స్పీకర్‌ పోచారం కంటతడి | Speaker Pocharam Srinivas Reddy Gets Emotional On Womens Day | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ పోచారం కంటతడి

Published Tue, Mar 9 2021 7:57 AM | Last Updated on Tue, Mar 9 2021 8:18 AM

Speaker Pocharam Srinivas Reddy Gets Emotional On Womens Day - Sakshi

అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓ కార్యక్రమంలో కంటతడి పెట్టారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ..’ పాటను ప్లే చేయగా, తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తు చేసుకుని ఒక్కసారిగా పోచారం ఉద్వేగానికి గురయ్యారు. 102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
– బాన్సువాడ

చదవండి: అదుపులోనే భైంసా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement