
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గ్యారేజీలోకి కొత్త కారు తీసుకొచ్చాడు. ఈ మధ్యే 82వ పుట్టినరోజు జరుపుకున్న ఈయన బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండెడ్ లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఇది ఎలక్ట్రిక్ వాహనం. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటున్న ఈ కారు ధర రూ.2.03 కోట్లు విలువ చేస్తోంది. ఇకపోతే బచ్చన్‌కు కార్ల మీద మక్కువ ఎక్కువ. ఈయన తొలిసారి కొన్న కారు ఫియాట్ 1100.
కార్ల కలెక్షన్..
తన తొలి సినిమా 'సాట్ హిందుస్తానీ (1969)' సక్సెస్ తర్వాత ఫియాట్ కారు కొన్నాడు.. అది కూడా సెకండ్ హ్యాండ్‌లో! అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇండియన్ సినిమా గర్వించే స్థాయికి చేరుకున్నాడు. ఈయన గ్యారేజీలో ల్యాండ్ రోవర్ డిఫెండర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ సెవన్, లెక్సస్ ఎల్‌ఎక్స్ 570 కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా మినీ కూపర్ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment