
ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్‌పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది.
'బుక్ మై షో'లో అత్యధిక టికెట్లు బుక్ అయిన ఇండియన్ సినిమాగా 'కల్కి 2898 ఏడీ' సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇప్పటికీ టికెట్ల విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా 'రెబల్స్ ఆఫ్ కల్కి' పేరుతో ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో భారీ యాక్షన్ సీన్స్‌ను వారు చూపించారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment