Yusuf Guda
-
అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలింది
గచ్చిబౌలి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో శవమై తేలిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నాణు, హీరాబాయి దంపతులు నగరానికి వలస వచ్చి గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్నగర్లో ఉంటున్నారు. నాణు ఆటో డ్రైవర్‌గా, హీరాబాయి హౌస్‌మేడ్‌గా పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు రమావతి రాణి(17) యూసూఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఉదయం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లిన రాణి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం తెల్లవారు జామున ఎన్టీఆర్నగర్లోని సిరీస్ సంస్థకు సంబంధించిన సెల్లార్ గుంతలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని బయటికి తీసి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరామర్శించారు. పరిహారం చెల్లించాలని ఆందోళన 14 ఏళ్ల క్రితం సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారని, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారని స్థానికులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు మృతదేహంతో సెల్లార్ గుంత వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇటు బాధితులు అటు సైట్ యాజమాన్యంతో చేసిన చర్చలు ఫలించ లేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సాయంత్రం 7 గంటల వరకు ఆందోళన కొనసాగించడంతో దిగివచి్చన యాజమాన్యం బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు అంగీకరించడంతో వారు ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తిత్తం ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ గుచ్చి) -
‘నిమ్స్-మి’లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు యూసఫ్ గూడలోని నిమ్స్-మి సంస్థలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సంస్థ డైరెక్టర్ జనరల్ డి. చంద్రశేఖర్ ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే మహిళా సాధికారత సాధ్యం అవుతుందని తెలిపారు. మహిళల పురోభివృద్ధి కోసం సంస్థ అనేక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో సంస్థ సేవలు మరింత వినియోగించుకొని తద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఎంఎస్ఎంఈ, భారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. మహిళలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యకమానికి విశిష్ట అతిధులుగా డాక్టర్ ఫహిమా భాను, మల్లిక, సిస్టర్ శ్రీలత బ్రహ్మకుమారీ పాల్గొన్నారు. (రాజ్ భవన్లో మహిళా దినోత్సవ వేడుకలు) -
ప్రేమను తిరస్కరించిందని చంపేసాడు
-
కొత్త రాజధానిలో ఇళ్ల స్థలమివ్వండి
ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ సౌకర్యాల కమిటీ సిఫార్సు సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ తరహాలోనే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు నూతన రాజధాని అమరావతిలో నివాస వసతికోసం ఇళ్లస్థలాల్ని కేటాయించాలని రాష్ట్ర అసెంబ్లీ సౌకర్యాల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఒక్కో ఎమ్మెల్యేకు 700 చదరపు గజాలు చొప్పున ఇవ్వాలని సూచించింది. అంతేగాక నామమాత్రపు ధరకు కేటాయించాలని పేర్కొంది. -
వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణం
సంజీవరెడ్డినగర్,న్యూస్‌లైన్: రియల్టర్ అనిల్‌కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడానికి వడ్డీ వ్యాపారుల వేధింపులో కారణమని పోలీసులు నిర్ధారించారు. యూసుఫ్‌గూడలోని మార్గిహోటల్లో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అనిల్‌కుమార్ గురువారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించాడు. అతను అక్కడికక్కడే చనిపోగా.. భార్య, పిల్లలు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. హోటల్గదిలో మృతుడు రాసిన సూడైడ్నోట్ పోలీసులకు దొరికింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం కొందరివద్ద అప్పులు చేశానని, రుణదాతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అందులో రాసి ఉంది. ముఖ్యంగా మంగిలాల్గాంధీ, కుమార్‌యాదవ్,రవి అనే వ్యాపారుల వేధింపులు తట్టుకోలేకే కుటుంబం సహా చనిపోతున్నానని అనిల్‌కుమార్ రాశాడు. పోలీసుల కథనం ప్రకారం...అనిల్‌కుమార్ తల్లి భారతి పేరుపై శ్రీనగర్‌కాలనీలో రూ.70 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. ఆ ఇంటి పేపర్లు బ్యాంకులో పెట్టి గతంలో రూ. 6 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో ఇల్లు వేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. అనిల్ బల్కంపేటలో ఉండే తన స్నేహితుడు కుమార్‌కు ఈ విషయం చెప్పగా.. అతను బ్యాంక్‌లో డబ్బు చెల్లించి, ఇంటి పేపర్లు తన వద్దే ఉంచుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కుమార్.. అనిల్ తల్లిని బ్యాం క్కు తీసుకెళ్లి తన వద్ద ఉన్న ఇంటి పేపర్లు పెట్టి రూ. 25 లక్షల లోన్ తీసుకున్నాడు. ఈ అప్పు తీర్చకపోవడంతో వడ్డీతో కలిపి బాకీ మొత్తం రూ. 40లకు చేరింది. బ్యాంక్ నోటీసు రావడంతో అనిల్ ఈసారి స్థానిక వడ్డీవ్యాపారి మం గీలాల్ గాంధీని ఆశ్రయించాడు. అతను రూ. 40 లక్షలను బ్యాంక్‌లో చెల్లించి ఇంటి పేపర్లు తన వద్ద పెట్టుకున్నాడు. 12 శాతం వడ్డీతో కలిపి ఈ అప్పు రూ. 42 లక్షలు అయిందని, వెంటనే తిరిగి చెల్లించాలని, లేదా ఇల్లు తన పేర రాసి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంతేగాక ఆ ఇంట్లోని ఓ పోర్షన్‌ను ఆక్రమించాడు. మంగీ లాల్ మరింత వేధిస్తుండటంతో అనిల్ 3 నెలల క్రితం కూకట్‌పల్లిలో ఉన్న మరో ఇంటిని రూ. 30 లక్షలకు అమ్మేసి.. వచ్చిన డబ్బును మంగీ లాల్‌కు చెల్లించాడు. అయితే, మిగతా 12 లక్ష లు కూడా చెల్లించాలని అతను వే ధించసాగా డు. మంగిలాల్ తన వద్ద ఉన్న ఇంటిపేపర్ల సహాయంతో బంధువుల పేరుతో జీపీఏ చే యించాడు. ఇదిలా ఉండగా, అనిల్ మరో స్నే హితుడికి డబ్బు అవసరం కావడంతో తాను కష్టాల్లో ఉండి కూడా బాలానగర్‌కు చెందిన ఫైనాన్సర్ వద్ద రూ.2 లక్షల అప్పు ఇప్పించా డు. అప్పు తీసుకున్న స్నేహితుడు పరారీ కావడంతో వడ్డీతో కలిపి రూ.4 లక్షలు నీవే చెల్లించాలని రవి.. అనిల్‌ను వేధించాడు. భార్యతో పాటు మరికొందరు మహిళలను తీసుకొచ్చి అనిల్ ఇంటి వద్ద గొడవ చేయించేవాడు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెందిన అనిల్ కుటుంబసభ్యులందరితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 25న మార్గి హోటల్లో దిగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అనిల్ భార్య లావణ్య,కూతుళ్లు ఆలేఖ్య,అకిల,ఆకాశల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం దని, ఎలాంటి ప్రాణాపాయంలేదని వైద్యులు శుక్రవారం వెల్లడించాడు.