి.. ఆ హీరోలకు గిఫ్ట్‌గా కోట్ల విలువైన వాచీలు)
'మంచితనంగా ఉండటానికి ఇదేం ఉదాహరణ కాదు. ఎందుకంటే ఇది చాలా సాధారణ విషయం. వాష్ రూమ్‌కి వెళ్లేందుకు నేను పర్మిషన్ అడిగారని డైరెక్టర్ చెప్పారు. అవును అది నిజమే. అది అతడి సెట్, అతడి సమయం, అక్కడ అతడే కెప్టెన్. నేను కేవలం పనోడిని మాత్రమే. ఒకవేళ నేను బయటకెళ్లాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి కదా! సెట్‌కి నన్ను పిలిచింది అతడే. అందుకే అతడి చెప్పిన విషయాల్ని తూచ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నేను అదే చేశాను' అని అమితాబ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
'కల్కి' సినిమాలో అశ్వద్థామగా కనిపించి అమితాబ్.. 80 ఏళ్ల వయసులోనే యాక్షన్, ఎమోషనల్ సీన్లలో రఫ‍్ఫాడించారు. ఒకానొక సమయంలో హీరో ప్రభాస్ అయినప్పటికీ.. పార్ట్-1లో తన యాక్టింగ్‌తో అశ్వద్థామనే అసలైన హీరో అనిపించేలా యాక్టింగ్ చేశారు. ఇలా ఇంత డెడికేషన్ చూపిస్తూ డైరెక్టర్ చెప్పింది వింటున్నారు కాబట్టి ఇప్పటికీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నారేమో!
(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఆలస్యం.. మనసు మార్చుకున్న చరణ్?)
Comments
Please login to add a commentAdd a comment