
లతా మంగేష్కర్- అమిత్ షా- దేవేంద్ర ఫడ్నవిస్
సాక్షి, ముంబై : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే భారతదేశ దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ను అమిత్‌షా మర్యాదపూర్వకంగా కలిశారు. మంగేష్కర్ నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయిన అమిత్ షా రానున్న ఎన్నికల్లో బీజేపీ తరుఫున ప్రచారం చేయాలని అమెను కోరారు. షెడ్యూల్ ప్రకారం జూన్ ఆరునే అమిత్ షా లతాను కలవాల్సింది ఉంది. ఆ సమయంలో మంగేష్కర్ పుడ్ పాయిజన్‌తో బాధపడుతుండడం వల్ల అమిత్‌షాతో భేటికి నిరాకరించారు.
ముంబైలో ఆదివారం బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకుగాను అమిత్‌షా ఒక్క రోజు పర్యటనకు మహారాష్ట్ర వచ్చారు. ఈ సందర్భంగా మంగేష్కర్‌తో భేటి అయ్యారు. నాలుగేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఓ పుస్తకాన్ని ఆమెకు బహుకరించారు. అమిత్‌షాతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీ ఛీప్ రాసాసాహెబ్, బీజేపీ నేత అశీష్ షెల్లర్ ఈ భేటిలో పాల్గొన్నారు. కాగా ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన అమిత్‌షా ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, వ్యాపారవేత్త రతన్ టాటాను బీజేపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని కోరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment