
అందరికీ అమితాబ్ అంటే నటుడిగానే తెలుసు. కానీ నిర్మాతగా చాలా దెబ్బలు తిన్నారు.

ఒకానొక టైంలో వాచ్‌మెన్‌కి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితిల్లోకి వెళ్లిపోయారు.

ముంబైలోని జుహూలో తన ఇంటిని వేలానికి పెట్టారు. అప్పుడు బాలీవుడ్ ఈయన్ని చూసి నవ్వింది.

తనని విమర్శించిన ఏ ఒక్కరినీ పల్లెత్తూ మాట కూడా అనలేదు. మూడేళ్ల పాటు చాలా కష్టపడ్డారు.

ప్రతి యాడ్, కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఇలా వచ్చిన ప్రతి ఛాన్స్ ఉపయోగించుకున్నారు.

జూహులోని ఎక్కడైతే తన ఇంటిని అమ్మేశారో.. అదే వీధిలో మూడు ఇళ్లు కొన్నారు. దటీజ్ అమితాబ్.

ఈరోజు (అక్టోబరు 11) ఈయన పుట్టినరోజు. ఈ సందర్భంగా బిగ్ బీ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

స్వతహాగా బాలీవుడ్ నటుడే. కానీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సుపరిచితుడే అని చెప్పొచ్చు.

వయసొచ్చాక కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఉద్యోగంలో చేరారు. కానీ మనసంతా నటనపైనే ఉంది.

దీంతో ఎలాగోలా కష్టపడి ముంబై వచ్చారు. అలా 1969లో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.

హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, భోజ్‌పురి.. ఇలా పలు భాషల్లో 200కి చిత్రాల్లో భిన్న పాత్రలు చేశారు.

జంజీర్, షోలే, దీవార్, శక్తి.. ఇలా చెప్పుకొంటూ పోతే అమితాబ్ కెరీర్‌లో బోలెడన్ని క్లాసిక్స్ ఉన్నాయి.

కెరీర్ ప్రారంభంలో గొంతు, ఎత్తు విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈయన.. ఆ తర్వాత విమర్శకుల నోళ్లు మూయించారు.

రెండు చేతులతోనూ ఆటోగ్రాఫ్ ఇవ్వగలిగే స్పెషల్ టాలెంట్ అమితాబ్‌కి ఉంది.

విజయ్ అనే పేరుతో ఏకంగా 20 సినిమాల్లో హీరోగా నటించిన అరుదైన ఘనత కూడా అమితాబ్‌దే.

నాలుగుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. 30కి పైగా వివిధ పురస్కారాలు సొంతం చేసుకున్నారు.

వయసైపోతున్న ఇప్పటికీ చాలామంది హీరోలు.. ఇమేజ్ చట్రం నుంచి బయటకు రాలేకపోయారు.