
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో జిల్లా అకౌంట్స్ అధికారులతో పాటు అన్ని శాఖల్లోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ప్రతిభను చాటేలా వినూత్నంగా వివిధ ప్రదర్శనలు ఇచ్చారు. కొందరు డాన్స్‌తో అలరిస్తే.. మరికొందరు పాటలు పాడారు.
మహిళలు అన్నింటా సమానమని చాటి చెప్పేలా తమ పాఠవాలను ప్రదర్శించారు. మిగతా కార్యక్రమాలల్లోనూ చురుగ్గా పాల్గొని ఎంజాయ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ అసొసియేషన్ ప్రతినిధి దీపారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా జాయింట్ డైరెక్టర్ రజిని, శైలజా రాణి, చీఫ్‌ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ గీతా చౌదరీ తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment