శ్రీదేవి ప్లేస్‌లో మాధురి | Janhvi Kapoor thanks Madhuri Dixit for stepping into Sridevi’s role in Shiddat | Sakshi
Sakshi News home page

శ్రీదేవి ప్లేస్‌లో మాధురి

Published Tue, Mar 20 2018 12:17 AM | Last Updated on Tue, Mar 20 2018 12:18 AM

Janhvi Kapoor thanks Madhuri Dixit for stepping into Sridevi’s role in Shiddat - Sakshi

మాధురీ దీక్షిత్‌, శ్రీదేవి

శ్రీదేవి అతిలోక సుందరి. అందంలో కానీ అభినయంలో కానీ పోటీ అనే ప్రసక్తి లేకుండా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీని రూల్‌ చేశారు. ఇటీవల దుబాయ్‌లో ఆమె దురదృష్టవశాత్తూ బాత్‌ టబ్‌లో పడి మరణించిన విషయం తెలిసిందే. ఇది జరగకముందే ‘2 స్టేట్స్‌’ ఫేమ్‌ అభిషేక్‌ వర్మ దర్శకత్వంలో ‘షిద్ధత్‌’ అనే సినిమాలో నటించటానికి అంగీకరించారట శ్రీదేవి. ఆమె హఠాన్మరణంతో ఆ ప్లేస్‌లో వేరే తారను తీసుకునే పనిలో పడింది చిత్రబృందం. పలువురు కథానాయికలను సంప్రదించారని సమాచారమ్‌. ఫైనల్లీ మాధురీ దీక్షిత్‌ ‘యస్‌’ చెప్పారు.

ఈ విషయాన్ని శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ స్వయంగా వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ‘‘అభిషేక్‌ వర్మ రూపొందించబోయే తదుపరి సినిమా మమ్మీ హృదయానికి చాలా దగ్గరైనది. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు నేను, ఖుషీ, డాడీ మాధురీజీకి చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటాం’’ అని పేర్కొన్నారామె. కరణ్‌ జోహార్‌ నిర్మించనున్న ఈ సినిమాలో వరుణ్‌ ధావన్, ఆలియా భట్, సంజయ్‌ దత్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఇయర్‌ సెకండ్‌ హాఫ్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement