Simi Garewal
-
నువ్వు లేవంటున్నారు..కష్టంగా ఉంది.. రతన్ టాటా మాజీ ప్రేయసి భావోద్వేగం
-
ఐశ్వర్యను దూరం పెట్టిన బిగ్‌బీ? నటి ఏమందంటే..?
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బిగ్‌బీ తనయుడు అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారని రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఐష్‌కు, తన అత్త జయా బచ్చన్‌కు సఖ్యత లేదని కూడా ఓ గాసిప్!ఐశ్వర్యను పట్టించుకోని బిగ్‌బీ?ఈ విషయంలో సోషల్ మీడియా అంతా ఐష్‌కు సపోర్ట్‌గా ఉండగా బిగ్‌బీ కుటుంబాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో ఓ యాంకర్ సైతం అమితాబ్‌ను విమర్శించింది. ఆయన తన కూతురికి అండగా ఉంటాడు కానీ కోడలు ఐశ్వర్యను మాత్రం అస్సలు పట్టించుకోడు. కూతురు, కొడుకు ఫోటోలు షేర్ చేస్తుంటారే తప్ప ఐష్ అవార్డు పొందితే దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరు అని ఆరోపించింది. ఈ వీడియో సీనియర్ నటి సిమి గరెవాల్ కంట్లో పడింది.ఇక చాలు ఆపండని నటి వార్నింగ్బచ్చన్ కుటుంబం గురించి మీకసలు ఏదీ తెలియదు.. ఇక చాలు, ఆపేయండి అని వార్నింగ్ ఇచ్చింది. కాగా సిమి గరెవాల్.. మేరా నామ్ జోకర్ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. సిద్దార్థ, కభి కభీ, కార్జ్ వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: Krystle DSouza: రెండు రోజులు బ్రేక్ లేకుండా షూటింగ్.. కింద పడిపోయినా వదల్లేదు! -
దేశం మారినా.. మీ బుద్ధి మాత్రం మారదు కదా
వాషింగ్టన్: దేశం కాని దేశంలో మనవాళ్లకు ఏదైనా ప్రమాదం వాటిల్లినా.. ఆపద వచ్చినా.. కాన్సులేట్ అధికారులు ఆదుకుంటారనే నమ్మకం ఉంటుంది. కాన్సులేట్ అధికారులంటే విదేశాల్లో ఉన్న వారికి.. ఇక్కడ వారి కుటుంబీకులకు మధ్య వారధిగా ఉండాలి. కానీ మన దగ్గర కొందరు ప్రభుత్వ అధికారుల్లో ఒక లాంటి మనస్తత్వం ఉంటుంది. తాము ఇతరులకంటే అతీతులమని ఫీలవుతుంటారు. తాము ఉన్నది ప్రజా సేవకు అనే విషయం మర్చిపోయి.. సామాన్యులతో చాలా కఠినంగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వారు ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా అలానే ప్రవర్తిస్తారు. దేశం మారినా వీరి బుద్ధి మాత్రం మారదు. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాక్ షో వ్యాఖ్యాత సిమి గరేవాల్ తన ట్విటర్లో షేర్ చేసిన వీడియో వివరాలు.. న్యూయార్క్ భారత కాన్సులేట్‌లో నవంబర్ 24న ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిలో ఓ మహిళ కాన్సులేట్ అధికారితో మాట్లాడుతూ ఉంటుంది. సదరు మహిళ తండ్రి కొద్ది రోజుల క్రితం మరణించాడు. ఆమె ఇండియా వెళ్లడానికి వీసా కోసం అప్లై చేస్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఫీజు అన్ని సబ్మిట్ చేసినప్పటికి.. కాన్సులేట్ అధికారి ఆమెకు వీసా నిరాకరిస్తాడు. ఆమె తన పరిస్థితిని వివరించి.. వీసా మంజూరు చేయాల్సిందిగా కోరుతుంది. (చదవండి: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!!) కానీ ఆ అధికారి ఆమె మాటలను అసలు పట్టించుకోడు. పైగా చాలా కఠినంగా మాట్లాడతాడు. ఆమె సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ని కూడా విసురుగా పడేస్తాడు. ఆమె ఎంత బ్రతిమిలాడుతున్నా.. ఆమె వాదన వినిపించుకోకుండా బయటకు వెళ్లిపోతాడు. అయితే అంతసేపు జరిగిన తతంగాన్నంత ఆమె వీడియో తీస్తుంది. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డ్ సదరు మహిళ వద్దకు వచ్చి వీడియో తీయోద్దని కోరతాడు. (చదవండి: ఆనంద్ మహీంద్రా ట్వీట్: ‘న్యూయార్క్ సెంట్రల్ పార్క్.. డబ్బా వాలీ’) ఈ వీడియోని సిమి గరేవాల్ తన ట్విటర్లో షేర్ చేసిన సదరు కాన్సులేట్ అధికారి ప్రవర్తన సరికాదని ట్వీట్ చేసింది. క్షణాల్లో ఈ వీడియో వైరలయ్యింది. చాలా మంది న్యూయార్క్ కాన్సులేట్ కార్యాలయంలో ఇలాంటి సంఘటనలు చాలా సహజం అని.. అక్కడి అధికారులు ఇంతే రూడ్‌గా ప్రవర్తిస్తారని గతంలో తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేశారు. సదరు అధికారిని నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. On 24/11/2021. Indian embassy New York. Her father had died & she wanted a visa for India. This is the obnoxious behavior of an Indian officer in the New York Consulate towards her. @DrSJaishankar @MEAIndia @PMOIndia you can't ignore this. pic.twitter.com/7ckWXnJqP0 — Simi Garewal (@Simi_Garewal) November 30, 2021 చదవండి: తమ్ముడి కోసం చిట్టితల్లి సాహసం -
నటితో క్రికెటర్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ
క్రికెట్ స్టేడియంలో ఆ బాట్స్మన్ బ్యాటింగ్ తీరుకి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు.. గ్యాలరీలో ఉన్న స్వదేశీయులు జేజేలు పలుకుతున్నారు. వాళ్లల్లో ఒక హీరోయిన్ అయితే ఆనందంతో కేరింతలు కొడ్తోంది. ఆ ఆనందం ఆ బ్యాట్స్‌మన్‌కి మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఫోర్, సిక్సర్ కొట్టినప్పుడల్లా ఆమె వంక చూస్తున్నాడు. అభినందనలను చప్పట్లతో మారుమోగిస్తోంది ఆమె. అతను.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. బ్యాట్‌తో మెరుపుదాడి చేసి స్టేడియంలో బంతులను పరిగెత్తించే టైగర్.. ఆ హీరోయిన్.. షర్మిలా టాగోర్ .. కాదు. నాజూకు మేని.. అంతే నాజూకైన స్వరం... బ్రిటిష్ యాక్సెంట్ ఇంగ్లిష్ ప్రత్యేకతల సిమీ గరేవాల్. అవును.. షర్మిలాను జీవిత భాగస్వామిగా చేసుకునే కంటే ముందు పటౌడీ శ్వాస, ధ్యాస సిమీనే. ఆ ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే ఈ వారం ‘మొహబ్బతే’. టైగర్ పటౌడీ పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. సిమీ అంతే పేమస్ బాలీవుడ్ ప్రేక్షకులకు. ‘సిద్ధార్థ’ సినిమాలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపించింది. ‘మేరా నామ్ జోకర్’, ‘చల్తే చల్తే’ వంటి సినిమాలతో మెప్పించింది. జాతీయ అంతర్జాతీయ సెలబ్రెటీలను కూర్చోబెట్టి మాటల్లో పెట్టి వాళ్ల జీవిత కథను (‘రెండవూ విత్ సిమీ గరేవాల్’ అనే టాక్ షోలో) వినిపిస్తూ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనీ నిరూపించుకుంది. పుట్టింది లుధియానా (పంజాబ్)లో, పెరిగింది ఇంగ్లాండ్‌లో. సిమీ సినిమాల్లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. నిరాహార దీక్ష చేసి పెద్దవాళ్ల చేత ‘ఎస్’ చెప్పించుకుంది. సిమీకి శ్వేత వర్ణం అంటే ఇష్టం. ఎక్కువగా ఆ రంగు దుస్తులనే వేసుకుంటుంది తన టాక్ షో అయినా.. సినిమా వేడుక అయినా. అందుకే ఆమెను ‘ది లేడీ ఇన్ వైట్’ అని పిలుస్తారు సినిమా రంగంలోని వాళ్లు. (చదవండి: ఆ హీరో ఇద్దరితో ప్రేమలో పడ్డాడు.. కానీ!) ఫస్ట్ లవ్.. తన పదిహేడేళ్ల వయసులో ఇంగ్లాండ్‌లో వాళ్లింటి పక్కనే ఉంటూండే జమ్నాగర్ మహారాజుతో ప్రేమలో పడింది. అతని వల్లే బయటి ప్రపంచం తెలిసింది అనీ చెప్పింది సిమి ఒక ఇంటర్వ్యూలో. మూడేళ్లు సాగిన ఆ బంధం బ్రేక్ అయింది. సినిమాలతో సివీమ బిజీగా ఉన్న సమయంలో ఒక పార్టీలో పటౌడీ పరిచయం అయ్యాడు. ఆటలు, ఇంగ్లిష్ కల్చర్ అంటే ఆ ఇద్దరికీ ఉన్న ఆసక్తి వాళ్లిద్దర్నీ స్నేహితులుగా మార్చింది. సిమీ ధైర్యం, నొప్పించకుండా ఉండే మాట తీరుకు ఆకర్షితుడై.. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు పటౌడీ. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉండే అతని తీరునూ సిమీ ఇష్టపడింది. ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఉన్నా.. ఏ సినిమా వేడుకకైనా జంటగా వచ్చేవాళ్లిద్దరూ. క్రికెట్, సినిమా పరివారానికంతటికీ తెలిసిపోయింది వీళ్లిద్దరూ ప్రేమ పక్షులని. గ్యాలరీలో సిమీ కేరింతల కోసం పిచ్ మీద నుంచి ఆశగా చూసేవాడు పటౌడీ. ఆలంబనగా చేతులు చాచేది సిమీ. అంతే ఆమెను చూస్తూనే వచ్చే బంతిని బౌండరీ దాటించేవాడని చెప్తారు ఈ ఇద్దరి సన్నిహితులు. అందుకే ఆ రెండు రంగాల వాళ్లు వీళ్ల పెళ్లి పత్రిక కోసం ఎదురు చూడసాగారు. పటౌడీ కూడా వాళ్లింట్లో వాళ్లకు సిమీ గురించి చెప్పేసి ఆమెతో పెళ్లి నిశ్చయం చేసుకోవాలనే శుభ ఘడియ కోసం ఆగాడు. ఈలోపు.. ఏదో సందర్భంలో షర్మిలా కలిసింది పటౌడీని. తొలి చూపులోనే ఆమె రూపం అతని మనసులో ముద్ర పడిపోయింది. ఈసారి తాను సందర్భం కల్పించుకొని షర్మిలాను కలిశాడు. పటౌడీని ఇష్టపడింది ఆమె. అతనికీ ఇష్టం ఉంది. కాని ఇంకా సందిగ్ధంలో ఉన్నాడు. జీవితభాగస్వామిగా షర్మిలా చేయే పట్టుకోవాలనే నిశ్చయించుకున్నాడు కాని సిమీతో ఉన్న బంధం అతణ్ణి కన్ఫ్యూజన్లో పెట్టింది. అయినా ఏ కొంచెం సమయం చిక్కినా షర్మిలాతోనే సమయం వెచ్చించసాగాడు. ఆ స్నేహ సంభాషణలతో కన్ఫ్యూజన్ పోయి స్పష్టత వచ్చేసింది. ఒకరోజు సాయంకాలం.. సిమీ వాళ్లింటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది సిమీ. ఎదురుగా పటౌడీ. ఎప్పటిలా నవ్వుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది ఆమె. ఇబ్బందిగానే హాల్లోకి వెళ్లి కూర్చున్నాడు. ‘లెమనేడ్ ఇష్టం కదా మీకు? తీసుకొస్తా’ అంటూ కిచెన్‌లోకి వెళ్లబోతుంటే ‘ఇప్పుడేం వద్దు. నీతో మాట్లాడాలి అంతే’ అన్నాడు పటౌడీ. ‘లెమనేడ్ తాగుతూ కూడా మాట్లాడొచ్చు కదా’ అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్లి లెమనేడ్ తెచ్చి పటౌడీ చేతికిచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది సిమి. ‘ఇప్పుడు చెప్పండి’ అన్నట్టుగా. చేతిలో ఉన్న గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ అన్నాడు పటౌడీ ‘సిమీ.. ఇట్స్ ఓవర్’ అని. కనుబొమలు పైకి స్ట్రెచ్ చేస్తూ చూసింది ఆమె ‘ఏంటీ?’ అన్నట్టుగా. ‘యెస్.. నేను షర్మిలాను ఇష్టపడ్తున్నాను. తననే పెళ్లిచేసుకుంటున్నాను. ఇంక మనమధ్య.. ’ అని ఆగాడు. నవ్వుతూనే నిట్టూర్చుంది సిమీ. ‘ఐయామ్ సారీ సిమీ’ అన్నాడు పటౌడీ ఆమె కళ్లలోకి చూస్తూ. అదే నవ్వు ఆమె పెదవుల మీద. కాని ఆ కళ్లల్లో కనిపించిన నీటి పొర పటౌడీ దృష్టిని తప్పించుకోలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. ‘బై’ అంటూ లేచాడు. తనూ లేచింది ఎప్పటిలాగే లిఫ్ట్ దాకా పటౌడీని సాగనంపడానికి. వద్దంటూ ఒక్కతీరుగా వారించాడు. అయినా వినకుండా అతని వెంటే వెళ్లింది. లిఫ్ట్ దగ్గర.. పటౌడీ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ షర్మిలా కనిపించింది సిమీకి. ఊహించని దృశ్యానికి షర్మిలా ఇబ్బంది పడింది. ఈ లోపు లిఫ్ట్ వచ్చింది. షర్మిలా, వెనకాలే పటౌడీ.. లిఫ్ట్‌లో వెళ్లిపోయారు. ఒంటరి అయిపోయింది సిమీ. తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీకి చెందిన రవి మోహన్ అనే వ్యాపారవేత్తను సిమీ పెళ్లి చేసుకుంది. కాని ఆ పెళ్లి ఎంతో కాలం నిలువలేదు. ఒంటరిగానే జీవనయానం సాగిస్తోంది సిమీ. - ఎస్సార్ -
శ్రీదేవి విషాదాంతం సేమ్ అలాగే..
సాక్షి, న్యూఢిల్లీ : శ్రీదేవి మరణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్లే ఆమె మరణించారని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. దుబాయ్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శ్రీదేవి ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన వెంటనే అలనాటి నటి సిమీ గరేవాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భారత సినీ ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి, అమెరికన్ పాపులర్ సింగర్ విట్నీహోస్టన్ మరణించిన ఉదంతాలు ఒకేలా ఉన్నాయని ఆమె ట్వీట్ చేశారు. అమెరికాలో పేరొందిన సింగర్ విట్నీ హోస్టన్ (48) 2012, ఫిబ్రవరి 11న బెవెర్లీ హిల్స్‌లో జరిగిన గ్రామీ పార్టీలో పాల్గొన్న అనంతరం హోటల్లోని బాత్ టబ్‌లో శవమై తేలారు. హోస్టన్ ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగిపోయారని, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరపూరిత కోణం లేదని అప్పటి లాస్ఏంజెల్స్ కరోనర్ అధికారిక నివేదికలో పేర్కొన్నారు. కాగా, విట్నీ హోస్టన్ మరణించిన తరహాలోనే శ్రీదేవి విషాదాంతం చోటుచేసుకుందని దుబాయ్ వైద్యుల ఫోరెన్సిక్ నివేదిక వెల్లడిస్తోంది. -
మనసులో మాటలు వెల్లడించిన జయ
-
నా జీవితమే పోరాటాలమయం...
ఎన్నడూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని జయలలిత కొన్ని సందర్భాల్లో పలువురు విలేకరులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారిలో సిమి గరేవాల్, కరణ్ థాపర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని కొన్ని అంశాలు... సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ... ప్రశ్న: ఎన్నో ఏళ్ల నుంచి మీ రాజకీయ జీవితాన్ని చూస్తున్నాను. గ్రేట్ జర్నీ. సినిమా కథలకంటే నాటకీయతతో కూడుకున్నది కదా? జయ: అవును. చాలా ఆందోళనకరమైన జీవితమే.. రాజకీయాలు మిమ్మల్ని కఠినంగా మార్చాయా? అవును. రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు చాలా బెరుగ్గా ఉండేదానిని. బిడియం ఎక్కువ. సమావేశాల్లో మాట్లాడాలంటే బాగా భయపడేదాన్ని. ఇప్పుడున్న స్థానానికి చేరుకుంటారని ఎప్పుడైనా ఊహించారా? లేదు. ముందు ఏం జరుగుతుందో తెలియకపోవడం కూడా మనకు మంచే చేస్తుంది. ముందే తెలిస్తే భయం వేసేది. మీ జీవితంలో అత్యంత కఠిన సమయమేది? ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో నా ప్రాధాన్యాన్ని కాపాడుకుని ముందుకు వెళ్లడమే నా జీవితంలో అత్యంత కఠిన సమయం. అప్పుడు నాకు కొనసాగాలనిపించలేదు. ఎందుకు మీకు కొనసాగాలనిపించలేదు? ఆ సమయంలో నేను చాలా అవమానాలెదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్లు నన్ను అనుమానంతో చూశారు. నటులను, డాక్టర్లను, లాయర్లను, వేరే రంగాల్లో ఉన్నవారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంతో గౌరవంతో చేస్తారు. కానీ రాజకీయనాయకుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారి తీరు చాలా దారుణంగా ఉంటుంది. ఎంతో అవమానకరమైన ప్రశ్నలు అడుగుతారు. మనల్ని ఒక్కసారి కూడా కలవని వ్యక్తులు మన జీవితంలోని తప్పులను ఎత్తిచూపిస్తారు. నేను చాలా సున్నిత మనస్కురాలిని. మీడియాలో నా గురించి వచ్చే వార్తలు నన్ను చాలా బాధ పెట్టాయి. మీరంటే కొందరు ఎందుకు భయపడతారు? నాకున్న పేరు వల్లేనేమో!(నవ్వుతూ). ఇంతకు ముందున్న జయలలిత వేరు. తను ఎప్పుడూ అందరితో కలిసేది కాదు. భయం భయంగా ఉండేది. ఎవరైనా నిలదీసినా తిరిగి సమాధానం చెప్పలేని భయస్తురాలు. ఎవరైనా అవమానిస్తే ఇంటికి వెళ్లి తలుపులు మూసుకుని ఏడ్చేది. ఆ జయలలిత ఇప్పుడు లేదు. నేను మారిన విధానాన్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. శశికళతో మీ సాన్నిహిత్యంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా మీరు దాన్ని ఎందుకు కొనసాగించారు? తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కేవలం నాపై తనకున్న విధేయత కారణంగానే చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ తను వెనక్కి తగ్గలేదు. తను ఏడాది పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. ఎంతో బాధపడింది. అవినీతి కేసులతో ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదు. నా మీద పెట్టిన అవినీతి కేసులన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినవే. మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇదంతా ఎందుకు అని మీకు ఎప్పుడూ అనిపించలేదా? మార్చి 25, 1989న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో నాపై దాడి జరిగింది. వారి పార్టీలోని వాళ్లంతా చేతికి దొరికిన దాంతో నాపై దాడిచేశారు. అప్పుడు స్పీకర్ టేబుల్ మీద పెద్ద గాజు గంట ఉండేది. దాంతో నా తల మీద కొట్టాలని వారు ప్రయత్నించారు. అదే జరిగుంటే నేను ఇప్పుడు బతికుండే దాన్ని కాదేమో. వారిలో ఒకరు నా చీర లాగడానికి కూడా ప్రయత్నించారు. నన్ను చెప్పులతో కొట్టారు. అది అత్యంత దారుణమైన అనుభవం. నేను జైలుకు వెళ్లడం నా జీవితంలోనే అత్యంత బాధాకర సంఘటన. కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో... కరణ్ థాపర్: మీ ఎమ్మెల్యేలు, మంత్రులు మీ ముందు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు? జయ: ఇది అందరు రాజకీయ నాయకులకు జరిగేదే. డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరుణానిధికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ వారు మనుషులు.. (మధ్యలో కలుగజేసుకుని) నా చుట్టూ జరిగిన చిన్న విషయమైనా అతిగానే కనిపిస్తుంది. పెద్దవారి వద్ద నుంచి ఆశీస్సులు తీసుకోవడం భారతీయ సాంప్రదాయం. కానీ వారు రాష్ట్ర మంత్రులు.. జయ: నేను వారిని అలా చేయవద్దని చెప్పాను. వారు మీ మాట వినడం లేదా? వారు వింటారు. అందుకే ఈ మధ్యకాలంలో ప్రజల మధ్య అలా చేయడం మానేశారు. మీకు సమయం లేదని చెబుతున్నప్పుడు మీరు కక్ష అనే పదం వాడారు. మీ ముందున్న ముఖ్యమంత్రిపై ఒక రోజు ముందే కేసు నమోదైనా శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన్ను అరెస్టు చేయించారు.. (మధ్యలో కలుగజేసుకుని) నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. నేను ప్రశ్న పూర్తి చేశాక మాట్లాడండి. మీరేం అడుగుతున్నారో నాకు అర్థమైంది. డీఎంకే ప్రభుత్వం నా మీద అక్రమకేసులు బనారుుంచి నన్ను జైలుకు పంపింది. నేను 28 రోజులు ఆ కేసులో జైల్లో ఉండి... అంటే అది వ్యక్తిగత కక్షా? కరుణానిధి ఈ పని చేసినప్పుడు మీడియా ‘చెడుపై విజయం’ అంటూ ఆయన్ను ఆకాశానికెత్తేసింది. అప్పుడు కరుణానిధి నాపై పన్నిన పన్నాగాన్ని కనిపెట్టిన ప్రజలు నన్ను 2001 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ మీరు ఆయన్ని అరెస్టు చేసినప్పుడు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి అవినీతి కేసులో అరెస్టయ్యారు. ఆ సమయంలో ఆయన కుటుంబ చానెల్ అరుున సన్‌టీవీ ఎంతో తెలివిగా ఎడిట్ చేసిన ఫుటేజ్‌తో ప్రజలను మాయ చేయాలని ప్రయత్నించారు. మీరు 77 సంవత్సరాల వయసున్న వ్యక్తిని అరెస్టు చేయించారు. అవినీతికి, వయసుకీ సంబంధం లేదు. అంటే అది వ్యక్తిగత కక్షా? అది వ్యక్తిగత కక్ష కాదు. అవినీతి కేసు. ముక్కుసూటితనం మీకు వ్యతిరేకంగా పనిచేస్తోందా? నేను నిజాయితీపరురాలిని. ఇప్పుడు మీతో కూడా నిజాయితీతో వ్యవహరించనివ్వండి. అలాగే ముక్కుసూటిగా నిజాలు మాట్లాడేందుకు ప్రాధాన్యతనిస్తాను. మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు వాటిని ఖండిస్తాడు. పోటీపడుతూ ప్రకటనలు జారీ చేస్తారు. ఇతరులపై అలాంటి సంఘటనలు జరిగితే వాటిని ఖండించిన రాజకీయ నేత ఇప్పటివరకూ ఎవరూ లేరు. బాధ్యులెవరు, బాధితులెవరు? అన్న విషయాలకు అతీతంగా ఇలాంటి ఉన్మాద చర్యలను అందరూ తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. మైనారిటీలపై జరిగే వాటినే నేరాలుగా చూడటం సరికాదు. ఇలాంటి సంఘటనలు మొత్తం మానవత్వంపై జరిగిన దాడిగానే చూడాలి. ఈ దేశ రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు మాత్రమే కాదు.. మెజారిటీ వర్గాల వారికీ హక్కులున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. - మార్జి 1, 2002 (గోద్రా మారణ కాండ సమయంలో) నా జీవితంపై ఎంజీఆర్ ప్రభావం చాలా ఎక్కువ. కాదనను. అయితే ఇప్పుడు నేను.. నేనే! నా ఆలోచనలు, చర్యలన్నింటినీ ప్రభావం చేయగల వ్యక్తి మరొకరు ఇకపై ఉండరు. ఇతరుల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రకటనలు చేయడమూ జరగదు. ఇకపై నేను సమాధానం చెప్పుకోవాల్సింది నాకు మాత్రమే. -మే 4, 1998 (సావీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) నేను మీ అమ్మను... బిడ్డలకు ఏది మంచిదో తల్లికే బాగా తెలుస్తుంది. మీ సంక్షేమమే నాకు సంతోషం. - ఎన్నికల ర్యాలీల్లో జయలలిత రాజకీయాల్లో నా తీరే వేరు. రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే కొన్ని నాటకాలు తప్పనిసరి.. నాకు సినిమాల్లో కెమెరా ముందు నటించిన అనుభవం ఉండనే ఉంది. అరుుతే నిజ జీవితంలో నటించడం మాత్రం నాకు రాదు. పురుషాధిక్య రాజకీయ రంగంలో సొంతబలంపై పైకి ఎదిగిన మహిళను నేను. మహిళా నేతగా ఇందిరాగాంధీ ఉన్నత స్థారుుకి చేరినప్పటికీ ఆమెకు నెహ్రూ కుటుంబంలో పుట్టడమన్న అనుకూలత ఉంది’’ ప్రతి పోలీసు అధికారి ప్రతి సాధారణ పౌరుడు సురక్షింతంగా ఉంచడం కోసమే పనిచేయాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే సామర్థ్యాలను పొందేలా శిక్షణను పొంది ఉండాలి. సవాళ్లను ఎదుర్కొన్న వారే ప్రతిభావంతులుగా తయారవుతారు. ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి చక్కటి ఉదాహరణగా సినిమాలు ఉండాలి. చదువు.. నీ ప్రశ్నకు సమాధానాన్ని మాత్రమే ఇస్తుంది. సంస్కృతి అనేది మనిషిగా జీవించడానికి అతి ముఖ్యమైనది. ప్రభుత్వ పాలసీలు, ప్రణాళికలను వ్యతిరేకించినవారంతా ప్రతిపక్షం కాదు. వారు ప్రభుత్వ మంచి, చెడులను చెప్పి ఉత్తమ ఫలితాలను తీసుకురాగలరు. ఇదే ప్రతిపక్ష పార్టీ ప్రధాన ఉద్ధేశం. -
ఆక్టోబర్ 29న ముంబయిలో ఐటీఏ పురస్కారాల ప్రదానం
ఈ ఏడాది13వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ఐటీఏ) పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని వచ్చే నెల 29న ముంబయిలో ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తామని ఆ ఐటీఏ కన్వీనర్ శశిరాజన్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సినిమా, సంగీతం, టాక్ షో,వార్తలు, కరెంట్ ఎఫైర్స్, దర్శకులు, వ్యాఖ్యాతలు, టెక్నిషియన్లు తదితరులను జ్యూరీ కమిటీ పురస్కారాలకు ఎంపిక చేసిందని చెప్పారు. అందులోభాగంగా18 టెక్నికల్ అవార్డులు, ఆరు పాపులర్ అవార్డులను పబ్లిక్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసినట్లు వివరించారు. ఐటీఏ అవార్డుల కోసం 45 కేటగిరిలకు 1850 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. ఐటీఏ కమిటీ జ్యూరీకి సిమి గరేవాల్ అధ్యక్షత వహించగా, రాకేశ్ బేడి, మిర్ మునీర్, జావేద్ సయ్యద్, ఉమేష్ గుప్తా,మాయా రావు, భరతి ప్రదాన్, అనిల్ సెహగ్ల్ సభ్యులుగా వ్యవహారించారు. నవంబర్ 3వ తేదీన ఐటీఏ అవార్డుల కార్యక్రమం స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతోందని శశిరాజన్ చెప్పారు.