
దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విశ్వవేదికపై భారత జెండా రెపరెపలాడింది. టీ 20 వరల్డ్‌కప్ (2024) ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఈ అపురూప క్షణాలను అభిమానులు, సినీ తారలు టీవీలో చూసి మురిసిపోయారు. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఈ విజయం వరించిందని తన్మయత్వానికి లోనవుతున్నారు.
టీవీ చూడలేదు
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సైతం సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. వరల్డ్ ఛాంపియన్స్‌గా ఇండియా.. టీ 20 వరల్డ్ కప్ 2024 గెలిచాం.. ఈ ఆనందం, ఎమోషన్స్ మాటల్లో చెప్పలేం. నేను మ్యాచ్ చూస్తే ఎక్కడ ఓడిపోతామోనని టీవీ చూడలేదు. మనందరి మనసులు భావోద్వేగంతో నిండిపోయాయి అని తన బ్లాగ్‌లో రాసుకొచ్చాడు.
ఎమోషనల్ ట్వీట్
'తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వరల్డ్ ఛాంపియన్స్ ఇండియా.. భారత్ మాతాకీ జై.. జై హింద్! జై హింద్!!' అని ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. కాగా నిన్న (జూన్ 29న) జరిగిన టీ 20 వరల్డ్ కప్ ఫినాలేలో సౌతాఫ్రికాను వెనక్కునెట్టి భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే!
సినిమాల సంగతి..
అమితాబ్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన కీలక పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న విడుదలైంది. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్య ముఖ్య పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ఏకంగా రూ.415 కోట్లు రాబట్టింది.
T 5057 - Tears flowing down .. in unison with those that TEAM INDIA sheds ..
WORLD CHAMPIONS INDIA 🇮🇳
भारत माता की जय 🇮🇳
जय हिन्द जय हिन्द जय हिन्द 🇮🇳— Amitabh Bachchan (@SrBachchan) June 29, 2024
చదవండి: బాక్సాఫీస్ వద్ద కల్కి నయా రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment