ఓ మహిళ ఇద్దరు పిల్లలు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ గొప్ప మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగడం అంత ఈజీ కాదు. ఓపక్క అమ్మగా పిల్లలకు అన్ని ఇవ్వలేకపోతున్న ఆవేదనను తట్టుకుంటూ.. పురషాధిక్య పారిశ్రామిక ప్రపంచంలో నెగ్గుకొచ్చి.. తానెంటో చూపించింది. పైగా అందరిచేత ప్రశంసలందుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
భారతీయ కాస్మెటిక్ రూపరేఖలను మార్చిన వినీత సింగ్ ప్రస్థానం చాలా సవాళ్లుతో కూడుకున్నది. మగవాళ్లు ఆధిపత్యం ఉండే రంగంలో రాణించి అందరికీ స్ఫూర్తిగా నిచింది. అదికూడా ఇద్దరు పిల్లల తల్లిలా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ సౌందర్య సాధనాల సీఈవో స్థాయికి చేరుకుంది. 2021వ సంవత్సంరో బ్యూటీ మార్కెట్‌లో తన షుగర్ కాస్మోటిక్స్ కంపెనీతో సంచలనం సృష్టించింది. 2015లో వినీత తన భర్త కౌశిక్ ముఖర్జీతో కలిసి ఈ షుగర్ కాస్మటిక్స్‌ని ప్రారంభించిది.
అప్పుడే మహిళపట్ల ప్రజల్లో వేనూళ్లుపోయిన భావాలను ఎదుర్కొంది. ఆమె తన షుగర్ బ్రాండ్స్‌తో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తగా దూసుకుపోవడమే గాక డిజిటల్ యుగం ఫ్లాట్‌ఫాంని క్యాష్ చేసుకుంది. భారతీయ యువుతులు తమ బ్రాండ్‌కి మారేలా చేయడంలో విజయం సాధించింది వినీత. అయితే వినిత గొప్ప మహిళా పారింశ్రామిక వేత్తగా మారడం అంత జీగా జరగలేదు. తన కంపెనీ ప్రారంభదశలో వెంచర్‌ని కాపాడుకునేలా ఇన్వెస్టర్‌లని తీసుకోవడం అత్యంత సవాలుగా మారింది. ఎందుకంటే వారందరీ నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట..కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నీకెందుకు ఇంత పెద్ద పనులు అనే విమర్శలు, ఉచిత సలహాలకు కొదువలేదు అన్నట్లుగా వచ్చాయి.
అయినా సరే ఆమె వెనక్కి తగ్గకుండా తన వ్యాపారాన్ని మంచిగా నిర్మించడంపైన దృష్టి పెట్టింది. 17 ఏళ్ల వయసులో తన ప్రొఫెసర్ వ్యవస్థాపకత కోసం నాటిన బీజాలు ఆమె నరనరాల్లో నిక్షిప్తమయ్యాయి. అదే ఆమెను వెనడుగు వేయనివ్వలేదు. తన వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించడంపై ఫోకస్ అయ్యేలా చేసింది. లక్షల వేతనం లభించే బ్యాంక్ జాబ్‌ని వదిలి మరీ..స్వంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్సాటు చేయాలని ప్రగాఢంగా నిశ్చయించుకుంది వినీత.
ఆ దృఢ నిశ్చరయం ఆమెను షుగర్ బ్యూటీ ప్రొడక్ట్‌లకు సంబంధించిన సీవోవో స్థాయికి చేరుకునేలా చేసింది. అయితే తనని ఎప్పుడూ అమ్మ అపరాధం వెంటాడుతూ ఉండేదని అన్నారు. అలాగే ఈ కంపెనీ ప్రారంభ రోజుల్లో తన పెద్ద కొడుకు పుట్టడంతో పెద్ద కొడుకు పాలు ఇవ్వడం, పని చేయడం, ఆఫీసు కాల్‌లను నిర్వహించడం చాలా కష్టంగా ఉండేదని అన్నారు. ముఖ్యంగా వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో 'అమ్మ అపరాధాన్ని' ఎదుర్కొన్నానని వివరించారు వినిత.
అలాగే తన చిన్న కొడుకు ఆరవనెల కడుపున ఉన్నప్పుడూ మారథాన్‌లో పరిగెత్తానని అన్నారు. అంతేగాదు ఆమె తరుచుగా ఆఫీస్ ఫైల్స్, మరో చేత్తో తన బిడ్డను లాలించేది. చెప్పాలంటే ఏకకాలంలో అన్ని పనులు నిర్వహించేదాన్ననని, అందువల్లో అమ్మగా వాళ్లకు అన్ని సమకూరుస్తున్నానా లేదా అనే భావం కలుగుతుండేదని అన్నారు వినీత. చివరిగా వినీత 'అమ్మ అపరాధం' చాలా విలువైనదని, దాన్ని నిర్వర్తించడం అంత ఈజీ కాదని చెప్పారు. ఏదీఏమైన ఓ తల్లిగా ఇద్దరూ పిలల్లను సాకుతూ..విజయవంతమైన పారిశ్రామికవేత్త ఎదగడం అనేది మాములు విషయం కాదు..!
(చదవండి: కన్నూర్ జైలు బిర్యానీ: ఖైదీలే స్వయంగా వండుతారట..!)
Comments
Please login to add a commentAdd a comment