సీన్లు పంచుకున్న మాధురీ, జూహీ | Madhuri dixit, Juhi chawla shares 'electric' scenes in 'Gulaab Gang' | Sakshi
Sakshi News home page

సీన్లు పంచుకున్న మాధురీ, జూహీ

Feb 7 2014 12:15 PM | Updated on Sep 2 2017 3:27 AM

సీన్లు పంచుకున్న మాధురీ, జూహీ

సీన్లు పంచుకున్న మాధురీ, జూహీ

ఒకప్పుడు వాళ్లిద్దరూ ప్రొఫెషనల్గా బద్ధశత్రువులు. నీవెన్ని సినిమాలు, నావెన్ని సినిమాలు హిట్టయ్యాయి అంటూ పోటీలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

ఒకప్పుడు వాళ్లిద్దరూ ప్రొఫెషనల్గా బద్ధశత్రువులు. నీవెన్ని సినిమాలు, నావెన్ని సినిమాలు హిట్టయ్యాయి అంటూ పోటీలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. లేటు వయసులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వీళ్లిద్దరూ ఇప్పుడు ఒకే సినిమాలో కలిసి నటించడమే కాదు, ఏకంగా మంచి జోష్ ఉన్న సీన్లను కూడా పరస్పరం పంచుకుంటున్నారు!! ఈ విషయాన్ని స్వయంగా మాధురీ దీక్షితే చెప్పింది. తాజాగా తామిద్దరం కలిసి నటిస్తున్న 'గులాబ్ గ్యాంగ్' చిత్రంలో మంచి అద్భుతమైన జోష్ ఉన్న సీన్లు చాలా ఉన్నాయని, అలాంటివాటిని తాము ఇద్దరం పంచుకుంటున్నామని ఆమె చెప్పింది. మంచి కరెంటు ఉన్న సీన్లను తాము ఇద్దరం పంచుకుంటున్నట్లు 46 ఏళ్ల మాధురీ దీక్షిత్ వివరించింది.

ఇక ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ స్వయంగా కొన్ని ఫైటింగ్ సీన్లు చేసింది. ఎలాంటి డూప్ను పెట్టుకోకుండా తాను తొలిసారి చాలా శక్తిమంతమైన, అసలైన యాక్షన్ సన్నివేశాలు చేశానని మాధురీ చెప్పింది. ఫైటింగ్ సీన్లను తాను చాలా ఎంజాయ్ చేశానని, ప్రేక్షకులు కూడా వాటిని ఎంజాయ్ చేస్తారనే భావిస్తున్ననని ఆమె అంది. తన ఫైటింగ్ సీన్లు కావాలని పెట్టినట్లుగా కనిపించవని, సినిమాలో సహజంగానే వచ్చేస్తాయని, పాటలు కూడా అలాగే వస్తాయని ఆమె చెప్పింది. సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన ఈ 'గులాబ్ గ్యాంగ్' మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement