gulab gang
-
ఈచ్ వన్ టీచ్ వన్!
ఉత్తరప్రదేశ్‌లోని ‘గులాబ్ గ్యాంగ్’ ఉద్యమం ఎంతో మంది మహిళలను ప్రభావితం చేసింది. మాధురిదీక్షిత్ ప్రధాన పాత్రలో ఇటీవల బాలీవుడ్లో ‘గులాబ్ గ్యాంగ్’ అనే పేరుతో సినిమా కూడా వచ్చింది. విశేషమేమిటంటే, గులాబ్ గ్యాంగ్ ఇచ్చిన స్ఫూర్తి మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశదేశాలకు వ్యాపించింది. అందరిలోనూ కసి రగలించింది. జర్మనిలో అన్నెసెమెసిక్ నాయకత్వంలోని అయిదు మంది మహిళల బృందం ‘గులాబ్ గ్యాంగ్’ గురించి గొప్పగా విని, చదివి ప్రభావితమైంది. ఆ ప్రభావంతో ‘ఈచ్ వన్ టీచ్ వన్’ పేరుతో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రచార కార్యమ్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల మన దేశానికి కూడా ఈ బృందం వచ్చింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలు, విద్యాలయాలకు వెళ్లి ‘ఈచ్ వన్ టీచ్ వన్’ పేరుతో రోజంతా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఇందులో డాక్యుమెంటరీ ప్రదర్శన, చర్చా కార్యక్రమం, ఆర్ట్స్వర్క్స్... మొదలైనవి ఉంటాయి. స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుందనే దానిపై ముఖ్యమైన సలహాలను మహిళల నుంచి ఆహ్వానిస్తారు. ‘‘ఒక సందేశాన్ని ప్రజలకు చేరువ చేయడానికి కళను మించిన ప్రత్యామ్నాయం లేదు. భాషతో పని లేదు’’ అంటున్నారు అన్నే. వర్క్‌షాప్‌లో ప్రదర్శించిన రకరకాల కళాకృతులు స్త్రీ సాధికారత, రక్షణ, హక్కులపై విలువైన సందేశాలని చెప్పకనే చెబుతున్నాయి. ‘ప్రతివ్యక్తి ఎదుటివ్యక్తి నుంచి నేర్చుకోవాల్సింది... తెలుసుకోవాల్సింది ఎంతో కొంత ఉంటుంది. ప్రతి వ్యక్తి తోటివ్యక్తికి చెప్పాల్సింది...నేర్పాల్సింది ఎంతో కొంత ఉంటుంది’ అనేది ‘ఈచ్ వన్ టీచ్ వన్’ సిద్ధాంతం. దీనిని ఈ ఒక్క విషయంలోనే కాదు... ప్రతి విషయంలోనూ అనుసరిస్తే పోోయేదేముంది... అజ్ఞానం తప్ప! -
మాధురిలో నేనే కనిపించా!
న్యూఢిల్లీ: గులాబ్ గ్యాంగ్ సినిమా నిర్మాతలపై సామాజిక కార్యకర్త సంపత్‌పాల్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నా మాధురీదీక్షిత్ నటన మాత్రం ఆమెను ముగ్ధురాలిని చేసినట్లే కనిపిస్తోంది. ‘గులాబ్ గ్యాంగ్ సినిమా నిర్మాతలు నా జీవితాన్నే చిత్రంగా మలిచినట్లు అనిపించింది ఈ సినిమా చూస్తుంటే.. అందుకే వారితో యుద్ధానికి సిద్ధమయ్యాను. నా డిమాండ్లు నెరవేరేవరకు ఈ పోరాటం ఆగదు. అయితే మాధురీ దీక్షిత్ తన నటనతో నన్ను చాలా ఆకట్టుకుంది. ఆ పాత్రలో మాధురిని తెరపై చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది..’ అని గులాబ్ గ్యాంగ్ వ్యవస్థాపకురాలు సంపత్‌పాల్ పేర్కొన్నారు. ‘ఆమె నటన చూస్తే నా పోరాట ప్రయాణంలో నాకు ఎదురైన అనుభవాలను నెమరవేసుకున్నట్లే అనిపించింది.. నేనే తెరపై ఉన్నానేమోననేంతగా ఆమె నటన ను చూసి పరవశురాలయ్యాను.. ఈ సినిమాలో పాత్రధారులు, నటులపై నాకు ఎటువంటి కోపం లేదు.. అనుభవ్ సిన్హా సహా మిగతా నిర్మాతలపైనే నా పోరాటం..’ అని ఆమె తెలిపారు. ఆ సినిమా తీసే ముందు తన అనుమతి తీసుకోలేదని, తనప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు పాల్ జీవితానికి గాని, ఆమె స్థాపించిన సంఘాన్ని కాని ఉద్దేశించి తీసినవి కావని, కేవలం కల్పితాలని ప్రకటించాలన్న షరతుతో సినిమా విడుదలకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతినిచ్చింది. కాగా, పాల్ శుక్రవారం తన న్యాయవాదితో సహా ఈ సినిమాను చూశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సినిమా తన జీవితచరిత్రను ఆధారంగానే తీశారన్నారు. తన జీవితంపై రచయిత్రి అమనా ఫొంటెల్లా ఖాన్ రచించిన ‘పింక్ శారీ రివల్యూషన్’ పుస్తకం ఆధారంగానే తీశారు. ఆ సినిమాలో ఉన్న అన్ని సన్నివేశాలు నా నిజజీవితంలో జరిగినవే.. ఆ పుస్తకంలో పేర్కొన్నవే.. కాని సినిమా నిర్మాతలు ఈ విషయాన్ని ఒప్పుకోవడంలేదు.. వారు అబద్ధాలు చెబుతున్నారు..’ అని పాల్ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాకు టైటిళ్లకు ముందు ప్రదర్శించే హెచ్చరికలో ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలని ప్రకటించినంత మాత్రాన అవి కల్పితాలు కావు కదా అని ఆమె వాదించారు. నేను ఇక్కడే ఉన్నాను.. మాధురి పోషించిన పాత్ర ‘రజ్జో’ చూస్తే అది కల్పితమని ఎలా చెప్పగలుగుతారో..’ అని ఆమె ప్రశ్నించారు. ‘మహిళా హింసకు వ్యతిరేకంగా నేను ఎలా పోరాడాను.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంపై సీఎంను ఎలా కలిశాను.. ఎలా జైలుకు వెళ్లాను.. చిత్రకూట్ జిల్లా మానిక్‌పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా టికెట్ పొందాను.. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలూ ఈ సినిమాలో కనిపిస్తున్నాయి.. కాదని ఆ నిర్మాతలు ఎలా బుకాయిస్తారు..!? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపత్‌పాల్ పూర్వాశ్రమంలో ఆరోగ్యశాఖలో పనిచేశారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో బాల్యవివాహాలు, మహిళా హింసకు వ్యతిరేకంగా 2006లో ఆమె ‘పింక్ శారీ రివల్యూషన్’ను ప్రారంభించారు. అనేక ఉద్యమాలు నిర్వహించారు. -
మహిళల భద్రతకు భరోసా
‘మీ ముక్తి మార్షల్’ పేరుతో గులాబ్ గ్యాంగ్ సేవలు ప్రారంభం సాక్షి, ముంబై: రాత్రి వేళ్లలో విధులు ముగించుకుని లోకల్ రైళ్లలో ఇళ్లకు చేరుకునే మహిళలకు రక్షణగా నిలిచేందుకు ముక్తి ఫౌండేషన్‌కు చెందిన ‘గులాబ్ గ్యాంగ్’ నడుం బిగించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుర స్కరించుకుని శనివారం నుంచి ఈ గ్యాంగ్ ‘మీ ముక్తి మార్షల్’ పేరుతో మహిళా ఉద్యోగులకు సేవలందిస్తోంది. స్మితా ఠాక్రే చొరవ వల్ల ముందుగా మీ ముక్తి మార్షల్ పథకాన్ని పశ్చిమ రైల్వే మార్గంలో ప్రారంభించారు. ఆ తర్వాత సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. ‘ ఒక్కో బృందంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందిన 12 మంది యువతులు ఉంటారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు అంధేరి-బోరివలి స్టేషన్ల మధ్య మహిళా ప్రయాణికులపై దృష్టి సారిస్తారు. అసాంఘిక దుష్టశక్తులు మహిళా ప్రయాణికులను ఇబ్బందిపెడితే ఈ బృందం సభ్యులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగిస్తార’ని రైల్వే అధికారులు తెలిపారు. మారుతున్న కాలంతో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలు, ఇతర వాణిజ్య సంస్థలు, ఆస్పత్రుల్లో రెండో షిప్టులో పనిచేస్తున్న మహిళలు విధులు ముగించుకుని అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒంటరిగా లోకల్ రైళ్లలో ప్రయాణించే మహిళలను వేధించడం, అత్యాచారయత్నం చేయడం, చోరీ, ఈవ్‌టీజింగ్ లాంటి అనేక సంఘటనలు చోటుచేసుకోవడం వల్ల వారిలో ఆందోళన రెట్టింపవుతోంది. అయితే మహిళల్లో ఉన్న అభద్రత భావాన్ని తొలగించడంతో పాటు వారికి రక్షణగా మేమున్నామనే భావనను నెలకొల్పేందుకు గులాబ్ గ్యాంగ్ సభ్యులు రంగంలోకి దిగారు. మార్షల్ ఆఫ్ ఆర్ట్స్ శిక్షణ పొందిన యువతులు రాత్రులు ఒంటరిగా ప్రయాణించే మహిళలకు రక్షణగా ఉంటున్నారు. మహిళలను ఇబ్బందులను గురిచేసే వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంపైనే దృష్టి సారించారు.కాగా, శివార్ల్లలో దాదాపు అన్ని లోకల్ రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), సాధారణ పోలీసులు ఉంటారు. సిబ్బంది కొరత వల్ల వీరు అంతటా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో రైళ్లు, స్టేషన్ పరిసరాల్లో మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. దీంతో వారికి భద్రత కల్పించేందుకు సిత్మాఠాక్రే చొరవతో గులాబ్ గ్యాంగ్ సేవలందించేందుకు ముందుకు వచ్చింది. దీనిపై మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సీన్లు పంచుకున్న మాధురీ, జూహీ
ఒకప్పుడు వాళ్లిద్దరూ ప్రొఫెషనల్‌గా బద్ధశత్రువులు. నీవెన్ని సినిమాలు, నావెన్ని సినిమాలు హిట్టయ్యాయి అంటూ పోటీలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. లేటు వయసులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వీళ్లిద్దరూ ఇప్పుడు ఒకే సినిమాలో కలిసి నటించడమే కాదు, ఏకంగా మంచి జోష్ ఉన్న సీన్లను కూడా పరస్పరం పంచుకుంటున్నారు!! ఈ విషయాన్ని స్వయంగా మాధురీ దీక్షితే చెప్పింది. తాజాగా తామిద్దరం కలిసి నటిస్తున్న 'గులాబ్ గ్యాంగ్' చిత్రంలో మంచి అద్భుతమైన జోష్ ఉన్న సీన్లు చాలా ఉన్నాయని, అలాంటివాటిని తాము ఇద్దరం పంచుకుంటున్నామని ఆమె చెప్పింది. మంచి కరెంటు ఉన్న సీన్లను తాము ఇద్దరం పంచుకుంటున్నట్లు 46 ఏళ్ల మాధురీ దీక్షిత్ వివరించింది. ఇక ఈ సినిమాలో మాధురీ దీక్షిత్ స్వయంగా కొన్ని ఫైటింగ్ సీన్లు చేసింది. ఎలాంటి డూప్‌ను పెట్టుకోకుండా తాను తొలిసారి చాలా శక్తిమంతమైన, అసలైన యాక్షన్ సన్నివేశాలు చేశానని మాధురీ చెప్పింది. ఫైటింగ్ సీన్లను తాను చాలా ఎంజాయ్ చేశానని, ప్రేక్షకులు కూడా వాటిని ఎంజాయ్ చేస్తారనే భావిస్తున్ననని ఆమె అంది. తన ఫైటింగ్ సీన్లు కావాలని పెట్టినట్లుగా కనిపించవని, సినిమాలో సహజంగానే వచ్చేస్తాయని, పాటలు కూడా అలాగే వస్తాయని ఆమె చెప్పింది. సౌమిక్ సేన్ దర్శకత్వం వహించిన ఈ 'గులాబ్ గ్యాంగ్' మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.