ప్రభాస్ 'కల్కి' మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్ అంచనాల్ని భారీగా పెంచేశాయి. తాజాగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటమే దీనికి నిదర్శనం. మరోవైపు రిలీజ్ దగ్గర పడే కొద్ది మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెడుతోంది. తాజాగా టీమ్ అంతా కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ అమితాబ్ మాత్రం ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది.
'కల్కి'లో భైరవగా ప్రభాస్, అశ్వద్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఈ విషయం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ సీన్స్ గురించే అమితాబ్ మాట్లాడుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దని చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)
'నాగి.. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది, ప్రభాస్ పాత్ర ఏంటనేది చూపించేందుకు కొన్ని ఫొటోలు చూపించాడు. 'కల్కి'లో నాది ప్రభాస్‌ని కొట్ట క్యారెక్టర్ అని చెప్పాడు. ముందే చెబుతున్నా ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి. సినిమాలో నేను చేసే పనులు చూసిన తర్వాత నన్ను తిట్టుకోకండి, ట్రోల్ చేయకండి' అని అమితాబ్ అన్నాడు. దీనికి ప్రభాస్ నవ్వుతూ.. 'అయ్యో సర్, వాళ్లంతా మీ ఫ్యాన్స్ కూడా!' అని చెప్పాడు.
ఇకపోతే తెలంగాణలో బుకింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి. 8 రోజుల పాటు ఐదు షోలకు అనుమతిచ్చారు. అలానే సింగిల్ స్క్రీన్‌లో రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.100 వరకు ధర పెంచుకునేందుకు అనుమతిచ్చారు. ఉదయం 5 గంటలకే బెన్‌ఫిట్ షోలు వేసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా టికెట్ ధరల గురించి తేలాల్సి ఉంది. నేడో రేపో టికెట్ ధరల పెంపుపై జీవో వచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?)
Comments
Please login to add a commentAdd a comment