
విజేతకు చెక్కు అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు
మాదాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం తెలంగాణ టీ చాంపియన్ షిప్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ఆనరరీ కాన్సుల్, రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా ఫర్ తెలంగాణ, సుచరిండియా ఏపీ సీఈఓ లయన్ కిరమ్, నిలోఫర్ కేఫ్ చైర్మన్ ఎ.బాబురావు, గోద్రేజ్ జెర్సీ సీఈఓ భూపేంద్రసూరి, మల్లారెడ్డి హెల్త్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మాడిశెట్టి రాజ్‌గోపాల్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలతో టీ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులన్నారు. గతంలో ఎన్నడూ లేని సరికొత్త విధానంతో రకరకాల టీలను పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. పోటీల్లో 104 Ðమంది పాల్గొన్నారు. ప్రథమ బహుమతి కింద లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, ముగ్గురు రన్నరప్‌లకు రూ.25 వేల చొప్పున మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment