'పుష్ప 2'కి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే రూ.621 కోట్ల గ్రాస్ దాటేసింది. దక్షిణాది కంటే ఉత్తరాదిలో ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్లే హిందీలోనూ రూ.200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. తెలుగు హీరోల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు కానీ బిగ్ బీ అమితాబ్.. బన్నీకి ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు.
(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)
కొన్నిరోజుల క్రితం 'పుష్ప 2' ప్రమోషన్ కోసం ముంబై వెళ్లిన అల్లు అర్జున్.. అమితాబ్ గురించి ప్రస్తావించాడు. ఆయన ఓ లెజెండ్ అని, ఈ వయసులోనూ అద్భుతంగా పనిచేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నారని అన్నాడు. ఇవి ఇప్పుడు అమితాబ్ కంటపడ్డాయి. దీంతో అల్లు అర్జున్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
'అల్లు అర్జున్ గారు.. మీ మాటలు నా మనసుని తాకాయి. నా అర్హత, స్థాయిని మించి మీరు పొగిడేస్తున్నారేమో అనిపించింది. మీ పనితనం, మీ ప్రతిభకు మేమంతా అభిమానులం. మీరు మా అందరినీ ఇన్స్పైర్ చేస్తూనే ఉండాలి. ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను' అని అమితాబ్.. బన్నీ గురించి రాసుకొచ్చారు. మరి దీనికి అల్లు అర్జున్ ఏమని రిప్లై ఇస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment