
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యోగా ఎంతో ఆదరణను పొందుతోంది. ఇప్పుడు ప్రపంచ ప్రజలంతా యోగా వైపే చూస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాతో ఆరోగ్యాన్నిపెంపొందించుకుంటున్నారు. ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా యోగాతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే మన సినీ తారలంతా యోగా ఆసనాలు వేసి వారి అందాన్ని మరింత పెంచుకుంటున్నారు.
ఈ క్రమంలో జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తప యోగా వీడియోను షేర్ చేశారు. ‘యోగా నా రోజు వ్యాయమంలో ఒక భాగం అయ్యింది. త్వరలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలు మీకోసం. రండి నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి’ అంటూ మాధురి దీక్షిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసనాలు వేసి చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment