
81 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. అభిమానులకు వినోదాన్ని పంచడమే తన ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నాడు. అయితే కొందరు మాత్రం.. ఇంకా ఈ వయసులో కూడా పని చేయడం అవసరమా? విశ్రాంతి తీసుకోవచ్చుగా అని కామెంట్లు చేస్తున్నారు. వయసుపై బడ్డప్పుడు ఖాళీగా కూర్చోకుండా ఇంకా పని చేయాల్సిన అవసరమేంటని కొందరు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
నా కారణమైతే..
తాజాగా ఈ ప్రశ్నలకు బిగ్‌బీ సమాధానమిచ్చాడు. 'ఇంకా ఎందుకు పని చేస్తున్నావని ఇప్పటికీ సెట్‌లో ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు. దీనికి నా దగ్గర సమాధానమే లేదు. అయితే సినిమా అనేది నాకొక ఉద్యోగం వంటిది. చేసుకుంటూ పోతున్నాను. మీరేదైనా అనుకోండి. నా పని నేను చేసుకునే స్వేచ్ఛ ఉంది. నా కారణమైతే నేను చెప్పాను. దానికి మీరు ఏకీభవిస్తారో లేదో మీ ఇష్టం. నేనైతే చెప్పాను.
మీకేమైనా సమస్యా?
ఇసుక కోటలను నిర్మించేటప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తారు. అవి కూలిపోయినా మళ్లీ కట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈసారి మరింత ధృడంగా ఉండాలని కష్టపడతారు. అది మీ కోసం, మీ వ్యాపార సామ్య్రాజ్యం కోసం ఇష్టంగా చేస్తారు. నేనూ అలాగే ఓ సామ్య్రాజ్యాన్ని సృష్టించాను, దాన్ని నిలబెట్టుకున్నాను. అందులో ఉన్నవారి కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటాను. అందుకు మీకేమైనా సమస్యా? అని ప్రశ్నించాడు. కాగా అమితాబ్ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాలో కనిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment