బిగ్‌బీకి ఐశ్వర్య బర్త్‌డే విషెస్‌.. జయా బచ్చన్‌ను డిలీట్‌ చేసిందేంటి? | Aishwarya Rai Crops Jaya Bachchan While Wishing Amitabh Bachchan On His Birthday, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Aishwarya Rai: అత్త, ఆడపడుచు పిల్లల్ని ఫోటోలో నుంచి తీసేసిన ఐశ్వర్య.. పోస్ట్‌ వైరల్‌

Published Thu, Oct 12 2023 3:39 PM | Last Updated on Thu, Oct 12 2023 4:08 PM

Aishwarya Rai Crops Jaya Bachchan While Wishing Amitabh Bachchan on Birthday - Sakshi

సెలబ్రిటీలు ఏం చేసినా అందులో తప్పొప్పులు వెతకడానికి జనాలు సిద్ధంగా ఉంటారు. తాజాగా ఐశ్వర్యరాయ్‌ ఓ పోస్ట్‌ పెట్టగా చాలామంది దాన్ని తప్పుపడుతున్నారు. అక్టోబర్‌ 11న అమితాబ్‌ బచ్చన్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఐశ్వర్య ఒక రోజు ఆలస్యంగా మామగారికి బర్త్‌డే విషెస్‌ చెప్పింది. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు ఉండునుగాక అంటూ తన కూతురు ఆరాధ్యతో బిగ్‌బీ దిగిన ఫోటోను షేర్‌ చేసింది. అంతా బాగుంది కానీ ఈ ఫోటోను జూమ్‌ చేసి, క్రాప్‌ చేసి మరీ పెట్టింది.

అత్తను కూడా ఫోటోలో నుంచి డిలీట్‌
ఈ విషయం ఎలా తెలిసిందంటే? బిగ్‌బీకి అతడి మనవరాలు నవ్య నవేలి నందా(శ్వేతా బచ్చన్‌ కూతురు) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫుల్‌ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇందులో బిగ్‌బీ, జయా బచ్చన్‌, నవ్య, అగస్త్య, ఆరాధ్య ఉన్నారు. ఇదే ఫోటోను తీసుకున్న ఐశ్వర్య తన అత్తతో సహా అందరినీ క్రాప్‌ చేసి అవతల పడేసింది. బిగ్‌బీ, ఆరాధ్య మాత్రమే ఉండేలా ఎడిట్‌ చేసింది. దాన్ని సోషల్‌ మీడియాలో వదిలింది. ఇది చూసిన జనాలు ఏదో తేడా కొడుతోందని కామెంట్లు చేస్తున్నారు.

ఫ్యాషన్‌ వీక్‌లో ఐశ్వర్యను లైట్‌ తీసుకున్నారా?
అయితే ఆమె అభిమానులు మాత్రం అది అంత పెద్ద విషయమే కాదని కొట్టిపారేస్తున్నారు. ప్రతి ఏడాది బిగ్‌బీ, ఆరాధ్య.. వీళ్లిద్దరు ఉన్న ఫోటో మాత్రమే పోస్ట్‌ చేస్తుందని, అందులో భాగంగానే ఇలా చేసిందని అంటున్నారు. కాగా ఇటీవల జయా బచ్చన్‌, శ్వేతా బచ్చన్‌ పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌కు హాజరయ్యారు. ఈ ఫ్యాషన్‌ వీక్‌లో ఐశ్వర్య రాయ్‌తో పాటు, నవ్య కూడా ర్యాంప్‌ వాక్‌ చేసింది. జయ, శ్వేత.. నవ్యను ఎంకరేజ్‌ చేస్తూ ఆమెలో ఉత్సాహాన్ని నింపారు, కానీ ఐశ్వర్యను మాత్రం లైట్‌ తీసుకున్నారు. అందుకే ఈసారి ఐశ్వర్య వారి ఫోటోలను కట్‌ చేసి కేవలం తన కూతురు మాత్రమే కనిపించేలా ఫోటో పోస్ట్‌ చేసిందని ఫ్యాన్స్‌ గెస్‌ చేస్తున్నారు. ఇకపోతే ఐశ్వర్య రాయ్‌ చివరగా పొన్నియన్‌ సెల్వన్‌ సినిమాలో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement