
మిల్కీ బ్యూటీ తమన్నాకు సినిమారంగంలో దాదాపు 15 ఏళ్ల అనుభవం ఉంది. చాలా పిన్న వయసులోనే నటిగా రంగప్రవేశం చేసిన తమన్నా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో నటించేశారు. బాలీవుడ్‌లో పెద్దగా ఆదరణకు నోచుకోకపోయినా దక్షిణాది ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా తన మార్కెట్‌ను కాపాడుకుంటున్న తమన్నా ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తాను చిన్న తనం నుంచి నటి మాధురీదీక్షిత్ డాన్స్ చూసి ఆమెలా ఆడాలని ఆశ పడ్డానని చెప్పారు.
మాధురీకి చాలా మంది అభిమానులుండేవారని, అలా తనకూ ఉండాలని కోరుకునేదాన్నని అన్నారు. ఆ కోరికే తనను సినిమా రంగంలోకి తీసుకొచ్చిందని అంది. దీంతో పట్టుదలతో డాన్స్‌ను నేర్చుకున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా డాన్స్‌కు ప్రాధాన్యత కలిగిన చిత్రంలో నటించాలన్న కోరిక ఉందని, అలాంటి చిత్రంలో తన పూర్తి డాన్స్ ప్రతిభను నిరూపించుకోవాలని ఆశ పడుతున్నట్లు వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకూ ఆ కోరిక నెరవేరలేదు. అయితే 12 ఏళ్లుకు పైగా నటిస్తున్నా ఇప్పుడే నటిగా జీవితాన్ని ప్రారంభించినట్లు ఉందని, ఇలా భావించడమే తన విజయరహస్యం అన్నారు. చిన్న వయసులోనే సినిమాలోకి వచ్చానని, ఆ రోజులను తలచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుందని చెప్పారు. నటిగా అనుభవం పెరగడంతో ఎలాంటి పాత్రల్లో నటిస్తే బాగుంటుందన్న గ్రహించగలుగుతున్నానన్నారు.
ఇప్పుడు తన ఆలోచనలు మారుతున్నాయని, తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలన్నీ ఒప్పేసుకుని నటించానని, అలాంటిది ఇప్పుడు ఎంపిక చేసుకుని నటిస్తున్న విధానం మారిందని తెలిపారు. ఇది తనకు తాను కొత్తగా తెలుసుకున్నానని తమన్నా చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment