కల్కి సినిమా అర్థం కాలేదన్నారు: అమితాబ్‌ బచ్చన్‌ | Amitabh Bachchan Says His Grandkids Roasted His Kalki 2898 AD Movie | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: నా మనవళ్లు 'కల్కి మూవీ' చూసి ఏమీ అర్థం కాలేదన్నారు!

Sep 16 2024 4:09 PM | Updated on Sep 16 2024 4:30 PM

Amitabh Bachchan Says His Grandkids Roasted His Kalki 2898 AD Movie

కొందరు హాలీవుడ్‌ సినిమాలను ఆహా.. ఓహో.. అని పొగుడుతుంటారు. మరికొందరికేమో ఆ చిత్రాలేవీ బుర్రకెక్కవు. తనది రెండో కేటగిరీ అంటున్నాడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌. కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలోని తాజా ఎపిసోడ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ త్రిషూల్‌ చౌదరి కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. అతడు టెన్షన్‌ పడటం చూసిన బిగ్‌బీ.. ఆ కంగారును పోగొట్టేందుకు త్రిషూల్‌ను హత్తుకుని తనతో మాట కలిపాడు.

అమితాబ్‌కు కౌంటర్‌
నా మనవళ్లు, మనవరాళ్ల కోసం వారితో కలిసి హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలకు వెళ్తుంటాను. కానీ ఆ సినిమాలు నాకసలు అర్థమే కావని చెప్తే వాళ్లేమన్నారో తెలుసా? అవునా, మాకు కూడా కల్కి 2898 ఏడీ మూవీ అస్సలు అర్థం కాలేదని రివర్స్‌ పంచ్‌ ఇచ్చారు అని తెలిపాడు. ఈ మాటలు విని నవ్వేసిన త్రిషూల్‌.. కల్కిలో అశ్వత్థామగా పాత్ర, పర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉన్నాయని బిగ్‌బీపై ప్రశంసలు కురిపించాడు.

సినిమా సంగతులు..
ఇకపోతే ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించిన కల్కి చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్‌ హాసన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నాగ్‌ అశ్విన​ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొట్టింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రానుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఈ మూవీతో పాటు ద ఇంటర్న్‌ సినిమా రీమేక్‌లోనూ బిగ్‌బీ నటించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement