
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, భైరవ ఆంథమ్‌కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ముంబయిలో గ్రాండ్ నిర్వహించారు. ఈ వేడుకలో అమితాబ్, నాగ్ అశ్విన్, కమల్ హాసన్, దీపికా, ప్రభాస్, రానా సైతం పాల్గొన్నారు. ఈవెంట్‌లో రానా దగ్గుబాటి ఇంటరాక్షన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కల్కి మూవీకి సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. 'గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో వర్క్ చేసే అవకాశం రావడం ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం. అమితాబ్ కంట్రీ మొత్తం రీచ్ అయిన ఫస్ట్ యాక్టర్. కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగా. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి క్లాత్ చుట్టుకొని ఆయనలానే యాక్ట్ చేసేవాడిని. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్. అందరికీ థాంక్ యూ' అని అన్నారు.
కల్కి 2898 ఏడీ చిత్రంలో భాగం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అమితాబ్ అన్నారు. నాగ్ అశ్విన్ తన విజన్‌తో మహా అద్భుతంగా తీశారని కొనియాడారు. కల్కి ఎక్స్ పీరియన్స్‌ను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని.. నాగి ఈ కథ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయానని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'నాగ్ అశ్విన్ మా గురువు బాలచందర్‌లా ఆర్డీనరిగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు ఉంది. ఇందులో బ్యాడ్ మ్యాన్‌గా నటించా. నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు. నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు' అని అన్నారు.
The biggest stars have come together. ✨#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/nK6hN7nmdU
— Kalki 2898 AD (@Kalki2898AD) June 19, 2024
Comments
Please login to add a commentAdd a comment