ఆలనాటి మేటి గీతాలను రీమిక్స్ చేయడం ఇప్పుడు కొత్త కాదు. 80, 90వ దశకాలకు సంబంధించిన ఎన్నో హిట్ సాంగ్స్ ఇప్పటికే రీమిక్స్ అయి మరోసారి ప్రేక్షకులను అలరించాయి. ఇదే కోవలో తాజాగా వచ్చిన ‘ఏక్ దో తీన్’ బాలీవుడ్ రీమిక్స్ సాంగ్ అదరగొడుతోంది. ‘బాగీ-2’ కోసం రీమిక్స్ చేసిన ఈ క్లాసిక్ సాంగ్‌లో శ్రీలంక భామ జాక్వలిన్ ఫెర్నాండెజ్ హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టింది. శ్రేయో ఘోషల్ తన గాత్రంతో మరోసారి ఈ పాటకు ప్రాణంపోయగా.. జాక్వలిన్ హాట్ లుక్స్, స్టెప్పులతో మరింత ఊపుతెచ్చేలా నర్తించింది.