
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో రవీనా ఒకరు. అందం, అభినయంతో రవీనా బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.90ల్లో స్టార్ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె నటించిన ప్రతి సినిమా హిట్లే. దీంతో ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులు ఉండేవారు.
ఇక తెలుగులోనూ సత్తా చాటిన రవీనా టాండన్ ఇటీవలె కెజిఎఫ్-2 సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె హీరో, హీరోయిన్ల విషయంలో తేడాలు చూపిస్తుండటంపై మండిపడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోలు ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల గ్యాప్ తీసుకుంటారు. కానీ హీరోయిన్స్ కొద్ది రోజులు కనిపించకున్నా…సెకండ్ ఇన్నింగ్స్ అని ముద్ర వేస్తారు.
మాధురీ దీక్షిత్‌ను 90ల కాలం నాటి సూపర్ స్టార్ అని మీడియాలో కథనాలు వేస్తారు. మరి అప్పటి నుంచి పని చేస్తున్న సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌ల గురించి అలా అనరెందుకు? హీరో, హీరోయిన్ల విషయంలో చూపిస్తున్న ఈ అసమానతను అంతం చేయాలి అంటూ వాపోయింది రవీనా.
Comments
Please login to add a commentAdd a comment