International Womens Day 2022: Chiranjeevi Press Meet At His Blood Bank - Sakshi

International Women's Day: మహిళమణులందరికి చిరంజీవి శుభాకాంక్షలు

Mar 8 2022 11:02 AM | Updated on Mar 8 2022 2:00 PM

Chiranjeevi Press Meet At His Blood Bank On Womens Day 2022 - Sakshi

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మహిళామణులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి  తన బ్లడ్‌ బ్యాంక్‌లో పని చేసే మహిళ డాక్టర్లు, మహిళలను భార్య సురేఖతో కలిసి సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కుటుంబంపై బాధ్యత తీసుకుంటున్న ప్రతి మహిళలకు నమస్కరిస్తున్నా. మహిళల శ్రమను గుర్తించడానికి ఈ రోజు సరైన రోజు అనిపించింది.

చదవండి: విదేశాల్లో జగ్గూభాయ్‌, షాకింగ్‌ లుక్‌ షేర్‌ చేసిన నటుడు

అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీ అందరి కష్టం చూస్తుంటే మా అమ్మ గారి కష్టం గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు నుంచి అమ్మ పడే కష్టం ఏంటో నాకు తెలుసు. తన కష్టం చూశాను కాబట్టే మీ అందరి కోసం ఈ చిరు సత్కారం’ అని అన్నారు. ఇక తాను స్త్రీ పక్షపాతి అవటానికి కారణం తన తల్లి, భార్య సురేఖ కారణమన్నారు. అంతేగాక ప్రస్తుతం మహిళలు అంతరిక్షం వరకు వెళుతున్నారని, ప్రతి ఒక్కరు మహిళలను గుర్తించాలన్నారు. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలని చిరంజీవి పేర్కొన్నారు.

చదవండి: కండోమ్‌ టెస్టర్‌గా రకుల్‌, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే..

అలాగే ఈ సందర్భంగా చిరు తన భార్య సురేఖ గురించి మట్లాడారు. ‘నేను సక్సెస్‌ ఫుల్‌ హీరోగా మారడానికి నా భార్య సురేఖ కారణం. ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా ఆమె చూసుకుంటుంది. నేను సినిమాలతో బిజీగా ఉంటే ఆమె ఇంట్లో నా తమ్ముళ్లను, పిల్లలను చూసుకునేది. నేను సినిమాలపై శ్రద్ధ పెడుతున్నానంటే తనే ప్రధాన కారణం. ’ అని ఆయన పేర్కొన్నారు. చివరగా టికెట్ల జీవో అంశంపై రిపోర్టర్‌ చిరంజీవిని ప్రశ్నించగా.. సినిమా టికెట్ల జీవో గురించి ఇప్పుడు మాట్లాడనని, ఇది సందర్బం కాదు అన్నారు. దీని గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతాను అని ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement