సాక్షి, న్యూఢిల్లీ : శ్రీదేవి మరణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న క్రమంలో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ పడిపోవడం వల్లే ఆమె మరణించారని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. దుబాయ్ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శ్రీదేవి ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన వెంటనే అలనాటి నటి సిమీ గరేవాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భారత సినీ ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి, అమెరికన్ పాపులర్ సింగర్ విట్నీహోస్టన్ మరణించిన ఉదంతాలు ఒకేలా ఉన్నాయని ఆమె ట్వీట్ చేశారు.
అమెరికాలో పేరొందిన సింగర్ విట్నీ హోస్టన్ (48) 2012, ఫిబ్రవరి 11న బెవెర్లీ హిల్స్‌లో జరిగిన గ్రామీ పార్టీలో పాల్గొన్న అనంతరం హోటల్‌లోని బాత్ టబ్‌లో శవమై తేలారు. హోస్టన్ ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగిపోయారని, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరపూరిత కోణం లేదని అప్పటి లాస్‌ఏంజెల్స్ కరోనర్ అధికారిక నివేదికలో పేర్కొన్నారు. కాగా, విట్నీ హోస్టన్ మరణించిన తరహాలోనే శ్రీదేవి విషాదాంతం చోటుచేసుకుందని దుబాయ్ వైద్యుల ఫోరెన్సిక్ నివేదిక వెల్లడిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment