ప్రభాస్ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే కోట్లాది టికెట్స్ అమ్ముడుపోయాయి. మరిన్ని చోట్ల బుకింగ్స్ ఇంకా నడుస్తున్నాయి. మొన్నటివరకు సరిగా ప్రమోషన్ జరగలేదని బాధపడిన ఫ్యాన్స్.. ఇప్పుడొస్తున్న బజ్ చూసి తెగ సంతోషపడిపోతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ 'కల్కి' ఓ పెద్ద సవాలు ఉంది. దీన్ని దాడటం పెద్ద కష్టమేమి కాదు గానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చేస్తాడోనని అందరూ వెయిటింగ్.
(ఇదీ చదవండి: 'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్‌ఫుల్!)
ఇలా థియేటర్లలోకి వెళ్లి కూర్చుంటే అర్థమైపోవడానికి, ఎంజాయ్ చేయడానికి 'కల్కి'.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో లేదంటే లవ్ స్టోరీనో కాదు. సైన్స్ ఫిక్షన్ ప్లస్ మైథాలజీ కాంబోలో తీసిన క్రేజీ సినిమా. భూత, భవిష్యత్, వర్తమాన అంశాల్ని స్టోరీలో మిలితం చేసినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వర్తమాన, భవిష్యత్ ఉండే సీన్లనీ అర్థం చేసుకోవడం ఎవరికీ పెద్దం కష్టమేం కాకపోవచ్చు.
'కల్కి'లో మహాభారతం ఆధారంగా తీసిన సీన్లు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అలా కల్కి, కలి, అశ్వథ్ధామ పాత్రల రిఫరెన్సులు కూడా ఉన్నాయి. ఒకప్పటి జనరేషన్‌కి పర్వాలేదు గానీ ప్రస్తుత టీనేజీలో ఉన్న యూత్ వీటన్నింటిని అర్థం చేసుకోవాలంటే పూర్తిగా కాకపోయినా కాస్తయిన అవగాహన ఉండాలి. ఎందుకంటే సినిమాలో ఇన్ డీటైల్డ్‌గా అయితే చెప్పలేరు కదా! మరి ఈ విషయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఏం చేశాడనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
(ఇదీ చదవండి: Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?)
Comments
Please login to add a commentAdd a comment