సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు యూసఫ్ గూడలోని నిమ్స్-మి సంస్థలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సంస్థ డైరెక్టర్ జనరల్ డి. చంద్రశేఖర్ ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని తెలిపారు. మహిళల పురోభివృద్ధి కోసం సంస్థ అనేక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో సంస్థ సేవలు మరింత వినియోగించుకొని తద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఎంఎస్ఎంఈ, భారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. మహిళలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యకమానికి విశిష్ట అతిధులుగా డాక్టర్ ఫహిమా భాను, మల్లిక, సిస్టర్ శ్రీలత బ్రహ్మకుమారీ పాల్గొన్నారు. (రాజ్ భవన్‌లో మహిళా దినోత్సవ వేడుకలు)
Comments
Please login to add a commentAdd a comment